Monday, 23 October, 2017

వంగవీటి మూవీ రివ్యూ

ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మాట అయినా, సినిమా అయినా సెన్సేష‌నే. టాలీవుడ్ హిస్టరీలో వివాదాస్పద సినిమాల్లో ఒక‌టిగా భావిస్తున్న వంగవీటి సినిమా డిసెంబ‌ర్ 23న‌ ప్రేక్ష‌కుల ముందుకుకొచ్చింది.చాలా రోజుల త‌ర్వాత వ‌ర్మ ఈ సినిమా ప్ర‌మోట్ చేయ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కులలో అంచ‌నాలు పెరిగాయి. ఇంత‌కీ వంగ‌వీటి సినిమా ఎలా ఉందో ఒక్క‌సారి చూద్దాం…

41482462416_unknown

సినిమా పేరుః వంగ‌వీటి
ద‌ర్శ‌కుడుఃరాంగోపాల్ వ‌ర్మ‌
న‌టీన‌టులుః సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలీ, కౌటిల్య, శ్రీతేజ్
నిర్మాతఃదాస‌రి కిర‌ణ్‌కుమార్‌
సంగీతంఃర‌విశంక‌ర్‌

41482464081_unknown

క‌థః  1970-88 మ‌ధ్య‌కాలంలో ఎర్రపార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ. వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. తనకు జరిగిన అవమాన్ని జీర్ణించుకోలేని రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్తో దారుణంగా నరికి నరికి చంపుతాడు.దీంతో రాధా పెద్ద రౌడీగా పేరు తెచ్చుకుంటాడు. సిటీలో అత‌ని పేరు ప్రాబ‌ల్యంలోకి వ‌స్తున్న‌ప్పుడు దేవినేని గాంధీ, నెహ్రు, ముర‌ళి అనే కాలేజ్ స్టూడెంట్స్ రాధా వ‌ద్ద‌కు చేరుతారు. రాధా పేరు సిటీలో ప్ర‌బ‌ల‌మైపోతున్న స‌మ‌యంలో ఓ సెటిల్‌మెంట్ గొడ‌వ‌లో రాధాను కొంద‌రు చంపేస్తారు. దాంతో వంగ‌వీటి మోహ‌న‌రంగా సీన్‌లోకి ఎంట‌ర్ అవుతాడు. రాధాపై అభిమానంతో దేవినేని బ్ర‌ద‌ర్స్ కూడా మోహ‌న్‌రంగాకే స‌పోర్ట్ చేస్తారు. అయితే చెప్పుడు మాట‌లు విన‌డం, చిన్న చిన్న స‌మ‌స్య‌లు పెరిగి పెద్ద‌ద‌వ‌డంతో వంగ‌వీటి మోహ‌న‌రంగాకు, దేవినేని బ్ర‌ద‌ర్స్‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. త‌మ‌కు వ్య‌తిరేకంగా గాంధీ స్టూడెంట్ యూనియ‌న్‌ను రెచ్చ‌గొడుతున్నాడ‌ని తెలుసుకున్న మోహ‌న‌రంగా అత‌నికి వార్నింగ్ ఇచ్చినా విన‌క‌పోవ‌డంతో, గాంధీని త‌న మ‌నుషుల‌తో చంపించేస్తాడు రంగా. దాంతో దేవినేని కుటుంబానికి, వంగ‌వీటి కుటుంబానికి దూరం పెరిగిపోతుంది. దేవినేని ముర‌ళి త‌న అన్న‌ను చంపిన వారిని చంపేస్తుంటాడు. మోహ‌న‌రంగా వార్నింగ్‌ను పట్టించుకోకుండా అత‌న్ని కూడా చంపేస్తాని అన‌డంతో మోహ‌న‌రంగ, దేవినేని ముర‌ళిని కూడా చంపేస్తాడు. అప్ప‌టికే దేవినేని నెహ్రు రాజ‌కీయాల్లో ఉండ‌టం, వంగ‌వీటి పార్టీ అధికారంలో లేక‌పోవ‌డంతో అద‌ను చూసి వంగ‌వీటి మోహ‌న‌రంగ‌ను చంపేస్తారు అస‌లు ఇంత‌కు మోహ‌న‌రంగ‌ను చంపిందెవ‌రు? అంత‌కు ముందు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప‌రిస్థితులేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….

81482463760_unknown

నటీనటులు ప‌నితీరుః

వంగవీటి సినిమాలో చాలా మంది కొత్త‌వారే న‌టించారు. కీలకమైన వంగవీటి రాధ, వంగవీటి రంగా పాత్రల్లో కనిపించిన సందీప్ కుమార్, ఆవేశపరుడైన రౌడీగా.. ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడిగా బాగా నటించాడు. రంగా భార్య పాత్రలో నైనా గంగూలీ ఆకట్టుకుంది. హ్యాపిడేస్ సినిమాలో స్టూడెంట్గా ఆకట్టుకున్న వంశీ చాగంటి ఈ సినిమాలో దేవినేని మురళీ పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రల్లో వంశీ నక్కంటి, కౌటిల్య, శ్రీ తేజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు ప‌నితీరుః
యాధార్థ ఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించటంలో వర్మకు తిరుగులేదు. గ‌త సినిమాలో ఉన్న క్వాలిటీ వ‌ర్మ‌ ఈ మధ్య తీస్తున్న సినిమాల్లో ఆ క్వాలిటీ చూపించటంలేదు. హడావిడిగా చుట్టేస్తూ కేవలం తన బ్రాండ్ వాల్యూ మీదే సినిమాను నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. వంగవీటి విషయంలోనే అదే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా భాగం సినిమాను తన వాయిస్ ఓవర్తో నడిపించి.. అసలు కథ కన్నా ఎక్కువగా సీన్స్నే ఎలివేట్ చేశాడు. వర్మ మార్క్ సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం మరోసారి ఆకట్టుకోగా మితిమీరిన రక్తపాతం అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
వర్మ మార్క్ టేకింగ్
యాక్షన్ సీన్స్
న‌టీన‌టుల ప‌నితీరు

మైనస్ పాయింట్స్ :
డైలాగ్స్
మితిమీరిన రక్తపాతం

రేటింగ్ 3\5

టీ టార్గెట్ లైన్‌: వంగ‌వీటి వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నం