Monday, 20 February, 2017
ktr-lc27

హైదరాబాద్‌ను కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతాం-కేటీఆర్‌

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో వాతావరణ కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను తరలిస్తామని చెప్పారు. తరలించే ప్రాంతాల్లోనూ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 1160 పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలించాల్సి ఉందన్నారు. పరిశ్రమలు తరలించేందుకు 19 ప్రతిపాదిత స్థలాలు గుర్తించామని చెప్పారు.హైదరాబాద్‌ను కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.