Saturday, 21 January, 2017
71482576560_625x300

మ‌రింత త‌గ్గ‌నున్న బంగారం ధ‌ర‌లు

రోజురోజుకీ దిగుతూ వ‌స్తోన్న‌ ప‌సిడిధ‌ర మ‌రింత దిగ‌జారే అవ‌కాశం ఉన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధ‌ర‌ రూ.26 వేలకు దిగువకు చేరుతుందేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు కార‌ణం ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం ధ‌ర రూ.27వేల దిగువకు బలహీనపడటం ఈ అంచనాలకు మరింత బలాన్ని స్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధరల పతనానికి కొద్దిగా బ్రేక్ పడింది. కాగా, దేశీయ మార్కెట్లో మాత్రం ప‌సిడి ధరల ప‌త‌నం అలాగే కొనసాగుతోంది. దీంతో మార్కెట్లో ఈ రోజు బంగారం ధర మరో 50 రూపాయ‌లు త‌గ్గింది.ప్ర‌స్తుతం పది గ్రాముల ప‌సిడి ధ‌ర‌ 27,800 గా ఉంది. మరోవైపు వెండి ధ‌ర‌ కిలో రూ.38,810గా ఉంది.

23hyd-state20a

ఎమ్మెల్సీ నారదాసు వివాహం

అవును మీరు విన‌ది నిజ‌మే టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.61 ఏళ్ల వయసున్న ఆయన మొదట్నుంచి ఆదర్శ, అభ్యుదయ భావాలతో మెలిగారు. ఇప్పటివరకు అవివాహితునిగానే ఉన్నారు.హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన హైకోర్టు న్యాయవాది అక్కి వర్ష(41)ను నాంపల్లిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబసభ్యులు..జిల్లాకు చెందిన తెరాస నేతల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి జరిగింది.

మావోయిస్ట్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటినుంచి లక్ష్మణరావు టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. అప్పటినుంచి ఆయన తన సోదరుడి ఇంట్లోనే ఉంటున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో ఏర్పడిన పరిచయం నారదాసు-అక్కివర్షల వివాహబంధానికి దారితీసింది.

Maltese troops survey a hijacked Libyan Afriqiyah Airways Airbus A320 on the runway at Malta Airport, December 23, 2016. REUTERS/Darrin Zamit-Lupi

లిబియాలో విమానం హైజాక్..బందీలుగా 118 మంది

లిబియాలో విమానం హైజాక్ అయ్యింది. ఆఫ్రిక్వీయ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏ-320 విమానం సబ ఎయిర్ పోర్ట్ నుంచి ట్రిపోలి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు దాన్ని హైజాక్ చేశారు. అ విమానంలో సిబ్బంది సహా 118 మంది ట్రావెలర్స్ ఉన్నారు. హైజాక్ విషయం తెలియగానే విమానాన్ని అధికారులు మాల్టా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తమ డిమాండ్లు తీర్చకపోతే విమానాన్ని పేల్చేస్తామంటూ హైజాకర్లు.. బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది.

మరోవైపు మాల్టీస్ ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ కూడా హైజాక్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా దృవీకరించారు. భద్రతా దళాలు అత్యవసర చర్యల్ని చేపట్టినట్టు తెలిపారు. హైజాగ్ చేయ‌బ‌డిన విమానంలో 82 మంది పురుషులు, 28 మహిళలు, ఒక శిశువు ఉన్నట్టు ట్వీట్ చేశారు.

capture4444444444444444

padmarao-ts23

గీత కార్మికుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నాంః పద్మారావు

 రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమానికి పాటు పడుతున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. గీత కార్మికులు చెట్లు ఎక్కేందుకు యంత్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. దీనిపై కేరళ రాష్ట్రంలో అధ్యయనం చేశామన్నారు. అబ్కారీ శాఖలో ప్రైవేటు వాహనాలు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. ప్రభుత్వ వాహనాలను సమకూర్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక చాలా చోట్ల గౌడ కులస్తులే కల్లు దుకాణాలు నడుపుతున్నారని పేర్కొన్నారు. ఒక వేళ వేరే వారు దుకాణాలు నడుపుతున్నట్లు తెలిస్తే వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు  డ్రిప్ సిస్టం ద్వారా ఈత, తాటి చెట్ల పెంపకం చేపడుతామన్నారు. ప్రమాదంలో మరణించిన గీత కార్మికులకు రూ. 30 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇచ్చామని తెలిపారు. గౌడ సొసైటీలపై దౌర్జన్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

22brk-gio95a

ఇక‌పై 3జీ ఫోన్లలోనూ జియో…?

రిలయన్స్ జియో మరో సంచలన ప్రకటన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియోగదారులకు చేరువైన జియో ఇకపై 3జీ ఫోన్లలోనూ పనిచేయనుంది. ఇప్పటి వరకు 4జీ ఫోన్లలో మాత్రమే పనిచేస్తున్న జియో సిమ్‌లు 3జీ ఫోన్లలోనూ పనిచేసే విధంగా సంస్థ ఓ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జియో సేవ‌లు 3జి వారికి కూడా అందించడంతో ద్వారా మరింత పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించ‌వ‌చ్చ‌ని ప్లాన్. ఇప్పటికే ఐదుకోట్ల మందికి మించి రిలయన్స్ జియో కస్టమర్లున్నారు.ఇక‌పోతే జనవరి 1న ‘హ్యాపీ న్యూఇయర్‌ ఆఫర్‌’ కింద 3జీ కస్టమర్లకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం.  

p-02

రూ.2000 నోటు మీ ఇంటికే వస్తుంది

నగదు కష్టాలను బ్యాంకులు తీర్చలేకపోతున్నాయి, కానీ స్నాప్‌డీల్ ‘నేనున్నాను’ అంటూ ఆదుకోవడానికి ముందుకొచ్చింది. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత కొంతైనా తీర్చేందుకు కొత్త పథకం ప్రవేశపెట్టింది. గురువారం నుంచి ‘Cash@Home’ సర్వీస్ పేరుతో నగదును ఇంటివద్దకే డెలివరీ చేసే పద్దతిని తీసుకొచ్చింది. గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిమాండ్‌ను మిగతా సిటీలకు ఈ సర్వీసులను కొద్దిరోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. కస్టమర్లు అభ్యర్థన మేరకు ఈ సర్వీస్‌ల కింద ఒక్కో బుకింగ్‌కు రూ.2000 వరకు నగదును స్నాప్‌డీల్ డెలివరీ చేయనుంది. ఇందుకోసం నామమాత్రపు రుసుము కింద రూ. 1ను చార్జ్ చేయనుంది. బుకింగ్ చేసుకునే సమయంలో ఈ ఫీజును డెబిట్ కార్డు లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించవచ్చు. నగదు డెలివరీ చేసే సమయంలో యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్ లో స్వైప్ చేసి స్నాప్ డీల్ కు ఈ నగదు చెల్లించవచ్చు. 

Now You Can Withdraw Rs.4500 From ATM

ఏటీఎం విత్ డ్రా మ‌నీపై స‌ర్ ఛార్జ్ వ‌సూలు..?

సామాన్యులపై కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ మరో పిడుగు వేసేలా ఉన్నాయి. బ్యాంకులు, ఏటీఎం ల నుంచి కస్టమర్స్ విత్ డ్రా చేసుకునే సొమ్ము పై సర్ చార్జ్ విధించే యోచనలో ఉన్నారని తెలిసింది. ఈ సర్ ఛార్జి 0.5.2 శాతం మధ్య ఉండ వచ్చునని, ఈనెల 30 తరువాత ఇది అమలులోకి రావచ్చునని అంటున్నారు.

కనీస పరిమితికి మించి నగదు తీసుకుంటే ఈ సర్‌ఛార్జి వర్తిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కనీస మొత్తం ఎంతన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అందిన సమాచారం మేరకు బ్యాంకుల నుంచి రోజుకు రూ.50 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ.15 వేలు మించి విత్‌డ్రా చేసుకుంటే సర్‌ఛార్జి విధించే అవకాశం ఉంది. ‘నిర్వహణ వ్యయం’ పేరుతో దీన్ని వసూలు చేయనున్నారని తెలిసింది. ఈ నిబంధనను నాలుగు నుంచి ఆరు నెలల పాటు అమలు చేయవచ్చునని, అయితే శాశ్వతంగా కూడా బాద వచ్చునని సమాచారం.

01-chargee

నగదు లావాదేవీలపై ఆంక్షలు పెడుతూ మరికొన్ని ప్రతిపాదనలు
* రూ.మూడు లక్షలకు మించిన లావాదేవీలను నగదు రూపంలో జరపడాన్ని పూర్తిగా నిషేధించడం. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాల్సి ఉంది.
* ప్రతి కుటుంబమూ రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోవడాన్ని నిషేధించడం
* ప్రభుత్వ సంస్థలకు రూ.లక్షకు మించిన నగదు చెల్లింపులపై సర్‌ఛార్జి విధించడం
* అన్ని కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలను చెక్కులు/ డిజటల్‌ మార్గాల్లోనే చెల్లించాలని ఆదేశించింది.

ravindra-jadeja-ashwin

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్‌-2 మ‌నోళ్లే

  ఐసీసీ టెస్టు ర్యాకింగ్ ప్ర‌క‌టించింది. ఈ టెస్టు ర్యాంకుల్లో ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఉండ‌గా..  ర‌వీంద్ర జ‌డేజా రెండోస్థానంలో నిలిచాడు. కెరీర్‌లో తొలిసారి మ్యాచ్‌లో ప‌ది వికెట్లు తీసిన జ‌డేజా ఒకేసారి నాలుగు స్థానాలు ఎగ‌బాకాడు. 1974 త‌ర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భార‌త బౌల‌ర్లుగా అశ్విన్‌, జ‌డేజా రికార్డు సృష్టించారు.  చెన్నైలో ప‌ది వికెట్ల ప‌ర్ఫార్మెన్స్‌తో 66 పాయింట్లు జ‌డేజా ఖాతాలో చేరాయి. దీంతో అత‌ను అశ్విన్ కంటే కేవ‌లం 8 పాయింట్ల తేడాతో రెండోస్థానంలో నిలిచాడు. సిరీస్‌లో జ‌డేజా మొత్తం 26 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్‌, జేమ్స్ ఆండ‌ర్స‌న్‌, డేల్ స్టెయిన్, రంగ‌న హెరాత్‌ల‌ను వెన‌క్కి నెట్టి జ‌డేజా రెండోస్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక ఆల్‌రౌండ‌ర్ల లిస్ట్‌లోనూ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంకులో ఉన్నాడు జ‌డేజా. ఈ లిస్ట్‌లోనూ అశ్విన్‌దే అగ్ర‌స్థానం కావడం విశేషం. మొత్తానికి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను రికార్డు లెవ‌ల్లో గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్స్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ రికార్డులే సృష్టిస్తున్నార‌నే చెప్పాలి.

cmkcr1221

రూ.16,500 కోట్లు రైతు రుణాలను మాఫీ చేశాం-సీఎం కేసీఆర్‌

దేశంలోనే అత్యధికంగా రుణమాఫీ చేసిన ఘనత తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మొత్తం 16,500 కోట్లు రైతు రుణాలను మాఫీ చేశామని తెలిపారు. న అసెంబ్లీలో వ్యవసాయంపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. పాత బకాయిలు 480 కోట్లు చెల్లించిన‌ట్లు తెలిపారుర. ఇన్‌పుట్ సబ్సిడీ డ్యూస్ పే చేశామని పేర్కొన్నారు. ప్ర‌తిసారి రైతు రుణ‌మాఫీపై ప్ర‌తిప‌క్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. ఇప్పటికి 75 శాతం రుణమాఫీ అయిందని, మిగతా 25 శాతం వచ్చే బడ్జెట్‌లో చేస్తామన్నారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ కోసం కేంద్రాన్ని రూ.3 వేల కోట్లు అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం నుంచి వచ్చింది వెయ్యి కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు.

cashi001

ఆన్‌లైన్‌ ద్వారానే ఉద్యోగుల‌కు జీతాలు

పెద్దనోట్లు రద్దు వేళ కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఇందులోభాగంగా వేతనాల చెల్లింపు చట్టం-1936ను సవరించి ఉద్యోగులకు ఆన్‌లైన్‌ ద్వారానే జీతాలు చెల్లించాలని కోరుతూ కొత్త ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ కాల ప‌రిమితి ఆరునెలలు.. ఈలోగా వేతనాల చెల్లింపు బిల్లు -2016ను వచ్చే పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదం పొందడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

అయితే ఈ ఆర్డినెన్స్‌తో ఇక నుంచి దేశంలోని అన్ని కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు ఆన్‌లైన్‌లోనే జీతాలు చెల్లించాల్సివుంటుంది. చెక్కుల రూపంలోగానీ, ఈ-బ్యాంకింగ్ ద్వారాగానీ జీతాలు చెల్లించాలి. చిన్నచిన్న కంపెనీల్లో ఇప్పటికీ జీతాల చెల్లింపులు నగదు రూపంలో జరుగుతుంటాయి. దీనిద్వారా క్యాష్‌లెస్ ఎకానమీని వృద్ధిలోకి రానుంది. తాజా నిర్ణయంతో ఆయా ఉద్యోగులు ఇప్పుడు డైలమాలో పడ్డారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ చూపాలని కేంద్రం కోరింది.