Monday, 25 September, 2017

జియో ఫ్రీ ఆఫ‌ర్ ఏడాది…?

టెలికాం రంగంలో సంచ‌ల‌నం సృష్టించిన జియో మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించేందుకు సిద్ద‌మ‌వుతోంది.వెల్‌క‌మ్ ఆఫర్ పేరుతో మూడు నెల‌ల‌పాటు ఉచిత వాయిస్‌, డాటాల‌ను వినియోగ‌దారుల‌కు ప్ర‌క‌టించింది జియో. అయితే ఈ ఆఫ‌ర్ మ‌రో నెల‌రోజుల్లో ముగియ‌నుండ‌గా.. ఈ ఆఫ‌ర్‌ను పొడిగించేందుకు స‌న్నాహాలు చేస్తోంది రిల‌య‌న్స్ జియో.


డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ బర్త్‌డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఉచిత సర్వీస్‌తో‌పాటు వెల్‌కమ్ ఆఫర్- 2017 ఏడాది చివరి వరకు ఇచ్చే ఛాన్స్ వున్నట్లు షికార్లు చేస్తున్నాయి. నిజంగా జియో నుంచి ఈసారి సంచలన ప్రకటన ఉంటుందా? లేదా అన్నవిషయం తెలియాలంటే డిసెంబర్ 28 వరకు వెయిట్ తప్పదు మరీ!


ఒకవేళ అలాంటి ప్రకటనొస్తే గనుక, ఈసారి మాత్రం మిగతా కంపెనీలు తేరుకోవడం కష్టమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే జియో ఆఫ‌ర్ కు బ‌దులుగా అనిల్ అంబానీ కూడా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే! కేవలం రూ.149 రీచార్జ్‌తో ఇండియావైడ్‌ అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేసుకోవడంతోపాటు ఫ్రీగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని ఆర్‌కాం ప్రకటించింది. జియో ఆఫర్ 4జీ కస్టమర్స్‌కు కాగా, ఆర్‌కాం ఆఫర్‌ను 2జీ, 3జీ, 4జీ వినియోగదారులకూ వర్తిస్తుంది. మరి తండ్రి బర్త్ డే రోజున అన్నాతమ్ముళ్లు ఈసారి ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాలి

You might also like

Leave a Reply