Wednesday, 23 August, 2017

రాజ‌కీయాల్లోకి మ‌హేష్ బాబు ఎంట్రీ..?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్ లో కాదులెండి..రీల్ లైఫ్ లోనే. శ్రీ‌మంతుడు త‌ర్వాత కొరటాల శివ‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌. అయితే ఈ మూవీలో మ‌హేష్ ని ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడట కొరటాల. ఇంతకుముందు ‘దూకుడు’లో తండ్రి కోసం యంగ్ ఎమ్మెల్యేగా నటించే క్యారెక్టర్ చేశాడు.యంగ్ ఎమ్మెల్యేగా వైట్ అండ్ వైట్‌లో మహేష్ చేసిన కామెడీ అదిరిపోయింది. ఇక కొరటాలతో చేయబోయే మూవీలో మాత్రం ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడట. ఈ మూవీలో పాలిటిక్స్‌ని సీరియస్‌గానే టచ్ చేస్తున్నాడట కొరటాల. అయినా కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా వుండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీలో మహేష్‌తో కీర్తి సురేష్ ఫస్ట్ టైం జతకట్టబోతోంది.

You might also like

Leave a Reply