Monday, 20 November, 2017

విక్టరీ వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా interesting facts

sddefault

 

1990ల్లో తెలుగు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పై ఓ ముద్ర ఉండేది. అదే తను ఓ రీమేక్ ల హీరో అని. Of course అప్పట్లో వెంకటేష్ ఎక్కువగా remakes mostly from Tamil చెయ్యడం, అవన్నీ దాదాపుగా hit talk సంపాదించుకోవడం, as a result వెంకటేష్ కమర్షియల్లీ పెద్దహీరో అయిపోవడం కూడా జరిగిపోయింది. చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం… ఇలా ఈ సక్సెస్ ఫుల్ సినిమాలన్నీ కూడా తమిళంలో సక్సెస్ సాధించిన సినిమాలకు రీమేక్సే. And one more interesting fact is that ఇందులో ఎక్కువ శాతం తమిళ్ లో నటదర్శకుడు కే.భాగ్యరాజా చిత్రాలే. Today let’s know some interesting facts about the film ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఫిల్మ్.

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్, సౌందర్య, వినీత, కోట శ్రీనివాసరావ్, బ్రహ్మానందం అండ్ బాబూ మోహన్ మెయిన్ రోల్స్ ప్లే చేశారు. భాగ్య రాజా కథతో వచ్చిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఇ.వి.వి.సత్యనారాయణ. తన మెలోడియస్ ట్యూన్స్ తో సినిమా సక్సెస్ కు సహకారం అందించారు మ్యూజిక్ డైరెక్టర్ కోటి. శ్రీ దుర్గా ఆర్ట్స్ బేనర్ పై నిర్మాత కే.యల్.నారాయణ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను అందించారు. ఇద్దరు పెళ్ళాల మధ్య నలిగిపోయే భర్తగా వెంకటేష్ ప్రేక్షకుల మనసుల్లో నవ్వుల పువ్వులు పూయించారు.

maxresdefault

1995 లో మురుగేషన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం తాయ్ కులమే అనే చిత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాకు మాతృక. భాగ్యరాజా కథతో తెరకెక్కిన ఆ సినిమాలో పాండ్యరాజన్, ఊర్వశి అండ్ వినయ ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆ సినిమా సక్సెస్ అండ్ అందులోని fun elements నచ్చి దర్శకుడు ఇవివి తెలుగులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు గా రీమేక్ చేయడం, ఆ subject and fun తెలుగు ప్రేక్షకులనూ విపరీతంగా ఆకట్టుకోవడంతో this movie went on to become a great hit of those times. ఇసుకపల్లి మోహన్ రావ్ అందించిన సంభాషణలు తెలుగు ప్రేక్షకులని గిలిగింతలు పెట్టాయి.

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో comedy was the biggest highlight. వెంకటేష్-బ్రహ్మానందం అండ్ వెంకటేష్-కోట ల కాంబినేషన్స్ లోని అన్ని సీన్లూ నవ్వుల పువ్వులు పూయించాయి. One more biggest plus point for this film was the music by Koti. సినిమాలో ఉన్న మొత్తం ఐదు పాటలూ మ్యూజికల్ గా హిట్ అయినవే. ఆ పాటలకు సామవేదం షణ్ముఖ శర్మ అందించిన అద్భుతమైన సాహిత్యంతో పాటు, beautiful locations from India and Nepal shot by senior cameraman ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా పనితనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తమిళం అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో ఈ సినిమా సాధించిన సక్సెస్ తర్వాత ఇదే సినిమా బాలీవుడ్ అండ్ శాండల్ వుడ్ లలో లూడా రీమేక్ అయ్యేలా చేసింది. హిందీలో అనిల్ కపూర్, రవీనా టాండన్ అండ్ రంభ ల కాంబినేషన్ లో “ఘర్ వాలీ బాహర్ వాలీ” గా డేవిడ్ ధావన్ దర్శక్త్వంలో వచ్చి అక్కడ కూడా మంచి సినిమాగా నిలిచింది. అలాగే కన్నడంలో రవిచంద్రన్, సౌందర్య అండ్ ప్రేమ ల కాంబినేషన్ లో సక్సెస్ సాధించింది. సో టోటల్ గా తమిళం, తెలుగు, కన్నడ అండ్ హిందీ… ఇలా నాలుగు భాషల్లోనూ మంచి సక్సెస్ నమోదు చేసుకుంది ఈ సినిమా.

intlo-illaalu-vantintlo-priyural

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన మరో పాత్ర వినీత-వెంకటేష్ ల కొడుకుగా కనిపించిన మాస్టర్ నాగ అన్వేష్. తను అప్పటి ప్రముఖ నిర్మాత, సింధూరపువ్వు వంటి బ్లాక్ బస్టర్ అందించిన కృష్ణారెడ్డి తనయుడు. ఇప్పుడు తను పెద్దవాడయి హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక్కడ మరో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అన్వేష్ కు జంటగా తన ఫస్ట్‌ సినిమాలో వెంకటేష్ మరో సూపర్ హిట్ రీమేక్ ఫిల్మ్ దృశ్యంలో కూతురుగా నటించిన కృతిక హీరోయిన్ గా నటిస్తుండడం. This is really a surprising news for Victory Venkatesh and his fans as well.

తెలుగు తెరపై ఇద్దరు పెళ్ళాల మధ్య నలిగే భర్త కాన్సెప్ట్ ఎప్పటికీ ఓ సక్సెస్ ఫుల్ ఫార్ములాగానే నిలిచిపోయింది. ఒకప్పుడు శోభన్ బాబు, తర్వాత రాజేంద్రప్రసాద్ అండ్ జగపతిబాబు లు ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలతో సక్సెస్ సాధించారు. వెంకటేష్ జస్ట్ ఫర్ వన్ టైం ఈ కాన్సెప్ట్ ట్రై చేసినా ఈ సినిమా తనకు మంచి సక్సెస్ నే అందించింది అని చెప్పుకోవాలి. ఈరోజుకు కూడా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా టీవీల్లో ప్రసారమయితే హ్యాపీగా రెండున్నర గంటల సేపు టీవీలకు అతుక్కుపోయి నవ్వుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు అంటే ఆ సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎంతగా నిలిచిపోయిందో చెప్పనవసరం లేదు.