Thursday, 19 October, 2017

ఎయిడ్స్ రోగుల‌కు ఓ శుభ‌వార్త‌

హెచ్ ఐ వీతో బాధ‌ప‌డుతున్న రోగుల‌కు ఓ శుభ‌వార్త‌. ఈ వ్యాధి నిర్మూల‌న కోసం సౌతాఫ్రికాలో జరుగుతున్న పరిశోధనల్లో ఇదో ముందడుగు ప‌డింది. అవును అక్క‌డి సైంటిస్టులు ఓ కొత్త వ్యాక్సీన్ ను పరీక్షిస్తున్నారు. గతంలో థాయ్ లాండ్ లో రీసెర్చర్లు జరిపి వదిలేసిన ప్రయోగాలను గమనించిన వీరు.. అ బేసిస్ పై హెచ్ వీ టీ ఎన్ 702 అనే టీకా మందును టెస్ట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హెచ్ఐవీ రోగుల చికిత్స లో ఈ వ్యాక్సీన్ ఉపయోగపడగలదని భావిస్తున్నారు. 2009 లో థాయ్ లాండ్ లో కొంతమంది సైంటిస్టులు ఇలాంటి వ్యాక్సీన్ పై రీసర్చ్ చేశారని, మూడున్నర ఏళ్ళలో ఇది 31.2 శాతం హెచ్ ఐ వీ ఇన్ ఫెక్షన్ తగ్గించగలిగిందని జోహాన్స్ బెర్గ్ పరిశోధకులు గుర్తించారు. ఇక తాము కూడా దీనిపై మరింత రీసర్చ్ జరిపి ఈ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని అనుకుంటున్నారు. సుమారు అయిదున్నర వేలమంది పురుషులను, మహిళలను పరీక్షించాలని, 2020 నాటికి తమ పరిశోధనా ఫలితాలను ప్రపంచానికి చాటాలన్నది వీరి యోచన అట.

You might also like

Leave a Reply