Sunday, 19 November, 2017

వీడ‌స‌లు తండ్రేనా..?  కూతుర్ని రేప్ చేయ‌డానికి కార‌ణం ఇదేన‌ట‌..?

మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రపంచం గగ్గోలు పెడుతోంది. వాటిని నివారించడానికి ఎన్ని చట్టాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. తాజాగా క‌న్న కూతురిని కాపాడాల్సిన తండ్రే క్రూర మృగంలా ప్ర‌వ‌ర్తించాడు. కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ, త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తుల‌తో సైతం ఈ ఆఘాయిత్యం చేయించాడు.
ఎట్ట‌కేల‌కు ఆ చిట్టిత‌ల్లి పోలీసుల‌ను సంప్ర‌దించింది. దాంతో పోలీసులు ఆ క్రూరుడిని అదుపులోకి తీసుకోని విచారించ‌గా అస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పాడు. త‌న కూతుర్ని రేప్ చేయ‌డం, ఇత‌రుల‌తో చేయించ‌డం త‌న‌కు చెప్ప‌లేనంత రొమాంటిక్ ఫీల్‌ని క‌లిగించాయ‌ని ఆ తండ్రి చెప్ప‌డంతో పోలీసులు షాక్ కు గుర‌య్యారు. అంతే కాదండ‌యో త‌న కూతుర్ని వేరే వాళ్లు రేప్ చేస్తుంటే చూసి వీడియో తీసి చూసి ఆనంద‌ప‌డేవాడిన‌ని ఆ క‌సాయి తండ్రి చెప్పాడ‌ట‌. మ‌రీ ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పాలి.
గ‌మ‌నికః- ఇక్క‌డ ఈ ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశం, నిందితుడి పేరు, చిట్టి త‌ల్లి పేరు గొప్యంగా ఉంచాల‌నే ఉద్దేశ్యంతో రాయ‌డం లేదు.
Have something to share? Write to us:info@tvarthalu.com, or connect with us on Facebook and Twitter.
london

పార్ల‌మెంట్ లో రేప్‌…! ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా..

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా, ఆడవాళ్లపై అత్యాచారాలు కనిపిస్తూనే ఉన్నాయి. వెనుకబడిన దేశాల్లోనో.. లేకపోతే విద్యావ్యవస్థ సరిగా లేని ప్రాంతాల్లోనో ఇలాంటి ఘటనలు జరిగితే అది వారి అజ్ఞానం అనుకోవచ్చు. కానీ ఏకంగా లండన్ లోనే మహిళపై లైంగిక వేధింపులు జరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బ్రిటన్ పార్లమెంట్ భవనంలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అనుమానంతో 23 ఏళ్ల వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 14న పార్లమెంట్ భవనంలో మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై అత్యాచార వ్యతిరేక చట్టాల కింద కేసు నమోదు చేశారు. కోర్టు అతడిని బెయిల్ పై విడుదల చేసింది. తదుపరి విచారణ 2017 జనవరిలో జరుగుతుంది. అరెస్ట్ చేసిన వ్యక్తి ఎంపీ కాదని పోలీసులు స్పష్టం చేశారు.
 అయితే ఏకంగా పార్లమెంట్ భవనంలోనే అత్యాచారం జరగడంపై ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి కఠిన చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లు మరింత పెరుగుతున్నాయి.

విశ్వ‌విద్యాల‌యాల‌ను గొప్ప‌గా తీర్చిదిద్దుతాం-మంత్రి క‌డియం

హైద‌రాబాద్ లోని  రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో  వైస్ ఛాన్స‌ల‌ర్ ల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌మ‌రి పాల్గొని మాట్లాడారు. త్వ‌ర‌లోనే యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేస్తామ‌న్నారు. అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. విద్యా ప్రమాణాలు మరింత మెరుగు కావాలన్నారు. ఇతర దేశాలతో పోటీ పడే విధంగా యూనివర్సిటీలను తీర్చిదిద్దుకుందామని చెప్పారు. విద్యార్థులకు ఉపాధి కల్పించే విధంగా బోధన ఉండాలని వీసీలకు మంత్రి క‌డియం సూచించారు. చివ‌ర‌గా.విద్యా వ్యవస్థలో మార్పులు రావాల‌న్నారు.

రాష్ట్రంలోని జాతీయ ర‌హ‌దారుల‌కు కేంద్రం రూ.620 కోట్లు కేటాయింపు

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాలపై స్పెషల్ కేర్ తీసుకుంటోంది కేసీఆర్ స‌ర్కార్‌. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. మరిన్ని నిధులు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఓకే చెప్పింది కేంద్రం. రాష్ట్రానికి రూ.620 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఇంతకు ముందు కేటాయించిన రూ.400 కోట్లకు అదనంగా ఈ నిధులను మంజూరు చేసింది. తెలంగాణకు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకుగాను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని నిథులు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏ జిల్లాకు ఎంతెంత నిధుల కేటాయింపు జ‌రిగిందో చూడండి…
1. ఆదిలాబాద్ జిల్లాలోని 44 కిలో మీటర్లకు 47 కోట్లు
2. కరీంనగర్ జిల్లాలో 84 కిలో మీటర్లకు 83 కోట్లు
3.ఖమ్మం జిల్లాలో 74 కిలో మీటర్లకు 76 కోట్లు
4. మహబూబ్ నగర్ జిల్లాలో 92 కిలో మీటర్ల పనులకు 90 కోట్లు
5. మెదక్ జిల్లాలో 61 కిలో మీటర్లకు 74 కోట్లు
6.నల్లగొండ జిల్లాలో 71 కిలో మీటర్లకు 70 కోట్లు
7.నిజామాబాద్ లో 56 కిలో మీటర్లకు 55 కోట్లు
8.రంగారెడ్డిలో 45 కిలో మీటర్లకు 47 కోట్లు
9.వరంగల్ లో 73 కిలో మీటర్లకు 78 కోట్లు
ఇక‌పోతే ఇటీవ‌లే జిల్లాల విభజన కావడంతో ప్రస్తుతం పరిధులు మారాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను.. 31 జిల్లాల వారీగా పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఎంపీ క‌విత‌కు మంగ‌ళహార‌తితో స్వాగ‌తం

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. బ‌తుక‌మ్మ సంబ‌రాల విశిష్ట‌త‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పేకార్య‌క్ర‌మంలో భాగంగా విదేశాల్లో జాగృతి త‌రుపున నిర్వ‌హిస్తున్న బ‌తుక‌మ్మ సంబ‌రాల‌కు హాజ‌రై రాష్ట్రానికి  చేరుకున్నారు.దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన క‌విత నేరుగా త‌న పుట్టింటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా క‌విత త‌ల్లి అయిన సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ ఆమెకు మంగ‌ళ‌హార‌తితో స్వాగ‌తం ప‌లికారు.ఎంపీ కవిత త‌న తల్లి శోభ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బ‌తుకమ్మ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే అవ‌కాశం ల‌భించినందుకు తెలంగాణ ఆడ‌బిడ్డ‌గా ఎంతో ఆనందిస్తున్నాన‌ని ఆమె చెప్పారు. అంత‌కు ముందు శంషాబాద్ విమానాశ్రమానికి  జాగృతి కార్య‌క‌ర్త‌లు పెద్ధ సంఖ్య‌లో చేరుకొని ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

ద‌స‌రా అంటే అర్థం తెలుసా…

దశహర అనే సoస్కృత పదం క్రమంగా దసరాగా మారింది.  మనలోని పది అవగుణాలను హరించేది ఈ “దశహర” పoడుగ

 

కామ (Lust)

క్రోధ (Anger)

మోహ (Attachment)

లోభ (Greed)

మద (Over Pride)

మాత్సర్య (Jealousy)

స్వార్థ (Selfishness)

అన్యాయ (Injustice)

అమానవత్వ (Cruelty)

అహంకార (Ego)

 

ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని “విజయదశమి”  అనికూడా అంటారు. అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ,  అందరికీ శరన్నవరాత్రి శుభాకాoక్షలు.

vijaya dashami subhakanksha 2016

విజ‌య ద‌శ‌మి శుభాకాంక్ష‌లు

WISH YOU A HAPPY VIJAYADASAMI (Dasara). May Goddesses Balathripurasundari, Gayayathri, Annpoornadevi , Kathyani, Lalita Thripura Sundari, Maha Lakshmi, Saraswati Devi , Durga Devi, Rajarajeswari Devi bless you all with Evergreen Health, Wealth, Prosperity, Happiness, Success and Every thing you want – www.tvarthalu.com