Monday, 25 September, 2017

ఇక నేనే అమెరికా బాస్ ను ట్రంప్ ఆస‌క్తిక‌ర స్పీచ్

న‌రాలు తెగే ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. స‌ర్వేల అంచనాల‌న్ని త‌ల‌క్రిందులు చేస్తూ ఊహించ‌ని విధంగా ట్రంప్ విజ‌య‌భావుటా ఎగ‌ర‌వేశారు. త‌న ప్ర‌త్య‌ర్ధి హిల్ల‌రీ క్లింట‌న్ ఆశ‌ల‌కు గండి కొట్టి వైట్ హౌజ్ ను ఏలేందుకు సంప‌న్న వ్యాపార‌వేత్త సిద్ద‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ట్రంప్ అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఉద్ధేశించి కీల‌క ఉప‌న్యాసం ఇచ్చారు. ఇక ప్ర‌తీ అమెరికా వ్య‌క్తికి నేనే అధ్య‌క్షుడిన‌న్నారు ట్రంప్‌…

  అమెరికా ప్రజల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడతానని, నేను గెలిచేందుకు స‌హ‌క‌రించిన వారందరికి కృత‌జ్ఞ‌తలు అంటే పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఆయ‌న అమెరికా అభివృద్ధి కోసం నిరంతంరం కృషి చేస్తాన‌ని చెప్పారు. అమెరికా ఆర్థిక రేటును గాడిలో పెట్టి రెట్టింపు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. త‌నతో పాటు దేశం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా సమైక్యంగా ఉండడానికి అందరూ కలిసిరావాలన్నారు. ఇది ఒక్కటే చారిత్రక విజయం కాదని, ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డం కోసం త‌న వ‌ద్ద గొప్ప ప్ర‌ణాళిక‌లు కూడా ఉన్నాయిని తెలిపారు. 

ఈ స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లైన‌ప్ప‌టి నుంచి జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌ల‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ట్రంప్ కు హిల్ల‌రీ, అమెరికా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా, త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్రంప్ గెలుపుతో ఆయ‌న ఇళ్లు, పార్టీ కార్యాల‌యం వ‌ద్ద కోలాహలం నెల‌కొంది. ఆయ‌న అభిమానులు పెద్ద ఎత్తున సంబ‌రాల్లో మునిగిపోయారు.

Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com