Monday, 20 November, 2017

ఘోర ప్ర‌మాదంః కుప్ప‌కూలిన విమానం

వరుస విమాన ప్రమాదాలు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. గాల్లో ప్రాణాలు గాల్లో క‌ల‌వ‌డంతో విమాన ప్రయాణమంటే రోజురోజుకు భయపడే పరిస్థితి కనిపిస్తోంది.  తాజాగా పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం కూలిపోయింది. ఈ విమానంలో 47 మంది ప్రయాణిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్రభుత్వ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-661 విమానం చిత్రాల్‌ నగరం నుంచి ఇస్తామాబాద్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో అబోటాబాద్‌ సమీపంలో రాడర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి.  ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని హవేలియన్‌ పట్టణ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోయిన సమాచారం తెలియడంతో రక్షణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారని అధికారులు తెలిపారు.

You might also like

Leave a Reply