Thursday, 19 October, 2017
pm-modi-held-cabinet

మంత్రులతో ప్రధాని మోదీ సమావేశం

నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న త‌రువాత ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు ప్ర‌ధాని మోదీ. అందులో భాగంగానే మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. నోట్ల రద్దుపై ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలు పటిష్టంగా అమలయ్యేలా చూడాలని మంత్రులను ఆదేశించారు ప్ర‌ధాని మోదీ. పెద్ద నోట్ల రద్దుపై ప్రజలకు వివరించ‌మ‌ని తెలిపారు. రైతులు, చిన్న వ్యాపారులకు తోడ్పడేలా కార్యాచరణ ఉండాల‌ని సూచించారు. మంత్రులంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాల‌న్నారు . ఎంపీలు శని, ఆదివారాల్లో ప్రజల దగ్గరకెళ్లి పెద్ద నోట్ల రద్దుపై వాస్తవాలు వివ‌రించాల‌న్నారు.