Saturday, 21 January, 2017
child-manners-eating-food

మీరు ఇలా తిన్నారో…ఇంకా అంతే సంగ‌తులు

చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి డైటింగ్ చేస్తూ ఉంటారు. అయితే కొంత‌కాలం ఆహారం నియ‌మాలు పాటిస్తూ కడుపు మాడ్చుతూ.. మళ్లీ మామూలుగా తింటూ ఉంటారు. ఇలా చేస్తే బరువు పెరగడానికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కడుపు మాడ్చిన సమయాన్ని మన మెదడు కరవుగా భావించి భవిష్యత్తు కొరతను ఎదుర్కొనేందకు మరింత కొవ్వు నిల్వ చేసుకొనేలా శరీరాన్ని కోరుతుందని బ్రిస్టల్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు  చెబుతున్నారు. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకొనే వారు తరచూ డైటింగ్‌లో లేనప్పుడు… ఎక్కువ ఆహారం తీసుకోవడం, బరువును అదుపులో పెట్టలేకపోతున్నట్లు గుర్తించిన‌ట్లు చెప్పారు.. అదే డైటింగ్‌ చేయని వారిలో ఎక్కువ కొవ్వు నిల్వ చేయాల్సిన అవసరం ఉండటం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఎప్పుడూ కడుపు మాడ్చని వారితో పోలిస్తే.. ఆహార పరిమితి పాటించే వారిలోనే సగటున బరువు పెరగడం అధికంగా ఉందని చెప్పారు. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడానికి బదులు.. మీరు తినేదానికన్నా కొద్దిగా తక్కువగా తింటూ.. శారీరక వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన బరువును సాధించవచ్చని తమ అధ్యయనంలో గుర్తించినట్లు సైంటిస్టులు పేర్కొన్నారు.

sahasam swasaga saagipo lyrics

తాను నేను సాంగ్ లిరిక్స్

తాను నేను మోయిలూ మిన్ను
తాను నేను కలువ కోలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను

శశి తానైతే నిశినే నేను
కుసుమమ్ తావి తాను నేను
వెలుగు దివ్వే
తెలుగు తీపీ
తాను నేను మనసు మాను

దారి నేను తీరం తాను
దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను
కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమీ మన్ను
నేను తాను రెప్ప కన్ను
వేరైపోని పుడమీ…. మన్ను..

తాను నేను మొయ్లో మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను గానం గమకం
తాను నేను ప్రాయం తమకం

తాను నేను మోయిలూ మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేనూ
తాను నేను వేరు మాను

శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వే
తెలుగు తీపి
తాను నేను మనసు మీను
మనసు మేను


Audio Available on:
Saavn- http://bit.ly/1UBHPOt
Erosnow- http://bit.ly/2634Ocm
Gaana- http://bit.ly/1rueOsb
Wynk- http://bit.ly/268WXqg

Song: Taanu Nenu
Movie Name: Saahasam Swaasaga Saagipo
Music: A.R.Rahman
Singer: Vijay Prakash
Lyrics: Ananth Sriram
Director: Gautham Vasudev Menon
Producer: M.Ravindher Reddy
Banner: Dwaraka Creations

tips-for-growing-beard-2

గడ్డం పెంచే కళ

గ‌డ్డం..100 % మేల్. గ‌డ్డంలో మ‌గ‌త‌నం క‌నిపిస్తుంది. మ‌గాడు క‌నిపిస్తాడు. రౌద్రం, పౌరుషం, ఆలోచ‌న‌, ఆవేశం, ఆనందం… ఇలా గ‌డ్డంలో ఎన్ని వెంట్రుక‌లు ఉంటాయో..అన్నిఇమోష‌న్స్ ఉంటాయి. గ‌డ్డం ఉన్న‌మగాడు ఆగడు.అతనికి తెలిసింది ఒక్కటే.. దూకుడు. నకిలీకి దూరంగా.. గెడ్డంలో అసలైన దమ్మును పెంచుతాడు. మగతనాన్ని, మగాడి తత్త్వాన్ని ప్రతిబింబించే గెడ్డాన్ని పెంచడం కూడా కళే. గ‌డ్డం పెంచాలనుకుంటే…మీ కోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. చదివి ఇక గ‌డ్డం పెంచేయండి. ఈ క‌శ‌లో ఆరి తేరండి.


tips-for-growing-beard-5

1. శరీరాన్ని ప‌ట్టించుకొండి
గ‌డ్డం శ‌రీరం ప్రాప‌ర్టీ. అందుకే ముందు శ‌రీరాన్ని ప‌ట్టించుకొండి. మంచి పోష‌కాలున్న ఆహారాన్ని తీసుకొండి. బీన్స్‌, గుడ్లు, చేప‌లు, పాలు వీటిని మీ డైట్‌లో భాగం చేసుకొండి. పాలు చిన్న‌పిల్ల‌లు తాగుతారు అని చాలా మంది అనుకుంటారు. పాలు తాగ‌కుంటే గ‌డ్డం స‌రిగ్గా పెర‌గ‌దు. గ‌డ్డం లేని మొహం చిన్న పిల్లాడి ముఖంలా ఉంటుంది. సో న‌ల్ల‌ని గడ్డానికి తెల్ల‌ని పాలు తాగండి.

 

 

tips-for-growing-beard-6

2. టెన్షన్‌కు పెన్ష‌న్ ఇచ్చేయండి
టెన్ష‌న్‌తో బ‌ట్ట‌త‌లు వ‌స్తుంది. గ‌డ్డం రాదు. అందుకే సో స్ట్రెస్ ను దూరం చేసుకొండి. మంచి నిద్ర‌, వ్యాయామం అవ‌స‌రం. వ్యాయామంతో శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ పెరిగి ముఖంపై వెంట్రుక‌లు పెరుగుతాయి. వారానికి ఒక సారి స్క్ర‌బ్ తో ర‌బ్ చేసి ఫేస్‌పై ఉన్న మృత క‌ణాలు తొల‌గించండి. ఫేస్‌ను క్లీన్‌గా ఉంచండి. ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్లతో ఆరోగ్య‌క‌ర‌మైన గ‌డ్డం మీ సొంతం అవుతుంది.

 

3. మంచి తిండి. మంచి గ‌డ్డం      

tips-for-growing-beard-7    గ‌డ్డం పెంచే ఆహార ప‌దార్ధాలు
ప్రోటీన్స్‌
పాల్ట్రీ ( చికెన్‌, ట‌ర్కీ…)
గుడ్లు
చేప‌లు
బీన్స్‌
పాలు
వెన్న‌

న‌ట్స్, గింజ‌లు

బాదాం
వాల్న‌ట్‌
ప‌ల్లీలు
కాజూ
పిస్తా
స‌న్‌ఫ్ల‌వ‌ర్ విత్త‌నాలు
అవిసె గింజ‌లు

ఫ్రూట్స్‌
యాపిల్
ఆరెంజ్
బ్లూ బెర్రిలు
స్ట్రాబెర్రి
ద్రాక్ష
బొప్పాయి
నిమ్మ
దానిమ్మ
కివీస్
ఆవ‌కాడో
పైనాపిల్‌

కూర‌గాయ‌లు
క్యాబేజ్‌
బ్ర‌కోలీ
లెట్టూస్‌
కేల్
బ్ర‌స్సెల్ స్ర్పౌట్‌
పాల‌కూర‌

 

tips-for-growing-beard-7

4. దుర‌ద మంచిదే
కొత్త‌గా గ‌డ్డం పెంచ‌డం మొద‌లు పెట్టిన వారికి తొలి నాలుగు వారాలు బాగా దురద పెడుతుంది. అఫ్‌కోర్స్‌ దుర‌ద పెడితే గోకేస్తాం. కానీ అలా చేస్తే చ‌ర్మం డ్యామేజ్ అవుతుంది. మొద‌టి నాలుగు వారాలు కొంచెం డిఫ‌రెంట్‌గా అనిపించొచ్చు. కానీ నెల త‌ర్వాత నుంచి ఇరిటేష‌న్ త‌గ్గి గ‌డ్డం సాఫ్ట్ అవుతుంది.

 

tips-for-growing-beard-1

5. గడ్డాన్ని ఒంట‌రిగా వ‌దిలేయండి
మొద‌టి నాలుగు వారాలు గ‌డ్డం హార్డ్‌గా ఉంటుంది. త‌ర్వాత మ‌రో వారం గ్యాప్ త‌ర్వాత‌ అడ‌విలా పెరిగిన గ‌డ్డాన్ని మంచి షేప్ ఇవ్వండి. అప్పుడు చూడండి.. సాఫ్ట్ హెయిర్ మొద‌ల‌వుతుంది. అయితే నాలుగు వారాలు మీరు ఓపిక ప‌ట్టాలి. ఊరికే గ‌డ్డాన్ని త‌డ‌మ‌టం..క‌ట్‌ చేస్తే బాగుంటుంది అని ఆలోచించ‌డం మీ గడ్డానికి మంచిది కాదు. దాంతో పాటు మార్కెట్‌లో గ‌డ్డం పెంచే ఆయిల్స్ అందుబాటులో వ‌చ్చాయి. చెక్ చేసి ట్రై చేయండి.

 

 

 

    AUTHOR- MG KISHORE

telugu jokes

తెలుగు జోక్స్

 

ఇద్దరు 5th క్లాస్ పిల్లలు మాట్లాడుకుంటున్నారు.

బుడుగు :  టీచర్ ని లవ్ చేయడం తప్పైపోయిందిరా బాబు.

పండు  : ఏమైందిరా ?

బుడుగు :  లవ్ లెటర్ ఇస్తే, హోం వర్క్ అనుకుని  Correction  చేసి ఇచ్చేసిందిరా….


భిక్షగాడు :  అయ్యా ఒ 8 రూపయాలు వుంటే దానం చెయ్యండయ్యా టీ తాగుతాను

అవతలి వ్యక్తి :  టీ 4 రూపాయలే కదా…?

భిక్షగాడు :  నాకు నా  గర్ల్ ఫ్రెండుకు కలిపయ్యా

అవతలి వ్యక్తి : భిక్షగాడికి గర్ల్ ఫ్రెండా?

భిక్షగాడు :  లేదయ్యా గర్ల్ ఫ్రెండ్ వఛ్చాకే భిక్షగాడి నయ్యా…

 


భార్య :  ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది.

భర్త  : ఎప్పటినుండే……

భార్య : ఎదురింటావిడ మెడలో నెక్లెస్ చూసినప్పటినుండి……!!!!!!!!!!!!!!!!!!!!!

భార్య :  ఏమండీ… మనకి పెళ్ళి చేసిన అయ్యగారు బస్సు గుద్ది చనిపోయారట తెలుసా….

భర్త :  మరే….. చేసిన పాపం ఊరికే పోతుందా…?

wonderla hyderabad

హైద‌రాబాద్‌ వింట‌ర్‌లో విహారానికి ఎక్కడికి వెళ్తున్నారు ?

హైదరాబాద్ లో పిల్లల కోసం ఎన్నో విహార స్థలాలున్నాయి. ఈసారి మీ అమ్మానాన్నలతో కలిసి అక్కడికి వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి. ఎక్కడికి వెళ్లాలో అనేగా ఆలోచిస్తున్నారు. మీ కోసం కొన్ని స్థలాలను ఎంపిక చేశాం. వాటి గురించి తెలుసుకుని.. మీకు నచ్చిన చోటికి వెళ్లండి. ఎంజాయ్ చేయండి.

zoo park hyderabad
zoo park hyderabad

1. జూపార్క్
380 ఎకరాలు విస్తరించిన నెహ్రూ జంతు ప్రదర్శనశాల పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్నో వివిధ జాతుల వన్యప్రాణులు.. నగరం జీవితానికి సంబంధం లేని ప్రపంచం.. మొత్తానికి ఒక అడవిలో తిరిగిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

golconda
golconda

2. గోల్కొండ
నాలుగు వందల ఎళ్లకు పైగా చరిత్ర ఉన్న గోల్కొండ అద్భుతమైన చరిత్ర ఉంది. 480 అడుగులు ఎత్తులో ఉన్న ఈ కోట నిర్మాణాన్ని కాకతీయులు ప్రారంభించగా.. కుతుబ్ షాహీలు పూర్తి చేశారు. ఈ కోట, దీని చుట్టు ఉన్న ప్రాంతాలు వజ్రాల వ్యాపారానికి ఒకప్పుడు చాలా ఫేమస్. ఈ కోటలోనే రామదాసుని బంధించారు. ఇప్పటికీ ఆ జైలును మీరు చూడొచ్చు.

salarjung museum
salarjung museum

3.సాలార్ జంగ్ మ్యూజియం
హైదరాబాదీ నవాబ్ రెండవ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ సొంత కలెక్షనే సాలార్జంగ్ మ్యూజియంలో ఉంటాయి. ఔరంగజేబు కత్తి, రాజా రవి వర్మ వేసిన పెయింటింగ్స్, జహంగీర్, నూర్జహాన్, షా జహాన్కు చెందిన డగార్లు ఇలా 43 వేల వస్తువులు, 50 వేల పుస్తకాలను మరెన్నో సాలార్ జంగ్ మ్యూజియంలో చూడొచ్చు.

charminar
charminar


4. చార్మినార్, మక్కా మజీద్
హైదరాబాద్ అంటే అందరికీ చార్మినార్ గుర్తుకు వస్తుంది. 400 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న చార్మినార్ ను కూలీ కుతుబ్ షా 1591 లో కట్టించారు. పర్షియన్ స్టైల్లో నిర్మించిన చార్మినార్ ను చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తుంటారు. ఈసారి చార్మినార్ కు వెళ్లినప్పుడు పక్కనే ఉన్న మక్కా మజీదుకు కూడా వెళ్లండి.

Ramoji Film City
                  Ramoji Film City

5. రామోజీ ఫిలింసిటి
ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న ఫిలింసిటీ ఇది. 1666 ఏకరాల్లో విస్తరించిన ఈ ఫిలింసిటీలో సినిమా షూటింగ్ కోసం జాతీయ, అంతర్జాతీయ దర్శకులు వస్తుంటారు. గుళ్లు, రైల్వేస్టేషన్లు ఇలా సినిమా షూటింగ్స్ సంబంధించిన ఎన్నో కట్టడాలు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.

wonderla hyderabad
wonder la hyderabad

6. వండర్ లా
ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేయడానికి వండర్ లా మంచి ప్లేస్. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ అమ్యూజ్ మెంట్ పార్కు్ల్లో ఎంటర్టైన్ మెంట్ కి కొదవ లేదు. వాటర్ గేమ్స్, హై థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ రైడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్లొచ్చు.

weight-loss-benefits-with-honey-and-cinnamon

ఈ డ్రింక్ తాగితే ఎక్స‌ర్ సైజ్ తో ప‌నిలేదు

 

బ‌రువు త‌గ్గాల‌ని నానా ఇబ్బందులు ప‌డుతూ ఎక్స‌ర్ సైజ్ చేస్తారు. కానీ వాటితో ఎలాంటి ప‌నిలేకుండా ఈ డ్రింక్ తాగితే ఈజీగా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు.. అదెలా అంటే ప్ర‌తి రోజు రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క‌పొడి, ఒక టీస్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనే, ఒక లీట‌ర్ నీళ్లుపోసి భాగా క‌ల‌పాలి. దీన్ని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఒక గ్లాసు.. రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాసు తాగాలి. దాల్చిన చెక్క శ‌రీరంలోని కొవ్వును త‌గ్గిస్తుంది. దీంతో రెండు.. మూడు వారాలు తాగితే ఈజీగా మీ బ‌రువును త‌గ్గించుకోవచ్చు… మీరు ఇంట్లో ఓ సారి ట్రై చేసి చూడండి.

 

quit-the-bad-habits

మందు తాగితే చెడ్డోడు మ‌జా తాగితే మంచోడు అంటారు. మీ ప‌రిస్థితి ఏంటి ?

మ‌నిషి పోటుగాడా కాదా.. అల‌వాట్లు  చెప్పేస్తాయి. అల‌వాట్ల‌ను బ‌ట్టే మ‌నిషి క్యారెక్ట‌ర్‌ను కాల్‌క్యులేట్ చేస్తారు. మందు తాగితే  చెడ్డోడు…మ‌జా తాగితే మంచోడు. ఇలా ఫిక్స్ అయిపోయారు జ‌నాలు. ఎంత గుడ్ బాయ్  అయినా… కొన్నిబ్యాడ్ ల‌క్ష‌ణాలు కామ‌మ్‌. వాటిని మానేస్తే..మ‌న‌మే తోపులం అవుతాం.  అలా మానేయాల్సిన కొన్ని అల‌వాట్ల గురించి..చ‌ద‌వండి.


 

Stop smoking nowస్మోకింగ్

అసలు సిగరెట్ అలవాటే చేసుకోకూడదు. పొరపాటున అయిందంటే వెంటనే మానెయ్యాలి. ఎందుకంటే వేలంత ఉండే సిగరెట్టులో నాలుగు వేల ప్రమాదకరమైన రసాయనాలుంటాయి. నికోటిన్, తార్, మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్, అమోనియా వంటి 43అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు మెల్లిమెల్లిగా శరీరాన్ని డొల్ల చేస్తాయి. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధూమపానం మానేసిన 20 నిమిషాల నుంచే శరీరం కోలుకోవడం ప్రారంభిస్తుంది. శ్వాసక్రియ మెరుగౌతుంది. మీకు నచ్చిన ఆహారం రుచిని మరింతగా ఎంజాయ్ చెయోచ్చు. డబ్బు పొదుపు అవుతుంది. దాంతో పాటు మీ కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపగలరు. ఇలా సిగరెట్ నిజం తెలిసి మానేసిన వాళ్లలో మహేష్ బాబు, హృతిక్ రోషన్ లాంటి చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దమ్ము కొట్టడం మానేయాలని కొంత మంది పాన్, గుట్కా అలవాటు చేసుకుంటారు. ఒక చెడ్డ అలవాటు వదిలేయడానికి మరో చెడ్డ అలవాటు చేసుకోవడం పరిష్కారం కాదు. పొగతాగడం మానేయలనుకునే వాళ్లకు ఆన్ లైన్లో చిట్కాలతో పాటు మార్కెట్ లో పుస్తకాలు, నికోటిన్ గమ్ ను అందుబాటులో ఉన్నాయి. వీటన్నించిని మించిన ఆయుధం సంకల్పమే. ఒక్కసారి మానేసిన కమిటెడ్ గా ఉంటే మళ్లీ సిగరెట్ ని ముట్టుకోరు.

 

quitting-the-bad-habits ప్రతీదానికి సలహా తీసుకోవడం..

విజేతల జీవితాల్లో ఒక విషయం కామన్ గా ఉంటుంది. అదే సొంత నిర్ణయాలు తీసుకోవడం. ఎవరి జీవితం వారి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో ఇతరుల సలహాలపై ఆధారపడటం మంచిది కాదు. ఈ హ్యాబిట్ మన జీవితాన్ని మనది కాకుండా చేస్తుంది. ఈ అలవాటు పోవాలంటే ముందు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొని పాటించడం అలవాటు చేసుకోవాలి. మొదట్లో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నా అనుభవం వల్ల నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సార్లు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం, అవగాహన ఉండక పోవచ్చు. అలాంటప్పుడు ఒక ప్రొఫెషనల్ ను సంప్రదిస్తే మంచిది. అలా కాకుండా విషయంపై అవగాహన లేని వ్యక్తులను సంప్రదిస్తే మళ్లీ మీ జీవితం మీది కాకుండా పోతుంది.

 

quitting-the-bad-habitsడబ్బు ఆదా చేసే అలవాటు లేకపోవడం

డబ్బు సంపాదించడం ట్యాలెంట్. ఆదా చేయడం కళ. ఖర్చు చేయడం అవసరం. నెలంతా కష్టపడితే వచ్చే జీతాన్ని కొంత మంది వారంలోనే ఖర్చు పెట్టేస్తారు. మళ్లీ జీతం కోసం నెలంతా వేచి చూసి చూసి.. ఇలా జీతం రాగానే అలా ఖర్చు పెట్టేస్తారు. కానీ జీతం మీద ఆధారపడి బతికే వాళ్లు 30 రోజుల గురించి ఆలోచించి ఖర్చు చేయాలి. రేపటి అవసరాల కోసం ఆదా చేయాలి. ప్రతీ నెల కొంత మొత్తాన్ని బ్యాంక్ లో వేసి అవసరం ఉన్నప్పుడే విత్ డ్రా చేయాలి. క్రెడిట్ కార్లు తీసుకునే ముందు.. అది కూడా అప్పు అని.. 45 రోజుల తరువతా అయినా మీరే కట్టాల్సి ఉంటుందని గమనించాలి. సులభవాయిదాల పద్ధతి ఉంది కదా అని అంతగా అవసరం లేని వస్తువులు కొని ఉన్న ప్రశాంతతను కోల్పోతారు. వచ్చే డబ్బుతో ఏం చేయాలో అర్థం కాకపోతే మనీ మేనేజ్ మెంట్ గురించి నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవచ్చు.

 

quitting-the-bad-habitsసాలరీ పెంచమని అడగలేక పోవడం

ఉద్యోగం చేసే చాలా మందికి ఎదురయ్యే సమస్య ఇది. పని ఎక్కువ.. జీతం తక్కువ అనిపించినప్పుడు సాలరీ పెంచమని అడిగేవాళ్లు తక్కువ. పెంచమని అడిగితే ఉన్న ఉద్యోగం ఎక్కడ పోతుందో అనే భయం కూడా కామన్. కానీ పెరగని జీతంతో ఆర్థిక అవసరాలకు భయపడుతూ ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు రావొచ్చు. మీరు పని చేసే సంస్థ మీ ట్యాలెంట్ ను గుర్తించి అడగక ముందే జీతం పెంచితే మంచిదే. కానీ అడగనిదే జీతం పెంచని సంస్థలో ఉన్నట్టైతే మొహమాటపడకండి. వెళ్లి జీతం పెంచమని అడగిచూడండి.

 

quitting-the-bad-habitsఆఫర్ మాయలో కొనడం

మార్కెట్ లో ఏదైనా ఆఫర్ వస్తే చాలు అవసరం ఉందా లేదా అని తేల్చుకోకుండానే కొనడానికి రెడీ అవుతారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్ చూసి అవసరం లేని వస్తువులతో ఇంటిని నింపేస్తారు. అలా కొన్న వాటిని సంవత్సరానికి ఒకసారైనా వాడిని సందర్భాలు కనిపించవు. అలాగే తక్కువ ధరకే వస్తుందని ఎక్కువగా కొనేస్తారు. ఏదైనా వస్తువు కొనేముందు దాని అవసరం ఉందా లేదా ఆలోచించాలి. పది రూపాయలు ఎక్కువైనా మన్నికైన వస్తువులను తీసుకోవాలి. ఇంటికి కావాల్సిన వస్తువుల జాబితా రాసుకుని అవే కొనడం ఉత్తమం.

 

quitting-the-bad-habitsఆత్మీయులతో టచ్ లో ఉండకపోవడం

స్మార్ట్ ఫోన్లు వచ్చాక తెలియని లేని వారితో పరిచయం పెరుగుతోంది. కానీ సొంత వాళ్లతో సాన్నిహిత్యం తగ్గుతోంది. డబ్బు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇవ్వలేని ఆనందాన్ని కాసేపు మాట్లాడు సొంతం చేసుకోవచ్చు. వీలైతే సెలవులు, పండుగల్లో మీ బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించడం.. లేదా మీరే వారింటికి వెళ్లి సర్ ప్రైజ్ చేయండి. ఆ సంతోషం క్యాండీ క్రష్ వెయ్యి సార్లు ఆడినా దొరకదు.

 

quitting-the-bad-habitsకూల్ డ్రింక్స్ తాగడం

తిన్నది అరగడానికి కూల్ డ్రింక్స్ తీసువడం కామన్.. కానీ మద్యపానం ఎంత ప్రమాదకరమో.. కూల్ డ్రింక్స్ తాగడం కూడా అంతే ప్రమాదకరం. ఎందుకంటే వీటిలో చక్కర శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో అనవసరమైన క్యాలరీలు చేరుతాయి. దీంతో గుండె జబ్బులతో పాటు, స్థూలకాయం, పంటి, కిడ్నీకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కాఫీ, టీలు కూడా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం.

 

quitting-the-bad-habitsనచ్చింది చేయకపోవడం

ఉద్యోగం..వ్యాపారం ఏం చేసినా అది ఆర్థికంగా నిలబడటానికే. వారంలో 5-6 రోజులు పనుల్లో బిజీగా గడిచిపోతాయి. కనీసం సెలవు అయినా మీకు నచ్చింది. చేయడానికి ప్రయత్నించండి. కొత్త ప్రదేశాలు చూడాలి అనుకుంటే ఒక్క రోజు టూరిస్ట్ అవ్వండి. ఫోటోగ్రఫీ, కవిత్వాలు రాయడం, పుస్తకాని తదవడం, మంచి సినిమాలు చూడటం, నచ్చిన వాళ్లను కలవడం, సేవా కార్యక్రమాలు చేయడం.. ఇలా మీకు ఏది నచ్చింది చేసేలా సెలవు రోజును ప్లాన్ చేసుకొండి. ఇలా రెండు మూడు వారాలు చేసి చూడండి. లైఫ్ మరిత హ్యాప్పీగా మారుతుంది.


 Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

01-coffeiee

కాఫీ తాగే అల‌వాటు ఉంటే…ఇది చ‌ద‌వండి

మీకు రోజు మూడు కప్పులు కాఫీ తాగే ఆల‌వాటు ఉంటే నిజంగా మీరు గ్రేట్‌. ఎందుకంటే రోజు మూడు క‌ప్పుల కాఫీ తాగితే మతిమరపు దూరం అవుతుందంటున్నాయి తాజా పరిశోధనలు. రోజూ కాఫీ తీసుకుంటే దానిలోవుండే కెఫిన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోకి చేరే కాలుష్యాలను అడ్డుకుంట‌య‌ట‌. అంతే కాదు కాఫీ పార్కిన్ సన్ వ్యాధి నిరోధానికి కూడా మంచి ఔషధంగా పని చేస్తుందంటున్నారు సైంటిస్టులు. కాఫీ వాడకం గురించి వచ్చిన తాజా రిపోర్టు ప్రకారం రోజూ కాఫీ తాగేవారి శరీరంలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చేరిన కారణంగా మెమరీ పవర్ పెరిగినట్టు గమనించారు.ఇక‌పోతే నరాలకు సంబంధించిన వ్యాధులను కూడా నియంత్రించగల శక్తి కాఫీకి ఉందని యూరప్‌కు చెందిన ఆరు పెద్ద కాఫీ తయారీ సంస్థలు తేల్చాయి. ఇదిలా ఉంటే కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల కొంతమంది మహిళల్లో గర్భస్రావాలకు కారణమవ్వడం, గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యే ప్రమాదముందనేది కొన్ని పరిశోధనల సారాంశం.

o rangula chilaka telugu lyrics

O Rangula Chilaka Song Lyrics – Jayammu Nischayammu Raa

 

ఓ రంగుల చిల‌క  చూడే నీ య‌న‌కా

అలుపంటూ లేని ఈ పిల్లాడి న‌డ‌కా

ఓ బంగ‌రు త‌ళుకా చుట్టూ ఏం క‌న‌కా

ఎక్క‌డికే ఆ అడుగులు చ‌ప్పుడు విన‌కా

ఓ సారిటు చూడే పాపం ప‌సివాడే

నీ చూపుల కోసం వేచి ఉన్నాడే

అన్నీ వ‌దిలేసి.. నిన్నే వ‌ల‌చాడే

నీ త‌ల‌పుల్లోనే నిదిరే మ‌రిచాడే

మొహ‌మాటాన్నీ ప‌క్క‌న వ‌దిలాడే

మొండిగ నిను వీడ‌క ముందుకు క‌దిలాడే

ఎవ‌రేమ‌నుకున్నా తానేమ‌నుకోడే

అండ‌గ నీ ప్రేమ‌ల మైమ‌ర‌ప‌య్యాడే

ఓ సారిటు చూడే పాపం ప‌సివాడే

నువ్వుంటూ లేని ధ్యాసే లేనోడే

బిడియ‌ము క‌ల‌వాడే హృద‌య‌ము అలలీడే

అయినా నిను గెలిచే  మ‌న‌సే  ఉన్నోడే

 

నిన్నంద‌రికంటే మిన్న‌గ చూస్తాడే

నిన్నేవ‌రేమ‌న్నా యుద్ధం చేస్తాడే

నీతో న‌డిచే ఆ ఏడడుగుల కోసం

వేవేల‌డుగులనైనా న‌డిచే ఘ‌నుడే

ఓ సారిటు చూడే పాపం ప‌సివాడే

నువ్ న‌డిచే దారిని వ‌ద‌ల‌ని ప్రేమికుడే

గుండె త‌ల‌పుల్నే తెరిచీ ఉంచాడే

దేవ‌త నువ్వంటూ భ‌క్తుడు అయ్యాడే


Film Name : Jayammu Nischayammu Raa

Producer : Shiva Raj Kanumuri

Director : Shiva Raj Kanumuri

Music Director : Ravi Chandra

Banner : AVS Raju Presents

Lable : Aditya Music

Actor : Srinivas Reddy

Actress : Poorna


Like This Lyrics ? Have Some To Say ? Comment Below Or Mail Us : Info@Tvarthalu.Com. Or Be A Friend With Us On Facebook & Twitter.

 

Ravana shared his failure reason to rama

రావ‌ణుడు చ‌నిపోయే ముందు రాముడికి చెప్పిన మాట

లంకాధిపతి రావణబ్రహ్మ యుద్ద భూమిలో..మృత్యు శయ్యపై అవసాన దశలో శ్రీరాముడితో ఇలా అన్నాడు.. “రామా !! నీ కంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నేను బ్రాహ్మణ జాతి  పుట్టాను నీది క్షత్రియ జాతి.

నేను నీ కంటే వయసులో పెద్ద.
నా కుటుంబం…
మీ కుటుంబం కన్నా పెద్ద.

నా వైభవం..
నీ వైభవం కన్నా అధికం.

మీ అంత:పురమే స్వర్ణం..
నా లంకానగరమే స్వర్ణమయం

నేను బలపరాక్రమాలలో …
నీకంటే శ్రేష్ఠుడిని.

నా రాజ్యము,
నీ రాజ్యము కంటే పెద్దది.

జ్ఞానంలో, తపస్సులో
నీ కంటే శ్రేష్ఠుడిని”.

“ఇన్ని శ్రేష్ఠమైన విషయాలు కలిగి వున్నా ..
యుద్ధంలో నేను
నీ ముందు ఓడిపోయాను.

దీనికి కారణం ఒకటే…
నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు..

నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు”.

నీతి

కుటుంబం పరివారమై వెంట ఉంటే
ఎంతటి కష్టమైన యుద్దమైనా
విజయం సాదిస్తుంది

పరివారమే కుటుంబమయితే
ఆనందం మన వెంటే ఉంటుంది

కుటుంబం దూరమైతే
బతుకే భారమవుతుంది

రావణబ్రహ్మ లాంటి వాడే
ఓటమి పాలయ్యాడంటే..
మనలాంటి వాళ్ళ బ్రతుకెంత?

ఎందుకంటే…
ఏ వృక్షమూ….
కఱ్ఱ సహాయం లేని గొడ్డలితో
తెగి పడదు.

వృక్ష జాతి స్నేహం తోనే…
గొడ్డలి విజయం సాధిస్తుంది.

అందుకే
అందరం కలిసి ఉందాం….!
విజయాలు సాదిద్దాం !!

కుటుంబాలు విచ్చిన్నం కాకుండా అందరం ప్రయత్నిద్దాం!!!

 

Source  : unknown