Sunday, 24 September, 2017

విడాకుల బాట‌లో ప‌వ‌న్ హీరోయిన్‌

ఇటీవ‌ల కాలంలో హీరోయిన్లు, హీరోల విడాకుల వ్య‌వ‌హారం కామ‌న్ అయిపోయింది. పెళ్ల‌యి ఇర‌వైయేళ్ల పాటు కాపురం చేసిన జంట‌లు కూడా విడిపోతున్నాయి. బఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టించిన ఓ క్రేజీ హీరోయిన్ సైతం ఇప్పుడు విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అదేనండి తెలుగులో గుడంబా శంకర్‌’, ‘భద్ర’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్‌ మీరా జాస్మిన్‌. తెలుగులో పెద్దగా సక్సెస్‌ఫుల్‌ కాలేకపోయిన ఈ ముద్దుగుమ్మ తమిళం, మలయాళం సినిమాల్లో మాత్రం టాప్‌హీరోయిన్‌గా కొనసాగింది. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే రాజేష్‌ అనే సంగీతకారుడితో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. అయితే ఆ ప్రేమ ఎంతోకాలం సాగలేదు.

 

636172218793332980
ఆ తర్వాత అనిల్‌ జాన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. అనిల్‌కు అప్పటికే పెళ్లయింది. మీరాతో ప్రేమలో పడిన తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక వీరిద్దరూ పెళ్లికి సిద్ధపడుతున్న తరుణంలో అనిల్‌ మాజీ భార్య తరపు బంధువులు మీరాపై దాడి చేశారు. అప్పుడు పోలీసుల రక్షణలో అనిల్‌-మీరాలు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ బంధానికి బీటలు పడినట్టు సమాచారం. పెళ్లయిన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏడాది నుంచి అనిల్‌కు మీరా దూరంగా ఉంటోందట. త్వరలోనే వీరిద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్టు సమాచారం. విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని భావిస్తోందట మీరా.

You might also like

Leave a Reply