Saturday, 21 January, 2017
salman-khan-kapil-dev

కపిల్ దేవ్ పాత్ర‌లో  సల్మాన్ ఖాన్‌

బాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారుల జీవితాలను తెరకెక్కించేందుకు బాలీవుడ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.ఇప్పటికే అజారుద్దీన్, ధోని లాంటి క్రికెట్ వీరుల జీవితాలు వెండితెర మీద సందడి చేశాయి.  త్వరలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ జీవితకథ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈనేపధ్యంలో మరో క్రికెట్ లెజెండ్ కథను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు.
ఇండియన్ క్రికెట్ టీంకు వరల్డ్ కప్ అందించిన క్రికెట్ వీరుడు కపిల్ దేవ్ జీవితాన్ని సినిమాగా  తీస్తాన‌ని ఇప్పటికే కబీర్ ఖాన్ ప్రకటించాడు. అయితే.. ఈ మూవీలో కపిల్ రోల్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో చేస్తార‌ని స‌మాచారం.. ప్రస్తుతం సల్మాన్-కబీర్ ఖాన్ లు ట్యూబ్ లైట్ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా తామే చేయాలన్నది ఈ దర్శకుడి ఆలోచన.
Like this story? Or have something to share? Write to us:info@tvarthalu.com, or connect with us on Facebook and Twitter.

ఈ ఫోటోలో విరాట్ క్లోహీ ఎవ‌రో చెప్పండి చూద్దాం..?

మీరు చూస్తున్న ఫోటో నిజ‌మే. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్యూయ‌ల్ రోల్ లో ఉన్నాడు కాదండి. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే ఇటీవల ముగిసిన భారత్‌-న్యూజిల్యాండ్‌ మూడో టెస్టు  మ్యాచ్‌ చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఒకేసారి ఇద్దరు విరాట్‌ కోహ్లిలు దర్శనమిచ్చారు. ఒకరేమో ప్రేక్షకులు ఉండే స్టాండ్స్‌లో.. మరొకరు మైదానంలో.. డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ను రెండుచోట్ల చూడటంతో అభిమానులు విస్తుపోయారు.
ఇంకా విచిత్రమేమిటంటే ఒరిజినల్‌ విరాట్‌ కోహ్లి కూడా అచ్చం తనలాంటి వాడు ప్రేక్షకుల మధ్య కనిపించడంతో బిత్తరపోయాడు. అతన్ని చూసి.. తనను తాను అద్దంలో చూసుకున్నట్టు ఫీలయ్యాడేమో.. కోహ్లికి నవ్వు ఆగలేదు. చేయి అడ్డం పెట్టుకొని మరీ చప్పట్లు కొడుతూ నవ్వుల్లో మునిగిపోయాడు. అంతే కాదండ‌యో డూప్లికేట్ క్లోహీతో చాలా మంది సెల్పీలు కూడా దిగారు.ఇప్పుడు ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది
 Like this story? Or have something to share? Write to us:info@tvarthalu.com, or connect with us on Facebook and Twitter.