Friday, 24 November, 2017

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్‌-2 మ‌నోళ్లే

  ఐసీసీ టెస్టు ర్యాకింగ్ ప్ర‌క‌టించింది. ఈ టెస్టు ర్యాంకుల్లో ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉండ‌గా..  ర‌వీంద్ర జ‌డేజా రెండోస్థానంలో నిలిచాడు. కెరీర్‌లో తొలిసారి మ్యాచ్‌లో ప‌ది వికెట్లు తీసిన జ‌డేజా ఒకేసారి నాలుగు స్థానాలు ఎగ‌బాకాడు. 1974 త‌ర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భార‌త బౌల‌ర్లుగా అశ్విన్‌, జ‌డేజా రికార్డు సృష్టించారు.  చెన్నైలో ప‌ది వికెట్ల ప‌ర్ఫార్మెన్స్‌తో 66 పాయింట్లు జ‌డేజా ఖాతాలో చేరాయి. దీంతో అత‌ను అశ్విన్ కంటే కేవ‌లం 8 పాయింట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచాడు. సిరీస్‌లో జ‌డేజా మొత్తం 26 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్‌, జేమ్స్ ఆండ‌ర్స‌న్‌, డేల్ స్టెయిన్, రంగ‌న హెరాత్‌ల‌ను వెన‌క్కి నెట్టి జ‌డేజా రెండోస్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆల్‌రౌండ‌ర్ల లిస్ట్‌లోనూ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంకులో ఉన్నాడు జ‌డేజా. ఈ లిస్ట్‌లోనూ అశ్విన్‌దే అగ్ర‌స్థానం కావడం విశేషం. మొత్తానికి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను రికార్డు లెవ‌ల్లో గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్స్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ రికార్డులే సృష్టిస్తున్నార‌నే చెప్పాలి.

డీఎంకే అధినేత క‌రుణానిధికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మరోమారు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 92 యేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న కరుణానిధి మరోమారు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం శ్వాసతీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో ఆయనను చెన్నైలోని కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు ఐసీయూలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డీఎంకే శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.

ముగిసిన ధీర వనిత అంతిమ ప్రస్థానం

తమిళ సినీ, రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది. ధీర వ‌నిత జ‌య‌ల‌లిత‌ సైనికలాంఛనాలతో వీడ్కోలు తీసుకున్నారు. వేలాదిమంది తమిళ ప్రజల కన్నీటి వీడ్కోలు మధ్య జ‌య‌ల‌లిత అంత‌క్రియ‌లు మెరీనా బీచ్‌లో ముగిశాయి. జయ ఇష్టసఖి శశికళ అంతిమ సంస్కారాలను నిర్వహించింది కేంద్రం అధికార లాంఛనాలతో జయ అంత్యక్రియలను నిర్వహించింది. మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్ సమాధి సమీపంలో జయను ఖననం చేశారు.

అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు

కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాధాకృష్ణన్‌లు అంత్యక్రియలకు హాజరయ్యారు.తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, తంబిదురై, మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌నేత గులాంనబీ ఆజాద్‌, ఏఐఏడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తదితరులు జయలలిత పార్థివదేహం వద్ద చివరిసారిగా నివాళులర్పించారు. అమ్మను కడసారి చూసేందుకు వచ్చిన అశేష జనంతో మెరీనా బీచ్‌ కన్నీటి సంద్రమైంది. శాశ్వతంగా జయలలిత భూమాత ఒడిలోకి చేరారు. దీంతో తమిళనాట ఒక అధ్యాయం ముగిసింది.

”అమ్మా” నీవు మ‌ళ్లీ పుట్టాల‌మ్మ‌

జయలలిత అంటే ఓ శ‌క్తి…అందుకే అభిమానుల‌కు విప‌రీత‌మైన భ‌క్తి.   దేశ రాజ‌కీయాల్లో  తన ప్రత్యేకతను చాటుతూ వార్తల్లో నిలుస్తూ విప్లవ వనిత(పురట్చితలైవి)గా గుర్తింపు పొందారు. ‘అమ్మ’ పథకాలకు రూపునిచ్చి అట్టడుగు వర్గాల ఆశాదీపమయ్యారు. ఎన్నో స‌వాళ్ల‌ను, ఓట‌మ‌ను ఎదుర్కొన్ని అఖండ జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగించిన ధీర‌నారి. సాహసానికి మారుపేరైనా జ‌య‌య‌లిత ఎన్నో సంచ‌నాల‌కు కేంద్ర బిందు.  అభిమానిస్తే అందలెమెక్కించే జయ… ఆగ్రహిస్తే మాత్రం అప‌ర‌కాళినే. సినీ జీవితం నుంచి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన జయలలిత ఎదుర్కొన్నన్ని కష్టాలు, వివాదాలు, కేసులు మరే ఇతర నేతలు ఎదుర్కోలేదనేది అతిశయోక్తి కాదు. జ‌య‌ల‌లిత అనుక్ష‌ణం పేద‌ల క‌ష్టాల గురించి ఆలోచించ‌డం వ‌ల్ల‌నే అంద‌రూ అమ్మ అని పిలుస్తారు. అలాంటి అమ్మ ఈరోజు లేర‌నే విష‌యాన్ని త‌మిళ ప్ర‌జ‌లు నిగ్ర‌హించుకోలేక‌పోతున్నారు. ఇక సెల‌వంటూ మ‌మ్మ‌ల్ని వ‌దిలిన వెళ్లిపోయావా అంటూ రోదిస్తున్నారు. నువ్వు లేక‌పోయినా  నీ జ్ఞాప‌కాలు, ఆద‌ర్శాలతో బ‌తుకుతాం అంటున్నారు. అమ్మ నీవు ఒక ధీర వ‌నిత‌వి..అందుకే నువ్వు మ‌ళ్లీ పుట్టాల‌ని కోరుకుంటున్నాం

జ‌య‌ల‌లిత గురించి మీకు తెలియ‌ని విష‌యాలు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాల‌కు మారు పేరు జ‌య‌ల‌లిత‌. ప్ర‌జ‌లు ముద్దుగా అమ్మ అని పిలుస్తారు. ఇంకొంత‌మంది అయితే పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) గా పేర్కొంటారు. అయితే జ‌య‌ల‌లిత ఈ స్థాయికి రావ‌డాని ఆమె ఏమి పూల బాట తొక్కి రాలేదు. ముళ్ల‌బాట‌లో ప‌య‌ణిస్తూ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకుంది. అయితే మీకు జ‌య‌ల‌లిత గురించి కొన్ని విష‌యాలు చూడండి

1. ఫిబ్రవరి 24, 1948న అప్పటి 1948 ఫిబ్రవరి 24వ తేదిన మైసూరులో తమిళ అయ్యాంగార్ సంతతికి చెందిన జయరామన్, అలనాటి నటి సంధ్య దంపతులకు జయలలిత జన్మించారు. జయలలితకు ఆమె తల్లిదండ్రులు కోమలవల్లిగా నామకరణం చేశారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.జయలలితకు రెండు ఏళ్లు ఉన్న సమయంలో ఆమె తండ్రి జయరామన్ మరణించారు. తరువాత తల్లితో కలిసి తమిళనాడులోని సొంత ప్రాంతానికి చేరుకున్నారు. మద్రాసు (చెన్నై) లోని చర్చి పార్క్ స్కూల్ లో టాపర్ గా నిలిచారు. కుటుంబ పరిస్థితుల వలన తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది జ‌య‌ల‌లిత‌. తొలిచిత్రం ‘చిన్నడగొంబె’ (కన్నడ), మనుషులు-మమతలుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.తమిళ, తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో జయలలిత నటించారు. ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించిన రికార్డు జయలలిత సొంతం అయ్యింది
1972లో తమిళనాడు ప్రభుత్వం కళైమామణి పురస్కారాన్ని ఇచ్చి జయలలితను గౌరవించారు.

2. ఇక‌పోతే 1981లో జయ రాజకీయాల్లోకి వచ్చారు. కరుణానిధిపై వ్యతిరేకత కారణగా ఎంజీఆర్ పెట్టిన అన్నా డీఎంకే పార్టీలో ఆమె చేరారు. పార్టీలో చేరిన తొలినాళ్ల‌లో పార్టీ కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. తన వాక్చాతుర్యంతో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పని చేశారు. 1984లో ఆమెను రాజ్యసభకు పంపించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా జయ పనిచేశారు. 1991లో ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా సీఎంగా జయ రికార్డును నెలకొల్పారు. 2006లో మళ్లీ ఆమె సీఎం పదవి చేపట్టారు.

3.అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకున్న జయలలిత రెండు సార్లు సీఎం పదవి నుంచి తప్పుకుని జైలుకు వెళ్లారు. ప్రతిపక్ష నాయకుడు కురుణానిధితో పాటు డీఎంకే మాజీ మంత్రులను అరెస్టు చేయించి జైలులో పెట్టించారు.

4. జ‌య‌ల‌లిత అవివాహిత జీవితాన్నే గ‌డిపారు. 20 ఏళ్ల క్రితం ఆమె తన దత్తపుత్రుడి పెళ్లిని ఘనంగా చేశారు. అతిథుల్లో ఆ పెళ్లిది వరల్డ్ రికార్డు. ఖర్చులో ఆసియా రికార్డు.

ఏది ఏమైనా జ‌య‌ల‌లిత ఎన్ని వివాదాలు ఎన్నడూ భయపడలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లారు. ప్రజలే తన కుటుంబ సభ్యులని పేదలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ స్థాయిలో జయలలిత ఉన్నారంటే అందుకు తమిళ ప్రజల అండ పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు.