1464668221855_banner

జ‌బ‌ర్ధ‌స్త్ లో బంధాలు

తెలుగు బుల్లితెరపై నవ్వుల పువ్వులు పూయిస్తున్న ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ కామెడీ షో.ఈ ప్రోగ్రాం టాలీవుడ్ కు ఎంతో మంది కామెడీయ‌న్లును ప‌రిచ‌యం చేసింది. అలాగే ఎలాంటి గుర్తింపు లేని ఔత్సాహిక నటులకు ఇదో మంచి ఫ్లాట్ ఫామ్ లా మారిపోయింది. మ‌రోవైపు ఈ ప్రోగ్రాం ఎంత స‌క్సెస్ అయిందో అంతే వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. ఇటీవ‌ల కాలంలో ఈ ప్రోగ్రాంలోని డ‌బుల్ మీనింగ్ డైలాగ్ లు శృతిమించిపోతున్నాయి. ఈ సంగ‌తీ ప‌క్క‌న పెడితే జ‌బ‌ర్ధ‌స్త్ షోలో ప్ర‌త్యేకంగా కొన్ని బంధాలు ఏర్ప‌డ్డాయి. అవి ఏంటంటే కామెడీ కింగ్ నాగ‌బాబును సుడిగాలి సుధీర్ డాడీ అనేవాడు. ఇప్పుడు మాస్ట‌ర్ నియంత్ కూడా నాగ‌బాబు మా బాబే అంటున్నాడు. ఇక‌పోతే ర‌చ్చ ర‌వి టీంలోని అప్పారావు అయితే రోజాను వ‌దిన అని, నాగ‌బాబును బావ అని పిలిస్తే చాలు న‌వ్వే వారు చాలా మంది ఉన్నారు. ఇదే అప్పారావు మాత్రం యాంక‌ర్ ర‌ష్మిని పిన్ని అన‌డం ఇక బాగుంది. ఏది ఏమైనా జ‌బ‌ర్ధ‌స్త్ షోలో కొన్ని బంధాలు ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తున్నాయనే చెప్పాలి.