Monday, 23 October, 2017

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్‌-2 మ‌నోళ్లే

  ఐసీసీ టెస్టు ర్యాకింగ్ ప్ర‌క‌టించింది. ఈ టెస్టు ర్యాంకుల్లో ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉండ‌గా..  ర‌వీంద్ర జ‌డేజా రెండోస్థానంలో నిలిచాడు. కెరీర్‌లో తొలిసారి మ్యాచ్‌లో ప‌ది వికెట్లు తీసిన జ‌డేజా ఒకేసారి నాలుగు స్థానాలు ఎగ‌బాకాడు. 1974 త‌ర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భార‌త బౌల‌ర్లుగా అశ్విన్‌, జ‌డేజా రికార్డు సృష్టించారు.  చెన్నైలో ప‌ది వికెట్ల ప‌ర్ఫార్మెన్స్‌తో 66 పాయింట్లు జ‌డేజా ఖాతాలో చేరాయి. దీంతో అత‌ను అశ్విన్ కంటే కేవ‌లం 8 పాయింట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచాడు. సిరీస్‌లో జ‌డేజా మొత్తం 26 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్‌, జేమ్స్ ఆండ‌ర్స‌న్‌, డేల్ స్టెయిన్, రంగ‌న హెరాత్‌ల‌ను వెన‌క్కి నెట్టి జ‌డేజా రెండోస్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆల్‌రౌండ‌ర్ల లిస్ట్‌లోనూ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంకులో ఉన్నాడు జ‌డేజా. ఈ లిస్ట్‌లోనూ అశ్విన్‌దే అగ్ర‌స్థానం కావడం విశేషం. మొత్తానికి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను రికార్డు లెవ‌ల్లో గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్స్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ రికార్డులే సృష్టిస్తున్నార‌నే చెప్పాలి.

టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ

విరాట్ సేన సంచలన విజయం సాంధించింది. ఇంగ్లండ్ తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను భారత్ 4-0 గెలుచుకుని ఇంగ్లండ్ కు నిరాశను మిగిల్చింది.గతంలో సిరీస్‌ ఓటమికి సగర్వంగా ప్రతీకారం తీర్చుకొంది. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది. ఆత‌ర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా రాణించింది. యువ సంచలన బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌త్రిబుల్ సెంచ‌రీ, కేఎల్‌ రాహుల్‌ 199 పరుగులతో రాణించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లోనే భార‌త్‌ 759 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో 282 పరుగులు వెనుకబడింది. ఇంగ్లండ్ జట్టు భారత విజయాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టును కేవలం 207 పరుగులకే రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో కుప్పకూల్చాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు చివరి టెస్టును ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో కోల్పోయింది.

20brk-114-india

ఇక‌పోతే చివరి టెస్టులో 303 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కరుణ్ నాయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. టెస్టు సిరీస్ లో ఆరు వందలకు పైగా పరుగులు చేసిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక‌పోతే ఈ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన జడేజా కెప్టెన్ కుక్ ను సిరీస్ లో ఆరుసార్లు అవుట్ చేయడం యాదృచ్చికంగా జరిగిందని కోహ్లీ తెలిపాడు. టెస్టు విజయం ఆనందాన్నిచ్చిందన్నాడు.జట్టులో యువకులు రాణించడం శుభపరిణామమని అన్నాడుఅద్భుతమైన పిచ్ ను గ్రౌండ్స్ మన్ తయారు చేశారని, మెరుగైన జట్టే విజయం సాధించిందని కోచ్ కుంబ్లే చెప్పాడు.

kohliwinseries1

క‌ర‌ణ్ నాయ‌ర్ ఈజ్ గ్రేట్‌…!

క్రికెట్ చ‌రిత్ర‌లో భారత మిడిల్ ఆర్డర్ క్రికెటర్ కరుణ్ నాయర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నాయర్ అరుదైన ఘనత సాధించాడు. ఒక మ్యాచ్లో ఐదు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్లో నాయర్ ట్రిపుల్ సెంచురీ సాధించాడు. రోహిత్ శర్మ గాయంతో ఇంగ్లండ్ తో మూడో టెస్టులో నాయర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గత మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమైన నాయర్.. ఈ మ్యాచ్లో పరుగుల దాహంతో చెలరేగిపోయాడు. 379 బంతుల్లో 31 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 303 పరుగులు చేశాడు. మొత్తానికి ఒకే మ్యాచ్ లో గ‌త ఆట‌గాళ్ల రికార్డుల‌ను నాయ‌ర్ చెరిపివేశాడ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.

41482131856_625x300

మ‌రోవైపుఈ సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు సాధించారు.1978-79 సీజన్ తరువాత ఇదే తొలిసారి. చివరిసారి స్వదేశంలో వెస్టిండీస్పై భారత్ ఆ ఘనత సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను నమోదు చేశారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాల్గోసారి మాత్రమే. కాగా, ఈ సిరీస్లో భారత జట్టు ఇప్పటివరకూ ఎనిమిది శతకాలను సాధించడం మరో విశేషం. ఇందులో విరాట్ కోహ్లి, మురళీ విజయ్లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్లు తలో ఒక సెంచరీ సాధించారు.

71482145679_625x300

ఇక‌పోతే ఈ టెస్టు సిరీస్లో టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. భారత తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులను రికార్డును సొంతం చేసుకుంది. గత అత్యధిక పరుగుల రికార్డును ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ అధిగమించింది. 2009లో ముంబైలో జరిగిన టెస్టులో శ్రీలంకపై భారత్ 726 పరుగులే భారత్ కు ఇప్పటివరకూ టాప్ స్కోర్.దీన్ని భారత్ తాజాగా అధిగమించింది. కరుణ్ నాయర్ అత్యద్భుతమైన ఆట తీరుతో భారత్ ఆ మార్కును బద్ధలు కొట్టింది.ఇప్పటివరకూ భారత్ నాలుగుసార్లు మాత్రమే ఏడొందల మార్కును చేరింది. గత 12 ఏళ్లలోనే ఏడొందలకు పైగా పరుగులను టీమిండియా నాలుగుసార్లు సాధించడం విశేషం.

భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ..సిరీస్ కైవ‌సం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కిచుకుంది.ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 3-0తో సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో చివరి రోజున‌ 182/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించింది. భారత బౌలర్‌ అశ్విన్ త‌న స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ఎంతో సేపు సాగనివ్వ‌లేదు.. అశ్విన్‌ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. అశ్విన్‌ తొలుత ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌స్టో (51)ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత అశ్విన్‌ వరుస ఓవర్లలో వోక్స్‌, రషీద్‌, ఆండర్సన్‌లను పెవిలియన్‌ బాటపట్టించాడు. దీంతో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమైంది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ‘విరాట్ ’ అద్భుత బ్యాటింగ్‌తో 631 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ కంటే 231 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. భారీ పరుగుల లోటును చేధించేందుకు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా ఇంగ్లండ్‌ను 195 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌తో పాటు సిరీస్ గెలిచి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. వీర విహారం చేసిన విరాట్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

విరాట్ కోహ్లీనువ్వు గ్రేట్‌…

భార‌త క్రికెట్ టెస్ట్ కెప్ట‌న్ విరాట్  కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకున్నాడు. ముంబై వేదిక‌గా ఇంగ్లండ్ తో జ‌రుగుత‌న్న నాల్గో టెస్టులో ఈ ఫీట్ నెల‌కొంది. ఒక సిరీస్లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 96వ పరుగు చేసే క్రమంలో ఈ సిరీస్లో విరాట్ 500 పరుగుల మార్కును చేరాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు.

ఇక‌పోతే అంత‌కుముందు ముంబయి వాంఖడె మైదానంలో ఒకే సంవ‌త్స‌రంలో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో భారత జట్టు కెప్టెన్‌గా ఈ ఘనతను సాధించింది ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే. 1997లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌, 2006లో రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. అంతేకాదు.. కోహ్లీ టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

విరాట్ సేన విక్ట‌రీ

మొహాలీ టెస్టులో విరాట్ సేన విక్ట‌రీ కొట్టింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టుల్లో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ నాలుగో రోజు 103 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ అలవోగా ఆ లక్ష్యాన్ని సాధించింది. ఫస్ట ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మిస్సయిన పార్ధివ్ ఆ లోటును సెకండ్ ఇన్నింగ్స్‌లో భర్తీ చేశాడు తొలుత నాలుగు వికెట్ల న‌ష్టంతో 78 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు.. టీ విరామ సమయానికి ముందే 236 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 102 పరుగుల ఆధిక్యత మాత్రమే సాధించింది. జో రూట్ (78), హసీబ్ హమీద్ (59) పోరాడినా ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు. క్రిస్ వోక్స్ 30 పరుగులు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగి హాఫ్ సెంచరీలతో రాణించి స్పిన్నర్లు జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్ రెండో ఇన్నింగ్స్‌లో బాల్‌తో ప్రతాపం చూపి భారత్ విజయానికి బాట వేశారు. వీరికి ఫాస్ట్ బౌలర్ షమీ జత కలిశాడు. అశ్విన్ 3, జడేజా, జయంత్, షమీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.ఇదిలా ఉంటే ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో భారత్ ముందంజలో ఉంది.

మ్యాచ్ అనంత‌రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడారు. టాస్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ గెలుస్తామని అనుకోలేదని, డ్రాగా ముగుస్తుందని భావించాననన్నారు. కానీ సహచరులు రాణించడంతో, ఎవరి పాత్రను వారు సమర్థవంతంగా పోషించడంతో విజయం సాధించామ‌ని చెప్పారు., మిగిలిన టెస్టుల్లో కూడా విజయం సాధించాలనే లక్ష్యంతో దిగుతామని తెలిపాడు.