Thursday, 19 October, 2017

గుడ్ న్యూస్ః జియో ‘న్యూ ఇయర్‌ ఆఫర్‌’

అంద‌రూ అనుకున్న‌ట్లే జ‌రిగింది. జియో యూజ‌ర్ల‌కు రిల‌య‌న్స్ అధినేత ముఖేష్‌ అంబానీ గుడ్ న్యూస్ చెప్పేశారు. జియో సిమ్పై అందిస్తు‍న్న ఉచిత సేవలను వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఫేస్బుక్, స్వైప్ కంటే వేగంగా జియో సేవలు దేశంలో విస్తరించాయని ముఖేష్ అంబానీ హర్షం వ్యక్తంచేశారు.అత్యంత వేగంగా సాంకేతికతను అందించే సంస్థగా జియో నిలవడం గర్వకారణమని ..ఇది తమ ఖాతాదారుల విజయమని పేర్కొన్నారు. జియోను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని తెలిపారు.. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఈ ఉచిత సేవలు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు.డిసెంబర్‌ 31 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

You might also like

Jio is free till April 15th

Jio is free till April 15th

Leave a Reply