Monday, 23 October, 2017

విరాట్ కోహ్లీనువ్వు గ్రేట్‌…

భార‌త క్రికెట్ టెస్ట్ కెప్ట‌న్ విరాట్  కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకున్నాడు. ముంబై వేదిక‌గా ఇంగ్లండ్ తో జ‌రుగుత‌న్న నాల్గో టెస్టులో ఈ ఫీట్ నెల‌కొంది. ఒక సిరీస్లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 96వ పరుగు చేసే క్రమంలో ఈ సిరీస్లో విరాట్ 500 పరుగుల మార్కును చేరాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు.

ఇక‌పోతే అంత‌కుముందు ముంబయి వాంఖడె మైదానంలో ఒకే సంవ‌త్స‌రంలో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో భారత జట్టు కెప్టెన్‌గా ఈ ఘనతను సాధించింది ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే. 1997లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌, 2006లో రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. అంతేకాదు.. కోహ్లీ టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.