Monday, 20 November, 2017
indian police on horse

ఇన్ని కార్లు ఉండ‌గా..పోలీసులు గుర్రాల‌ను ఎందుకు వాడుతారో తెలుసా?

 రాజుల కాలంలో వివిధ దళాలు ఉండేవి. అందులో అశ్విక దళం ఒకటి. దానికి కొనసాగింపే ఇది.
 బ్రిటిష్‌ వారి సంప్రదాయాన్ని స్వాతంత్ర్యానంతరం మన దేశ పాలకులూ కొనసాగిస్తున్నారు. 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాల్లోని అనేక వలస దేశాల్లోనూ, యూరోపియన్‌ దేశాల్లోనూ, అమెరికాలోనూ అశ్విక పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ వైఎస్‌ దాద్వాల్‌ మొట్టమొదట సారి ఢిల్లీ అశ్విక దళాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. అయితే ఆయన తర్వాత వచ్చిన పోలీస్‌ కమిషనర్‌ 40 అశ్వాలను ఖరీదు చేసి అశ్విక దళాన్ని పునరుద్ధరించారు. స్వాతంత్య్ర దినోత్సవం, ఢిల్లీ పోలీస్‌ రైజింగ్‌ డే, ప్రముఖులు విడిది చేస్తున్న సమయంలోను, వారాంతాలలో ఢిల్లీ గేట్‌ వద్ద పహారా కోసం, క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వద్ద గుంపులను నియంత్రించేందుకు అశ్విక బలగాలను తరచూ వినియోగిస్తుంటారు. 

You might also like

Leave a Reply