Sunday, 19 November, 2017

ఘ‌నంగా గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుక‌

తిరుపతిలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం పాటల వేడుక కన్నుల పండువగా జరిగింది.ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడుతో పాటు ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప‌లువురు ముఖ్యఅతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ…గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నాడు బాలయ్య.. మన తెలుగు రాజహంస శాతకర్ణి అని, ఈ సినిమా కోసం దర్శకుడు క్రిష్ చాలా కష్ట పడ్డాడని చెప్పారు. ఇక ఏపీ సీ ఎం చంద్రబాబు..ఈ మూవీ లెజెండ్ లా వెయ్యి రోజులకన్నా ఎక్కువగా ఆడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించడం హేమమాలినికి దక్కిన గౌరవమని అన్నారు. కాగా..సినిమాలకు కూడా తాను మంత్రినని, అందుకే ఈ ఫంక్షన్ కు వచ్చానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మూవీ మన చరిత్రను గురించి తెలియజేయడం విశేషమన్నారు. కొంత ఉద్విగ్నంగా మాట్లాడిన క్రిష్..బాలకృష్ణ ఈ మూవీ స్టోరీని 10 నిముషాల్లో ఓకె చేశారని తెలిపాడు. నా పేరు ముందు మా తల్లి పేరుతో అంజనా పుత్ర క్రిష్ అని పెట్టుకున్నా.. ఆ పేరును నిలబెడతా అన్నాడు.పెళ్లి అయిన తరువాత 10 రోజులు కూడా తన భార్యతో ఉండలేదని, అందుకు ప్రతిగా గొప్ప చిత్రాన్ని ఇస్తానని చెబుతున్నానని క్రిష్ పేర్కొన్నాడు. అటు.. హీరోయిన్ శ్రియ, మరో డైరెక్టర్ బోయపాటి, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ కూడా మాట్లాడారు.

goutamiputra-02

ఇక‌పోతే ట్రైలర్ తోటే సినీజనాల మతులుపోగొట్టిన డైరెక్టర్ క్రిష్, తన సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను పురస్కరించుకుని బ్యాక్ టు బ్యాక్ సాంగ్ మేకింగ్ వీడియోలు వదిలాడు. ఒకదాన్ని మించింది మరోటి అన్నరీతిన అదిరిపోయే విజువల్స్, గ్రూప్ సాంగ్స్..వారెవ్వా అనిపిస్తుండగా, ఆయా సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుటి దృశ్యాల్ని వీడియో రూపంలో రిలీజ్ చేసింది గౌతమిపుత్రశాతకర్ణి టీం.. దీంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత అస‌క్తి నెల‌కొంది.

 

 

తెలుగమ్మాయి అందాల అర‌బోత‌

ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. గతకొద్ది రోజులుగా అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారు ని పిచ్చెక్కిస్తున్న ఈ భామ తాజాగా చేసిన ఫోటో షూట్ తో మరింతగా రెచ్చిపోయి నోరెళ్ళ బెట్టేలా చేసింది . ఒంటి పై ఉన్న విలువలను ఒక్కొక్కటిగా తీసేసి చేసిన ఫోటో షూట్ పిచ్చి లేపుతోంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటో రసిక హృదయాలను గిలిగింతలు పెడుతోంది. సినిమాల్లో కూడా సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది కానీ అనుకున్నంత గా అవకాశాలు మాత్రం రావడం లేదు ఈ భామకు . అయితే అడవి శేష్ సరసన అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రంలో తాజాగా నటిస్తోంది ఈ భామ . మరి ఆ సినిమాతో తెలుగులో వరుసగా ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి .

క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ ఫోటో ర‌గ‌డ‌

భారత ఫేస్ బౌలర్ మహమ్మద్ షమీ తన భార్య తో కలసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే ఆ ఫోటో కాస్త రభస గా మారింది.హిజాబ్ లేకుండా భార్య ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడమేమిటని పలువురు ముస్లిమ్ లు షమీపై విమర్శల వర్షం కురిపించారు. కొందరైతే షమీ అసలు ముస్లిమేనా అంటూ ప్రశ్నించారు.

కేవలం స్లీవ్ లెస్ గౌను ధరించడం వల్ల ఈ రకమైన కామెంట్లు చేస్తుండడంతో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ షమీ దంపతులకు అండగా నిలిచాడు. షమీకి నా మద్దత్తు ఉంటుంద‌న్నారు. దేశంలో పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్నది అర్థమయ్యె ఉంటుందని అనుకుంటున్నా అని కైఫ్ ట్వీట్ చేసాడు. కొందరు షమీకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం షమీకి మద్దత్తు తెలుపుతున్నారు.ఎవరికి నచ్చినట్లు వారు దుస్తులు ధరిస్తారని దీనిపై అనవసర రాద్ధాంతం వద్దని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

capture88

అమీర్ “దంగల్‌” కలెక్షన్ల వ‌ర్షం

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. పీకే సినిమాతో ఇండియాలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన రికార్డ్ సొంతం చేసుకున్న ఆమిర్, దంగల్ తోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు. విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

నోట్ల రద్దుతో చిల్లర దొరక్క చాలా సినిమాలు మంచి టాక్‌ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం వెనకబడ్డాయి. ఇలాంటి సమయంలో విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా థియేటర్లలో దూసుకుపోతోంది . ఆమిర్‌ ఖాన్‌ నటించిన చిత్రాల్లో అత్యుత్తమ చిత్రంగా ఇప్పటికే చాలా మంది విమర్శకులు, సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తారు. సూపర్ హిట్ మౌత్ టాక్తో దూసుకుపోతున్న దంగల్ మరోసారి బాక్సాఫీస్ రికార్డ్లను తిరగరాయటం కాయంగా కనిపిస్తోంది.

ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టండి..?

పై ఫోటోలో ఉన్న ఉన్న హీరోయిన్  దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నతార‌. అంతే కాదండ‌యో త్వ‌ర‌లో ఈమె ప్రేమించిన అబ్బాయినే పెళ్లిచేసుకోనుంది. ఇప్ప‌టికే మీకు ఈమె ఎవ‌రో తెల‌సిపోయింద‌నుకుంటా.. అదేనండి అందాల భామ సమంత. తనకు ఉండాలనుకుంటున్న లక్షణాలు అన్ని సముద్రానికున్నాయని చెబుతోంది ఈ సుందరి. అవేంటంటే..అందం, అంతుచిక్కని రహస్యాలు, సువిశాలమైన తత్వం, స్వేచ్ఛ అంటోంది ఈ ముద్దు గుమ్మ. సముద్రంలో వెనకవైపు నుంచి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసి తన అభిమానులకు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపింది. త్వ‌ర‌లోనే   నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది.

61482666633_unknown

యూట్యూబ్‌స్టార్ తో ప్రియాంక ఇలా…

బాలీవుడ్‌, హాలీవుడ్ లో న‌టి ప్రియాంక చోప్రా త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. క్వాంటికో’ టెలివిజన్‌ సిరీస్‌తో హాలీవుడ్‌లో సందడి చేసిన ప్రియాంక ప్రస్తుతం ‘బేవాచ్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా  ప్రియాంక చోప్రా కెనడియన్‌ యూట్యూబ్‌స్టార్‌ లిల్లీ సింగ్‌తో కలిసి ఓ ఎపిసోడ్‌లో పాల్గొంది. ‘హౌ టు బి ఎ గుడ్‌ వుమన్‌’ పేరుతో రూపొందించిన ఈ వీడియో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ‘సూపర్‌ వుమన్‌’తో కలిసి నటించడం సరదాగా ఉందంటూ ఈ సందర్భంగా ప్రియాంక ట్వీట్‌ చేసింది. 

ల‌వ‌ర్ కోసం..దొంగ‌గా మారిన యువ‌తి

ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిలు దొంగ‌త‌నం చేయ‌డం మ‌నం చూశాం. కానీ తన బాయ్‌ఫ్రెండు డబ్బుల్లేక సతమతమవుతుంటే చూసి సహించలేకపోయింది ఓ 19 ఏళ్ళ టీనేజర్ దొం గతనాలకు అలవాటు పడింది. హైదరాబాద్ సరూర్ నగర్‌లోని మారుతీ నగర్‌లో ఉంటున్న జి.సాయి కిరణ్మయి అనే యువతి.. ఓ జిమ్ ఇన్‌స్త్రక్టర్ అయిన యశ్వంత్ నాయుడితో ప్రేమలో పడింది. తరచూ సొమ్ముల్లేక ఇబ్బందులు పడుతున్న తన బాయ్‌ఫ్రెండును చూసి మధనపడేది. అతనికి అవసరమైన డబ్బులకోసం భలే ప్లాన్ వేసింది. ఇందుకు యశ్వంత్ కూడా సై అన్నాడు. అతని సలహాతో కిరణ్మయి ఫేస్‌బుక్‌లో తన పేరిట ఖాతా తెరిచి మహిళలు, తన ఈడు టీనేజర్లతో స్నేహం స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు వారి ఇళ్ళకు వెళ్తూ వారి అభిమానం సంపాదించింది.

గత అక్టోబరు 30న బి.రాజేశ్వరి అనే మహిళ ఇంట్లో 15 తులాల బంగారు నగలు, నవంబరు 2న సంధ్య అనే అమ్మాయి ఇంట్లో 4.5 తులాల బంగారు చైను, ఆమె డెబిట్ కార్డును కిరణ్మయి దొంగిలించింది. సంధ్య డెబిట్ కార్డుతో బ్యాంకు నుంచి 30 వేలు డ్రా చేసి తిరిగి ఏమీ తెలియనట్టు డెబిట్ కార్డును సంధ్య ఇంట్లో ఉంచేసింది. అయితే ఆ తరువాత సంధ్యకు కిరణ్మయి అసలు రూపం తెలిసి జూబిలీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిరణ్మయిని, ఆమె బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్ నాయుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరిని జుడిషియల్ రిమాండుకు పంపింది.

naga-chaitanya-and-samantha-engagement-date-fixed

నాగ‌చైత‌న్య‌, స‌మంతా ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్‌

అక్కినేని వారి ఇంట మ‌రో శుభ‌కార్యం జ‌ర‌గ‌నుంది. అఖిల్ ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత ఇప్పుడు నాగ‌చైత‌న్య‌- స‌మంతా జో్డీ ఎంగేజ్‌మెంట్‌కు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యుల నుంచి అనుమ‌తి పొందిన ఈ జంట త్వ‌ర‌లో ఒక్క‌ట‌వ్వ‌నుంది. చేతూ- సామ్‌ల ఎంగేజ్‌మెంట్ 2017 జ‌న‌వ‌రి 29 జ‌ర‌గ‌నుంద‌ట‌. ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో్ జ‌ర‌గ‌నున్నఈ వేడుక‌లో ప‌లువురు సినీ, రాజ‌కీయ, వ్యాపార ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం.

 

అల్లు అర్జున్ కూతురు పేరు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న తన ముద్దులొలికే కూతురికి నామకరణం చేశాడు. తమ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన దేవత పేరు అర్హ అని ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో అల్లుఅర్జున్ పోస్ట్ చేశాడు. అర్హ అనే పేరుకు అర్థాన్ని కూడా అల్లు అర్జున్ వివరించాడు. హిందుత్వంలో శివుడు, ఇస్లామిక్‌లో ప్రశాంతత, నిర్మలం అని అర్థమని పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈ పేరులో మరో స్పెషాలిటీ కూడా ఉంది. Arjun లో AR, Sneha లో HA లను కలిపి ARHA (అర్హా) అని పేరు పెట్టినట్టుగా వివరించాడు. ఇలా తన కూతురికి పేరు పెట్టడంలో కూడా బన్నీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

fake news and hoax effects on real life

పిల్లి డ్యాష్‌కి డైప‌ర్ ఎవ‌రు వేస్తారు ?

ఒక పిల్లి ఎక్క‌డంటే అక్క‌డే షిట్ చేసేది..దాంతో ఎల‌క‌లు ఖంపు భ‌రించ‌లేక‌పోయాయి. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. పిల్లికి డైప‌ర్ వేద్దామ‌ని. కానీ పిల్లి డ్యాష్ కి డైప‌ర్ ఎవ‌రు వేస్తారు ? ఇదే ఎల‌క‌ల సందేహం. ఇది క‌థ కాదు నిజం. ఇక్క‌డ సోష‌ల్ మీడియానే పిల్లి. యూజ‌ర్లు ఎల‌క‌లు. పుకార్లు, రాద్దాంతాలే కంపు. అమ్మాయిలు క‌నిపిస్తే ప‌ది సార్లు ఎన‌కా ముందు చూడ‌టం కామ‌న్‌. కానీ ఒక విష‌యం షేర్ చేసే ముందు ఎన‌కా ముందు ఆలోచిండం లేదు. ఎందుకంటారు.. మీడియాలా సోష‌ల్‌నెట్ వ‌ర్కింగ్ వినియోగ‌దారులు కూడా సంచ‌ల‌నానికి అల‌వాటు ప‌డ్డారా.. వాస్తవం అవ‌స‌రం లేదా ?

 ఒక వారం క్రితం వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, పేప‌ర్లూ, చానెళ్లు..ఎక్క‌డ చూసినా.. కుక్క మాంస‌మే. ఒక హోట‌ల్‌లో బిర్యానీలో కుక్క‌మాంసం క‌లిపార‌నే పుకారు.. ధావ‌నంలా వ్యాపించింది. ద‌మ్‌కి బిర్యానీ లో కుక్క మాంసం అని ద‌మ్ ద‌మ్ చేసింది. వాట్స‌ప్‌ గ్రూప్‌లో ఉండ‌టం పాపంలా క‌నిపిస్తుంది. ఎందుకంటే.. ఇలా మెసేజ్ వ‌స్తే.. అలా ఫ‌ర్వార్ట్ చేసేస్తున్నారు. అన్ని గ్రూపుల్లో అదే కంటెంట్‌. గుడ్డిగా షేరింగేనా.. వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని ఎవ‌రికీ ఉండ‌దా ?ఒక ఎంబియే విద్యార్థి స‌ర‌దాకోసం రాసిన మెసేజ్‌.. టోట‌ల్ తెలుగు వాళ్ళ‌ను అన‌వ‌ర విష‌యంలో అల‌ర్ట్ చేసింది. చివ‌రికి షాహ్‌ఘౌస్ వ్యాపారం దెబ్బ‌తింది. ఇందులో మ‌న పాపం కూడా ఉందిగా.. ఇలా మెసేజ్ రాగానే అలా షేర్ చేస్తుంటాం.. అబద్ధానికి బానిస‌త్వం చేస్తున్న‌ట్టే క‌దా

చెత్త‌ను బుట్ట‌లో కాదు.. గ్రూప్‌లో వేయండి
* వాట్స‌ప్ వీడియో కాలింగ్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అనే మెసేజ్‌.. ఉస్తాద్‌ వాట్స‌ప్ అప్‌డేట్ చేయాలంటే.. ప్లేస్టోర్ ఉంది క‌దా ?
*ఈ అమ్మాయికి బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ‌చ్చింది., స‌హాయం చేయండి. మీరు షేర్ చేస్తే ఫేస్‌బుక్ అమెకు ప్ర‌తీ షేర్‌కు ఒక రూపాయి ఇస్తుంది అనే మెసేజ్‌.. కామ‌న్‌సెన్స్ క‌దా..ఒక వేళ ఫేస్‌బుక్ స‌హాయం చేయాలి అనుకుంటే ఇలా చీప్‌లా షేర్ చేయ‌మ‌ని చెప్ప‌దు క‌దా .
* ఈ మ‌ధ్య వాయిస్ రికార్డింగ్‌లు కూడా తోడ‌య్యాయి. నిమిషం పాటు ఉండే వాయిస్‌లో ఇక్కడ క‌నిపిస్తున్న వ్య‌క్తికి శ‌క్తి కావాలంటే బూస్ట్ కావాలి…ఈ మెసేజ్‌ను షేర్ చేయండి అని.. వీటి వెన‌క ఒక ప్లానే ఉంది.
*ప్ర‌మాదం జ‌రిగిన దృశ్యాలు, కంటెంట్‌ వంటి జుగుప్సాక‌ర‌మైన షేరింగ్స్ వ‌ల్ల చూసే వారి మ‌న‌సు విచ‌లితం అవుతుంది. లైఫ్ అంచే చిరాకు వేస్తుంది.
ఇలాంటి ఎన్నో షేరింగ్‌లు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ లైఫ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి..

వాస్త‌వాలు
ఇలాంటి స్పామ్ మెసేజ్‌లు ఎందుకు పుడ‌తాయో తెలుసా ?
1. కొన్ని వెబ్‌సైట్ లు, బ్రాండ్ లు ఇలా అవాస్త‌వ పోస్ట్‌ల‌ను షేర్ చేస్తాయి. ఇవి క్లిక్ చేస్తే వాళ్ల‌కు విజిట‌ర్స్ పెరుగుతారు. దాంతో యాడ్స్ పెరుగుతాయి.
2. హ్యాక‌ర్లు ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల‌ను క్రియేట్ చేసి స్పామ్ చేస్తారు. ఎంత షేర్ అయితే.. వీళ్ల ప‌ని అంత ఈజీ అవుతుంది. మీ లైఫ్ హ్యాక్ అవుతుంది.

 ఇలాంటి ఫేక్ న్యూస్‌ల‌ను అరిక‌ట్టేందుకు ఫేస్‌బుక్ ప‌క్కా ప్ర‌ణాళిక వేస్తోంది. ఆ ప్లాన్ అమ‌ల‌య్యే వ‌ర‌కైనా మీరు వ‌దంతుల‌ను, పుకార్ల‌ను షేర్ చేయ‌కండి ఉస్తాద్‌. పిల్లి డ్యాష్‌కి డైప‌ర్ క‌ట్ట‌కుంటే..కంపు మ‌న‌కే వ‌స్తుంది. ఆలోచించండి

-న‌క్క‌తోక‌


             You can Follow Us on Facebook @   https://www.facebook.com/trendingvarthalu

             For  Nakkatoka Features @ https://www.facebook.com/nakkatoka