Monday, 23 October, 2017

రూ. 2000 నోటు గురించి బ‌య‌ట‌ప‌డ్డ సీక్రెట్‌..?

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ లో కొంచెం మార్పు వ‌చ్చింద‌నే చెప్పాలి.  ముఖ్యంగా కొత్త రెండు వేల నోట్ల‌ ముద్రణ కోసం వాడిన టెక్నాలజీ, రంగు, రూపం తదితర విషయాలపై జనాల్లో విపరీతమైన ఊహాగానాలు వెల్లువెత్తాయి.  తొల‌త రూ.2 వేల నోట్లలో జీపీఎస్ ఆధారిత నానో చిప్‌లు పెట్టారనీ రూమ‌ర్స్ వచ్చాయి. తర్వాత అవన్నీ కట్టుకథలేనని తేలిపోయాయి. తాజాగా మరో సంచలన విషయం విస్తృతంగా ప్రచారం అవుతోంది. రూ.2 వేల నోటులో పి32 అనే రేడియో ధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందన్న వార్త శరవేగంగా వ్యాపిస్తోంది. రెండు వేల నోటు ముద్రించేందుకు ఈ రేడియో ధార్మిక పదార్థాన్నే వినియోగించారనీ.. అందుకే పెద్ద మొత్తంలో దాచిపెట్టిన కొత్త నోట్లు దొరికిపోతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.  ఇక‌పోతే  కొత్త కరెన్సీ నోట్లను రేడియో ధార్మిక పదార్థంతో ముద్రించినట్టు అటు ఆర్బీఐగానీ, ఇటు ఆర్ధిక శాఖగానీ అధికారికంగా ఏమీ వెల్లడించలేదు. రెగ్యులర్‌గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లనే తాజా నోట్లలో కూడా వినియోగించినట్టు ఆర్బీఐ వర్గాలు కూడా చెబుతుందడడంతో… ఈ ‘రేడియో ధార్మిక’ వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.