Monday, 23 October, 2017
fake news and hoax effects on real life

పిల్లి డ్యాష్‌కి డైప‌ర్ ఎవ‌రు వేస్తారు ?

ఒక పిల్లి ఎక్క‌డంటే అక్క‌డే షిట్ చేసేది..దాంతో ఎల‌క‌లు ఖంపు భ‌రించ‌లేక‌పోయాయి. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. పిల్లికి డైప‌ర్ వేద్దామ‌ని. కానీ పిల్లి డ్యాష్ కి డైప‌ర్ ఎవ‌రు వేస్తారు ? ఇదే ఎల‌క‌ల సందేహం. ఇది క‌థ కాదు నిజం. ఇక్క‌డ సోష‌ల్ మీడియానే పిల్లి. యూజ‌ర్లు ఎల‌క‌లు. పుకార్లు, రాద్దాంతాలే కంపు. అమ్మాయిలు క‌నిపిస్తే ప‌ది సార్లు ఎన‌కా ముందు చూడ‌టం కామ‌న్‌. కానీ ఒక విష‌యం షేర్ చేసే ముందు ఎన‌కా ముందు ఆలోచిండం లేదు. ఎందుకంటారు.. మీడియాలా సోష‌ల్‌నెట్ వ‌ర్కింగ్ వినియోగ‌దారులు కూడా సంచ‌ల‌నానికి అల‌వాటు ప‌డ్డారా.. వాస్తవం అవ‌స‌రం లేదా ?

 ఒక వారం క్రితం వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, పేప‌ర్లూ, చానెళ్లు..ఎక్క‌డ చూసినా.. కుక్క మాంస‌మే. ఒక హోట‌ల్‌లో బిర్యానీలో కుక్క‌మాంసం క‌లిపార‌నే పుకారు.. ధావ‌నంలా వ్యాపించింది. ద‌మ్‌కి బిర్యానీ లో కుక్క మాంసం అని ద‌మ్ ద‌మ్ చేసింది. వాట్స‌ప్‌ గ్రూప్‌లో ఉండ‌టం పాపంలా క‌నిపిస్తుంది. ఎందుకంటే.. ఇలా మెసేజ్ వ‌స్తే.. అలా ఫ‌ర్వార్ట్ చేసేస్తున్నారు. అన్ని గ్రూపుల్లో అదే కంటెంట్‌. గుడ్డిగా షేరింగేనా.. వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని ఎవ‌రికీ ఉండ‌దా ?ఒక ఎంబియే విద్యార్థి స‌ర‌దాకోసం రాసిన మెసేజ్‌.. టోట‌ల్ తెలుగు వాళ్ళ‌ను అన‌వ‌ర విష‌యంలో అల‌ర్ట్ చేసింది. చివ‌రికి షాహ్‌ఘౌస్ వ్యాపారం దెబ్బ‌తింది. ఇందులో మ‌న పాపం కూడా ఉందిగా.. ఇలా మెసేజ్ రాగానే అలా షేర్ చేస్తుంటాం.. అబద్ధానికి బానిస‌త్వం చేస్తున్న‌ట్టే క‌దా

చెత్త‌ను బుట్ట‌లో కాదు.. గ్రూప్‌లో వేయండి
* వాట్స‌ప్ వీడియో కాలింగ్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అనే మెసేజ్‌.. ఉస్తాద్‌ వాట్స‌ప్ అప్‌డేట్ చేయాలంటే.. ప్లేస్టోర్ ఉంది క‌దా ?
*ఈ అమ్మాయికి బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ‌చ్చింది., స‌హాయం చేయండి. మీరు షేర్ చేస్తే ఫేస్‌బుక్ అమెకు ప్ర‌తీ షేర్‌కు ఒక రూపాయి ఇస్తుంది అనే మెసేజ్‌.. కామ‌న్‌సెన్స్ క‌దా..ఒక వేళ ఫేస్‌బుక్ స‌హాయం చేయాలి అనుకుంటే ఇలా చీప్‌లా షేర్ చేయ‌మ‌ని చెప్ప‌దు క‌దా .
* ఈ మ‌ధ్య వాయిస్ రికార్డింగ్‌లు కూడా తోడ‌య్యాయి. నిమిషం పాటు ఉండే వాయిస్‌లో ఇక్కడ క‌నిపిస్తున్న వ్య‌క్తికి శ‌క్తి కావాలంటే బూస్ట్ కావాలి…ఈ మెసేజ్‌ను షేర్ చేయండి అని.. వీటి వెన‌క ఒక ప్లానే ఉంది.
*ప్ర‌మాదం జ‌రిగిన దృశ్యాలు, కంటెంట్‌ వంటి జుగుప్సాక‌ర‌మైన షేరింగ్స్ వ‌ల్ల చూసే వారి మ‌న‌సు విచ‌లితం అవుతుంది. లైఫ్ అంచే చిరాకు వేస్తుంది.
ఇలాంటి ఎన్నో షేరింగ్‌లు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ లైఫ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి..

వాస్త‌వాలు
ఇలాంటి స్పామ్ మెసేజ్‌లు ఎందుకు పుడ‌తాయో తెలుసా ?
1. కొన్ని వెబ్‌సైట్ లు, బ్రాండ్ లు ఇలా అవాస్త‌వ పోస్ట్‌ల‌ను షేర్ చేస్తాయి. ఇవి క్లిక్ చేస్తే వాళ్ల‌కు విజిట‌ర్స్ పెరుగుతారు. దాంతో యాడ్స్ పెరుగుతాయి.
2. హ్యాక‌ర్లు ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల‌ను క్రియేట్ చేసి స్పామ్ చేస్తారు. ఎంత షేర్ అయితే.. వీళ్ల ప‌ని అంత ఈజీ అవుతుంది. మీ లైఫ్ హ్యాక్ అవుతుంది.

 ఇలాంటి ఫేక్ న్యూస్‌ల‌ను అరిక‌ట్టేందుకు ఫేస్‌బుక్ ప‌క్కా ప్ర‌ణాళిక వేస్తోంది. ఆ ప్లాన్ అమ‌ల‌య్యే వ‌ర‌కైనా మీరు వ‌దంతుల‌ను, పుకార్ల‌ను షేర్ చేయ‌కండి ఉస్తాద్‌. పిల్లి డ్యాష్‌కి డైప‌ర్ క‌ట్ట‌కుంటే..కంపు మ‌న‌కే వ‌స్తుంది. ఆలోచించండి

-న‌క్క‌తోక‌


             You can Follow Us on Facebook @   https://www.facebook.com/trendingvarthalu

             For  Nakkatoka Features @ https://www.facebook.com/nakkatoka