Tuesday, 17 January, 2017
30116ciniyuvaraj3

ఘ‌నంగా క్రికెట‌ర్ యువ‌రాజ్ పెళ్లి

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ ఇంటివాడ‌య్యాడు.బాలీవుడ్‌ నటి, మోడల్‌ హజెల్‌కీచ్‌తో యువీ వివాహం సిక్కు సాంప్రదాయం ప్రకారం చండీగఢ్ గురుద్వారలో జరిగింది. ఈ వివాహానికి పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. పెళ్లి కొడుకు యువీ, పెళ్లికూతురు హజెల్ పెళ్లి దుస్తుల్తో మెరిసిపోయారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారాయి.  ఇక‌పోతే డిసెంబరు 2న హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ తంతు జరగనుంది.ఇదిలా ఉంటే ఈన‌వంబ‌ర్‌ 29న  మెహందీ, సంగీత్‌లు ఘనంగా జరిగాయి. టీమిండియా టెస్టు సారథి విరాట్‌కోహ్లీ, జట్టు సభ్యులతో కలిసి యువీ వేసిన భాంగ్రా స్టెప్పులు అలరించాయి.

29brk-bad-112-kdk0

విరాట్ సేన విక్ట‌రీ

మొహాలీ టెస్టులో విరాట్ సేన విక్ట‌రీ కొట్టింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టుల్లో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ నాలుగో రోజు 103 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ అలవోగా ఆ లక్ష్యాన్ని సాధించింది. ఫస్ట ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మిస్సయిన పార్ధివ్ ఆ లోటును సెకండ్ ఇన్నింగ్స్‌లో భర్తీ చేశాడు తొలుత నాలుగు వికెట్ల న‌ష్టంతో 78 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు.. టీ విరామ సమయానికి ముందే 236 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 102 పరుగుల ఆధిక్యత మాత్రమే సాధించింది. జో రూట్ (78), హసీబ్ హమీద్ (59) పోరాడినా ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు. క్రిస్ వోక్స్ 30 పరుగులు చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగి హాఫ్ సెంచరీలతో రాణించి స్పిన్నర్లు జడేజా, అశ్విన్, జయంత్ యాదవ్ రెండో ఇన్నింగ్స్‌లో బాల్‌తో ప్రతాపం చూపి భారత్ విజయానికి బాట వేశారు. వీరికి ఫాస్ట్ బౌలర్ షమీ జత కలిశాడు. అశ్విన్ 3, జడేజా, జయంత్, షమీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.ఇదిలా ఉంటే ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో భారత్ ముందంజలో ఉంది.

మ్యాచ్ అనంత‌రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడారు. టాస్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ గెలుస్తామని అనుకోలేదని, డ్రాగా ముగుస్తుందని భావించాననన్నారు. కానీ సహచరులు రాణించడంతో, ఎవరి పాత్రను వారు సమర్థవంతంగా పోషించడంతో విజయం సాధించామ‌ని చెప్పారు., మిగిలిన టెస్టుల్లో కూడా విజయం సాధించాలనే లక్ష్యంతో దిగుతామని తెలిపాడు.

81480400560_625x300

విషాదంః కుప్పకూలిన విమానం

కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో విమానం కూలిపోయింది.బొలివియా నుంచి ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లను కొలంబియా తీసుకెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఇంధన కొరత కారణంగానే విమానం కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.


మంగళవారం ఉదయం 10.15గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రియోనిగ్రోలోని జాస్‌ మరియా కార్డోవ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయల్దేరింది. కొలంబియాలో ఇది రెండో అతి పెద్ద విమానాశ్రయం. కోపా సుదామెరికన్‌ ఫైనల్స్‌లో భాగంగా బుధవారం అట్లెటికో నసియోనల్‌తో తలపడేందుకు బ్రెజిల్‌ చాపికోయిన్స్‌ ఫుట్‌బాల్‌ జట్టు బయల్దేరింది.అయితే ఈ ప్ర‌మాదంలో ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై స్పష్టత లేదు. విమానం కుప్ప‌కూలిన వార్త తెలియ‌గానే బ్రెజిల్ దేశం మొత్తం పెను విషాదంలో మునిగిపోయింది.

badminton-women-s-singles-group-play_3c527b62-b2df-11e6-aa81-69e46120af64

వావ్ సింధు…రియ‌ల్లీ యువ‌ర్ గ్రేట్‌

భారత షట్లర్ పీవీ సింధు అద‌ర‌ర‌గొడుతోంది. రియో ఒలింపిక్ లో రజత పతక సాధించిన ఈ హైద‌రాబాదీ అమ్మాయి ఇటీవ‌లే చైనా సూపర్‌ సిరీస్‌ గెలిచింది. ఇక తాజాగా హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లోనూ దూసుకుపోతోంది. టైటిల్‌ కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. క్వార్టర్‌ ఫైనల్లో సింగపూర్ క్రీడాకారిణి లియాంగ్ ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 21-17, 21-23, 21-18 స్కోరుతో లియాంగ్ పై విజయం సాధించింది.

yuvaran-0001

పార్ల‌మెంట్ కు యువీ…నా పెళ్లి రావాల‌ని మోడీకి ఆహ్వానం

త్వ‌ర‌లో క్రికెట‌ర్ యువ‌రాజ్ పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ఈనెల 30న చండీగ‌ఢ్‌లో గురుద్వారా‌లో యువరాజ్- హజల్కీచ్‌ల మ్యారేజ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా త‌న పెళ్లికి హాజ‌రు కావాలంటూ అతిథుల‌ను ఆహ్వానించే ప‌నిలోపడ్డాడు యువీ. ఈ నేప‌థ్యంలోనే తన తల్లి షబ్నంసింగ్తో క‌ల‌సి గుర‌వారం పార్లమెంట్‌కు వచ్చాడు. ప్రధాన‌మంత్రి మోదీతోపాటు పలువురు రాజకీయ నేతలకు ఆహ్వాన పత్రికలను అందజేశాడు.

భారత క్రికెట్‌లో ఫ్రాంక్‌స్టర్‌గా పేరున్న యువీ ఎంతో మందికి ఆత్మీయుడు. అత్యంత ఆడంబరంగా జరిగే యువీ వివాహానికి బాలీవుడ్‌ స్టార్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు, క్రీడాకారులు భారీ స్థాయిలో హాజరవుతారని అంచనా. అయితే పెద్ద నోట్ల రద్దు చేసిన తరుణంలో పెళ్లి చేసుకొనే వారు రూ.2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో యువీ తన వివాహ ఖర్చుల కోసం రూ.2.5 లక్షలు తీసుకుంటాడో లేదో మరి!

Team india won test match with england

విశాఖ టెస్టులో కోహ్లీ సేన గ్రాండ్ విక్టరీ

విశాఖ టెస్టుల్లో కోహ్లీ సేన ఘ‌న విజ‌యం సాధించింది. 246 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ అద్భుత‌మైన విజ‌యం సాధించింది.
405 ప‌రుగుల ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను టీమిండియా చిత్తు చేసింది. స్పిన్నర్ల ధాటికి కుదేలైన బ్యాట్స్ మెన్ లు కుదేల‌య్యారు. దీంతో 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది భారత్ .

India's Pusarla Venkata Sindhu returns a shot from China's Sun Yu during the final of women's singles in the badminton China Open in Fuzhou in southeastern China's Fujian province Sunday Nov. 20, 2016. Sindhu won by 2-1 to clinch the title. (Chinatopix Via AP)(AP11_20_2016_000203B)

చైనా ఓపెన్ టైటిల్ సింధుకే

చైనా ఓపెన్ టైటిల్ పీవి సింధు సొంత‌మైంది. ఫైన‌ల్లో సున్‌యుపై గెలిచి రూ. 36 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి కూడా గెలుచుకుంది సింధు. ఈ ఘ‌నత సాధించిన  మూడో భార‌తీయ క్రీడాకారిణ‌గా రికార్డు క్రియేట్ చేసింది. అన‌తి కాల‌తంలోనే ఇంటర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో రాకెట్ స్పీడ్‌గా దూసుకొచ్చిన బ్యాడ్మింట్‌న్ స్టార్ పీవి సింధు మ‌రో మారు త‌న స‌త్తా చాటింది. సూప‌ర్ సిరీస్ టైటిల్ సొంతం చేసుకుంది.  వ‌రల్డ్ బ్యాడ్మింట‌న్‌లో లెజెండ్స్‌గా పేరున్న చైనాలో.. చైనా ప్లేయ‌ర్‌నే ఓడించ‌డం మ‌రో హైలైట్‌. సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్ ఈ  టైటిల్ సాధించిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు  పొందింది.

cricket

క్రికెట్ చ‌రిత్ర‌లో వింతైనా అవుటై ఇదే….

అవును క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది ఒక రక‌మైన అద్భుత‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కు ఏ బ్యాట్స్‌మన్ ఇలా అవుటైన దాఖాలాలు లేవు. దక్షిణాఫ్రికాతో హోబర్ట్ నగరంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ చిత్రం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ బాల్ ను లెగ్ సైడ్ కు పంపే క్ర‌మంలో చాలా వింత‌గా అవుటై పెవిలియ‌న్ చేరాడు.  ఇదెలా జ‌రిగిందంటే  బంతి ముందుగా వార్న‌ర్ తొడకు తగిలి, ఆ తర్వాత మోచేతికి తగిలింది. ఆ వెంటనే వెనకాల ఉన్న వికెట్లను ముద్దుపెట్టుకుంది. ఏం జరిగిందోనని ఆశ్చర్యపోతూ వార్నర్ వెనక్కి తిరిగి చూసేసరికే బెయిల్స్ కింద పడ్డాయి. వార్నర్ ఇలా అవుటైన తీరును స్వయానా వార్నర్ గానీ, కోచ్ డారెన్ లేమన్ గానీ, జట్టులో మి గిలిన సభ్యులు గానీ ఏమాత్రం నమ్మలేకపోయారు. ఇక‌పోతే మూడోరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 120 పరుగులు వెనకబడి ఉంది.

sania-mirza-meet-kcr

సీఎం కేసీఆర్ ను క‌లిసిన సానియా మీర్జా

తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సీఎం కేసీఆర్ ను క‌లిశారు. త‌న సోధ‌రి వివాహానికి హాజ‌రుకావాలంటూ సానియా ఆయ‌న‌కు ఆహ్వ‌న పత్రిక‌ను అందించారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసులో మ‌ధ్యాహ్నాం  మ‌ర్యాధ‌పూర్వ‌కంగా క‌లిసిన సానియా పెండ్లి ప‌త్రిక‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా సానియా ఇటీవ‌ల ఆడిన టోర్నీల వివ‌రాల‌ను తెలుసుకున్నారు.మహిళల టెన్సిస్ డబుల్స్ విభాగంలో ఇటీవ‌లే సానియా మీర్జా రెండో సారి అగ్ర‌స్థానాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇలాగే ఆట‌ల్లో రాణించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాల‌ని అందుకోసం రాష్ట్ర‌ప్ర‌భుత్వం త‌రుపున స‌హాయం ఎప్ప‌టికి అందిస్తామ‌ని చెప్పారు.

womencricket

మ‌హిళ‌లు క్రికెట‌ర్లు గ్రేట్‌…వ‌న్డే సిరీస్ కైవ‌సం

భార‌త మ‌హిళ క్రికెట‌ర్లు మ‌రోసారి స‌త్తా చాటారు. వెస్టిండీస్‌ మహిళల జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ మహిళల క్రికెట్‌ జట్టు 2-0తో కైవశం చేసుకుంది. విజయవాడలోని మూలపాడు స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అయిదు వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ మహిళల జట్టు ఏడు వికెట్ల నష్టంతో 153 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ జట్టులో దీయేంద్ర దోత్తిన్ హాఫ్ సెంచ‌రీతో రాణించింది. ఇక‌పోతే భార‌త బౌల‌ర్ల‌లో జులన్‌ గోస్వామి, బిస్త్‌ రెండేసి వికెట్లు తీయగా, పాండే, రాజేశ్వరి గైక్వాడ్‌ తలో వికెట్‌ తీశారు.

ఇక‌పోతే   154 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ కేవలం అయిదు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్‌ మిథాలీరాజ్‌ 45, స్మృతి మంధన 44, దీప్తి శర్మ 32పరుగులతో రాణించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో భారత్‌ సొంతమైంది. నామమాత్రమైన మూడో వన్డే మూలపాడులోని స్టేడియంలో నవంబరు 16న జరుగ‌నుంది.