Monday, 20 November, 2017

ట్రంపే విజేత‌

అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. స‌ర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించనివిధంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ విజయకేతనం ఎగురవేశారు..ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన.. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ లో ట్రంప్‌ సంచలన విజయం సాధించారు.. 538 ఓట్లున్న ఎలెక్టోరల్‌ కాలేజీలో ట్రంప్ 276 ఓట్లు సాధించారు. మెజార్టీ మార్క్ ఆయ‌న దాటిపోయారు.. హిల్లరీ 215 ఓట్లతో వెనుకబడ్డారు.

ట్రంప్ విజయం ఖాయం కావ‌డంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు., హిల్లరీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే అమెరికా 45వ అధ్యక్షుడిగా, అత్యధిక వయసులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ట్రంప్‌ చరిత్ర సృష్టించనున్నారు

Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com