Monday, 20 November, 2017

ప‌వ‌న్ ఓ నిద్ర‌పోతున్న అగ్నిప‌ర్వ‌తం-వ‌ర్మ‌

డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ చిత్ర విచిత్ర ట్వీట్ల చేస్తుంటారు. ఈ ట్వీట్ల‌లో కొంద‌రిని తిడుతాడు..మ‌రికొంద‌రిని పొగుడుతాడు. ముఖ్యంగా వర్మ స్పందించే లిస్టు లో పవన్ కళ్యాణ్ కూడా వున్నారు. సమయం చిక్కినప్పుడల్లా పవన్ పై వర్మ కామెంట్ల వర్షం కురిపిస్తూనే వుంటాడు.గ‌తంలో పవన్‌కల్యాణ్‌ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో మరెవరూ లేరన్నారు.. పవన్‌కల్యాణ్‌ తెలివైన ఆలోచనలు, ఉద్యమ ప్రణాళికలను తెలివితక్కువ వాళ్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంద‌ని రాసుకొచ్చాడు వ‌ర్మ‌. తాజగా వర్మనుండి మరో ‘పవర్’ బాణం బయటికి వచ్చింది. ”పవన్ కళ్యాణ్ నిదరపోతున్న అగ్ని పర్వతం లాంటి వాడ‌న్నారు.. అప్పుడపుడు గుడ గుడ లాడుతూ పొగలోదులుతుంటాడు… టైం వచ్చినప్పుడే పెల్తాడు” అని ట్వీట్ చేశాడు వర్మ. ఇటివల పవన్ కళ్యాణ్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన ఈ నేపధ్యంలో వర్మ ఈ ట్వీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

capture45888888

You might also like

Leave a Reply