Saturday, 21 January, 2017
kids

అన్న‌ద‌మ్ముల ప్రేమ ( క‌థ‌)

అన్న‌ద‌మ్ముల ప్రేమ ( క‌థ‌)

విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే్ అన్నకు చాలా ప్రేమ. అన్నంటే తమ్ముడికి ఏంతో గౌరవం. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు.

రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంటో ఇష్టం లేకపోయినా తప్పని సరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన పదెకరాల పొలాన్ని చెరో అయిదేసి  ఎకరాల చొప్పున పంచుకున్నారు.

కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు. నా భార్యా నేనూ ఉన్నదాంతో సర్దుకోగలం. అన్నయ్యకు ఇద్దరు పిల్లలు. ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం…. అనే భావన లక్ష్మణుడికి ఉండేది. అందుకనీ పంట చేతికొచ్చిన ప్రతిసారీ ఎవరూ లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు.

నా కొడుకులు ఏదో ఒకరోజు అందివస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు వాడికి వయసు పెరిగేకొద్దీ బతుకు భారమవుతుంది. అని ఆలోచించేవాడు రాముడు అంతేకాదు, పంట చేతిరికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపురాశిలో పది బస్తాల ధాన్యాన్ని వేసేవాడు.

ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్లపాటు  కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపుకొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు.

sweet-corn-recipe

స్వీట్ కార్న్ సూప్

ఇవికావాలి
స్వీట్ కార్న్ – కప్పు, ఉల్లి కాడలు – అరకప్పు, కూరగాయలు ఉడికించిన నీళ్లు – మూడు కప్పులు, టమాటా సాస్ – ఐదు చెంచాలు, దాల్చిన చెక్క – కొద్దిగా, జీలకర్ర – చెంచా, మిరియాలు-చెంచా, ఉల్లిపాయ తరుగు – అరకప్పు, టమాటా- ఒకటి, పచ్చిమిర్చి – నాలుగు, ఉప్పు, పంచదార – తగినంత.

ఇలా చేయాలి

 ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. అలానే శుభ్రంగా ఉన్న వస్ర్తంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి. ఉల్లిపాయ ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్కజొన్నలను కూరగాయలు ఉడికించిన నీళ్లలో వేసి పొయ్యి మీద పెట్టాలి. కొద్దిసేపటికి ఉప్పు, ఉల్లకాడలు, టమాటా సాస్ వేసి బాగా మరిగించాలి. సూప్ చిక్కగా అవుతుంది. అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి వేడివేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

zine-kids-4

Find The Differences

These Picture seems same.

Yet They have 10 differences.

Try to find out them. 

Find the difference
IMAGE -01

 

Find the difference
IMAGE-0 2

 

For Solution Scroll Down..

……

…..

….

..

.

Solution

There are ten differences in total.
1) Spot the extra bird.
2) See the direction of the paper plan.
3) Notice the amount of white flowers.
4) Count the number of snails. One is missing.
5) Count the number of butterflies. There is an extra.
6) Count the number of plants. There is an extra.
7) Count the number of apples. One is missing.
8) See the dots on the bow that belongs to the girl.
9) One less paper plane on the ground.
10) Notice the shoes of girl. They are plain white.

_____

Like this ? Wanna Say somthing. you comment below or mail us : info@tvarthalu.com

And We can be friends on Facebook and Twitter too

ism song lyrics

ISM SONG KANULU NAVAINA LYRICS IN TELUGU

క‌నులు నావైనా


జింద‌గీ కే లియే జాన్ జ‌రూరీహే
జీనే కే లి అర్మాన్ జ‌రూరీ హే
ఇస్ జాన్ ఔర్‌ అర్మాన్ కే లియే.. తెరి ముస్కాన్ జరూరీ హే
ఔర్ వో ముస్కాన్ కే లియే… మేరీ జాన్ దేదూంగా
యా కిసీకీ.. జాన్ లూంగా

క‌నులు నా వైనా
క‌ల‌లు నీవేలే
పెద‌వి నాదైనా
పిలుపు నీదేలే
ఈ గుండె నాదైనా
ఉండేదీ నువ్వేలే
ఈ ప్రాణం నాదైనా
ఊపిరి నువ్వేలే….
మ‌హ‌బాగుందే
మాయ‌లాగుంది
మ‌రోలోకంలో
మ‌న‌సు దూకింది
క‌నులు నా వైనా
క‌ల‌లు నీవేలే
పెద‌వి నాదైనా
పిలుపు నీదేలే

నాలోంచి నీలోకి
వ‌చ్చేసి మెల్ల‌గా
న‌న్నమో నీకిచ్చేశాగా
గుండెతో గుండెనె ఇలా
గుచ్చేశా దండ‌లా

జానోనా జానో స‌న‌మ్‌
న‌చ్చింది ప్రేమ త‌నం
నీ న‌వ్వు నా మ‌ర‌ణం
నీ చూపె నా జ‌ననం
మ‌హ‌బాగుందే
మాయ‌లాగుంది
మ‌రోలోకంలో
మ‌న‌సు దూకింది

నాదంటూ నీదంటూ
ఏముంది కొత్త‌గా
ఇద్ద‌రిని క‌రిగించేశాక‌
జ‌న్మ‌తో జ‌న్మ‌కి ఇలా
ముడి వేద్దాం గ‌ట్టిగా

జానోనో జానో సనం
ప్రేమంటే పిచ్చిత‌నం
నువ్వేలే నా చ‌ల‌నం
నీ పేరే నా మ‌న‌నం
మ‌హ‌బాగుందే
మాయ‌లాగుంది.
మ‌రోలోకంలో
మ‌న‌సు దూకింది


Movie : Ism
Song: kanulu Navaina
Music Director: Anup Rubens
Singers: Jubin Nautiyal, Mohana Bhogaraju
Lyrics: Bhaskara Bhatla
Producer : Nandamuri Kalyana Ram
Director : Puri Jagannadh
Banner : NTR Arts
Lable :Srinu
Actor : Nandamuri Kalyan Ram
Actress : Aditi Arya


 Like this Lyrics ? Have some to say ? comment below or mail us : info@tvarthalu.com. or Be A Friend with us on Facebook & Twitter.

 

beauty tips for men

అంద‌గాడివైతే.. అమ్మాయిలే లైనేస్తారు

 ట్రెండ్ మారింది బాస్‌. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా లైనేస్తున్నారు. కానీ వాళ్లు అలా చేయాలంటే… మ‌నం అందంగా ఉండాలిగా. డ్యాషింగ్ లుక్‌తో పాటు..చాకొలెట్ బాయ్ లాంటి లుక్ కూడా ఉండాలి. ఎందుకంటే అమ్మాయిల‌కు చాకొలెట్స్ బాగా ఇష్టం. ఈ బ్యూటి టిప్స్ మ‌న మ‌గాళ్ల‌కే బ‌డ్డి. పాటించి చూడండి. ఎవ‌రికి తెలుసు.. ఏ అమ్మాయి మీకు లైన్‌వేస్తుందో..

ఫేషియ‌ల్‌లో షీ ఉన్నంత మాత్రానా ఆడ‌వాళ్లు మాత్ర‌మే  చేయించుకోవాలి అనే రూలేమీ లేదు. త‌క్కువ ర‌సాయ‌నాలు ఉన్న ఫేస్ వాష్ ఉత్ప‌త్తుల‌ను ఎంపిక చేసుకోని మ‌గ‌వారు కూడా పేషియ‌ల్స్ చేసుకోవ‌చ్చు. హ్యాండ్స‌మ్ గా రెడీ అవ్వొచ్చు.

  • రోజుకు క‌నీసం రెండు సార్లైన ఫేషియ‌ల్ క్రీమ్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. సోపు, డియోడ‌రెంట్ ఉత్ప‌త్తుల‌ను ముఖానికి వాడ‌కూడ‌దు.

  • పురుషుల చర్మం ర‌ఫ్ గా ఉంటుంది కాబ‌ట్టి విట‌మిన్ ప్రాడ‌క్ట్స్ లేదా అలోవేరా (క‌ల‌బంద‌)ల‌తో త‌యారు చేసిన ఫేస్ వాష్‌ల‌ను వాడాలి.

  • షేవింగ్ చేసిన త‌ర్వాత అలొవెరా ఫేష్ వాష్ చేసుకుంటే షేవింగ్ స‌మ‌యంలో చిన్న‌గాట్లు ఏర్ప‌డ్డా ఎటువంటి గుర్తులు లేకుండా చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ముఖంగా మొటిమ‌లు, ముడుత‌లు, రంధ్రాలు పోయి ముఖం ఆకర్ష‌ణీయంగా మారుతుంది.

  


      Feature Photo Model:  MG Kishore

lips

అంద‌మైన లిప్స్ కోసం

మ‌గువ మోముపై క‌ళ్ల త‌రువాత‌.. పెదాలే. అధ‌రాల‌ అందాన్నివ‌ర్ణించ‌డానికి క‌వులుకు కూడా ప‌దాలు దొర‌క‌లేవ‌ట‌. అంత అంద‌మైన పెదాల‌ను కాపాడ‌టానికి మ‌నం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి ఫ్రెండ్స్‌. అందుకే కొన్ని చిట్కాలు తీసుకొచ్చాం. పాటించి క‌వులను మ‌రింత క‌న్‌ఫ్యూజ్ చేయ‌డండి.

  • కొబ్బ‌రి నూనె, బాదం నూనె స‌మ పాళ్ళ‌లో తీసుకుని పొడి బారిన పెద‌వుల‌పై రాస్తే తేమ‌గా త‌యారౌతాయి.

  • రెండు కుంకుమ పువ్వు రెక్క‌ల్ని పెరుగులో క‌ల‌పాలి. ఈ పెరుగును రోజుకు రెండు మూడు సార్లు పెద‌వుల‌కి రాసుకుంటే మంచి రంగులోకి మారుతాయి.

  • వారానికి ఒక‌సారి టూత్ బ్ర‌ష్‌తో పెద‌వుల‌పై రుద్దితే అక్క‌డి మృత చ‌ర్మం తొల‌గిపోతుంది.

naziruddin

మూర్ఖుడితో న‌జీరుద్దిన్‌ (క‌థ‌)

అది అమావాస్య రాత్రి. అంతా క‌టిక చీక‌టి. న‌జీరుద్దిన్ గ‌బ‌గ‌బా న‌డుస్తున్నాడు. తొంద‌ర‌గా ఇంటికి చేరుకోవాల‌ని పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడు. ఇంత‌లోనే దుప్ప‌టి ధ‌రించి వంగి న‌డుస్తున్న ఒక వ్య‌క్తి హ‌ఠాత్తుగా అత‌డికి ఎదుర‌య్యాడు.
ఎదురుగా రావ‌డంతో న‌జీరుద్దిన్ ను ప‌ల‌క‌రించాడు. మాటా మాటా క‌లిపాడు. మాట‌ల మ‌ధ్య‌లో.. అయ్యా, మ‌న సుల్తాన్‌గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అన‌డిగాడు ఆ వ్య‌క్తి.
ఆ ప్ర‌శ్న విన్న న‌జీరుద్దిన్‌… భూమ్మీద ఎవ‌రైనా మూర్ఖుడున్నాడంటే అది అత‌నే అన్నాడు.
అది విన్నవ్య‌క్తి ముసుగు తీసేసి.. నావైపు చూసి కూడా ఆ మాట చెప్ప‌గ‌ల‌వా…. నేను నీ సుల్తాన్‌ను. నెల‌కోసారి మారువేషం వేసుకుని బ‌య‌ట తిరుగుతూ ప్ర‌జ‌లు నా గురించి ఏం అనుకుంటున్నారో ఆడుగుతాను అన్నాడు.
అది విన్న న‌జీరుద్దిన్ కాస్త ఖంగారు ప‌డి.. అ…ఆ…అయ్యా… న‌..న‌..న‌న్ను క్ష‌మించండి. నేను మీ గురించి ప‌లికిన మాట‌లు ప‌ట్టించుకోకండి.
నెల‌కోసారి నేనేమ‌నుకున్నానో దానికి సరిగ్గా వ్య‌తిరేకంగా చెబుతూ తిరుగుతుంటాను అన్నాడు.
అత‌డి తెలివికి సుల్తాన్ గ‌ట్టిగా న‌వ్వేసి వ‌దిలేసి వెళ్లిపోయాడు.

vidur-niti

విదుర నీతుల్లో టాప్ -10

సంజ‌య రాయ‌భారం పూర్త‌య్యాక ధృత‌రాష్ట్రునికి భ‌విష్య‌త్ గురించి దిగులు పట్టుకుంది. ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌ల‌తో నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. అందుకే ద్వార‌పాల‌కుని ద్వారా స‌ర్వ‌ధ‌ర్మ మ‌ర్మ‌జుడు విదురుని రప్పించుకున్నాడు. త‌న దిగులుని త‌గ్గించే మాట‌లు చెప్ప‌మ‌న్నాడు. అప్పుడు విదురుడు చెప్పిన వ మాట‌లే విదుర నీతులు. ఈ నీతులు మ‌న జీవితంలో కూడా మార్పులు తీసుకువస్తాయి. విదుర నీతులు పాటిస్తే జీవితం మ‌ధురం అవుతుంది.

1. బ‌ల‌వంతుల‌తో విరోధం మంచిది కాదు. ( మ‌న శ‌త్రువు బ‌ల‌వంతుడైతే మ‌న‌కు నిద్ర ప‌ట్ట‌దు. అత‌నెప్పుడు దాచి చేస్తాడో అనే భ‌యం నిద్ర‌పోనీదు)
2.శ‌త్రుదేశ రాజు చ‌ర్య‌ల‌ను క‌నిపెట్ట‌ని రాజు శ‌త్రువుల చేతిలో మ‌ర‌ణిస్తాడు.
3.మ‌న‌ల్ని న‌మ్ముకున్న వారికి త‌ప్ప‌నిస‌రిగా ఆహారం, వ‌స్త్రాలు మ‌న‌మే స‌మ‌కూర్చాలి.
4.స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా ఇత‌రుల ఇంటికి వెళ్ల‌డం మంచిది కాదు.
5.ఎదుటి వారిని గౌర‌వించ‌డం ఉత్త‌మ ల‌క్షణం.
6. అక్ర‌మ లైంగిక సంబంధాలు ఆయువు త‌గ్గిస్తాయి.
7. పేద‌వారైన స్నేహితుల‌కు సాయం చేయాలి.
8.అంద‌రూ నిద్ర‌పోయే స‌మ‌యంలో మెలుకువ‌గా ఉండ‌రాదు.
9.అవ‌స‌రం లేని వారికి ఉప‌దేశించ‌కు ( అడ‌గ‌నిదే స‌ల‌హాలివ్వరాద‌ని పెద్ద‌లు చెప్పేది ఇందుకే )
10. ప్ర‌శ్నించ‌కుండా జ‌వాబు చెప్ప‌డం మూర్ఖ‌త్వం.

premam

ప్రేమ‌మ్ తెలుగు లిరిక్స్‌

తెల‌వారితె క‌నురెప్ప‌ల‌ తొలి మెల‌కువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చ‌ప్పుడు నువ్వే
పొల‌మారితె నీ మ‌న‌సుకి అది నా పొర‌పాటే
నీ పేరే ప‌ల‌క‌డ‌మే పెద‌వుల‌క‌ల‌వాటే
వెన్నెల‌లా ఉంటుందే నీ ప‌క్క‌న చోటే
వేకువ‌లా చూస్తుందే నీ నువ్ న‌డిచిన బాటే
ప్రాణాలే తీస్తోందే నీ ఊహ‌ల తోటే
నా మ‌న‌సే నీద‌య్యే.. విన‌దే నా మాటే

ఎవ‌రే … ఎవ‌రే ప్రేమ‌ను మాయంది
ఎవ‌రే.. ఈ హాయికి హృద‌య‌ము చాలంది

ఎవ‌రే నిన్నే నా వైపు న‌డిపే
నా ఊహ‌ల మ‌ధురోహ‌ల హ‌రివిల్లు నింపే
తియ‌తీయ‌ని నిమిషాలే నీలోనా ఒంపే
నా ఒంట‌రి కాలాన్నే నీతోనే చెరిపె
ఆ దైవ‌మే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరున‌వ్వే విలువైన వ‌ర‌మంటూ
నా ప్రాణ‌మె నీకు చెపుతుంది ఇప్పుడు
నువ్ లేక నే లేన‌నీ…..

గ‌ది లాంటి మ‌దిలో న‌ది లాంటి నిన్నే
దాచేయాల‌నుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువ్ దూరం అయినా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవ‌రే
ఎవ‌రే..
వెన్నెలలా ఉంటుంది నీ ప‌క్క‌న చోటే
వేకువ‌లా చూస్తుందే నువ్ న‌డిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహ‌ల తోటే
నామ‌నసే నీద‌య్యే విన‌దే నా మాటే

ఎవ‌రే.. ఎవ‌రే ప్రేమ‌ను మాయంది
ఎవ‌రే.. ఈ హాయికి హృద‌య‌ము చాలంది


Song Name- Evare
Movie Name: Premam
Banner: Sithara Entertainments
Producer: Naga Vamsi Suryadevara
Director: Chandu Mondeti
Starring: Naga Chaitanya, Sruthi hassan
Music: Rajesh Murugesan
Singer: Vijay Yesudas
Lyrics: Shree Mani

telugu jokes

తెలుగు జోక్స్‌

ఆకారం
చెస్టర్టన్ అనే ఆంగ్ల రచయిత ఒకరోజు బెర్నార్డ్ షాని కలుసుకున్నారు. చెస్టర్టన్ లావుపాటి మనిషి. బెర్నార్డ్ షా అందుకు విరుద్ధం. బెర్నార్డ్ షా ఆకారాన్ని గురించి ఓ ఆట పట్టించాలని అనిపించింది చెస్ట‌ర్‌స్ట‌న్ కి.
మిమ్మల్ని చూస్తే చాలు.. మనదేశం అంతా కరువుకాటకాలతో నిండిపోయింది అనుకుంటారని అన్నాడు బెర్నార్డ్ షాతో్. షా నవ్వేసి నిజమే.. అయితే మీ ఆకారం చూస్తే ఆ కరువుకాటకాలు ఎందుకు ఏర్పాడ్డాయో వెంటనే తెలిసిపోతుంది వారికి అన్నాడు సీరియ‌స్ గా.

పొరపాటు
హైజాకర్ పైలట్ వెనకే నిలబడి అతని మెడ మీద పిస్టల్ ఉంచాడు.
వెంటనే విమానం పారిస్ తీసుకెళ్లు అన్నాడు.
అది విన్న పైలట్.. ఏడ్చినట్టుంది. మన విమానం అసలు వెళ్లేది పారిస్కేగా అన్నాడు.
అది విన్న హైజాకర్ చచ్చాన్రా నాయనా. పొరపాటున ఇంకో ఫ్లైట్ ఎక్కినట్టున్నా అన్నాడు.