Saturday, 21 January, 2017
funny jokes in telugu

బ్యాంక్ ఉద్యోగి రాము కౌంటర్లో  ఉన్నంట్టుండి స్పృహకోల్పోయాడు

మేనేెజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు…
క్యూలో ముందర ఒక 20 ఏళ్ళ అమ్మాయి నిలబడి ఉంది.

అక్కడే ఉన్న అటెండర్ తో…

మేనేెజర్ : ఎలా పడిపోయాడు..!!

అటెండర్ : ఆ అమ్మాయి డబ్బులు డ్రా చేసింది..!!

మేనేెజర్ : ఎక్కువ అమౌంట్ డ్రా చేసిందా..??

అటెండర్ : లేదు సార్..!!!

మేనేెజర్ : రాముని, ఏమైనా తిట్టిందా!!.. 

అటెండర్ : లేదు సార్..!!

మేనేజర్ : మరెలా…!!

అటెండర్ : 16000/- డ్రా చేస్తే, రాము సార్ కొత్త 2000/- నోట్లు ఇచ్చాడు..

మేనేెజర్ : అయితే..!!

   అటెండర్ : ఆ అమ్మాయి 2000/- నోట్లు తీసుకొని, ” ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉంటే చూపిస్తారా ” అని రాముని అడిగింది..!!

                                                                                    మేనేజర్ కూడ సృహతప్పి పడీపోయాడూ… 🤕🤕

51420782685_295x200

మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే మీరు ఆరోగ్య‌వంతులే

ఏంటి ముగ్గులు బాగా వేస్తే ఆరోగ్య‌వంతులు ఎలా అనుకుంటున్నారా…? అయితే ఇది చ‌ద‌వండి. చాలా మంది మ‌హిళ‌లు ల‌క్ష్మీదేవి క‌టాక్షం కోసం ఉద‌యాన్నే ఇంటిముందు శుభ్రం చేసి చ‌క్క‌గా ముగ్గులు పెడ‌తారు. ఇవి ఇంటిక అందాన్నే కాదు, అవి పెట్టిన వారికి ఆరోగ్యాన్నీ క‌లిగిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వంగి ముగ్గులు పెట్ట‌డం వ‌ల‌న న‌డుము, ఉద‌ర‌భాగంలో పేరుకు పోయినా కొవ్వు త్వ‌రగా క‌ర‌గ‌డ‌మే కాకుండా న‌డుము, చేతుల నొప్పులు వంటివి త‌గ్గుతాయ‌ని అంటున్నారు. అలాగే చేతుల‌కు కూడా మంచి వ్యాయామం అవుతుంది. ఉద‌యాన్నే స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చ‌డం వ‌ల‌న మ‌న‌స్సుతో పాటు శ‌రీరం ప్ర‌శాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంద‌ని అంటున్నారు. ముగ్గు వేసే స‌మ‌యంలో తెలియ‌కుండానే ఊపిరి ప్ర‌క్రియ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

shibhi-chakravarthy-oath

శిబీ కథ ఏమిటి?

పూర్వం శంబరాసురునితో యుద్ధం చేసిన సమయంలో దశరథ చక్రవర్తి తనకు ఎప్పడైనా ఇస్తానన్న రెండు వరాల్ని ఎప్పుడిస్తాడో, ఇవ్వడో నన్న సందేహం కైకేయికి వస్తుంది. ఆమె కోరుకున్న రెండు వరాలు కూడా సామాన్యమైనవి కావు. రామునికి బదులు భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయడం. ఒకటి. శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యడం రెండో కోరిక. తనకిచ్చిన మాటపై దశరథుడు నిలబడేటట్లు చెయ్యడానికి. కైకేయి ఇక్ష్వాకు వంశస్థుడైన శిబి చక్రవర్తి సత్య సంధతను గూర్చి తన భర్తకు ఉత్తేజకరంగా చెపుతుంది. మాట తప్పనితనాన్ని పరీక్షించడానికి ఒకసారి ఇంద్రుడు డేగగాను. అగ్ని పావురంగాను వస్తారు. పావురాన్ని డేగ తరుముతూంటే. పావురం ప్రాణభీతితో వచ్చి శిబి ఒడిలో వాలుతుంది. ఆయన దాన్ని కాపాడతానని అభయమిస్తాడు. అపుడు డేగ వచ్చి శిబి చక్రవర్తితో ఈ పావురం నేను న్యాయంగా సంపాదించుకున్న ఆహారం. వెంటనే దాన్ని నాకిచ్చెయ్! అంటుంది. అపుడు శిబి అంటాడు ఈ పావురానికి నేనే అభయమిచ్చాను. కావున దానిని నీకు ఆహారంగా ఇవ్వలేను. నా మాంసం కోసి నీకు ఆహారంగా ఇస్తాను అంటూ తన మాంసాన్ని కోసి డేగకు అందిస్తాడు. ఇంద్రుడు, అగ్ని ప్రత్యక్షమై శిబి సత్య సంధతకు జోహారులర్పిస్తారు. కైకేయి ఈ కథ చెప్పి, దశరధుడు తాను పూర్వం చేసిన వాగ్దానాన్ని పాటించవలసినదిగా హెచ్చరించింది. పనిలో పనిగా, తాను ఇచ్చినమాటకు కట్టుబడి, తన కన్నులను అంధ బ్రాహ్మణునికి ఇచ్చి, ఉత్తమ లోకాలను పొందిన అలర్క మహారాజు కథ కూడా భర్తకు చెప్పింది. రామాయణంలో ఇటువంటి సత్కథలెన్నో ఉన్నాయి.

mens beauti tips

మగాళ్లం.. అంద‌గాళ్లం..  టిప్స్‌

 ఈ మధ్య కాలంలో మగవాళ్లు కూడా ఎన్నో సౌందర్య సాధనాలు వాడుతున్నారు. వీళ్ల కోసం ప్రత్యేకంగా పెద్ద కాస్మోటిక్ మార్కెటే వచ్చేసింది. ఎన్ని కాస్మోటిక్స్ వాడినా కొన్ని చిట్కాలు పాటించకపోతే మ‌గాళ్ల‌ సొగసు నిలుపుకోవడం కష్టమే. ఆచరించాల్సిన ఆ చిట్కాల్లో కొన్ని మీకోసం.


  1. వారానికి రెండు సార్లు స్ర్కబ్బర్ తో  ముఖాన్నిశుభ్రం చేస్తే మృతకణాలు, బ్లాక్ వైట్ హెడ్స్ పోతాయి.

  2.   బయటకు వెళ్తున్నప్పుడు సన్ ప్రొటెక్షన్ లోషన్ లేదా సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవాలి.

  3.  స్కిన్ టోన్ కోసం షౌండేషన్ లేదా పౌడర్ వాడొచ్చు.

  4.  ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్ల వల్ల త్వరగా చర్మం ముడతలు పడి వృద్ధ్యాప్య ఛాయలు వచ్చేస్తాయి. వీటిని మానేస్తే నునుపైన చర్మం మీ సొంతమవుతుంది.

  5.  అన్నిటికంటే ఉత్తమమైంది వ్యాయామం చేయడం. దానివల్ల శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి. హ్యాండ్సమ్ గా తయారవుతారు.

tips for pregnant women in telugu

గర్భిణి స్త్రీల కోసం చిట్కాలు

1. బ‌రువైన వ‌స్తువులు మోయ‌రాదు. ఎక్కువ‌ విశ్రాంతి తీసుకోవాలి.

2. పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి పౌష్టికాహారం తీసుకోవాలి.  అందులో పాలు, పండ్లు, మాంసం, గుడ్లు ఉండేలా చూసుకోవాలి.

3.  రెగ్యుల‌ర్‌గా  వైద్యులను సంప్రదిస్తూ  వాళ్లు సూచించిన‌ మందులను క్రమం తప్పకుండా వాడాలి.

4.  నెలలు నిండిన స్త్రీలు ఎక్కువ‌గా ప్ర‌యాణించ‌రాదు. త‌ప్ప‌దు అనుకుంటే  కుదుపులు లేకుండా చూసుకోవాలి.

5.  గర్భణీ స్త్రీలు వత్తిడి, భయానికి లోను కాకూడదు. అది  కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతుంది.

6. నెలలు నిండిన స్త్రీలు హైవీల్స్ చెప్పులు వాడకపోవడం మంచిది. ఇలా వాడటం వల్ల అదుపు తప్పి పడిపోయానపుడు కడుపులోని బిడ్డకు ప్రమాదం.

7. సుఖ ప్రసవం కోసం తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి.

8. నెలలు నిండాక శృంగారానికి దూరంగా ఉండటం మంచిది.

9. నిద్రపోయేటపుడు ఎడమవైపు తిరిగ పడుకోవడం శ్రేయస్కరం.

10. అలాగే ప్రసవం అయిన తర్వాత పుట్టిన బిడ్డకు తల్లి చనుబాలు ఇవ్వడమే ఉత్తమం. తల్లి చనుబాలు వల్ల బిడ్డలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

indian-women-drinking-alchohol-6

ఈ తాగుబ్యూటీల ముందు తాగుబోతులు ప‌నికిరారు

మ‌గవారు తాగితే..తాగుబోతు అంటారు. మ‌రి ఆడ‌వారు తాగితే… తాగుబ్యూటీ అనొచ్చు. అలాంటి కొంత మంది తాగుబ్యూటీలు ఫోటోలు మీ కోసం

indian-women-drinking-alchohol-11

indian-women-drinking-alchohol-10

indian-women-drinking-alchohol-9

indian-women-drinking-alchohol-8

indian-women-drinking-alchohol-7

indian-women-drinking-alchohol-6

indian-women-drinking-alchohol-1

indian-women-drinking-alchohol-2

indian-women-drinking-alchohol-3

indian-women-drinking-alchohol-4

chicken-soup-in-cool-winter

చికెన్ బ్రౌన్‌రైస్ సూప్‌

 

 

ఈ చ‌లికాలాన్ని సూప‌ర్‌గా ఎంజాయ్ చేయాలంటే సూప్‌ల‌ను మించిన సోర్స్ లేదు. అందుకే మీకు ఒక కొత్త ర‌కం సూప్‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. రెడీ చేసుకుని  హాట్ హాట్‌గా ఎంజాయ్ చేయండి.

 

ఇవి కావాలి

ఉప్పు క‌ల‌ప‌ని చికెన్ స్టాక్                –   ఎనిమిది క‌ప్పులు

ఉల్లిపాయ                                     –   ఒక‌టి

క్యారెట్లు                                        –  మూడు

కొత్తిమీర                                      –   రెండు క‌ట్ట‌లు

నీళ్లు                                           -రెండు క‌ప్పులు

బ్రౌన్ రైస్                                     –  రెండు క‌ప్పులు

చికెన్ ముక్క‌లు                             – పావు క‌ప్పు

బిర్యానీ ఆకు                                –  ఒక‌టి

పాల కూర                                      – క‌ట్ట‌

మిరియాల పొడి                            – రుచికి త‌గినంత‌

 ఇల చేయాలి

చికెన్ బ్రౌన్ రైస్ సూప్  చేయాలంటే ముందుగా  మందంగా అడుగు ఉన్న గిన్నెల్లో అర‌క‌ప్పు చికెన్ స్టాక్‌ను మ‌రిగించాలి.  త‌ర్వాత ఉల్లిపాయ‌లు, కొత్తిమీర‌, క్యారెట్ ముక్క‌లు వేసి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ క‌నీసం ఎనిమ‌ది నిమిషాలు మ‌రిగించండి. దీంట్లో  మిగిలిన చికెన్ స్టాక్‌,  నీళ్లు, బియ్యం, చికెన్ ముక్క‌లు, బిర్యానీ ఆకు ఒక‌దాని  త‌రువాత ఒకటి వేసేయాలి.  కొంచెం సెగ త‌గ్గించి సుమారు అర‌గంట వ‌ర‌కు మ‌రిగించాలి. అన్నం, చికెన్ ముక్క‌లు ఉడికాక బిర్యానీ ఆకు తీసేసి  పాలకూర త‌రుగు వేయాలి. ఐదు నిమిషాల‌య్యాక రుచికి త‌గిన‌ట్టు ఉప్పు, మిరియాల  పొడి క‌లిపి స‌ర్వ్ చేస్తే  చాలు.

ఆత్యాశ ఫలం

ఒక ఊళ్లో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళుతుండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు వెళిపోతూండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం అన్నింటిని ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో  ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకు మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది.

 ఒక రోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి ఆవు మెడలో గంట ఎంతో బావుంది. నాకు అమ్ముతావా, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని ఆడిగాడు.వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు. ఉత్తి గంటకి ఏంతో డబ్బులిస్తున్నాడు అని మనుసులో నవ్వుకుని సరేనన్నాడు గోవిందుడు.ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసికెళ్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధ పడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేక పోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు.

నీతి: అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.

indian-corn-dosa

జొన్న.. రుచిలో మిన్న

జొన్న జోరుమీదుంట‌ది. జొన్నతిన్నవాడి జోరు న‌డుస్త‌ది. ఇది తింటే షుగ‌రు, అది తింటే అల్స‌ర్ అని క‌న్‌ఫ్యూజ్ అయ్యేవాళ్లు జొన్న వంట‌లు తిని ఆరోగ్య‌వంతులౌతారు. జొన్న పిండితో రొట్టెలే కాదు.. ఇంకా ఎన్నోచేసుకోవ‌చ్చు. అందులో కొన్నింటిని మీకు ప‌రిచ‌యం చేస్తున్నాం.

 

జొన్న దోశ

ఇవి కావాలి

జొన్నపిండి – రెండుకప్పులు, బియ్యం పిండి – అరకప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ముప్పావుకప్పు, పచ్చిమిర్చిముక్కలు – కొన్ని, జీలకర్ర- అరచెంచా, కొత్తిమీర తరుగు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె -అరకప్పు

ఇలా చేయాలి

ఓగిన్నెలో జొన్నపిండీ, బియ్యప్పిండీ, తగినంత ఉప్పూతీసుకుని నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్క‌లు , పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. తరవాత పెనంవేడి చేసి అరచెంచా నూనెరాసి ఈ పిండిని దోశలా వేసుకోవాలి. మళ్లీ కొద్దిగా నూనె వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని కొబ్బరి లేదా అల్లంచట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

జంతికలు

ఇవి కావాలి

జొన్నపిండి – కప్పు, బియ్యం పిండి – పావుకప్పు, నువ్వులు – రెండుచెంచాలు, కారం – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా

ఇలా చేయాలి

ఓగిన్నెలో జొన్నపిండీ, బియ్యప్పిండీ, నువ్వులూ, కారం, సరిపడా ఉప్పూ వేసుకుని బాగాకలపాలి. అందులో అరకప్పు కాచిన నూనె వేసుకుని బాగా కలిపి తరువాత సరిపడా నీళ్లుపోసి జంతికల పిండిలా చేసుకోవాలి. ఇపుడు బాణలిలో నూనె వేడిచేసి ఈపిండిని జంతికల గొట్టంలో తీసుకుని జంతికల్లా వేసుకోవాలి. వేగాక తీసుకుంటే సరిపోతుంది.

లడ్డూలు

ఇవి కావాలి

జొన్నపిండి- కప్పు, చక్కెరపొడి – కప్పు, ఎండుకొబ్బరిపొడి – అరకప్పు, యాలకులపొడి – అరకప్పు, నెయ్యి – రెండు మూడు చెంచాలు, కిస్మిస్, జీడిపప్పుపడుకులు – కొన్ని, గోరువెచ్చని పాలు – అరకప్పు.

ఇలా చేయాలి

బాణలిలో చెంచా నెయ్యి కరిగించి కిస్మిస్, జీడిపప్పు పలుకుల్నివేయించుకుని తీసిపెట్టుకోవాలి. మిగిలిన నెయ్యనీ కరిగించి అందులో జొన్నపిండిని వేయించుకుని ఓగిన్నెలోకి తీసుకోవాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్నకిస్మిస్, జీడిపప్పు పలుకులూ, చక్కెరపొడీ, యాలకులపొడీ, కొబ్బరి పొడివేసుకుని బాగా కలుపుకోవాలి. తరవాత పాలు చల్లుకుంటూ లడ్డూల్లాచేసుకోవాలి. ఇవి చూడడానికి రవ్వలడ్లలా ఉంటాయి. కొన్నిరోజులపాటు నిల్వఉంటాయి.

క‌ట్లెట్‌

ఇవి కావాలి

జొన్నపిండి – కప్పు, క్యాబేజీ తరుగు – కప్పు, వెన్నలేని పెరుగు – ముప్పావుకప్పు, కొత్తిమీర – కట్ట (సన్నగాతరగాలి), అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం – చెంచా, క్యారెట్ త‌రుము -పావుకప్పు, వెల్లుల్లి ముక్కలు – చెంచా, పసుపు – అరచెంచా, వంటసోడా – చిటికెడు, చక్కెర – కొద్దిగా, ఉప్పు – తగినంత, జీలకర్ర – చెంచా, నూనె – అరకప్పు, కరివేపాకురబ్బలు – నాలుగైదు.

ఇలా చేయాలి

ముందుగా బాణలిలో చెంచా నూనె వేడి చేసి క్యాబేజీని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మెత్తగా ఉడికించాల్సిన అవసరంలేదు. అదయ్యాక జొన్నపిండిని కూడా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఓగిన్నెలో వేయించుకున్నక్యాబేడీ, జెన్నపిండీ, పెరుగూ, కొత్తిమీర తరుగు, అల్లం, పచ్చిమిర్చిమిశ్రమం, వెల్లుల్లి ముక్కలూ, క్యారెట్ తురుము పసుపూ, వంటసోడా, తగినంత ఉప్పూ, చక్కెర, జీలకర్ర, కరివేపాకు తీసుకుని గట్టిపిండిలా కలుపుకోవాలి. ఈమిశ్రమాన్నికట్లెట్ల మాదిరి చేసుకుని పది, పదిహేను నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా నూనెరాసి, ముందుగా ఉడికించుకుని పెట్టుకున్నకట్లెట్ల నుంచి రెండు వైపులా కాల్చి తీసుకోవాలి. కావాలనుకుంటే జీలకర్ర, కరివేపాకును తయారీలో కలపకుండా విడిగా వేయించి కట్లెట్లను ఉంచి రెండు వైపులాకాల్చి తీసుకోవాలి. కావాలనుకుంటే జీలకర్ర, కరివేపాకును తయారీలో కలపకుండా విడిగా వేయించి కట్లెట్లపై వేసుకోవచ్చు. వీటిని టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తినొచ్చు.

healthy-benefits-of-plums

ఆల్ బుకారా.. అర‌డ‌జ‌ను లాభాలు

అవునండీ బాబు.. ఆల్ బుకారా పండ్లు తింటే ఎంతో మంచిద‌ట‌. ఈ పండ్ల‌లో ఉంటే విటమిన్ ‘ఇ’, బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయిట‌. అలాగే దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. అలాంటి వారు ఆల్ బుకారా పండ్లను తీసుకోవడం ద్వారా పెదవుల అందాన్ని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు ఆల్ బుకారా తొక్కతో పెదవులను కొన్ని రోజులు మ‌ర్ధ‌న చేసుకుంటే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి.

మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే అఆల్ బుకారాను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.