Tuesday, 25 April, 2017
hot-shruti-hassan-hot-12

యంగ్ మ్యుజిషియన్ తో శృతి డేటింగ్..?

సౌత్ నే కాకుండా అటు నార్త్ లోనూ తన అందాలతో అలరిస్తున్న భామ శృతి హాసన్. ఈ బ్యూటీ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అయితే శృతి డేటింగ్ చేస్తుంద‌నే న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.  ఈ మధ్య ఖాళీ దొరికితే లండన్ లో వాలిపోతోంది శృతి. రీసెంట్ గా పవన్ తో చేస్తోన్న కాటమరాయుడు మూవీ షెడ్యూల్ పొల్లాచ్చిలో ఫినిష్ కాగానే లండన్ చేరిపోయింది శృతి.అక్కడే ఓ యంగ్  మ్యుజిషియన్ తో శృతి డేటింగ్ చేస్తోందట. అయితే శృతి మాత్రం అలాంటిదేం లేదంటోంది. కొత్త మ్యూజిక్ ఆల్బం కోసమే తరచుగా లండన్ వెళ్తున్నానంటోంది. శృతి కూడా సింగర్ అనే సంగతి మనకి తెలిసిందే. అందుకే న్యూ మ్యూజిక్ ఆల్బం కోసం లండన్ వెళుతున్నానని డేటింగ్ మ్యాటర్ కవర్ చేస్తోందంటున్నారు. అయితే సమంత కూడా ఇంతకుముందు నాగ చైతన్యతో డేటింగ్ మ్యాటర్  చాలా కాలం సీక్రెట్ గా వుంచిందని..ఇప్పుడు శృతి కూడా అలానే చేస్తోందని టాక్ వినిపిస్తోంది.