Sunday, 19 November, 2017
telugu jokes

తెలుగు జోక్స్‌

ఆకారం
చెస్టర్టన్ అనే ఆంగ్ల రచయిత ఒకరోజు బెర్నార్డ్ షాని కలుసుకున్నారు. చెస్టర్టన్ లావుపాటి మనిషి. బెర్నార్డ్ షా అందుకు విరుద్ధం. బెర్నార్డ్ షా ఆకారాన్ని గురించి ఓ ఆట పట్టించాలని అనిపించింది చెస్ట‌ర్‌స్ట‌న్ కి.
మిమ్మల్ని చూస్తే చాలు.. మనదేశం అంతా కరువుకాటకాలతో నిండిపోయింది అనుకుంటారని అన్నాడు బెర్నార్డ్ షాతో్. షా నవ్వేసి నిజమే.. అయితే మీ ఆకారం చూస్తే ఆ కరువుకాటకాలు ఎందుకు ఏర్పాడ్డాయో వెంటనే తెలిసిపోతుంది వారికి అన్నాడు సీరియ‌స్ గా.

పొరపాటు
హైజాకర్ పైలట్ వెనకే నిలబడి అతని మెడ మీద పిస్టల్ ఉంచాడు.
వెంటనే విమానం పారిస్ తీసుకెళ్లు అన్నాడు.
అది విన్న పైలట్.. ఏడ్చినట్టుంది. మన విమానం అసలు వెళ్లేది పారిస్కేగా అన్నాడు.
అది విన్న హైజాకర్ చచ్చాన్రా నాయనా. పొరపాటున ఇంకో ఫ్లైట్ ఎక్కినట్టున్నా అన్నాడు.

 

ఇండ‌స్ట్రీలో 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నవ‌ప‌ర్‌స్టార్‌

ప‌వ‌ర్ స్టార్  ప‌వ‌న్‌  క‌ల్యాన్ తెలుగు  సినీప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టి  నిన్న‌టితో 20 ఏళ్లు పూర్త‌య్యాయి. 1996 అక్టోబ‌ర్ 11న అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర‌య్యారు ప‌వ‌న్ క‌ల్యాన్‌. క‌యామ‌త్ సే కయామ‌త్ త‌క్ అనే హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చిన  ఈ  చిత్రం 47 థియేట‌ర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాన్  మార్ష‌ల్ ఆర్ట్ ట్యాలెంట్‌తో, స్టైల్‌తో ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆ త‌రువాత తొలిప్రేమ‌, త‌మ్ముడు, బ‌ద్రి, ఖుషీ, జ‌ల్సా, గబ్బ‌ర్ సింగ్‌, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలతో కోట్లాది  మందికి ఫేవ‌రిట్ అయ్యారు.  డైలాగ్ డిల‌వ‌రీ, డ్రెస్సింగ్‌, మ్యాన‌రిజంతో టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోగా అయ్యారు.  ఆయ‌న  ట్యాలెంట్‌కు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి. సినిమాలు  చేస్తూనే జ‌న‌సేన పార్టీ  బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ప‌వ‌న్ కల్యాన్ ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

pavan kalyan

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినియా చేస్తున్నవిష‌యం తెలిసిందే.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్  ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినియా చేస్తున్నవిష‌యం తెలిసిందే.  ఈ చిత్రం ఇటీవలే ఫ‌స్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.  రేప‌టి నుంచి రెండో షెడ్యూల్ మొద‌లు కానుంది.  త‌రువాత షెడ్యూల్ రామేశ్వ‌రంలో.  2016 ఎండ్ అయ్యేలోపు షూటింగ్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసి  మార్చి 31కి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్  చేస్తున్నార‌ట‌.  త‌మిళంలో్ విజ‌యం సాధించిన వీర‌మ్  చిత్రానికి  కాట‌మ రాయుడు తెలుగు వ‌ర్ష‌న్‌. తెలుగు స్థానిక‌త‌ను బ‌ట్టి  డైలాగ్స్‌లో కొన్ని మార్పులు చేశార‌ట‌. గ్రామీణ వాతావ‌ర‌ణం, మాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్..వెర‌సీ ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ విజిల్స్ వేసే  కంటెంట్‌తో సినిమా ఉంటుంద‌ట‌. కాట‌మ రాయుడులో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ్ముడిగా అజ‌య్‌,  శివ‌బాలాజీ, క‌మ‌ల్ కామ‌రాజు, చైత‌న్య కృష్ణ న‌టిస్తున్నారు. హీరోయిన్ శృతి హాన‌స్.

రానాకు కేటిఆర్ సలహా…

సురేష్ బాబుకు క‌న్న కొడుకు రానాతో సినిమా చేయ‌డానికి ఇప్పుడు స‌మ‌యం దొరికిన‌ట్టుంది.  ఇండ‌స్ట్రీలో క‌న్న కొడుకు ఉన్నా… సినిమా తీస్తాన‌ని ఎప్పుడూ ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఇప్పుడు ఒక భారీ బ‌డ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇదంతా బాహుబ‌లి ఎఫెక్టే అనుకోవ‌చ్చు. ఎందుకంటే బాహుబ‌లికి ముందు రానా పాపులారిటీ, పారితోషికం…త‌క్కువ‌. బాహుబ‌లి వ‌ల్ల వ‌చ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకొనే క్ర‌మంలో్నే సురేష్ బాబు సినిమా తీయ‌నున్నాడ‌ని ఇట్టే అర్థం అయిపోతుంది. తండ్రితో క‌లిసి ఒక సినిమా చేయ‌బోతున్న‌ట్టు రానా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. దీనికి కేటిఆర్ స‌ర‌దా  స‌ల‌హాతో్ రప్లై   ఇచ్చాడు.” సలహా/హెచ్చరిక..తండ్రులు చాలా టఫ్ బాసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దు..జాగ్రత్త మరి ” అంటూ రానాకు రిప్లై ఇచ్చారు తెలంగాణ మంత్రి కెటీఆర్. దానికి రానా కూడా ” థ్యాంక్యూ సర్..అర్ధమైంది. దృష్టిలో పెట్టుకుంటాను, ఫాలో అవుతాను ” అంటూ రిప్లై ఇచ్చాడు. కెటీఆర్ చెప్పింది కూడా కరెక్టే మరి..!

telugu jokes

తెలుగు జోక్స్‌

ఆకారం
చెస్టర్టన్ అనే ఆంగ్ల రచయిత ఒకరోజు బెర్నార్డ్ షాని కలుసుకున్నారు. చెస్టర్టన్ లావుపాటి మనిషి. బెర్నార్డ్ షా అందుకు విరుద్ధం. బెర్నార్డ్ షా ఆకారాన్ని గురించి ఓ ఆట పట్టించాలని అనిపించింది చెస్ట‌ర్‌స్ట‌న్ కి.
మిమ్మల్ని చూస్తే చాలు.. మనదేశం అంతా కరువుకాటకాలతో నిండిపోయింది అనుకుంటారని అన్నాడు బెర్నార్డ్ షాతో్. షా నవ్వేసి నిజమే.. అయితే మీ ఆకారం చూస్తే ఆ కరువుకాటకాలు ఎందుకు ఏర్పాడ్డాయో వెంటనే తెలిసిపోతుంది వారికి అన్నాడు సీరియ‌స్ గా.

పొరపాటు
హైజాకర్ పైలట్ వెనకే నిలబడి అతని మెడ మీద పిస్టల్ ఉంచాడు.
వెంటనే విమానం పారిస్ తీసుకెళ్లు అన్నాడు.
అది విన్న పైలట్.. ఏడ్చినట్టుంది. మన విమానం అసలు వెళ్లేది పారిస్కేగా అన్నాడు.
అది విన్న హైజాకర్ చచ్చాన్రా నాయనా. పొరపాటున ఇంకో ఫ్లైట్ ఎక్కినట్టున్నా అన్నాడు.

మ‌సాలా కిచిడి

masala kichidi ఇవి కావాలి

బియ్యం – ఒక క‌ప్పు

పెస‌ర‌ప‌ప్పు- అర‌క‌ప్పు

టొమాటోలు- 5

గ‌రంమ‌సాలా- ఒక స్పూన్‌

మిరియాలు – టీ స్పూన్‌

జీర‌కర్ర – టీ స్పూన్‌

ప‌సుపు – అర టీ స్పూన్‌

ధ‌నియాల పొడి – టీ స్పూన్‌

లవంగాలు- 10

ప‌లావ్ ఆకులు- 2

ఉప్పు- త‌గినంత‌

ఉల్లి త‌రుగు- క‌ప్పు

 

 ఇలా చేయాలి

ముందుగా బియ్యం, పెస‌ర‌ప‌ప్పు శుభ్రంగా క‌డిగి అర‌గంట సేపు నానిన త‌రువాత నీరు  వంపేసి ప‌క్క‌న ఉంచుకోవాలి.  బాణలిలో్ టీ స్పూన్ నూనె కాగాక మిరియాలు, జీల‌క‌ర్ర‌, లవంగాలు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేగ‌నివ్వాలి. టొమాటో ముక్క‌లు కూడా వేసి మెత్త‌గా ఉడ‌క‌నీయాలి. త‌రువాత బియ్యం, పెస‌ర‌ప‌ప్పు దీనిలో కొద్దిసేపు వేగ‌నిచ్చిన త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి బాగా ఉడ‌క‌నీయాలి. చివ‌ర‌గా గ‌రంమ‌సాలా వేసి క‌లిపి, కొత్తిమీర‌తో గార్నిష్ చేయాలి. అంతే మ‌సాలా కిచిడి రెడీ.

ఎంజాయ్‌