Monday, 25 September, 2017

న‌టి దారుణ హ‌త్య‌

పాకిస్థాన్ లో మ‌రో దార‌ణం జ‌రిగింది. ప్ర‌ముఖ న‌టి కిస్మ‌త్ బేగ్ పై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు..దీంతో స్థానికులు ఈమెను , కార్ డ్రైవర్ ను దగ్గరలోని హాస్పటల్ కు చేర్చగా అప్పటి ఆమె ప్రాణాలు పోయాయని డాక్టర్స్ తేల్చారు..లాహోర్‌ నగరంలో గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది..కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిస్మత్‌ మాజీ ప్రియుడు, ఫైసలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ ఘటనలో గాయాలతో బయటపడ్డ డ్రైవర్ ను పోలీసులు విచారించ‌గా ప‌లు అస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పాడు. షో ముగించుకుని ఇంటికి తిరిగి బయలుదేరిన త‌మ కారును అగంత‌కులు వెంటాడి.. కారుకు అడ్డంగా బైక్‌ల ఆపి యాక్సిడెంట్‌ చేశారు. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే కొంతమంది త‌మ కారును చుట్టుముట్టి ‘ఇప్పుడు చెయ్యగలవా డాన్స్‌..’ అని కోపంగా అరుస్తూ తుపాకులతో నటి కాళ్లు, చేతులు, పొట్టభాగంలో విచక్షనారహితంగా కాల్పులు జరిపి పారిపోయార‌ని తెలిపాడు.

ఇదిలా ఉంటే టాప్‌ మోడల్‌ ఖందిల్‌ బలూచ్‌ దారుణ హత్య, అంతకుముందు టీవీ యాంకర్‌పై విషప్రయోగం, మరో తొమ్మిది మంది కళాకారిణుల హత్యలు.. పాకిస్థాన్‌లో శాంతిభద్రతల లేమిని తెలియజేస్తాయి.

You might also like

Leave a Reply