Monday, 23 October, 2017

‘Mahesh Babu took no money for Takkari Donga’

It has been 15 years since superstar Mahesh Babu’s Takkari Donga released and an interesting news about the cowboy flick has come out.

Director Jayanth C Paranjee who helmed the mega phone for Takkari Donga, said in his recent interview that Mahesh Babu did not even take a single penny from the producer as it was a high budgeted flick. The veteran film maker added that the star hero took high risks to perform stunts for the movie and none from the industry could have gone that far for a movie.

Jayanth C Paranjee ended up saying that people still ask him to direct Mahesh in a full fledged love story.

Mahesh Babu tweets on Manjula’s film

Manjula’s production

Manjula Swaroop, sister of Mahesh Babu produced several Telugu movie and received national award for the movie, Show. Now the actress cum producer is taking up the job of direction.

Manjuala’s directorial debut

Manjula is making her directorial debut with hero Sundeep Kishan. The film has been launched officially in Hyderabad with pooja ceremony today early in the morning. Sundeep Kishan attended the function.

Mahesh Babu’s tweet

On the occasion of his sister’ directorial debut launch, Mahesh Babu conveyed his best wishes to Manjula. He tweeted, ‘Wishing my dearest sister Manju all the best on her directorial debut !! Time to add another feather to your cap!.’

”సంభవామి” అంటున్న మ‌హేష్‌

టాలీవుడ్  సూప‌ర్ స్టార్ మ‌హేష్, డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం పై  అంచ‌నాలు భారీగా ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికాలంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అటు చిత్ర బృందంలోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ‘వాస్కోడిగామా’, ‘ఏజెంట్ శివ’ వంటి పలు పేర్లను అనుకున్నారు. అయితే, ఈ టైటిళ్ల విషయంలో అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ గందరగోళానికి తెర దించుతూ.. ఈ సినిమాకు   ‘సంభవామి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ వింటుంటేనే ‘అరె.. భలే ఉందే’ అనిపిస్తోంది కదా.  మొత్తానికి చివ‌ర‌గా మ‌హేష్ సినిమా టైటిల్ బాగుందని సినీ జనాలు అనుకుంటున్నారు.. కాగా, ఈ టైటిల్‌ను మహేశ్ కోసం ఫిల్మ్ చాంబర్‌లో నమోదు చేయించినట్లు ప్రముఖ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రెండు భాషల్లోనూ ఒకే టైటిల్ పెట్టాలని మురుగదాస్ ఆలోచిస్తున్నాడు. దానిలో భాగంగానే.. ఈ టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

రాజ‌కీయాల్లోకి మ‌హేష్ బాబు ఎంట్రీ..?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్ లో కాదులెండి..రీల్ లైఫ్ లోనే. శ్రీ‌మంతుడు త‌ర్వాత కొరటాల శివ‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌. అయితే ఈ మూవీలో మ‌హేష్ ని ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడట కొరటాల. ఇంతకుముందు ‘దూకుడు’లో తండ్రి కోసం యంగ్ ఎమ్మెల్యేగా నటించే క్యారెక్టర్ చేశాడు.యంగ్ ఎమ్మెల్యేగా వైట్ అండ్ వైట్‌లో మహేష్ చేసిన కామెడీ అదిరిపోయింది. ఇక కొరటాలతో చేయబోయే మూవీలో మాత్రం ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడట. ఈ మూవీలో పాలిటిక్స్‌ని సీరియస్‌గానే టచ్ చేస్తున్నాడట కొరటాల. అయినా కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా వుండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీలో మహేష్‌తో కీర్తి సురేష్ ఫస్ట్ టైం జతకట్టబోతోంది.

actress keerthi suresh in mahesh babu movie

మ‌హేష్ బాబుతో న‌టించే చాన్స్…బ్యూటీ ఎవ‌రో తెలుసా?

actress keerthi suresh in mahesh babu movieనేను శైల‌జ మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన కీర్తిసురేష్‌..త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలేమి లేక‌పోవ‌డంతో త‌మిళ్ ఇండ్ర‌స్టీకే ప‌రిమిత‌మైంది .ప్ర‌స్తుతం నానీ నాని హీరోగా తెర‌కెక్కుతున్న నేను లోక‌ల్ మూవీలో యాక్ట్ చేస్తోంది. రీసెంట్‌గా రిలీజైన టీజ‌ర్‌లో కీర్తి సురేష్ అదిరే హ‌వాభావ‌ల‌తో దుమ్మురేపింది. నాని కంటే, ఆ అమ్మ‌డి మూమెంట్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాదు..ఆమె ఫాలోవ‌ర్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది. అలాంటి కీర్తిసురేష్‌కు ఇప్పుడు అవ‌కాశాలు కూడా క్యూక‌డుతున్నాయ్‌.

   రీసెంట్‌గా త‌మిళ్‌లో హీరో విజ‌య్‌తో కొత్త మూవీకి అగ్రిమెంట్ చేసిన కీర్తిసురేష్‌, త్వ‌ర‌లో మ‌హేష్‌బాబు-కోర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే మూవీలో హీరోయిన్‌గా ఫిక్సైన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా, ఆమెను ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ మూవీలో ఇద్ద‌రి హీరోయిన్ల‌కు చాన్స్ ఉంది. మ‌హేష్‌బాబు-కీర్తి సురేష్ పెయిర్ బాగుంటుంద‌ని, కొర‌టాల శివ ద‌గ్గ‌రుండి అత‌న్ని ఒప్పించిన‌ట్టు ఫిలిం న‌గ‌ర్ టాక్‌. మ‌రోవైపు కీర్తి సురేష్‌, అల్లు అర్జున్ న‌టిస్తున్న తెలుగు, త‌మిళ్ మూవీలో కూడా యాక్ట్ చేయ‌నుంది. ఎక్స్‌ఫొజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉండే ఈ అమ్మ‌డు…యాక్టింగ్‌తోనే ఇండ్రస్ట్రీని షేక్ చేస్తుంది. త‌మిళ్ హీరో శివ‌కార్తీకేయ‌న్ న‌టించిన ర‌జ‌నీ మురుగ‌న్‌, రెమో మూవీలు ఆమెకు ఫుల్ ఫాలోయింగ్‌ను పెంచేశాయి. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు పొటెత్తుతున్నాయ్‌. మ‌రీ..ఇలాంటి టైమ్‌లో కీర్తి సురేష్ ఎలాంటి క్యారెక్ట‌ర్స్‌తో ఆక‌ట్టుకుంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

mahesh-fans-angry-at-samantha

స‌మంతపై మ‌హేష్ అభిమానుల ఆగ్ర‌హం

టాలీవుడ్ లో ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారిన హీరోయిన్ స‌మంత‌పై ప్రిన్స్ మ‌హేష్ బాబు అభిమానులు గ‌రంగ‌రంగా ఉన్నార‌ట‌. ఆమె పై ఈ రేంజ్ లో ఎందుకు హాట్ గా ఉన్నారు అనుకుంటున్నారా..? అదేనండి ఇటీవ‌ల సమంత సోష‌ల్ మీడియాలో తెగ ఆక్టీవ్ గా ఉండ‌టంతో ఆమెకు ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య తెగ‌పెరిగిపోయింది. మ‌హేష్ బాబును దాటేసి పోయింది. ప్రస్తుతం సమంతను ట్విట్ట‌ర్ లో 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో మహేష్ బాబు సమంత కంటే వెనుకబడిపోయాడు. మహేష్ కి 25 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే ఫాలోవ‌ర్స్‌ ఉన్నారు. ఈ వార్త కాస్తా మహేష్ అభిమానుల దృష్టికి రావడంతో వారంతా ఈ వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని ఓ టాక్ . దీంతో స‌మంత‌పై క‌స్సుబుస్సు మంటున్నార‌ట‌..

mahesh-babu

మ‌హేష్ సినిమా మ‌ల్టీస్టారర్ కాదు

చేసిన‌వి మూడు సినిమాలే. కానీ స్టార్ డైర‌క్ట‌ర్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాడు కొర‌టాల శివ‌. ప్రిన్స్ మ‌హేష్ బాబుతో శ్రీ‌మంతుడు తెరకెక్కించిన కొర‌టాల శివ మ‌రో మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు కోసం క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. అయితే కొన్ని రోజులుగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా గురించి ఎన్నో వార్తలు వ‌చ్చాయి. సినిమా మ‌ల్టిస్టార‌ర్ అనే ప్ర‌చారం జ‌రిగింది. ఈ న్యూస్‌పై కొర‌టాల శివ ఒక క్లారిటీ ఇచ్చాడు. మ‌హేష్‌తో చేయాల‌నుకుంటున్న సినిమా మ‌ల్టీ స్టార‌ర్ కాద‌ని చెప్పాడు. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు చెబుతాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌హుభాషా చిత్రం చేస్తున్నాడు మ‌హేష్‌. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు కొర‌టాల శివ‌.