Thursday, 19 October, 2017
banking

బ్యాంకర్లు మ‌నుషులు కాదా ? ( Webitorial- Tvarthalu)

మీరు నిన్నలంచ్ చేశారా.. మొన్న ? దానిక‌న్నా ముందు ?. చేశారు క‌దా. కానీ వేలాది మంది బ్యాంక‌ర్లు ఈ నాలుగు రోజుల నుంచి లంచ్ చేయ‌లేదు. ఇలా డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు. త‌ర్వాత కూడా ఉండొచ్చు. కానీ అదంతా మ‌న‌కెందుకు. నాలుగు 500 నోట్లు ఇవ్వాలి. కొత్త‌ 2000 నోటు తీసుకోవాలి. ఇదే మ‌న‌కు కావాల్సింది. అంతే క‌దా ?

అవునూ, ప్ర‌ధాన మంత్రి మోడి ప్ర‌క‌ట‌న‌తో మీరంతా టెన్ష‌న్ ప‌డుతున్నారు. అందుకే మీ చేతిలోని డ‌బ్బును మార్చుకోవ‌డానికి.. అది కూడా అంద‌రిక‌న్నా ముందు మార్చుకోవ‌డానికి బ్యాంకుల్లో క్యూ క‌డుతున్నారు. అద్భుత‌మైన భార‌త‌దేశం నిర్మాణానికి స‌హ‌క‌రిస్తున్నారు. భారీ క్యూలో నిల‌బ‌డి క్యాషియ‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లే వ‌ర‌కు మీకు నీర‌సం వ‌చ్చేస్తోంది. బీపీ ఎక్కిపోతోంది. ముందు క‌నిపిస్తున్న క్యాషియ‌ర్‌ని మీకు న‌చ్చిన‌ట్టుగా తిట్టేస్తున్నారు. తిట్టేయండి. మీకు న‌చ్చిన‌ట్టు తిట్డండి. కానీ ఆ క్యాషియ‌ర్ కూడా మ‌నలాగే ఒక ఉద్యోగి అని మ‌ర్చిపోయారా ?

 చాలా మంది బ్యాంకుల్లోకెళ్లి న‌గ‌దు మార్చుకుని రిలాక్స్ అయ్యారు. కానీ కౌంట‌ర్‌పై కూర్చున్న క్యాషియ‌ర్‌ని మాత్రం చాలా మంది శ‌త్రువులా చూస్తున్నారు. మ‌నలాగే వాళ్లు కూడా మ‌నుషులు అన్నవిష‌యం గుర్తుందా?

  • మీరిలా డ‌బ్బు ఇవ్వ‌గానే కొత్త నోట్లు ఇవ్వ‌డానికి అది పాన్ డ‌బ్బా కాదు. వాళ్ల ప్రాసెస్ వాళ్ల‌కు ఉంటుంది.

  • ప్ర‌తీ పైసాకి వాళ్లు స‌మాధానం చెప్పుకోవాలి. ఏమైనా త‌గ్గితే వాళ్ల జేబుల్లోంచే ఇవ్వాలి.

  • ఉద‌యం 9 నుంచి రాత్రి 10 వ‌ర‌కు తిండీ తిప్ప‌లు లేకుండా.. కోట్ల‌ రూపాయ‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చాలా స్ట్రెస్‌తో కూడుకున్నప‌ని. ఈ విష‌యం మ‌నం ఆర్థం చేసుకోవాలిగా…

  • మీరు ఎప్పుడైనా నోట్లు లెక్క బెట్టారా ? ఒక క‌ట్ట‌ని ఎన్ని సార్లు లెక్క‌బెడితే క‌రెక్ట్ ఎమౌంట్ ట్యాలీ అయింది? ఇవన్నీ ఆలోచించాలి. అలాంటి వంద‌లాది క‌ట్ట‌ల‌ను వాళ్లు డీల్ చేయాలి. అందులో ఒక్క‌టైన న‌కిలీ నోటు వ‌స్తే వాళ్ల జేబులోంచే క‌ట్టాలి.

  • మీ మోహం చూడ‌గానే మీ ఎకౌంట్ ఓపెన్ కాదు. ఇలా డ‌బ్బు ఇవ్వ‌గానే అలా మీ ఎకౌంట్‌లో న‌గ‌దు పడిపోదు. మీ ఎకౌంట్ లో సేఫ్‌గా మీ డ‌బ్బు చేర్చాలంటే వాళ్లకు కూడా స‌మ‌యం ప‌డుతుంది.

  • పాత నోట్ల క్వాలిటీ, అస‌లా న‌కిలీయా అని చెక్ చేయాలి. దాంతో పాటు రోజూవారీ లావాదేవీలు, మ‌ళ్లీ క్రాస్ సెల్లింగ్‌, గోల్డ్ లోన్స్ అడ‌గ‌మ‌ని మేనేజ‌ర్ పోట్లు.. ఇలాంటి ఎన్నో ప్రెష‌ర్స్‌కి క‌స్ట‌మ‌ర్ల అరుపులు తోడైతే.. వాళ్ల ఎంత టెన్ష‌న్ ప‌డ‌తారో ఆలోచించారా ?

  • వాళ్లు తిన్నారా లేదా.. అని ఎప్పుడైనా ఆలోచించారా ? వాళ్లు ఎటు పోతే మాకు ఎందుకు అంటారా ?

  • వాళ్లు ఏ గ్రహం నుంచి వ‌చ్చారు..అదే బ్యాంక‌ర్లు .. మార్స్‌… కాదు… వాళ్లు మ‌నుషులే క‌దా.. మ‌న గ్ర‌హ‌మే క‌దా.

  • వాళ్ల‌కు కూడా ఇమోష‌న్స్ ఉంటాయ‌ని మ‌ర్చిపోయాం. వాళ్ల‌కు కూడా ఫ్యామిలీ ఉంటుంద‌ని మ‌ర్చిపోయాం. వాళ్ల పిల్ల‌ల‌ను ఫ్యామిలీ విష‌యాలు ప‌ట్టించుకోకుండా 13-15 గంట‌లు బ్యాంకుల్లోనే ఉంటున్నారు . టెన్ష‌న్ టెన్ష‌న్ గా జీవితాన్ని గ‌డుపుతున్నారు.

         

  ఎదుటి వ్య‌క్తి మ‌నిషి..అనే విష‌యాన్ని గుర్తించలేని రోజు.. మ‌నం మ‌నుషుల‌మేనా అని ప్ర‌శ్నించుకోవాలి?

                                                                      బ్యాంక‌ర్ల‌ను అర్థం చేసుకుందాం..
                                                                                గౌర‌విద్దాం

                                                                           వాళ్ల‌కి స‌హ‌క‌రిద్దాం
                                                                  

చిworryగా..

మీ డ‌బ్బు లీగ‌ల్ అయితే..డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఎలాంటి టెన్ష‌న్ లేకుండా మార్చుకోవ‌చ్చు. అంద‌రిలా ఎగ‌బ‌డి తీసుకోవ‌డ‌గం వ‌ల్ల నోట్లు గుడ్లు పెట్టి డ‌బుల్ అవ్వ‌వ‌ని మ‌నం తెలుసుకుంటే… మోడి అనుకున్న, ఊహించిన మార్పును ఎలాంటి టెన్షన్ లేకుండా అంద‌రం స్వాగ‌తించొచ్చు.

MG kishore

MG kishore,
Editor, CEO
T-varthalu.com

Like this webtorial? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

You might also like

Leave a Reply