Monday, 23 October, 2017

ఖబడ్దార్ పెట్రోలు లేకుండా తగలబెడతా-వ‌ర్మ‌

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ, వంగ‌వీటి రాధారంగా మిత్ర‌మండ‌లి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. వంగవీటి సినిమాలో రంగా పాత్రను సరిగా చూపించలేదని రాధారంగా మిత్రమండలి స‌భ్యులు ఆరోపించారు. ఈ ఇష్య‌నై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటూగా స్పందించారు. పనీపాటా లేకుండా వీధుల్లో తిరిగే మీలాంటి వారు రాధా రంగాల పేరు చెడగొట్టడానికే పుట్టారని విమర్శించారు. తన దిష్టిబొమ్మలను తగలబెట్టొచ్చు గానీ, తాను మాత్రం మీ లోపలి కుళ్లును పెట్రోలు కూడా లేకుండా తగలబెడతానని హెచ్చరించారు. తాను క్షమాపణలు చెప్పడం అటుంచి.. మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుంది ఖబడ్దార్ అంటూ మండిపడ్డారు.