Wednesday, 23 August, 2017

”సంభవామి” అంటున్న మ‌హేష్‌

టాలీవుడ్  సూప‌ర్ స్టార్ మ‌హేష్, డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం పై  అంచ‌నాలు భారీగా ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికాలంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అటు చిత్ర బృందంలోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ‘వాస్కోడిగామా’, ‘ఏజెంట్ శివ’ వంటి పలు పేర్లను అనుకున్నారు. అయితే, ఈ టైటిళ్ల విషయంలో అభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ గందరగోళానికి తెర దించుతూ.. ఈ సినిమాకు   ‘సంభవామి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ వింటుంటేనే ‘అరె.. భలే ఉందే’ అనిపిస్తోంది కదా.  మొత్తానికి చివ‌ర‌గా మ‌హేష్ సినిమా టైటిల్ బాగుందని సినీ జనాలు అనుకుంటున్నారు.. కాగా, ఈ టైటిల్‌ను మహేశ్ కోసం ఫిల్మ్ చాంబర్‌లో నమోదు చేయించినట్లు ప్రముఖ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రెండు భాషల్లోనూ ఒకే టైటిల్ పెట్టాలని మురుగదాస్ ఆలోచిస్తున్నాడు. దానిలో భాగంగానే.. ఈ టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.

You might also like

Leave a Reply