Monday, 20 November, 2017

త్వరలో ఐటీని విస్త‌రిస్తాం-మంత్రి కేటీఆర్‌

 శాస‌న‌మండ‌లి ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కుల మంత్రి కేటీఆర్ స‌మాధాన‌మిచ్చారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐటీని విస్తరించబోతున్నామని కేటీఆర్ తెలిపారు.  రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు టాస్క్ ఏర్పాటు చేశామన్నారు. . గతంలో ఏనాడూ లేని విధంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో త్వరలో ఐటీని విస్తరించబోతున్నామని ప్రకటించారు.టీహబ్ దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కాకతీయ శాండ్ బాక్స్ పేరిట, వరంగల్‌లో నిట్‌తో కలిపి టీ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.