Saturday, 21 January, 2017
jiyo-happy-new-offer

జియో వినియోగ‌దారుల‌కు షాకింగ్ న్యూస్‌

టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. జియో ఫ్రీ ఆఫర్ ను 2017 మార్చి వరకు పొడ‌గిస్తూ ప్రకటించి కస్టమర్లకు సంతోషాన్ని నింపింది..అయితే జియో నిర్ణయాన్ని తప్పు బడుతూ ఎయిర్ టెల్ జియో ఫై కేసు వేసింది..మొదట డిసెంబర్ వరకు అని చెప్పిన జియో ఫ్రీ ఆఫర్ , ఇప్పుడు మార్చి వరకు అని చెప్పడం ఫై ఎయిర్ టెల్ తన అభ్యతరాన్ని వ్యక్తం చేసింది.

ట్రాయ్ ఈ పొడిగింపుకు అనుమతించడంపై ఎయిర్‌టెల్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పీలెట్ ట్రిబ్యూనల్‌(టీడీశాట్)కు ఫిర్యాదు చేసింది. జియో విషయంలో ట్రాయ్ మెతక వైఖరి అవలంభిస్తోందని, ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఎయిర్‌టెల్ ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుపై విచారణను జనవరి 6, 2017కు టీడీశాట్ వాయిదా వేసింది. దీంతో జియో ఆఫర్ మార్చి వరకు ఉంటుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అని కస్టమర్లు ఖంగారు పడుతున్నారు

arun-jaitely-gst-tax-reuters_650x400_81448280899

ప‌న్నులు క‌ట్ట‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు-అరుణ్ జైట్లీ

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సర్వత్రా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తక్కువ పన్నుల గురించి సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా దేశం తక్కువపన్నుల దశలోకి అడుగుపెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు.భార‌త్‌లో కొందరు ప‌న్నుల ఎగ‌వేత‌ను తెలివైన పనిగా భావిస్తున్నారని, ప్ర‌స్తుతం అటువంటి వారు భారీ మూల్యమే చెల్లించారన్నారు.. ఈ రోజు ఐఆర్‌ఎస్‌ 68వ బ్యాచ్‌ వృత్తి శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్స‌వంలో జైట్లీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడాలంటే దేశంలో పన్నుల విధానంలో మార్పు రావాలని అన్నారు. ప్ర‌స్తుతం మనకు కావాల్సింది పన్నులు తక్కువగా ఉండటమేన‌ని, పోటీతత్వంతో స‌ర్వీసు మెరుగుపడుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.ప‌న్నులు చెల్లించడం పౌరుల బాధ్యతని, త‌ద్వారానే దేశ ఆర్థిక రంగం అభివృద్ధి చెందుతుందని జైట్లీ చెప్పారు. ప్రభుత్వ అధికారులకు ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేస్తూ వారిలో నిజాయతీ, శ్ర‌మించే తత్వం, కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం ఉండాల‌ని అన్నారు. దేశంలో పన్నుల ఎగవేత అనేది అధికంగా ఉంద‌ని, గత డెబ్బై ఏళ్లుగా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప‌న్ను ఎగ‌వేత అనేది వారికి తప్పుగా అనిపించడం లేదని జైట్లీ వ్యాఖ్యానించారు.  

ramgopal-varma-counter-attack-to-vangaveeti-radha-id2_1482747726

వంగ‌వీటి రాధాకు వర్మ వార్నింగ్

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయినా డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ వంగ‌వీటి రాధాతో బస్తీమే సవాల్‌ అంటున్నాడు. రంగా క్యారెక్టర్‌ను వక్రీకరించానన్న రాధా కామెంట్లకు వ‌ర్మ జ‌వాబిచ్చాడు. రంగాను మహాత్మా గాంధీ అని చూపించాలా? మర్డర్ల మాట అటుంచి మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా? మదర్‌థెరిస్సాకన్నా సాత్వికుడని చూపించాలా? చీమకైనా హాని చెయ్యని గౌతమబుద్ధుడని చూపించాలా? అని వర్మ ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతేకాదు, వాస్తవాలే చూపించాలన్న రాధా డిమాండ్లకు నా సమాధానమంటూ ఇంకో అటాక్ మొదలుపెట్టాడు. రంగా, ఆయన భార్య గురించి అభిమానులు వినడానికి.. చూడడానికి ఇష్టపడని డాక్యుమెంట్‌ వాస్తవాలు చాలా చూపగలను.. రంగాపై ఉన్న గౌరవంతో అవి చూపించలేదని పేర్కొన్నారు.

ఒక‌వేళ రాధా ఆ వాస్త‌వాలు ఏంటని డిమాండ్‌ చేస్తే.. వాటన్నింటినీ కుండబద్దలుగొట్టినట్టు చెబుతానన్నాడు రాంగోపాల్‌వర్మ. అంతటితో ఆగని వర్మ వంగవీటి రాధా, రంగాలోని గొప్పతనంలో.. రాధాకు 0.1 శాతంకూడా లేకపోవడంతోనే రాధా పరిస్థితి ఇలా తయారైందని ఎద్దేవా చేశాడు. తాను తీసిన వంగవీటి సినిమా కరెక్ట్‌ కాదనుకుంటే.. అసలు వంగవీటి సినిమా అని తీసి లోకానికి చూపించుకోమనండి అంటూ మరో సవాల్ విసిరాడు వర్మ.

sharukh-01

డాక్టర్ షారూఖ్

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కు మరో అరుదైన గౌరవం ద‌క్కింది. నటనలో విశేషమైన నటన కనబరుస్తున్న షారూక్ ఖాన్‌కు హైదరాబాద్ లోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ డాక్టరేట్ తో స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా షారూక్ మాట్లాడుతూ…హైదరాబాద్‌లో తాను డాక్టరేట్ అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తన పేరెంట్స్ ఉంటే ఎంతో సంతోషించేవారని భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి హైదరాబాద్‌లోనే పుట్టారని, అలాంటి గడ్డ మీద డాక్టరేట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఫాదర్ స్వాతంత్య్ర సమరయోధుడని, ఉర్దూ భాషాభిమాని అని తెలిపారు.

జీవితంలో ముందుకు వెళ్లేందుకు కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సి వస్తుందని, ఏదైనా చేశాక తప్పులు సరిదిద్దుకోవడం కంటే, ముందే జాగ్రత్త పడడం మంచిదన్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆరవ స్నాతకోత్సవంలో వర్సిటీ చాన్సలర్ జాఫర్ సరేష్వాలా షారుక్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. యూనివర్సిటీ అధికారులు, సిబ్బందికి ఈ హీరో కు ధన్యవాదాలు తెలిపారు.

51482731814_unknown

పందెం రాయుళ్లకు షాక్

సంక్రాంతి వచ్చిందంటే చాలు పందెం రాయళ్ల హడావుడి అంతాఇంతా కాదు. కోస్టల్ ఏరియాలో ఈ వేడి మరింత ఎక్కువగా వుంటుంది. తాజాగా కోడి పందెం రాయుళ్లకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. ఏపీలో కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టంచేసింది. అలాగే పందేలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని కాసింత ఆగ్రహం వ్యక్తంచేసింది. కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని ప్రస్తావిస్తూ పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ ఆర్గనైజేషన్‌, యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

car-parking-23-1482466606

రోడ్డుపై వాహనం పార్కింగ్ చేస్తే అంతే సంగ‌త‌లు..!

మీరు క‌నుక పొర‌పాటున  నో పార్కింగ్ జోన్ లో వాహనాలను నిలిపితే ఇక అంతే సంగ‌తులు. ఇక‌పై నో పార్కింగ్ జోన్ లో వాహ‌నాలు పార్కింగ్ చేస్తే  ముక్కు పిండి మరీ భారీ జరిమానాను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అక్రమ పార్కింగ్ కు ప్రస్తుతం రూ. 200 జరిమానాగా వసూలు చేస్తుండగా, దాన్ని 500 శాతం పెంచి రూ. 1000 వసూలు చేయాలన్నది కేంద్ర రోడ్లు, రవాణా శాఖ ఆలోచన. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. వాహనాలను రోడ్లపై పార్క్ చేసి, రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని నిలువరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అక్రమ పార్కింగ్ లను గమనించిన ప్రజలు ఎవరైనా, దాని ఫోటో తీసి ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖకు పంపవచ్చని గడ్కరీ తెలిపారు. ఈ విషయంలో భవన నిర్మాణ విభాగం కూడా సహకరించాలని, సరైన పార్కింగ్ లేని భవనాలకు అనుమతులు ఇవ్వద్దని గ‌డ్క‌రీ కోరారు.

money-showred

దేవుడాః వీళ్లు 40 లక్షలు ఏం చేశారో చూడండి

పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలు నానాఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెల‌సిందే. కొన్ని చోట్ల న‌ల్ల‌కుబేరులు త‌మ ఇంట్లో దాచుకున్న కొత్త రెండు వేల రూపాయిల నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డ ఘ‌ట‌న‌లు మ‌నం చూశాం. కానీ గుజరాత్ నౌసారిలో ఈ మ్యూజిక్ షోలో లక్షలాది రూపాయాలను పూలలా వెదజల్లారు. మొత్తం 40 లక్షలను వెదజల్లినట్లు తెలిసింది. వీరు విసిరిన నోట్లు మొత్తం రూ. 10, 20 నోట్లే. అయితే మగవాళ్లతో పోటీ పడి మహిళలు పైసలను వెదజల్ల‌డం ఇక్క‌డ విశేషం.

 

ktr-ts26

సుపరిపాలనే మా స‌ర్కార్‌ లక్ష్యం-కేటీఆర్‌

ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే మాప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు మంత్రి కేటీఆర్‌. ఇందులో భాగంగానే వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. వంద రోజుల ఎజెండాలో నగర అభివృద్ధికి సంబంధించి చాలా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మై జీహెచ్‌ఎంసీ పేరిట యాప్ తీసుకొచ్చామని చెప్పారు. దాదాపు 1100కు పైగా చెత్త వేసే ప్రాంతాలను తరలించామన్నారు.

జీహెచ్‌ఎంసీ ఏర్పడినప్పటి నుంచి రోడ్ల కోసం తాము ఖర్చు పెట్టిన డబ్బు ఎవరూ ఖర్చు పెట్టలేదని గుర్తు చేశారు. రోడ్లను ఎంత వేసినా పటిష్టంగా ఉండకపోవడానికి సీవరేజ్ వ్యవస్థనే కారణమన్నారు. సీవరేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు.

ఇక‌పోతే విశ్వనగరాలు రాత్రికి రాత్రే కావ‌ని కొంత సమయం పడుతుందన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్న మాట వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఏడాది పొడవునా నాలాల్లో పూడికతీతకు టెండర్లు పిలిచామని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీలో సిబ్బంది కొరత లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

modi8

అవినీతిపై యుద్ధం షూరూ: మోడీ

పెద్దనోట్ల రద్దుతో అవినీతిపై యుద్ధం ప్రారంభించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతినెలా నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.‘అవినీతి, నల్లధనంపై మా ప్రభుత్వం యుద్ధం ప్రారంభించింద‌న్నారు. పెద్దనోట్ల రద్దును దేశ ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. దేశంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహంచే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంద‌ని చెప్పారు. ఇందులో భాగంగా నేటి నుంచి ‘లక్కీ గ్రాహక్‌ యోజన’ ప్రారంభిస్తున్న‌ట్లు వివ‌రించారు.. వ్యాపారుల కోసం డిజి- ధన యోజన్‌కు శ్రీకారం చుడుతున్నామ‌న్నారు. 100రోజుల పాటు ఈ లక్కీ డ్రాల ద్వారా లక్షల రూపాయలు గెలుచుకోనున్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న బంపర్‌ డ్రా తీస్తామ‌ని అందులో కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చున‌ని చెప్పారు.. డిజిటల్‌ మార్పు యువత సహా అంకుర సంస్థలకు సువర్ణావకాశం లాంటిది’ అని ప్రధాని అన్నారు.సోషల్ మీడియాలో వాట్సాప్ నుంచి మెసేజ్ ను పంపడం కన్నా ఎలక్ట్రానిక్ చెల్లింపును సులభతరం చేసి చూపిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

క్రీడాకారులకు అభినందనలు

మన్‌కీ బాత్‌ సందర్భంగా ఆటగాళ్లను మోదీ ప్రశంసించారు. ప్రపంచకప్‌ను గెలిచిన జూనియర్‌ హాకీ జట్టును అభినందించారు. ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ఇయర్‌గా, ఐసీసీ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా రెండు అవార్డులు గెలుచుకున్న భారత స్పిన్నర్‌ అశ్విన్‌ను, ఇంగ్లాండ్‌తో టెస్ట్‌లో త్రిశతకం సాధించిన కరుణ్‌ నాయర్‌ను మోదీ ప్రశంసించారు. ఇంగ్లాండ్‌పై 4-0 తో టెస్ట్‌ సిరీస్‌ సొంతం చేసుకున్న టీమిండియాను అభినందించారు. విరాట్‌ కోహ్లి నేతృత్వంలో భారత్‌ అద్భుతంగా రాణిస్తోందన్నారు. వికలాంగుల బిల్లుకు మద్దతు తెలిపిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకూ మోదీ ధన్యవాదాలు తెలిపారు.

51482667696_625x300

సీఎం గారు ప‌బ్లిక్ లో ఈ పనేంటి..?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. సిద్ధారామయ్య పీఏ చేత బూట్లు తొడిగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. చేతన రామారావు మరణించిన వార్తను తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్లారు. అనంతరం చేతన రామారావు ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రధాన ద్వారం వద్ద ఎవరికోసమో వేచి చూస్తున్నట్లు నిల్చున్నారు. ఇంతలో సిద్ధారామయ్య పీఏ కుమార్ అక్కడకు చేరుకుని బూట్లు తొడిగినట్లు చెప్పారు.

ఈ సంఘటనను చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురి కాగా సీఎం మాత్రం స్పందించలేదని తెలిపారు. అసిస్టెంట్లతో ఇలాంటి పనులు చేయించే నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారని ఆ సమయంలో సీఎం సిద్ధారామయ్యతో పాటు ఉన్న కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు. అందరూ సమానులే అనే సీఎం ఇలాంటి పనులు చేస్తుండటం సిగ్గు చేటని అన్నారు. గ‌తంలో ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్ లో సీఎం సిద్దారామ‌య్య‌కు ఓ మ‌హిళ ముద్దు ఇవ్వ‌డంతో అప్ప‌ట్లో పెద్ద దూమార‌మే రేగింది. మ‌రీ తాజా ఇష్యూపై సిద్దారామ‌య్య ఏం చెబుతాడో చూడాలి మ‌రీ.