Sunday, 19 November, 2017

చనిపోయిందనుకున్న ఆమె 40 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ అద్భుత సంఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. న‌మ్మ‌శ‌క్యం కాని ఈ విష‌యాన్ని తెలుసుకొని అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. చ‌నిపోయిందని అంద‌రూ భావించిన విలాస అనే ఒకావిడ 40 సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్లీ త‌న సొంత గ్రామంలో అడుగుపెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఇప్పుడు ఆమెకు 82 ఏళ్లు. 1976లో విలాస పశుగ్రాసం కోసం త‌న గ్రామానికి స‌మీపంలోని అడవికి వెళ్లింది. అయితే, అడ‌విలో ఆమెను పాము కాటు వేయ‌డంతో ఆమెకు నాటు వైద్యం చేయించారు. నాటు వైద్యం ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఆమె కోలుకోలేదు. ఇక ఆమె మ‌ర‌ణించింద‌ని అనుకొని ఆమెను స్థానికంగా వున్న గంగా నదిలో పడేశారు. అక్క‌డే అంతిమ సంస్కారాలు నిర్వ‌హించి వెళ్లారు.

అయితే, నదిలో కొట్టుకుపోతున్న ఆమెను జాల‌ర్లు కాపాడారు. స్పృహలో లేని ఆమెకు వైద్యం అందించారు. అయితే, ఆమె స్పృహ ‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌ గతం మర్చిపోయింది. దాంతో వారి దగ్గరే ఉండిపోయింది. ఇటీవ‌లే ఆమెకు త‌న గ‌తం పూర్తిగా గుర్తుకొచ్చింది. త‌న‌వాళ్ల గురించి ఓ బాలిక‌కు చెప్పింది. ఈ విషయాన్ని ఆ బాలిక తన బంధువుకు చెప్పింది. దీంతో ప‌లువురు ఆమె వ‌ద్దకు వ‌చ్చి ఆమె గురించిన వివ‌రాలు తెలుసుకొని సొంత గ్రామానికి పంపించారు. ఇప్పుడు ఆమె త‌న‌ కుమార్తెలను క‌లుసుకుంది. విలాస‌కు 82 ఏళ్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమెకు ఉన్న‌ పుట్టుమచ్చల ఆధారంగా ఆమె కుమార్తెలు త‌మ త‌ల్లిని గుర్తించారు. ఇన్నేళ్ల త‌రువాత త‌మ త‌ల్లిని తిరిగి క‌లుసుకోవ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Photo source : loldamn.com

‘బ్లూ లైఫ్ మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్ స్పెష‌ల్ ఫీచ‌ర్స్

బ్లూ ప్రోడక్ట్స్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘బ్లూ లైఫ్ మ్యాక్స్‌’ను విడుదల చేసింది. రూ.8వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ ఎల్‌టీఈ ప్రత్యేకతలు కలగిన ఈ ఫోన్ 2 జీబీ ర్యామ్ సదుపాయం కల్పించారు

బ్లూ లైఫ్ మ్యాక్స్ ఫీచర్లు ఇలా వున్నాయి..

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
4జీ ఎల్‌టీఈ
3700 ఎంఏహెచ్ బ్యాటరీ

బాబోయ్ వీళ్లంతా ఏం చేస్తున్నారో చూడండి

పై ఫోటో లో టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ దంపతులతోపాటు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, తమన్నా, అఖిల్‌ పార్టీ చేసుకున్నారు. వీళ్లంతా క‌లిసి ఎప్పుడు పార్టీ చేసుకున్నార‌నే డౌట్ మీకు రావొచ్చు. ఇటీవ‌ల‌ తమన్నా త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల్ని చెర్రీతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.హైదరాబాద్‌లో మస్తీగా గడిచిందని పేర్కొంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను తమన్నా, రకుల్‌, ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. పార్టీలో తమన్నాతో కలిసి గ్రీన్‌ టీ తాగానని, ఉపాసనకు ఇది ఇష్టంలేదని నవ్వుతూ రకుల్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు తమన్నాతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. మీ అందర్నీ కలవడం ఆనందంగా ఉందని అఖిల్‌ ట్వీట్‌ చేశారు.

241216ciniramcharan2

 

241216ciniramcharan3

 

telugu-jokes

గోల్డెన్ గొడ్డ‌లి క‌థ‌లో ట్విస్ట్‌

ఫ్లాష్ బాక్ :

చిన్నప్పుడు ‘నిజాయితీ’ పై ఒక కథ చదువుకున్నాము –

ఒక పేదవాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా..

గొడ్డలి జారి నదిలో పడిపోయింది.

అప్పుడు అతడు దీనంగా నది ఒడ్డున కూర్చోనుంటాడు.

అతనికి దేవుడు ప్రత్యక్షమై – “ఎందుకు భాద పడుతున్నావ”ని అడుగుగా…

“స్వామీ, నా గొడ్డలి పోయి నాకు బతుకు తెరువు లేకుండా పోయింది” అని చెప్పాడు.

అప్పుడు దేవుడు అతనికి బంగారు గొడ్డలి ఇవ్వగా …

అతను అది నాది కాదంటాడు.

అలాగే వెండి ,ఇత్తడి , రాగి గొడ్డల్లు ఇవ్వజూపగా…

అవి తనవి కాదంటాడు.

ఇనుప గొడ్డలి ఇవ్వగా అది తనదే అంటాడు.

అతని ‘నిజాయితీ’కి మెచ్చి దేవుడు అన్ని గొడ్డల్లు అతనికి ఇచ్చి వెళతాడు. అది పాత కథ …

ప్రస్తుతం:

అదే బీదవాడు ఇటీవల తన భార్యను తీసుకొని కట్టెలు కొట్టడానికి తిరిగి అడవికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు అతని భార్య నదిలోపడిపోయింది …

అతను దీనంగా…
ఒడ్డున కూర్చోనుండగా …
తిరిగి దేవుడు ప్రత్యక్షమై “ఏమైంద”ని అడుగుగా…

“నా భార్య నదిలో పడిపోయింది” అనగా…

దేవుడు ‘అనుష్క’ను తెచ్చి, “ఈమేనా నీ భార్య?” అని అడుగుగా…

“అవును స్వామీ! ఈమే నా భార్య” అంటాడు.

ఆశ్చర్యపోయిన దేవుడు …

“అప్పుడు నిజాయితీగా ఉండేవాడివి …

ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు?” అని అడుగుగా…

“స్వామీ ! మీరు ‘అనుష్క’నుచూపెట్టారు. నేను నా భార్య కాదంటాను …

తర్వాత మీరు ‘తమన్నా’, ‘కాజోల్’, ‘సమంతా’ను చూపెడతారు…
నేను వాళ్ళను కూడా కాదంటాను …

అప్పుడు నా భార్యను చూపెడతారు…

నేను అవునంటాను…

అప్పుడు మీరు అందరిని నాకు ఇచ్చి వెళతారు …

అయ్యో స్వామీ! ఈ కాలంలో ఒక్కరితోనే చాలా కష్టంగా ఉంది …

ఇంత మంది అయితే…!!
నావల్ల కాదు…!!!

అందుకే …”
?????????

ప్రేమ్ న‌గ‌ర్ రీమేక్ లో చైతూ, స‌మంత‌

ప్ర‌ముఖ నిర్మాత సురేష్‌బాబు ఓ ఇంట‌ర్వ్యూలో త‌న మ‌న‌సులోని మాట‌న బ‌య‌ట‌పెట్టాడు. రామానాయుడు ప్రొడ్యూస్ చేసిన ప్రేమ్‌నగర్ సినిమా అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో ఎవర్ గ్రీన్ హిట్. అయితే ఇప్పుడు ప్రేమ్ న‌గ‌ర్ రీమేక్ చేయ‌డం త‌న డ్రీమ్ అని చెప్పాడు. ఈ నేపథ్యంలో ‘ప్రేమ్‌నగర్’ రీమేక్ చేస్తే.. చైతన్య- సమంతలతో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ లవ్ స్టోరీస్‌కి సూపర్‌గా వుంటుందని గ‌తంలో ‘ఏ మాయ చేశావే’తో ప్రూవ్ అయ్యింది. చైతన్యతో పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత తెలుగులో ఎలాంటి మూవీ చేయాలా అని కంఫ్యూజన్‌లోవున్న సామ్‌కి ప్రేమ్‌నగర్ రీమేక్ పర్ఫెక్ట్‌గా వుంటుందని అంటున్నారు. రీమేక్‌కి చైతూ- సమంతలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి సురేష్‌బాబుకి వేరే ఛాయిస్ లేదని గుసగుసలు వినబడుతున్నాయి.

ఓం నమో వేంకటేశాయ టీజ‌ర్‌

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మరో భక్తి సినిమా ఓం నమో వేంకటేశాయ.ఈ సినిమా., ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను నిర్మాణ సంస్థ సాయి కృప ఎంటర్ టైన్మెంట్ తాజాగా రిలీజ్ చేసింది. విజువల్ ట్రీట్ లా ఉన్న ఈ టీజర్ లో పలు పాత్రల గురించి చెప్పకనే చెప్పారు డైరెక్టర్. నాగార్జున కెరీర్లో ఈ చిత్రం మరో మైల్ స్టోన్గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో అనుష్క, పగ్య జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

‘దంగల్’ మూవీ రివ్యూ

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ లేటెస్ట్ మూవీ ‘దంగల్’. ఈ సినిమాలో ఆమీర్‌ఖాన్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు డైరెక్టర్ నితీష్ తివారికాగా, ప్రొడ్యూసర్ ఆమీర్ ఖానే కావడం విశేషం. శుక్ర‌వారం రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో ఒక్క‌సారి చూద్దాం.

22cinima-dangal001

 

నటీనటులు: ఆమీర్ ఖాన్, సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా
దర్శకత్వం: నితీష్ తివారి
సంగీతం : ప్రీతమ్

కథ:

హర్యానాకు చెందిన రెజ్లర్ మహవీర్‌సింగ్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘దంగల్’. రెజ్లింగ్ ను ప్రాణప్రదంగా భావించే మహవీర్, ఆర్థికపరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ క్రీడలో ఉన్నత శిఖరాల్ని చేరుకోలేకపోతాడు. దీంతో, ఆకోరికను తన కొడుకుద్వారా తీర్చుకోవాలని ఎన్నో కలలు కంటాడు. అయితే, మహవీర్ కు ఇద్దరూ కూతుర్లు పుట్టడంతో తీవ్ర నిరాశకు లోనౌతాడు. ఇలాంటి సందర్భంలో ఒకరోజు అనుకోకుండా తన కూతుళ్లలోని ప్రతిభను గుర్తిస్తాడు మహవీర్. అంతే.. కూతుళ్లకు ట్రైనింగ్ ఇచ్చి బరిలోకి దింపుతాడు. పురుషాధిపత్యం కొనసాగుతున్న రెజ్లింగ్‌లో మహిళల ప్రవేశిస్తే, ఘన విజయాలు సాధించగలరని నిరూపించడమే లక్ష్యంగా కథనం సాగింది.

dangal-review-759

సినిమా విశ్లేష‌ణ‌

ముఖ్యంగా డైరెక్ట‌ర్ నితీష్ తివారి గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూని తీసుకుని అంతే సున్నితంగా తెరకెక్కించాడు. ఫస్టాఫ్ చాలావరకూ క్యారెక్టర్స్ మీదే డైరెక్టర్ దృష్టిపెట్టాడు. అయితే, సినిమా అసలు టర్న్ తీసుకుందిమాత్రం మహవీర్ తన కూతుళ్లలో అంతర్గతంగా ఉన్న టాలెంట్ ను గుర్తించినప్పుడే. కథ ఇంటర్వెల్ కు చేరుకునే సమయానికి సినిమామీద ప్రేక్షకుల ఆసక్తి పీక్ స్టేజ్ కు చేరుకుందనేలా చేశాడు. అదే క్యూరియాసిటీని చివరివరకూ మెయిన్ టైన్ చేయగలిగాడు. ఈ కథనం ద్వారా కుస్తీ క్రీడవైపు భారతీయ మహిళలను ప్రోత్సహించినట్టే. . తండ్రీకూతుళ్ళ మధ్య జరిగే సంభాషణలు భావోద్వేగంతో పాటు హాస్యాన్ని కూడా పంచిపెట్టాయి. అదేవిధంగా ఈ మూవీ దేశభక్తిని ప్రేరేపించేవిధంగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక‌పోతే ఈ సినిమాకు ప్రాణ‌మే న‌టీన‌టులు. వీరి న‌ట‌న‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి. 51 ఏళ్ళ వయసులో అమీర్ ఖాన్ ఇటువంటి ప్రయోగాలను చేయడం ప్రశంసించదగినదే. అమీర్ ఖాన్ పూర్తిగా పాత్రలో ఒదిగిపోయారు. తన రూపాన్ని పాత్రకు అనుగుణంగా మార్చుకున్నారు. నలుగురు కూతుళ్ళ తండ్రిగా చక్కగా అభినయించారు. ఆడపిల్లలు మగ పిల్లల కన్నా తక్కువేమీ కాదన్నది ఆ తండ్రి నమ్మకం. ఆయన భార్యగా నటించిన సాక్షితో పాటు ఫాతిమా, సాన్యా సనా షేక్ నటన కూడా ఆకట్టుకునేవిధంగా ఉంది.

dangal-movie

ఫ‌స్ట్‌ పాయింట్స్‌
1.కథ.. కథనం
2.నటీనటులు
3. నేపథ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్‌

1. సెకండాఫ్ లో కొన్ని స‌న్నివేశాలు సాగ‌తీత‌

రేటింగ్: 4\5

టీ టార్గెట్ లైన్ః దంగ‌ల్ అంద‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం

వంగవీటి మూవీ రివ్యూ

ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మాట అయినా, సినిమా అయినా సెన్సేష‌నే. టాలీవుడ్ హిస్టరీలో వివాదాస్పద సినిమాల్లో ఒక‌టిగా భావిస్తున్న వంగవీటి సినిమా డిసెంబ‌ర్ 23న‌ ప్రేక్ష‌కుల ముందుకుకొచ్చింది.చాలా రోజుల త‌ర్వాత వ‌ర్మ ఈ సినిమా ప్ర‌మోట్ చేయ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కులలో అంచ‌నాలు పెరిగాయి. ఇంత‌కీ వంగ‌వీటి సినిమా ఎలా ఉందో ఒక్క‌సారి చూద్దాం…

41482462416_unknown

సినిమా పేరుః వంగ‌వీటి
ద‌ర్శ‌కుడుఃరాంగోపాల్ వ‌ర్మ‌
న‌టీన‌టులుః సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలీ, కౌటిల్య, శ్రీతేజ్
నిర్మాతఃదాస‌రి కిర‌ణ్‌కుమార్‌
సంగీతంఃర‌విశంక‌ర్‌

41482464081_unknown

క‌థః  1970-88 మ‌ధ్య‌కాలంలో ఎర్రపార్టీ నాయకుడు చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ. వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. తనకు జరిగిన అవమాన్ని జీర్ణించుకోలేని రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్తో దారుణంగా నరికి నరికి చంపుతాడు.దీంతో రాధా పెద్ద రౌడీగా పేరు తెచ్చుకుంటాడు. సిటీలో అత‌ని పేరు ప్రాబ‌ల్యంలోకి వ‌స్తున్న‌ప్పుడు దేవినేని గాంధీ, నెహ్రు, ముర‌ళి అనే కాలేజ్ స్టూడెంట్స్ రాధా వ‌ద్ద‌కు చేరుతారు. రాధా పేరు సిటీలో ప్ర‌బ‌ల‌మైపోతున్న స‌మ‌యంలో ఓ సెటిల్‌మెంట్ గొడ‌వ‌లో రాధాను కొంద‌రు చంపేస్తారు. దాంతో వంగ‌వీటి మోహ‌న‌రంగా సీన్‌లోకి ఎంట‌ర్ అవుతాడు. రాధాపై అభిమానంతో దేవినేని బ్ర‌ద‌ర్స్ కూడా మోహ‌న్‌రంగాకే స‌పోర్ట్ చేస్తారు. అయితే చెప్పుడు మాట‌లు విన‌డం, చిన్న చిన్న స‌మ‌స్య‌లు పెరిగి పెద్ద‌ద‌వ‌డంతో వంగ‌వీటి మోహ‌న‌రంగాకు, దేవినేని బ్ర‌ద‌ర్స్‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. త‌మ‌కు వ్య‌తిరేకంగా గాంధీ స్టూడెంట్ యూనియ‌న్‌ను రెచ్చ‌గొడుతున్నాడ‌ని తెలుసుకున్న మోహ‌న‌రంగా అత‌నికి వార్నింగ్ ఇచ్చినా విన‌క‌పోవ‌డంతో, గాంధీని త‌న మ‌నుషుల‌తో చంపించేస్తాడు రంగా. దాంతో దేవినేని కుటుంబానికి, వంగ‌వీటి కుటుంబానికి దూరం పెరిగిపోతుంది. దేవినేని ముర‌ళి త‌న అన్న‌ను చంపిన వారిని చంపేస్తుంటాడు. మోహ‌న‌రంగా వార్నింగ్‌ను పట్టించుకోకుండా అత‌న్ని కూడా చంపేస్తాని అన‌డంతో మోహ‌న‌రంగ, దేవినేని ముర‌ళిని కూడా చంపేస్తాడు. అప్ప‌టికే దేవినేని నెహ్రు రాజ‌కీయాల్లో ఉండ‌టం, వంగ‌వీటి పార్టీ అధికారంలో లేక‌పోవ‌డంతో అద‌ను చూసి వంగ‌వీటి మోహ‌న‌రంగ‌ను చంపేస్తారు అస‌లు ఇంత‌కు మోహ‌న‌రంగ‌ను చంపిందెవ‌రు? అంత‌కు ముందు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప‌రిస్థితులేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….

81482463760_unknown

నటీనటులు ప‌నితీరుః

వంగవీటి సినిమాలో చాలా మంది కొత్త‌వారే న‌టించారు. కీలకమైన వంగవీటి రాధ, వంగవీటి రంగా పాత్రల్లో కనిపించిన సందీప్ కుమార్, ఆవేశపరుడైన రౌడీగా.. ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడిగా బాగా నటించాడు. రంగా భార్య పాత్రలో నైనా గంగూలీ ఆకట్టుకుంది. హ్యాపిడేస్ సినిమాలో స్టూడెంట్గా ఆకట్టుకున్న వంశీ చాగంటి ఈ సినిమాలో దేవినేని మురళీ పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రల్లో వంశీ నక్కంటి, కౌటిల్య, శ్రీ తేజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు ప‌నితీరుః
యాధార్థ ఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించటంలో వర్మకు తిరుగులేదు. గ‌త సినిమాలో ఉన్న క్వాలిటీ వ‌ర్మ‌ ఈ మధ్య తీస్తున్న సినిమాల్లో ఆ క్వాలిటీ చూపించటంలేదు. హడావిడిగా చుట్టేస్తూ కేవలం తన బ్రాండ్ వాల్యూ మీదే సినిమాను నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. వంగవీటి విషయంలోనే అదే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా భాగం సినిమాను తన వాయిస్ ఓవర్తో నడిపించి.. అసలు కథ కన్నా ఎక్కువగా సీన్స్నే ఎలివేట్ చేశాడు. వర్మ మార్క్ సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం మరోసారి ఆకట్టుకోగా మితిమీరిన రక్తపాతం అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
వర్మ మార్క్ టేకింగ్
యాక్షన్ సీన్స్
న‌టీన‌టుల ప‌నితీరు

మైనస్ పాయింట్స్ :
డైలాగ్స్
మితిమీరిన రక్తపాతం

రేటింగ్ 3\5

టీ టార్గెట్ లైన్‌: వంగ‌వీటి వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నం

 

బిజినెస్ మెన్ తో అనుష్క పెళ్లి..?

టాలీవుడ్ తిరుగులేని స్టార్ డ‌మ్ సంపాదించిన హీరోయిన్‌ అనుష్క. కొత్త హీరోయిన్లు ఎంత‌మంది వ‌స్తున్నా, అనుష్క స్థానాన్ని ఇంచు కూడా క‌దిలించ‌లేక‌పోతున్నారు. హీరోయిన్‌ ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌కు ఇప్పటికీ అనుష్కకే ఫ‌స్ట్ ఛాయిస్‌.

అయితే 30 సంవ‌త్స‌రాలు దాటినా ఈ అమ్ముడు పెళ్లి ఎప్పుడు అనేది గ‌త కొద్ది రోజులుగా చ‌ర్చ‌జ‌రుగుతుంది.అయితే అనుష్క పెళ్లి గురించి ఆలోచించే వారికి ఓ న్యూస్‌. అనుష్క తన ఫ్యామిలీ ఫ్రెండ్ ను వివాహం ఆడబోతుందని స‌మాచారం. అత‌ను బెంగళూర్ లో రియాల్టీ బిజినెస్ లు చేసే ఆ వ్యక్తి అట‌. లేటెస్ట్ సమాచారం ఏమిటంటే.. ఇరు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగిపోయని ఫిల్మ్ నగర్ కబర్. బాహుబలి-2 విడుదల అనంతరం స్వీటీ తన పెళ్లి కబరు అధికారింగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

NEETHONE DANCE SONG LYRICS-DHRUVA

NEETHONE DANCE SONG LYRICS-DHRUVA

సున్ సున్ సున్ సున్లో యారో
Love Soldier
Thats Right
సున్ సున్ సున్ సున్లో మేరీ స్పైసీ ఖబర్
Thats Right
అణువనువున పొగించవొయ్
ప్రేమ రివర్, ఓకే
గన గన గన మోగించవోయ్
ప్యార్ బజర్
నీతోనే డ్యాన్స్ టు నైట్
నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే పార్టీ ఫుల్ నైట్ హా..
One more time!

నీతోనే డ్యాన్స్ టు నైట్
నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్
నీతోనే ఫుల్ నైట్ హా..(x2)
One more time!

నీతోనే డ్యాన్స్ టు నైట్
నీతోనే ఫర్ లైఫ్
నీతోనే పార్టీ ఫుల్ హా..

Everybody!
తు ఎక్ మై ఎక్ చేరిన వేళ‌
Say Why
దో దిల్ దో దిల్ చేసెను గోల
Say Why
తీన్ బార్ తీన్ బార్ తుంట‌రి దొల
Say Why
చార్ పాంచ్ అయ్యేలా
Thats Why

Now Shake It body Baby..ahaa
Lets make this club Go Crazy
God you are looking Fantastic
kiss my lips lemme taste it

పార్టీ ఇది ప్రేమల పార్టీ
జోడీ నువు నేనోక జోడీ
ఆడి పాడేద్దాం మెలొడీ

One more time!

పార్టీ ఇది ప్రేమల పార్టీ
జోడీ నువు నేనోక జోడీ
ఆడి పాడేద్దాం మెలొడీ

Thats Right
Party, Jodi, Party
Thats Right

నీతోనే డ్యాన్స్ టునైట్‌
నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్

నీతోనే పార్టీ ఫుల్ నైట్ హా..

One more time!

నీతోనే డ్యాన్స్ టునైట్‌
నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్

నీతోనే పార్టీ ఫుల్ నైట్ హా..
(x3)

Everybody! (x3)

Everybody!


Starring : Ram Charan Tej, Rakul Preet, Arvind Swamy & Navdeep

Song : Neethoney Dance
Movie : Dhruva
Banner : Geetha Arts
Producer : Allu Aravind
Director : Surender Reddy
Music : Hiphop Tamizha
Singers: Hiphop Tamizha,
Lyrics: Nikitha Gandhi


Dhruva Audio Available on:
Saavn- http://bit.ly/2fxo0Ik
Wynk- http://bit.ly/2fetTMa
Hungama- http://bit.ly/2fRQKiR
Gaana- http://bit.ly/2fxnKZI
Erosnow- http://bit.ly/2fxSB8t

Source : Aditya Music