Tuesday, 17 January, 2017
636183479641877527

క్రికెటర్ భార్య స్లీవ్ లెస్ ఫోటో ర‌గ‌డ‌

భారత ఫేస్ బౌలర్ మహమ్మద్ షమీ తన భార్య తో కలసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే ఆ ఫోటో కాస్త రభస గా మారింది.హిజాబ్ లేకుండా భార్య ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడమేమిటని పలువురు ముస్లిమ్ లు షమీపై విమర్శల వర్షం కురిపించారు. కొందరైతే షమీ అసలు ముస్లిమేనా అంటూ ప్రశ్నించారు.

కేవలం స్లీవ్ లెస్ గౌను ధరించడం వల్ల ఈ రకమైన కామెంట్లు చేస్తుండడంతో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ షమీ దంపతులకు అండగా నిలిచాడు. షమీకి నా మద్దత్తు ఉంటుంద‌న్నారు. దేశంలో పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్నది అర్థమయ్యె ఉంటుందని అనుకుంటున్నా అని కైఫ్ ట్వీట్ చేసాడు. కొందరు షమీకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం షమీకి మద్దత్తు తెలుపుతున్నారు.ఎవరికి నచ్చినట్లు వారు దుస్తులు ధరిస్తారని దీనిపై అనవసర రాద్ధాంతం వద్దని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

capture88

virat-odi

ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్‌గా కోహ్లి

ashwincelebrations

2016లో టెస్టులు, వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లుతో ఐసీసీ టెస్ట్‌, వ‌న్డే జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతస్థాయిలో రాణించిన భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ టెస్ట్‌ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 12 మందితో కూడిన టెస్ట్‌ జట్టులో స్థానం పొందిన ఏకైక భారత ఆటగాడిగా అశ్విన్‌ నిలిచాడు. ఇక‌పోతే 2016 అత్యుత్తమ టెస్ట్‌ క్రికెటర్‌గానూ అశ్విన్‌ ఎంపికయ్యాడు.టెస్ట్‌ జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నలుగురు, భారత్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా తరపున ఒక్కొక్కరు చొప్పున స్థానం పొందారు. టెస్ట్‌ జట్టు సారథిగా అలిస్టర్‌ కుక్‌ ఎంపికయ్యాడు.

22brk74b22brk74a
మ‌రోవైపు ఐసీసీ వ‌న్డే జ‌ట్టు కెప్టెన్ గా పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి.. ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

kohliwinseries4

ఇక ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు టీమిండియాకు ద‌క్కింది. ఈ ఏడాది ఓట‌మ‌న్న‌దే లేకుండా 9 టెస్టులు గెలిచింది కోహ్లి సేన‌. వ‌న్డే ప్లేయ‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డీకాక్‌కు ద‌క్కగా.. 2016 స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు పాక్ ప్లేయ‌ర్ మిస్బావుల్ హ‌క్‌కు ద‌క్కింది. ఈ అవార్డు అందుకున్న తొలి పాక్ ప్లేయ‌ర్‌గా మిస్బా నిలిచాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో నాలుగు సిక్స‌ర్ల‌తో వెస్టిండీస్‌కు ట్రోఫీ సాధించిపెట్టిన కార్లోస్ బ్రేత్‌వైట్‌కు ఐసీసీ టీ20 ప‌ర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కింది. బంగ్లాకు చెందిన ముస్తాఫిజుర్ రెహ‌మాన్ ఐసీసీ ఎమ‌ర్జింగ్ క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా నిలిచాడు. ఇక అంపైర్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా డేవిడ్ షెప‌ర్డ్ ట్రోఫీని అందుకోబోతున్నాడు సౌతాఫ్రికా అంపైర్ మ‌రాయిస్ ఎరాస్మ‌స్‌.

ravindra-jadeja-ashwin

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్‌-2 మ‌నోళ్లే

  ఐసీసీ టెస్టు ర్యాకింగ్ ప్ర‌క‌టించింది. ఈ టెస్టు ర్యాంకుల్లో ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉండ‌గా..  ర‌వీంద్ర జ‌డేజా రెండోస్థానంలో నిలిచాడు. కెరీర్‌లో తొలిసారి మ్యాచ్‌లో ప‌ది వికెట్లు తీసిన జ‌డేజా ఒకేసారి నాలుగు స్థానాలు ఎగ‌బాకాడు. 1974 త‌ర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భార‌త బౌల‌ర్లుగా అశ్విన్‌, జ‌డేజా రికార్డు సృష్టించారు.  చెన్నైలో ప‌ది వికెట్ల ప‌ర్ఫార్మెన్స్‌తో 66 పాయింట్లు జ‌డేజా ఖాతాలో చేరాయి. దీంతో అత‌ను అశ్విన్ కంటే కేవ‌లం 8 పాయింట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచాడు. సిరీస్‌లో జ‌డేజా మొత్తం 26 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్‌, జేమ్స్ ఆండ‌ర్స‌న్‌, డేల్ స్టెయిన్, రంగ‌న హెరాత్‌ల‌ను వెన‌క్కి నెట్టి జ‌డేజా రెండోస్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆల్‌రౌండ‌ర్ల లిస్ట్‌లోనూ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంకులో ఉన్నాడు జ‌డేజా. ఈ లిస్ట్‌లోనూ అశ్విన్‌దే అగ్ర‌స్థానం కావడం విశేషం. మొత్తానికి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను రికార్డు లెవ‌ల్లో గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్స్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ రికార్డులే సృష్టిస్తున్నార‌నే చెప్పాలి.

41482230737_unknown

టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ

విరాట్ సేన సంచలన విజయం సాంధించింది. ఇంగ్లండ్ తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను భారత్ 4-0 గెలుచుకుని ఇంగ్లండ్ కు నిరాశను మిగిల్చింది.గతంలో సిరీస్‌ ఓటమికి సగర్వంగా ప్రతీకారం తీర్చుకొంది. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది. ఆత‌ర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా రాణించింది. యువ సంచలన బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌త్రిబుల్ సెంచ‌రీ, కేఎల్‌ రాహుల్‌ 199 పరుగులతో రాణించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లోనే భార‌త్‌ 759 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో 282 పరుగులు వెనుకబడింది. ఇంగ్లండ్ జట్టు భారత విజయాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టును కేవలం 207 పరుగులకే రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో కుప్పకూల్చాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు చివరి టెస్టును ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో కోల్పోయింది.

20brk-114-india

ఇక‌పోతే చివరి టెస్టులో 303 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కరుణ్ నాయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. టెస్టు సిరీస్ లో ఆరు వందలకు పైగా పరుగులు చేసిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక‌పోతే ఈ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసిన జడేజా కెప్టెన్ కుక్ ను సిరీస్ లో ఆరుసార్లు అవుట్ చేయడం యాదృచ్చికంగా జరిగిందని కోహ్లీ తెలిపాడు. టెస్టు విజయం ఆనందాన్నిచ్చిందన్నాడు.జట్టులో యువకులు రాణించడం శుభపరిణామమని అన్నాడుఅద్భుతమైన పిచ్ ను గ్రౌండ్స్ మన్ తయారు చేశారని, మెరుగైన జట్టే విజయం సాధించిందని కోచ్ కుంబ్లే చెప్పాడు.

kohliwinseries1

19brk116aa

క‌ర‌ణ్ నాయ‌ర్ ఈజ్ గ్రేట్‌…!

క్రికెట్ చ‌రిత్ర‌లో భారత మిడిల్ ఆర్డర్ క్రికెటర్ కరుణ్ నాయర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నాయర్ అరుదైన ఘనత సాధించాడు. ఒక మ్యాచ్లో ఐదు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్లో నాయర్ ట్రిపుల్ సెంచురీ సాధించాడు. రోహిత్ శర్మ గాయంతో ఇంగ్లండ్ తో మూడో టెస్టులో నాయర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గత మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమైన నాయర్.. ఈ మ్యాచ్లో పరుగుల దాహంతో చెలరేగిపోయాడు. 379 బంతుల్లో 31 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 303 పరుగులు చేశాడు. మొత్తానికి ఒకే మ్యాచ్ లో గ‌త ఆట‌గాళ్ల రికార్డుల‌ను నాయ‌ర్ చెరిపివేశాడ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.

41482131856_625x300

మ‌రోవైపుఈ సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు సాధించారు.1978-79 సీజన్ తరువాత ఇదే తొలిసారి. చివరిసారి స్వదేశంలో వెస్టిండీస్పై భారత్ ఆ ఘనత సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను నమోదు చేశారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాల్గోసారి మాత్రమే. కాగా, ఈ సిరీస్లో భారత జట్టు ఇప్పటివరకూ ఎనిమిది శతకాలను సాధించడం మరో విశేషం. ఇందులో విరాట్ కోహ్లి, మురళీ విజయ్లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్లు తలో ఒక సెంచరీ సాధించారు.

71482145679_625x300

ఇక‌పోతే ఈ టెస్టు సిరీస్లో టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. భారత తన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులను రికార్డును సొంతం చేసుకుంది. గత అత్యధిక పరుగుల రికార్డును ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ అధిగమించింది. 2009లో ముంబైలో జరిగిన టెస్టులో శ్రీలంకపై భారత్ 726 పరుగులే భారత్ కు ఇప్పటివరకూ టాప్ స్కోర్.దీన్ని భారత్ తాజాగా అధిగమించింది. కరుణ్ నాయర్ అత్యద్భుతమైన ఆట తీరుతో భారత్ ఆ మార్కును బద్ధలు కొట్టింది.ఇప్పటివరకూ భారత్ నాలుగుసార్లు మాత్రమే ఏడొందల మార్కును చేరింది. గత 12 ఏళ్లలోనే ఏడొందలకు పైగా పరుగులను టీమిండియా నాలుగుసార్లు సాధించడం విశేషం.

41481517799_625x300

భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ..సిరీస్ కైవ‌సం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కిచుకుంది.ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 3-0తో సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో చివరి రోజున‌ 182/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించింది. భారత బౌలర్‌ అశ్విన్ త‌న స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ఎంతో సేపు సాగనివ్వ‌లేదు.. అశ్విన్‌ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. అశ్విన్‌ తొలుత ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌స్టో (51)ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత అశ్విన్‌ వరుస ఓవర్లలో వోక్స్‌, రషీద్‌, ఆండర్సన్‌లను పెవిలియన్‌ బాటపట్టించాడు. దీంతో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమైంది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ‘విరాట్ ’ అద్భుత బ్యాటింగ్‌తో 631 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ కంటే 231 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. భారీ పరుగుల లోటును చేధించేందుకు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా ఇంగ్లండ్‌ను 195 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌తో పాటు సిరీస్ గెలిచి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. వీర విహారం చేసిన విరాట్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

81481363044_625x300

విరాట్ కోహ్లీనువ్వు గ్రేట్‌…

భార‌త క్రికెట్ టెస్ట్ కెప్ట‌న్ విరాట్  కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకున్నాడు. ముంబై వేదిక‌గా ఇంగ్లండ్ తో జ‌రుగుత‌న్న నాల్గో టెస్టులో ఈ ఫీట్ నెల‌కొంది. ఒక సిరీస్లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 96వ పరుగు చేసే క్రమంలో ఈ సిరీస్లో విరాట్ 500 పరుగుల మార్కును చేరాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు.

ఇక‌పోతే అంత‌కుముందు ముంబయి వాంఖడె మైదానంలో ఒకే సంవ‌త్స‌రంలో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో భారత జట్టు కెప్టెన్‌గా ఈ ఘనతను సాధించింది ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే. 1997లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌, 2006లో రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. అంతేకాదు.. కోహ్లీ టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

636169688503760702

త్వ‌ర‌లో క్రికెట‌ర్ జ‌హీర్ పెళ్లి…ఎవ‌రితో తెలుసా..?

చాలా మందికి తెల‌సు క్రికెట్ కు బాలీవుడ్ కు ఉన్న బంధం ఏమీ కొత్తది కాదని. క్రికెట‌ర్లు, బాలీవుడ్ హీరోయిన్ల మధ్య ప్రేమలు, పెళ్లిల్లు సాధారణమే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ ఆలీఖాన్‌ తల్లిదండ్రులైన మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి, షర్మిలా ఠాగూర్‌ల ప్రేమాయణం నుంచి నేటి విరాట్‌ కోహ్లీ, అనుష్కా శర్మల లవ్‌స్టోరీ వరకు మనకు పరిచయమే.
ఇటీవలె డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌, నటి హాజెల్‌ కీచ్‌లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగామరో క్రికెటర్ ఒక బాలీవుడ్ నటీమణితో ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడనే మాట వినిపిస్తోంది. టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ జహీర్‌ఖాన్‌ ఇంతకుముందే ఇషా శర్వాణీ అనే బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగించాడు. అయితే ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు జహీర్‌ ‘చక్‌ దే ఇండియా’లో నటించిన బెంగాలీ నటి సాగరికా ఘట్గే తో ప్రేమ‌లో ఉన్నాడ‌ట‌. వీరిద్దరూ జంటగా యువరాజ్‌ పెళ్లి వేడుకకు కూడా హాజరై కనువిందు చేశారు. జహీర్‌ త్వరలోనే సాగ‌రికతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కోడై కూస్తోంది బాలీవుడ్‌ మీడియా.

61216yuvi

సినిమాగా క్రికెట‌ర్ యువ‌రాజ్ జీవితం

బాలీవుడ్ అంతా ఇప్పుడు బయోపిక్ ల మయంగా మారిపోయింది. ఎక్కడెక్కడి ప్రముఖల జీవిత చరిత్రలు తెరకెక్కించే పనిలో బాలీవుడ్ సాంకేతిక నిపుణులంతా ఉన్నారు. ముఖ్యంగా కుస్తీ పోరాట యోదులు, బాక్స‌ర్లు, క్రికెట‌ర్ల జీవితాల‌ను తెర‌పై అవిష్క‌రిస్తున్నారు. ఇప్ప‌టికే క్రికెట‌ర్ అజారుద్దీన్, ఎం ఎస్ ధోని బ‌యోపిక్ లు వ‌చ్చాయి. ఇక తాజాగా ఇటీవల ఓ ఇంటివాడైన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ జీవితం ఆధారంగా బయోపిక్‌ రాబోతోంది. యువీ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌గా పేరుతెచ్చుకోవడం, క్యాన్సర్‌తో పోరాడడం నుంచి వివాహం వరకు అన్నీ బయోపిక్‌లో చూపించబోతున్నారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ యువీతో చర్చలు జరుపుతోంది. ఇటీవల నటి హాజెల్‌ కీచ్‌ని వివాహం చేసుకున్న యువీ హనీమూన్‌ నుంచి రాగానే అధికారికంగా ఏ విషయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

2brk-81aa

అస‌లు సైనాకు ఏమైందీ..?

భార‌త స్టార్ షెట్ల‌ర్ సైనా నెహ్వాల్ కు ఏమైంది అనే ప్ర‌శ్న ఇప్పుడు క్రీడా అభిమానుల‌ను తొలిచివేస్తోంది.గ‌త కొద్ది కాలంగా ఫామ్ లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న సైనా నెహ్వాల్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మకావు ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ క్వార‍్టర్స్‌లో సైనా ఓటమి చవిచూసింది. క్వార్టర్‌ ఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్‌ యిమాన్‌తో తలపడిన సైనా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో 21-12తో తొలిసెట్‌ను జాంగ్‌ సునాయాసంగా గెలిచింది. రెండో సెట్‌లో కాస్త కుదురుకున్నట్లు అనిపించిన సైనా ఒకానొక సమయంలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత జాంగ్‌ అద్భుతంగా పోరాడి సైనాకు విజయాన్ని దూరం చేసింది. ఈ ఓట‌మితో సైనా నెహ్వాల్‌ మకావు ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది.

అయితే ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ జాబితాలో సైనా టాప్‌-10లో చోటు కోల్పోయి 11వ ర్యాంకుకు పడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్‌-10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే దే. రియో ఒలింపిక్‌ పతక విజేత సింధు తన ర్యాంకును మెరుగుపరుచుకుని ఏడో ర్యాంకులో కొనసాగుతోంది.