Saturday, 21 January, 2017
cricket

భార‌త్‌, ఇంగ్లండ్ తొలి టెస్ట్ డ్రా

రాజ్ కోట్ః మొత్తానికి అనుకున్న‌ట్లే జ‌రిగింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివ‌రి  రోజు ఇంగ్లాండ్‌ 260/3 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఇంగ్లండ్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత 310 పరుగులు లీడ్ సాధించింది. ఈ పరుగులను ఛేదించే క్రమంలో చివరిరోజు ఆటలో కోహ్లీ సేన 6 వికెట్లను కోల్పోయింది. కోహ్లీ మాత్రమే 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇక‌పోతే ఈ టెస్ట్ మ్యాచ్ లో  ఇరు జట్ల ఆటగాళ్లు భారీ స్కోర్ల దిశగా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మొత్తం 6 సెంచరీలు నమోదయ్యాయి. రూట్, మోయిన్ అలీ, స్టోక్స్, పుజారా, విజయ్, కుక్‌లు సెంచరీలు చేశారు

మొత్తానికి మొద‌టి టెస్ట్ మ్యాచ్ డ్రా కావ‌డంతో ఈ సిరీస్ అస‌క్తిగా మారిందంటున్నారు క్రికెట్ విశ్లేష‌కులు. రెండో మ్యాచ్ లో గెలుపు పై ఇరు జ‌ట్లు ప్ర‌త్యేక దృష్టి పెడుతాయ‌ని చెబుతున్నారు.

india-england-cricket

డ్రా దిశగా తొలి టెస్ట్‌

రాజ్ కోట్ లో జ‌రుగుతున్న భార‌త్‌, ఇంగ్లండ్ ఫ‌స్ట్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 488 ప‌రుగుల‌కే ఆలౌట్ అవ్వ‌డంతో  ఇంగ్లాండ్‌కు 49 పరుగుల  ఆధిక్యం లభించింది. అయితే నాలుగో రోజు క‌నుక ఆశ్విన్‌, సాహా పోరాటం సాగించ‌క‌పోతే భార‌త్ త‌గిన మూల్యం చెల్లించుకునేది.

ఇక‌పోతే 49 ప‌రుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ అరంభించిన ఇంగ్లండ్ నిల‌క‌డ‌గా ఆడుతోంది. ఇక‌పోతే వికెట్లు తీయడమే లక్ష్యంగా టీమిండియా వ్యూహం రచిస్తోంది. మొత్తానికి రాజ్ కోట్ మ్యాచ్ డ్రా అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

cricket

తొలిటెస్ట్ః ”రాజ్ కోట్” లో సెంచ‌రీల మోత‌

రాజ్ కోట్ వేదిక‌గా జ‌ర‌గుతున్న భార‌త్‌, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇప్ప‌టికే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ మూడు సెంచరీలు సాధించి టీమిండియా ముందు  537 పరుగుల భారీ స్కోర్ ఉంచింది. దీంతో పుజారా, మురళీ విజయ్‌లు సెంచ‌రీల‌తో క‌దం తొక్క‌డంతో భార‌త్ దీటుగా బ‌దులిస్తోంది. అద్భుతమైన టెక్నిక్‌తో అసలుసిసలు టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడే పుజారా తొలి సారి వేగంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో 169 బంతుల్లో 59.17 స్ట్రైక్‌ రేట్‌తో 100 ప‌రుగులు చేశాడు. గంభీర్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా  మైదానానికి నలువైపులా బంతిని తరలించాడు. ఓ వైపు సింగిల్స్‌ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండ‌రీలు సాధించాడు. సెంచ‌రీ సాధించిన త‌ర్వాత దూకుడు పెంచాడు. ఈ నేప‌థ్యంలో ఇంగ్లాండ్‌ చేసిన బౌలింగ్‌ మార్పు ఆ జట్టుకు ఎట్టకేలకు కలిసొచ్చింది. స్టోక్స్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ కుక్‌ క్యాచ్‌ పట్టడంతో పుజారా ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ పడింది. ఇక‌పోతే కెరీర్‌లో ఇది అతనికి 9 శతకం కాగా ఇంగ్లాండ్‌పై మూడోది.

మ‌రోవైపు  ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్‌ సాధించిన నేపథ్యంలో ఓపెనర్‌ మురళీ విజయ్ సూప‌ర్‌గా ఆడాడు.  ఆద్యంతం నిలకడగా మంచి సహనంతో కలబోసిన డిఫెన్స్‌తో బ్యాటింగ్‌ చేసిన విజయ్‌ 255 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో సెంచ‌రీ సాధించాడు. కెరీర్‌లో ఇది అతనికి ఏడో సెంచ‌రీ.  ఇక ఇంగ్లండ్‌పై విజ‌య్ కు ఇది తొలి సెంచ‌రీ.

bcci-supremecourt-india

భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ కు తొల‌గిన అడ్డంకులు

భార‌త్‌, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ కు అన్ని అడ్డంకులు తొల‌గిపోయాయి.లోథా కమిటీ సంస్కరణలు అమలు చేయడానికి బీసీసీఐ ఆల‌స్యం చేసింది. దీంతో  నిధులు విడుదల చేయడంలో తామేమీ చేయలేమని లోథా క‌మిటీ తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో  నిధులు విడదల చేయకపోతే మ్యాచ్ జరగడం కష్టమని బీసీసీఐ సుప్రీంకోర్టులో అత్యవసర పిటీషన్ దాఖలు చేసింది. దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం రూ. 56 లక్షలు ఖర్చు చేసేందుకు బీసీసీఐకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఈ మేరకు నిధుల నుంచి బీసీసీఐ ఆ డబ్బులను తీసుకుని మ్యాచ్‌ నిర్వహణకు ఖర్చు చేయనుంది. ఈ నిర్ణ‌యానికి సుప్రీంకోర్టు అంగీకారం తెల‌ప‌డంతో  బీసీసీఐలో నెలకొన్న టెన్షన్ కు పుల్ స్టాప్ పడింది. బుధ‌వారం య‌థావిధిగా రాజ్ కోట్‌లో భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇకపోతే ఇరు జ‌ట్లు ఈ మ్యాచ్ కు అన్ని ర‌కాలుగా సిద్ధ‌మ‌య్యాయి. ఎలాగైనా ఐదు టెస్ట్ మ్యాచ్  సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచి పై చేయి సాధించాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాజ్ కోట్ పిచ్ పై స్పిన్ప‌ర్ల ప్ర‌భావం ఎక్కువ ఉండ‌డంతో భార‌త్ , ఇంగ్లీష్ జ‌ట్టు స్పిన్ బౌలింగ్ పై దృష్టిసారించాయి.

cricket-player-wedding

బాస్కెట్ బాల్‌, క్రికెట్ బాల్ పెళ్లి…?

బాస్కెట్ బాల్‌, క్రికెట్ బాల్ పెళ్లి…?

ఏంటి టైటిల్ వైరెటీగా ఉంద‌ని అనుకుంటున్నారా..? ఏమి లేదండి బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్ర‌తిమా సింగ్‌, క్రికెట‌ర్ ఇషాంత్ వివాహం జ‌ర‌గ‌నుంది.   2016 సంవ‌త్స‌రం జూన్ లో వీరిద్ద‌రికి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పెళ్లి మూహుర్తాన్ని తాజాగా ఖరారు చేశారు. డిసెంబర్ 9వ తేదీన ఇషాంత్-ప్రతిమల  వివాహ కార్యక్రమాన్ని జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వారణాసికి చెందిన ప్రతిమా సింగ్.. గతంలో భారత జాతీయ బాస్కెట్ బాల్ జట్టు తరపున అనేక మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించింది. దాంతో పాటు కెప్టెన్ గా కూడా వ్యహరించింది.ఇక‌పోతే భార‌త జ‌ట్టును త‌న బౌలింగ్ తో  ఇషాంత్  శ‌ర్మ ఎన్నో విజ‌యాలు అందించాడు. అంతేకాదండ‌యోత్వరలో ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ కు ఇషాంత్ ఎంపికైయ్యాడు కూడా.. నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకూ ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. నాల్గో టెస్టు ప్రారంభమైన రెండో రోజు ఇషాంత్ పెళ్లి జరపడానికి నిశ్చయించడంతో చివరి రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండకపోవచ్చునని తెలుస్తోంది. .

cricket

భార‌త ఆట‌గాళ్లు ఇంత మంచి వాళ్లా….?

విశాఖ‌ప‌ట్నం:న‌్యూజిలాండ్ తో జ‌రిగిన చివ‌రిమ్యాచ్‌లో భార‌తీయ క్రికెట్ టీమ్ ఎంతో మందికి ప్రేర‌ణ‌నిచ్చే ప‌ని చేసింది. త‌మ జెర్సీల‌పై ఇంటిపేరును కాకుండా ఇంటికి దేవ‌త‌లాంటి త‌ల్లి పేరును ఉండేలా చూసుకున్నారు ఆట‌గాళ్లు. మ్యాచ్ ఆరంభం నుంచే ఈ టీష‌ర్ట్‌ల‌ను ధ‌రించి మాతృమూర్తుల‌కు వంద‌నాలు స‌మ‌ర్పించారు. మ‌నిషి జీవితంలో త‌ల్లికి ఉండే ప్రాధాన్యత‌ గురించి తెల‌ప‌డానికి క్రీకెట‌ర్లు ఇలా చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న అంత‌ర్జాతీయ క్రికెట్ అభిమానులు భార‌త క్రికెట‌ర్లు ఇంత మంచివారా అని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.
పైన మీరు చూస్తున్న ఫోటే అదే..

________________

Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

 

india won the series

విక్ట‌రీని గిఫ్ట్‌గా ఇచ్చిన టీమిండియా

*బౌల‌ర్లు జాల‌ర్ల‌య్యారు
*స్పిన్న‌ర్లు బ‌ర్న‌ర్ల‌య్యారు
*కివీస్ పుల్లైస్ అయింది
*భార‌త్ చిల్లౌట్ అయింది
వెర‌సి న్యూజిలాండ్‌తో జ‌రిగిన చివ‌రీ వ‌న్డేలో భార‌తీయులంతా విజేత‌ల‌య్యారు. దీపావ‌ళికి ఒక్క‌రోజు ముందే న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైనల్‌ మ్యాచ్ మ‌న‌కు పండ‌గను కొంచెం అర్లీగా తెచ్చేసింది. భార‌త బౌల‌ర్లంతా అద్భుతంగా రాణించ‌డంతో ధోనీ నేతృత్వంలోని టీమిండియా సిరిస్ సొంతం చేసుకుంది. ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు రోహిత్ శ‌ర్మ (70) శుభారంభాన్ని ఇచ్చాడు. త‌ర్వాత బ్యాటింగ్‌కి వ‌చ్చిన కోహ్లీ (65) చ‌క్క‌ని ప్ర‌ద‌ర్శ‌న‌ను కొన‌సాగించాడు. దీంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో భార‌త్ 6 వికెట్లు కోల్పోయి 269 ప‌రుగుతు చేసింది.

భార‌త్ ఇచ్చిన ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ ఎక్క‌డా కూడా ఒక అంత‌ర్జాతీయ జ‌ట్టుల ఆడ‌లేదు. ఆది నుంచే త‌డ‌బ‌డుతూ 79 ప‌రుగుల‌కే చాప‌చుట్టేసింది. ఇంటికి బ‌య‌ల్దేరాల‌నే తొంద‌రుందేమో అని ట్విట్ట‌ర్‌లో ఎంతో మంది కామెంట్ చేశారంటే వాళ్ల వికెట్లు ఎలా ప‌డ్డాయో ఊహించుకోవ‌చ్చు. భార‌త్ విజ‌యానికి కార‌ణ‌మైన అమిత్ మిశ్రా 18 ప‌రుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. కొత్త‌గా వ‌చ్చిన స్పిన్న‌ర్ జ‌యంత్ తొలి ఓవ‌ర్లోనే ఒక వికెట్ తీసుకున్నాడు. ఇలా దీపావ‌ళికి ముందే ప‌టాక‌లు కాల్చే అవ‌కాశాన్నిచ్చి..పండ‌గ‌ను మ‌రింత సంబురంగా సెల‌బ్రేట్ చేసుకునే అవ‌కాశం ఇచ్చింది భార‌తీయ క్రికెట్ బృందం.

________________

Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

pv-sindhu

సింధు ఓట‌మి….ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అవుట్

 ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో విఫ‌ల‌మైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో పోరాడి ఓడింది. హి బింగ్‌జియావో (చైనా)తో జరిగిన మ్యాచ్ లో 20-22, 17-21తో పరాజయం పాలైంది. మొదటి గేమ్ లో సింధు బాగా పోరాడినప్పటికీ ప్రత్యర్థి ముందు తలవంచింది. రెండో గేమ్ సింధు ఏ మాత్రం పోటీ  లో బింగ్‌జియావోకు ఇవ్వ‌లేదు. దీంతో  సింధు చైనా గోడ‌ను అధిగ‌మించ‌లేదు. అయితే బింగ్ జియావో చేతిలో ఓట‌మితో సింధు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అవుట్ అయింది. ఇక‌పోతే ఇటీవల జరిగిన డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లోనూ సింధు రెండో రౌండ్ లోనే నిష్క్రమించిన సంగ‌తి తెలిసిందే.

indian-team-squad

విశాఖ వీరుడెవ‌రో..?

భార‌త్- న్యూజిలాండ్ ల వ‌న్డే పోరు తుది ద‌శ‌కు చేర‌కుంది. ఈ రోజు వైజాగ్ లో ఫైనల్ మ్యాచ్ కు ఇరు జ‌ట్లు సిద్ధ‌మ‌య్యాయి. టెస్టు హోదా సంపాదించిన వైజాగ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు జరగగా, నాలుగింట టీమిండియా విజయం సాధించింది.
ఇదే సమయంలో టీమిండియాపై ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా వన్డే సిరీస్ ను గెలుచుకుని సిరీస్ ను చేజిక్కించుకోవాలని కివిస్ జ‌ట్టు భావిస్తోంది. ఇదిలా ఉంటే విశాఖ స్టేడియంలో క‌నుక భారీ స్కోర్ రాబ‌ట్టితే భార‌త్ విజ‌యం ఖాయ‌మ‌ని క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక‌పోతే టీమిండియాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పేసర్, యార్కర్ కింగ్ బుమ్రాను తుదిజట్టులో స్థానం కల్పించనున్నారు. బుమ్రా కోసం అక్షర్ పటేల్, ధవల్ కులకర్ణి, లేదా అమిత్ మిశ్రా లలో ఎవరో ఒకర్ని తప్పించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ లో ఎవ‌రు గెలుపొంది విశాఖ వీరుడుగా ఎవ‌రు నిలుస్తారో చూడాలి మ‌రీ.

ఈ మ్యాచ్ మ‌ధ్యాహ్నం 1.30 నిమిషాల‌కు ప్రారంభం కానుంది.

____________

Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

 

cricket-2

టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్

టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా 115 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక‌ రెండో స్థానంలో దాయాది దేశం పాకిస్థాన్ 111 పాయింట్లతో నిలిచింది. మూడో స్థానంలో 108 పాయింట్లతో ఆస్ట్రేలియా నిలిచింది. తరువాతి స్థానాల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. అయితే  న్యూజిలాండ్ సిరీస్ లో రాణించి 200 వికెట్ల క్లబ్ లో చేరిన అశ్విన్ టెస్టు బౌలర్లలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా ఐదో స్థానంలో నిలిచాడు. టెస్టు బ్యాట్స్ మెన్ జాబితాలో అజింక్యా రహానె ఆరో ర్యాంక్ లో నిలవగా, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ 15, 17వ ర్యాంకుల్లో నిలిచారు.