Monday, 23 October, 2017

కాపురం గోపురంగా నిల‌బ‌డాలంటే ఈ మాట‌లు అన‌కూడ‌దు

పవిత్ర బంధాల లిస్ట్ లో భార్యా భర్తల బంధం టాప్లో ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఎక్కువగా గొడవపడే వాళ్ల లిస్ట్ కూడా భార్యభర్తల పేరే టాప్లో ఉంటుంది. పెళ్లైన ఆ.. నాలుగు రోజు మస్తుంటుంది. తర్వాతే భార్యపై ప్రేమ వస్తుంటుంది. పోతుంటుంది. గొడవలు షురు. గొడవపడుతూనే చాలా మంది కాపురం చేస్తుంటారు. నిజానికా కాపురం గోపురంలా నిలబడాలంటే…ఎవరికి వారు కొన్ని టిప్స్ పాటించాల్సిందే.

భార్య‌తో ఈ మాట‌లు అన‌కూడ‌దు

  • మరో జన్మ ఉంటె నువ్వు మాత్రం నాకు వద్దు
  • నువ్వింతే ఎప్పుడూ…నిన్ను చేస్కున్నాను చూడు … నన్ననుకోవాలి
  • మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది ….ఎప్పుడోకప్పుడు నువ్విలా చేస్తావని

భ‌ర్త‌తో అన‌కూడ‌ని మాట‌లు

  • ఇతని వల్ల మళ్ళీ ప్రాబ్లం వచ్చేలా ఉంది (ఫ్రెండ్స్ తో భర్త ని ఉద్దేశించి )
  • మీ నాన్న లాగే నువ్వు కూడా…అంటూ దెప్పి పొడిచే మాటలు
  • భర్త ఏదో కారణంతో ఉద్యోగం మానేస్తే… జాబ్ ఎప్పుడు వెతుక్కుంటావు
  • చేస్కున్నోళ్ళకి చేస్కున్నంత … ఇలాంటి మొగుడు వస్తాడని మాత్రం అనుకోలేదమ్మా …(మంచిగా ఉన్నా కూడా అంటుంటారు కొంతమంది )
  • అన్నీ బాగానే ఉన్నాయ్ …ఆ ఆరో లక్షణమే సరిగ్గా లేదు (దేన్ని ఉద్దేశించి అంటారో వాళ్ళకే తెలీదు)
  • కాళ్ళ కింద శని పెట్టుకుని నడుస్తుంటే ఎవరేం చేస్తారు
  • దమ్మిడీ లేదు కాని మాటలు మాత్రం మాట్లాడతాడు              
  • నేను తప్ప అందరూ ఆయనకి అందం గానే కన్పిస్తారు. చూడడానికి అలా ఉన్నాడు కాని వదిలేస్తే దేశాల్ని దోచేస్తడు….

భార్యా భర్తల మధ్య ఇలాంటి కొండి మాటల తూటాలు..సంసారం అనే కోటలను కూల్చేస్తాయి. ఒక్క సారి ఊహించండి..మీ పిల్లల భవిష్యత్తు..ఆనదంగా గడపబోయే భవిష్యత్ క్షణాలు. జస్ట్ ఇమాజిన్ చేసుకొండి. జీవితాన్ని ఇమాజినేషన్ కన్నా బ్యూటిఫుల్గా మలచుకొండి.

 

 

AUTHOR : MG KISHORE

              Like This Story? Wanna Say Something ? Comment Below Or Mail Us At : Info@Tvarthalu.Com

You might also like

Leave a Reply