Tuesday, 17 January, 2017

మొటిమలు మిమ్మల్ని బాధిస్తున్నాయా ?

యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆడవారిని మొటిమలు వేధిస్తుంటాయి. వీటి వల్ల ముఖం అందవికారంగా తయారయ్యి నలుగురితో కలవాలంటే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మొటిమలు మిమ్మల్ని దరి చేరవు.

  •  మొటిమలు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినేవారిలో వస్తాయి. కాబట్టి ఆయిల్ ఫుడ్ ను వీలైనంత వరకూ తగ్గించుకునేలా చూడాలి.

  •  మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బాక్టీరియా వల్ల వస్తుంటాయి. కాబట్టి ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.

  •  మొటిమలు ఉన్నవారు వాటిని సూది, పిన్నీసు వంటి వాటితో పొడుస్తుంటారు. ఇలా చెయ్యండం వల్ల దీనిలో ఉండే బాక్టీరియా ముఖం లోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది.

  •   మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్ను వాటిపై మెల్లిగా రుద్దుతుంటే కొంచెం ఉపశమనం లభిస్తుంది.

  •  కొంచెం నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం కనపడుతుంది

  •   మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహారం తగ్గించాలి.

  •  నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటిమలు రాకుండా చూసుకోవచ్చు.

  •   మొటిమలు ఉన్నాయి కదా అని ఏ క్రీం పడి తే అవి రాసెయ్యకూడదు. దీనివల్ల మీ ముఖం ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రభావం ఉంది.

  •   టమోటా పండు రసం తీసి మొటిమలు మీద రాసుకుంటే ఫిలితం కనిపిస్తుంది.

  •  కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు.

cold and fever tips in telugu

జలుబుకు గృహవైద్యం 

వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా జలుబు బారిన పడిన వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబును త్వరితగతిన వదిలించుకోవచ్చు. రాత్రి సమయంలో నిద్ర పోయేముందు పాలు తాగితే జలుబు నుంచి దూరం కావచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా మరగించి, ఆ తర్వాత ఆ నీటిని శుభ్రమైన వస్త్రంతో వడగట్టి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు తగ్గుతుంది. తులసి ఆకులు కూడా జలుబును తగ్గించేందుకు దోహద పడతాయి. కొన్ని తులసి ఆకులు, చిటికెడు రాతి ఉప్పు కలిపి రసాన్ని మింగితే మంచి ఫలితం లభిస్తుంది. తులసి ఆకులను ‘టీ’లా మరగించి తాగినా జలుబు నుంచి విముక్తి పొందవచ్చు.

child-manners-eating-food

మీరు ఇలా తిన్నారో…ఇంకా అంతే సంగ‌తులు

చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి డైటింగ్ చేస్తూ ఉంటారు. అయితే కొంత‌కాలం ఆహారం నియ‌మాలు పాటిస్తూ కడుపు మాడ్చుతూ.. మళ్లీ మామూలుగా తింటూ ఉంటారు. ఇలా చేస్తే బరువు పెరగడానికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కడుపు మాడ్చిన సమయాన్ని మన మెదడు కరవుగా భావించి భవిష్యత్తు కొరతను ఎదుర్కొనేందకు మరింత కొవ్వు నిల్వ చేసుకొనేలా శరీరాన్ని కోరుతుందని బ్రిస్టల్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు  చెబుతున్నారు. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకొనే వారు తరచూ డైటింగ్‌లో లేనప్పుడు… ఎక్కువ ఆహారం తీసుకోవడం, బరువును అదుపులో పెట్టలేకపోతున్నట్లు గుర్తించిన‌ట్లు చెప్పారు.. అదే డైటింగ్‌ చేయని వారిలో ఎక్కువ కొవ్వు నిల్వ చేయాల్సిన అవసరం ఉండటం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఎప్పుడూ కడుపు మాడ్చని వారితో పోలిస్తే.. ఆహార పరిమితి పాటించే వారిలోనే సగటున బరువు పెరగడం అధికంగా ఉందని చెప్పారు. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడానికి బదులు.. మీరు తినేదానికన్నా కొద్దిగా తక్కువగా తింటూ.. శారీరక వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన బరువును సాధించవచ్చని తమ అధ్యయనంలో గుర్తించినట్లు సైంటిస్టులు పేర్కొన్నారు.

weight-loss-benefits-with-honey-and-cinnamon

ఈ డ్రింక్ తాగితే ఎక్స‌ర్ సైజ్ తో ప‌నిలేదు

 

బ‌రువు త‌గ్గాల‌ని నానా ఇబ్బందులు ప‌డుతూ ఎక్స‌ర్ సైజ్ చేస్తారు. కానీ వాటితో ఎలాంటి ప‌నిలేకుండా ఈ డ్రింక్ తాగితే ఈజీగా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు.. అదెలా అంటే ప్ర‌తి రోజు రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క‌పొడి, ఒక టీస్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనే, ఒక లీట‌ర్ నీళ్లుపోసి భాగా క‌ల‌పాలి. దీన్ని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఒక గ్లాసు.. రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాసు తాగాలి. దాల్చిన చెక్క శ‌రీరంలోని కొవ్వును త‌గ్గిస్తుంది. దీంతో రెండు.. మూడు వారాలు తాగితే ఈజీగా మీ బ‌రువును త‌గ్గించుకోవచ్చు… మీరు ఇంట్లో ఓ సారి ట్రై చేసి చూడండి.

 

01-coffeiee

కాఫీ తాగే అల‌వాటు ఉంటే…ఇది చ‌ద‌వండి

మీకు రోజు మూడు కప్పులు కాఫీ తాగే ఆల‌వాటు ఉంటే నిజంగా మీరు గ్రేట్‌. ఎందుకంటే రోజు మూడు క‌ప్పుల కాఫీ తాగితే మతిమరపు దూరం అవుతుందంటున్నాయి తాజా పరిశోధనలు. రోజూ కాఫీ తీసుకుంటే దానిలోవుండే కెఫిన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోకి చేరే కాలుష్యాలను అడ్డుకుంట‌య‌ట‌. అంతే కాదు కాఫీ పార్కిన్ సన్ వ్యాధి నిరోధానికి కూడా మంచి ఔషధంగా పని చేస్తుందంటున్నారు సైంటిస్టులు. కాఫీ వాడకం గురించి వచ్చిన తాజా రిపోర్టు ప్రకారం రోజూ కాఫీ తాగేవారి శరీరంలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చేరిన కారణంగా మెమరీ పవర్ పెరిగినట్టు గమనించారు.ఇక‌పోతే నరాలకు సంబంధించిన వ్యాధులను కూడా నియంత్రించగల శక్తి కాఫీకి ఉందని యూరప్‌కు చెందిన ఆరు పెద్ద కాఫీ తయారీ సంస్థలు తేల్చాయి. ఇదిలా ఉంటే కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల కొంతమంది మహిళల్లో గర్భస్రావాలకు కారణమవ్వడం, గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యే ప్రమాదముందనేది కొన్ని పరిశోధనల సారాంశం.

51420782685_295x200

మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే మీరు ఆరోగ్య‌వంతులే

ఏంటి ముగ్గులు బాగా వేస్తే ఆరోగ్య‌వంతులు ఎలా అనుకుంటున్నారా…? అయితే ఇది చ‌ద‌వండి. చాలా మంది మ‌హిళ‌లు ల‌క్ష్మీదేవి క‌టాక్షం కోసం ఉద‌యాన్నే ఇంటిముందు శుభ్రం చేసి చ‌క్క‌గా ముగ్గులు పెడ‌తారు. ఇవి ఇంటిక అందాన్నే కాదు, అవి పెట్టిన వారికి ఆరోగ్యాన్నీ క‌లిగిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వంగి ముగ్గులు పెట్ట‌డం వ‌ల‌న న‌డుము, ఉద‌ర‌భాగంలో పేరుకు పోయినా కొవ్వు త్వ‌రగా క‌ర‌గ‌డ‌మే కాకుండా న‌డుము, చేతుల నొప్పులు వంటివి త‌గ్గుతాయ‌ని అంటున్నారు. అలాగే చేతుల‌కు కూడా మంచి వ్యాయామం అవుతుంది. ఉద‌యాన్నే స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చ‌డం వ‌ల‌న మ‌న‌స్సుతో పాటు శ‌రీరం ప్ర‌శాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంద‌ని అంటున్నారు. ముగ్గు వేసే స‌మ‌యంలో తెలియ‌కుండానే ఊపిరి ప్ర‌క్రియ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

tips for pregnant women in telugu

గర్భిణి స్త్రీల కోసం చిట్కాలు

1. బ‌రువైన వ‌స్తువులు మోయ‌రాదు. ఎక్కువ‌ విశ్రాంతి తీసుకోవాలి.

2. పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి పౌష్టికాహారం తీసుకోవాలి.  అందులో పాలు, పండ్లు, మాంసం, గుడ్లు ఉండేలా చూసుకోవాలి.

3.  రెగ్యుల‌ర్‌గా  వైద్యులను సంప్రదిస్తూ  వాళ్లు సూచించిన‌ మందులను క్రమం తప్పకుండా వాడాలి.

4.  నెలలు నిండిన స్త్రీలు ఎక్కువ‌గా ప్ర‌యాణించ‌రాదు. త‌ప్ప‌దు అనుకుంటే  కుదుపులు లేకుండా చూసుకోవాలి.

5.  గర్భణీ స్త్రీలు వత్తిడి, భయానికి లోను కాకూడదు. అది  కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతుంది.

6. నెలలు నిండిన స్త్రీలు హైవీల్స్ చెప్పులు వాడకపోవడం మంచిది. ఇలా వాడటం వల్ల అదుపు తప్పి పడిపోయానపుడు కడుపులోని బిడ్డకు ప్రమాదం.

7. సుఖ ప్రసవం కోసం తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి.

8. నెలలు నిండాక శృంగారానికి దూరంగా ఉండటం మంచిది.

9. నిద్రపోయేటపుడు ఎడమవైపు తిరిగ పడుకోవడం శ్రేయస్కరం.

10. అలాగే ప్రసవం అయిన తర్వాత పుట్టిన బిడ్డకు తల్లి చనుబాలు ఇవ్వడమే ఉత్తమం. తల్లి చనుబాలు వల్ల బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

healthy-benefits-of-plums

ఆల్ బుకారా.. అర‌డ‌జ‌ను లాభాలు

అవునండీ బాబు.. ఆల్ బుకారా పండ్లు తింటే ఎంతో మంచిద‌ట‌. ఈ పండ్ల‌లో ఉంటే విటమిన్ ‘ఇ’, బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయిట‌. అలాగే దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. అలాంటి వారు ఆల్ బుకారా పండ్లను తీసుకోవడం ద్వారా పెదవుల అందాన్ని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు ఆల్ బుకారా తొక్కతో పెదవులను కొన్ని రోజులు మ‌ర్ధ‌న చేసుకుంటే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి.

మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే అఆల్ బుకారాను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

saffron-bindu

నుదుటన కుంకుమ బొట్టు ధరించడం

చాలా మంది అనుకుంటారు నుద‌ట‌నే కుంకుమ బొట్టును ఎందుకు ధ‌రించాల‌ని. అయితే దీనికో రీజ‌న్ ఉంద‌ట‌. నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట.ఇక‌పోతే కుంకుమ‌ను ఏ చేతి వేలితో పెట్టుకోవాల‌ని అనే  డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే కుంకుమ‌ను ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కో ఫ‌లితం క‌లుగుతుంది. కుంకుమ‌ను ఉంగ‌ర‌పు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్ర‌శాంతి చేకూరుతుంది. ఇక న‌డివేలుతో ధ‌రిస్తే ఆయువు స‌మృద్ధి చెంఉదుతంది. బొట‌న వేలితో ధ‌రిస్తే శ‌క్తి క‌లుగుతుంది, చూపుడు వేలుతో ధ‌రిస్తే, భ‌క్తీ, ముక్తీ క‌లుగుతాయి.

ఇదిలా ఉంటే ప్లాస్టిక్ బొట్టు, బిళ్ల‌లు పెట్టుకోవ‌డం క‌న్నా మేల ర‌కం కుంకుమ ధ‌రిస్తే  మంచింది. నుదుట‌న కుంకుమ అదిస్తే జ్ఞాన చ‌క్రాన్ని పూజించిన‌ట్టేన‌ని చాలా మంది పెద్ద‌లు చెబుతుంటారు.

diwali-sweets

దీపావళిని ‘తీపావళి’ చేసుకుందాం

దీపావళి వస్తుందంటే ముందు స్వీట్స్ గుర్తొస్తాయి. రకరాకల స్వీట్లు తిని సంబురం చేసుకోవాలని అనుకుంటారు. ఈ సారి బయటి నుంచికి మిఠాయిలు కొనుక్కోకుండా ఇంట్లోనే త‌యారు చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. ఈ దీపావళిని తీపావళి చేసుకోండి

కాజు బర్ఫీ

ఇవి కావాలిbarfi-kaju-2జీడిపప్పులు – 2 కప్పులు, పంచదార – 1 కప్పు, నెయ్యి – 1 కప్పు, యాలకుల పొడి – 1/2 టీ స్పూను, సిల్వర్ పేపర్

ఇలా చేయాలిజీడిప్పులను మూడు గంటలు నానబెట్టి కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ లా చేయండి. నాన్ స్టిక్ పాన్లో పంచదార, ఒక కప్పు నీళ్ళు పొసి సన్నటి మంటపై ఉడికించండి. తర్వాత జీడిప్పు ముద్దను మేసి బాగా కలుపుతూ సన్నటి సెగపై ఉడికించండి. మిశ్రమం గట్టి పడుతుండగా నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిపి మంట ఆర్పేయండి. పైన సిల్వర్ పేపర్ అద్ది కావలసినట్టు స్క్వేర్ గా కానీ, డైమండ్ షేపులో కానీ కట్ చేయండి. టేస్టీ కాజూ బ‌ర్ఫీని ఎంజాయ్ చేయండి.

 

కోవా కజ్జికాయలు

kaju-kajjikayaluఇవి కావాలి

మైదా – అరకేజి, కోవా – 1 కేజి, కిస్మిస్ – 3 టేబుల్ స్పూన్లు, బాదం – 200 గ్రాములు, నూనె – 6 టేబుల్ స్పూన్లు, నీరు – 200 ఎం.ఎల్, చక్కెర – అరకేజి, నూనె – వేయించడానికి తగినంత.

ఇలా చేయాలి

పిండిలో నూనె వేసి బాగా కలిపిన తర్వాత నీటిని చేరుస్తూ ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి. బాణలిలో కోవా వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అందులో చక్కెరా.. సన్నగా తరగిన బాదం పప్పు, కిస్మిస్ లు వేసి కలిపి దించేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన మిశ్రమాన్ని చిన్న చిన్న చపాతీల్లా వత్తి అందులో కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులను మూసేయాలి. వీటిని కాగిన నూనెలో వేసి చిన్న మంట మీద దోరగా వేయించాలి.

కాజాలు

kaajaluఇవి కావాలి
మైదా – అరకేజి, పంచదార – అరకేజి, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 కప్పు, నూనె – సరిపడినంత, ఉప్పు – చిటికెడు
ఇలా చేయాలి
మైదా పిండిలో ఒక కప్పు వేడి నెయ్యి, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి కలపండి. కావలసిన సైజులో ఉండలు చేసి చపాతీల్లా వత్తండి. ఒక చపాతీపై రెండు స్పూన్లు నెయ్యి వేసి రాయండి. దానిపై బియ్యం పిండి చల్లండి. దాన్ని రోల్ చేసి కట్ చేయండి. అప్పడాల కర్రతో కాజూల్లా వత్తండి. పంచదార తీగపాకం పట్టి పక్కకు పెట్టుకోండి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత కాజులు వేసి బంగారు రంగులో వేయించి పాకంలో వేసి పది నిమిషాలు వుంచి తీసేయండి. ఈ విధంగానే కావాలసినంత వేయించి పాకంలో వేయండి.

ఇలా మీకు న‌చ్చిన స్వీట్లు చేసుకుని తినండి. వీలైతే ఇరుగు పొరుగు వాళ్ల‌కు కూడా ఇవ్వండి. ఎందుకంటే సంతోషం పంచితేనే పెరుగుతుంది.
హ్యపీ తీపావ‌ళి

___________
Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com