Tuesday, 17 January, 2017
Teach your 3 year olds how to wash their private parts properly and warn them never to allow anyone touch those areas and that

Tell Your Kids About GOOD TOUCH and BAD TOUCH At Early Age

Kids are prone to many perils. Parents can eliminate those bad experiences by telling them about the black facts of life. It’s advised by Experts that Parents should teach their kids about bad touch and good touch even before they turn up to 5 years old. Here we Present you some tips for safe kids and happy parenting.


1: Warn your Girl Child Never to sit on anyone’s laps no matter the situation including uncles.

2: Avoid Getting Dressed in front of your child once he/she is 2 years old. Learn to excuse them or yourself.

3. Never allow any adult refer to your child as ‘my wife’ or ‘my husband’

4. Whenever your child goes out to play with friends make sure you look for a way to find out what kind of play they do, because young people now sexually abuse themselves.

5. Never force your child to visit any adult he or she is not comfortable with and also be observant if your child becomes too fond of a particular adult.

6. Once a very lively child suddenly becomes withdrawn you may need to patiently ask lots of questions from your child.

7. Carefully educate your grown ups about the right values of sex . If you don’t, the society will teach them the wrong values.

8: It is always advisable you go through any new Material like cartoons you just bought for them before they start seeing it themselves.

Teach your 3 year olds how to wash their private parts properly and warn them never to allow anyone touch those areas and that

Take up the case and show them you can defend them.Remember, we are either parents or parents-to-be.

9. Ensure you activate parental controls on your cable networks and advice your friends especially those your child(ren) visit(s) often.

10. Teach your 3 year olds how to wash their private parts properly and warn them never to allow anyone touch those areas and that
includes you (remember, charity begins from home and with you).

11: Blacklist some materials/associates you think could threaten the sanity of your child (this includes music, movies and even friends and families).

12. Let your child(ren) understand the value of standing out of the
crowd.

13: Once your child complains about a particular person, don’t keep quiet about it.


Paramanandayya Shishyula katha Telugu

ప‌రమానంద‌య్య శిష్యుల క‌థ‌- రామ‌య్య ద‌య్యం

ఒక‌నాడు ప‌రమానంద‌య్యకి శిష్యుల‌పై కోపం వ‌చ్చి ‘ఎక్క‌డిక‌యినా వెళ్ళి చావండిరా’.. అని క‌సిరి వెళ్ళ‌గొట్టారు. శిష్యులు చేసేదిలేక ఊరి చివ‌ర‌కు పోయారు. చెరువులో నీరు తాగి దాహం తీర్చుకొని త‌మ క‌ర్త‌వ్యం గురించి ఆలోచింప‌సాగారు. ఇంత‌లో ఒక తుంట‌రి ‘ఏంటి పంతుళ్ళు. ఇక్క‌డున్నారు. రామ‌య్య ద‌య్యమై ఊరి పొలిమేర‌ల్లో తిరుగుతున్నాడు. ఇక్క‌డ రాకండి పారిపొండి’ అని భ‌య‌పెట్టాడు.

ఆ మాట విన్న వెంట‌నే ప‌ర‌మానంద‌య్య శిష్యులు నిశ్చేష్టుల‌య్యారు. భ‌యంతో అటు ఇటూ ప‌రుగెత్తి మ‌ర అక్క‌డికే వ‌చ్చి ‘ఒరేయ్ మ‌నం ఎందుకు ప‌రుగెత్తుతున్నామురా’ అని ఆలోచించుకొని కొంత సేప‌టికి మ‌ళ్లీ భ‌య‌ప‌డుతూ ‘గుర్తొచ్చిందిరా రామ‌య్య ద‌య్య‌మై మ‌న‌ల్ని ప‌ట్టి బాధించ‌డం త‌థ్యం’ అనుకొని త‌లోదారి పారిపోయారు.అలా వారు పారిపోయి.. చివ‌రికి ప‌ర‌మానంద‌పురానికి చేరుకున్నారు.

అక్కడ ఏదో ప‌ని చేసుకుంటూ దిక్కులేని ప‌క్షుల్లా జీవించ‌సాగారు. కొంత కాలం త‌రువాత ప‌ర‌మానంద‌య్య‌కి శిష్యుల‌పై ధ్యాస‌మ‌ళ్లింది. ‘వెర్రికుంక‌లు…ఎక్క‌డున్నారో… ఏం చేస్తున్నారో’… అని బెంగ‌తో వెత‌కడం మొద‌లు పెట్టాడు. కొంత కాలానికి శిష్యుల జాడ తెలిసింది. ర‌మ్మ‌ని క‌బురు పంపారు. కాని వారు ‘రామ‌య్య ద‌య్య‌మై తిరుగుతున్నాడు. మ‌మ్మ‌ల్ని చంపేస్తాడు. మేము రాము’ అని బ‌దులు పంపారు.దీంతో ప‌ర‌మానంద‌య్య ‘ఏం భ‌యం లేదు. దెయ్యం పాదాల‌కు గోరింటాకు రాశాను. అది ఇంక బ‌య‌టికి తిర‌గ‌దు’ అని ఒక వ్య‌క్తితో చెప్పి పంపించాడు, ఇది విన్న శిష్యులు శాంతించారు. గురువుగారు పంపిన వ్య‌క్తితో శిష్యులంద‌రు తిరిగి వ‌చ్చి ‘బుద్ధిగానే ఉంటామండీ..మ‌మ్మ‌ల్ని క‌సురుకోకండి. మేమంతా మీ శిష్యుల‌మేగా’ అంటూ గురువుగారి వ‌ద్ద‌నే ఉండిపోయారు.

cunning-fox

జిత్తుల‌మారి న‌క్క‌

ఆడవిలో కుందేళ్లన్నీ ఒకచోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకో కుందేల్ని ఆహారంగా తీసుకెళ్లి కాలం గడపాలని అనుకుంది. వాటి ద‌గ్గ‌రికెళ్లి, మిత్రులారా. అసలు మీకు ఈ సంగతి తెలుసా? మన రాజు సింహానికి జబ్బు చేసింది. నేనిప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను అని చెప్పింది నక్క. అయ్యో, అలానా అని విచారం వ్యక్తం చేశాయి కుందేళ్లు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తోంది. నెల రోజుల పాటు రోజుకో కుందేల్ని తింటే తప్ప జబ్బు నయం కాదట. అందుకే మీలో ఒకర్ని పట్టుకు రమ్మని రాజాజ్ఞ అని నమ్మబలికింది నక్క. ఆ మాటను నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ, భక్తితోనూ రోజుకో కుందేలు నక్క వెంట వెళ్లసాగింది. నక్కదాన్ని చంపి రాజు పేరుమీద మాంసాన్ని కడుపారా లాగిస్తుండేది. నాలుగు రోజుల తర్వాత రాజవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది. కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, రాజుగారికి ఏ ఆనారోగ్యమూ లేదు. జత్తుల మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది. అని చెప్పింది. దాంతో కుందేళ్లు నక్కకు తగిన బుద్ది చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క ఒక కుందేలును తీసుకెళ్లడానికి వచ్చింది. నక్క బావా కాసేపు తాడును లాగే ఆట ఆడుకుందామా? మేమంతా ఒకవైపు ఉంటాం. నువ్వొక్కడివీ మరోవైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వారి విజేత అని చెప్పాయి కుందేళ్లు. ఓస్ ఇంతేనా! అంది నక్క, కుందేళ్లన్నీ ఒకవైపూ నక్క ఒక్కటీ ఒకవైపూ ఉండి తాడును పట్టుకుని బలంగా లాగడం మొదలుపెట్టాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడబలుక్కొని తాడును వదిలేశాయి. నక్క ఒక్కసారిగా వెనకాలున్న పెద్దబావిలో పడిపోయింది. దాని పీడ వీరగడైనందుకు కుందేళ్లన్నీ సంబర పడ్డాయి.

wonderla hyderabad

హైద‌రాబాద్‌ వింట‌ర్‌లో విహారానికి ఎక్కడికి వెళ్తున్నారు ?

హైదరాబాద్ లో పిల్లల కోసం ఎన్నో విహార స్థలాలున్నాయి. ఈసారి మీ అమ్మానాన్నలతో కలిసి అక్కడికి వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి. ఎక్కడికి వెళ్లాలో అనేగా ఆలోచిస్తున్నారు. మీ కోసం కొన్ని స్థలాలను ఎంపిక చేశాం. వాటి గురించి తెలుసుకుని.. మీకు నచ్చిన చోటికి వెళ్లండి. ఎంజాయ్ చేయండి.

zoo park hyderabad
zoo park hyderabad

1. జూపార్క్
380 ఎకరాలు విస్తరించిన నెహ్రూ జంతు ప్రదర్శనశాల పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్నో వివిధ జాతుల వన్యప్రాణులు.. నగరం జీవితానికి సంబంధం లేని ప్రపంచం.. మొత్తానికి ఒక అడవిలో తిరిగిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

golconda
golconda

2. గోల్కొండ
నాలుగు వందల ఎళ్లకు పైగా చరిత్ర ఉన్న గోల్కొండ అద్భుతమైన చరిత్ర ఉంది. 480 అడుగులు ఎత్తులో ఉన్న ఈ కోట నిర్మాణాన్ని కాకతీయులు ప్రారంభించగా.. కుతుబ్ షాహీలు పూర్తి చేశారు. ఈ కోట, దీని చుట్టు ఉన్న ప్రాంతాలు వజ్రాల వ్యాపారానికి ఒకప్పుడు చాలా ఫేమస్. ఈ కోటలోనే రామదాసుని బంధించారు. ఇప్పటికీ ఆ జైలును మీరు చూడొచ్చు.

salarjung museum
salarjung museum

3.సాలార్ జంగ్ మ్యూజియం
హైదరాబాదీ నవాబ్ రెండవ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ సొంత కలెక్షనే సాలార్జంగ్ మ్యూజియంలో ఉంటాయి. ఔరంగజేబు కత్తి, రాజా రవి వర్మ వేసిన పెయింటింగ్స్, జహంగీర్, నూర్జహాన్, షా జహాన్కు చెందిన డగార్లు ఇలా 43 వేల వస్తువులు, 50 వేల పుస్తకాలను మరెన్నో సాలార్ జంగ్ మ్యూజియంలో చూడొచ్చు.

charminar
charminar


4. చార్మినార్, మక్కా మజీద్
హైదరాబాద్ అంటే అందరికీ చార్మినార్ గుర్తుకు వస్తుంది. 400 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న చార్మినార్ ను కూలీ కుతుబ్ షా 1591 లో కట్టించారు. పర్షియన్ స్టైల్లో నిర్మించిన చార్మినార్ ను చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తుంటారు. ఈసారి చార్మినార్ కు వెళ్లినప్పుడు పక్కనే ఉన్న మక్కా మజీదుకు కూడా వెళ్లండి.

Ramoji Film City
                  Ramoji Film City

5. రామోజీ ఫిలింసిటి
ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న ఫిలింసిటీ ఇది. 1666 ఏకరాల్లో విస్తరించిన ఈ ఫిలింసిటీలో సినిమా షూటింగ్ కోసం జాతీయ, అంతర్జాతీయ దర్శకులు వస్తుంటారు. గుళ్లు, రైల్వేస్టేషన్లు ఇలా సినిమా షూటింగ్స్ సంబంధించిన ఎన్నో కట్టడాలు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.

wonderla hyderabad
wonder la hyderabad

6. వండర్ లా
ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేయడానికి వండర్ లా మంచి ప్లేస్. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ అమ్యూజ్ మెంట్ పార్కు్ల్లో ఎంటర్టైన్ మెంట్ కి కొదవ లేదు. వాటర్ గేమ్స్, హై థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ రైడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్లొచ్చు.

shibhi-chakravarthy-oath

శిబీ కథ ఏమిటి?

పూర్వం శంబరాసురునితో యుద్ధం చేసిన సమయంలో దశరథ చక్రవర్తి తనకు ఎప్పడైనా ఇస్తానన్న రెండు వరాల్ని ఎప్పుడిస్తాడో, ఇవ్వడో నన్న సందేహం కైకేయికి వస్తుంది. ఆమె కోరుకున్న రెండు వరాలు కూడా సామాన్యమైనవి కావు. రామునికి బదులు భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయడం. ఒకటి. శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యడం రెండో కోరిక. తనకిచ్చిన మాటపై దశరథుడు నిలబడేటట్లు చెయ్యడానికి. కైకేయి ఇక్ష్వాకు వంశస్థుడైన శిబి చక్రవర్తి సత్య సంధతను గూర్చి తన భర్తకు ఉత్తేజకరంగా చెపుతుంది. మాట తప్పనితనాన్ని పరీక్షించడానికి ఒకసారి ఇంద్రుడు డేగగాను. అగ్ని పావురంగాను వస్తారు. పావురాన్ని డేగ తరుముతూంటే. పావురం ప్రాణభీతితో వచ్చి శిబి ఒడిలో వాలుతుంది. ఆయన దాన్ని కాపాడతానని అభయమిస్తాడు. అపుడు డేగ వచ్చి శిబి చక్రవర్తితో ఈ పావురం నేను న్యాయంగా సంపాదించుకున్న ఆహారం. వెంటనే దాన్ని నాకిచ్చెయ్! అంటుంది. అపుడు శిబి అంటాడు ఈ పావురానికి నేనే అభయమిచ్చాను. కావున దానిని నీకు ఆహారంగా ఇవ్వలేను. నా మాంసం కోసి నీకు ఆహారంగా ఇస్తాను అంటూ తన మాంసాన్ని కోసి డేగకు అందిస్తాడు. ఇంద్రుడు, అగ్ని ప్రత్యక్షమై శిబి సత్య సంధతకు జోహారులర్పిస్తారు. కైకేయి ఈ కథ చెప్పి, దశరధుడు తాను పూర్వం చేసిన వాగ్దానాన్ని పాటించవలసినదిగా హెచ్చరించింది. పనిలో పనిగా, తాను ఇచ్చినమాటకు కట్టుబడి, తన కన్నులను అంధ బ్రాహ్మణునికి ఇచ్చి, ఉత్తమ లోకాలను పొందిన అలర్క మహారాజు కథ కూడా భర్తకు చెప్పింది. రామాయణంలో ఇటువంటి సత్కథలెన్నో ఉన్నాయి.

ఆత్యాశ ఫలం

ఒక ఊళ్లో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళుతుండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు వెళిపోతూండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం అన్నింటిని ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో  ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకు మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది.

 ఒక రోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి ఆవు మెడలో గంట ఎంతో బావుంది. నాకు అమ్ముతావా, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని ఆడిగాడు.వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు. ఉత్తి గంటకి ఏంతో డబ్బులిస్తున్నాడు అని మనుసులో నవ్వుకుని సరేనన్నాడు గోవిందుడు.ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసికెళ్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధ పడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేక పోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు.

నీతి: అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.

WG

ప్ర‌పంచాన్ని కాపాడుదామా?

iy

ప్రపంచంలో ఎన్ని అందాలున్నాయో.. అన్ని ఆపదలు కూ డా ఉన్నాయి. మనిషి సాల్వ్ చేయలేని సమస్యలను ఎదుర్కొనేందుకు మనకు ఒక సూపర్ హీరో కావాలి. కానీ సినిమాలో చూపించినట్టు. నిజ జీవితంలో సూపర్ హీరోలు ఉండరని అంటారు. కానీ మీరే నెక్ట్స్ సూపర్ హీరో అవ్వొచ్చు. దాని కోసం ఈ టిప్స్ పాటిస్తే సరి.

 

కాస్ట్యూమ్ కాదు

సూపర్ హీరో అవడమంటే ముందు కాస్ట్యూమ్ కొనుక్కోవాలని కాదు. సూపర్ మేన్, స్పైడర్ మేన్, ఐరన్ మేన్, వీళ్లంతా సూపర్ హీరోలు ఎందుకయ్యరో తెలుసా? వాళ్లు చేసే మంచి పనులే వాళ్లను సూపర్ హీరోలను చేస్తాయి. అంతే కానీ వాళ్లు వేసుకున్న కాస్ట్యూమ్ వల్ల కాదు. మీరు కూడా సూపర్ హీరో అవ్వొచ్చు. మంచి లక్ష్యం పెట్టుకుని దానిపై దృష్టి పెట్టాలి. బాగా కష్టపడాలి.

 

AGFహుందాగా ప్రవర్తించాలి.

సూపర్ హీరోగా అవ్వాలంటే ముందు హుందాగా ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించాలి. మీకు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. సూపర్ మేన్ ను గమనించారా.. ఎవరినైనా రక్షించినప్పడు ఎంత హుందగా ప్రవర్తిస్తాడో.. తన గొప్పతనాన్ని గుర్తించాలని తహతహలాడడు కదా.

QGRQADధైర్యంగా ఉండండి  

సూపర్ హీరోకు ఉండాల్సిన మొదటి లక్షణం ధైర్యం. అందరిని గౌరవిస్తూనే పనులను ధైర్యంగా చేయాలి. అప్పడు మీరు కూడా సూపర్ హీరో అవుతారు.

ASDFFసహాయం చేయండి

స్పైడర్ మేన్ అంటే మీకు ఇష్టం కదా.. అతన్ని గమనించారు.. కాస్ట్యూమ్ వేసుకొనేది ప్రజల్ని రక్షించడానికే. సహాయం చేయడానికే, అందుకే మీరు కూడా సహాయం చేసి సూపర్ హీరొ కావచ్చు. ఆకలితో బాధపడే వారికి అన్నం పెట్టడం, పుట్టిన రోజును ఏదైనా అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసుకోవడం. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకోవడం.. ఇవన్నీ సహాయాలే.

HTRGWGనేరాలను ఆపండి

సూపర్ హీరోల్లా మీరు ఆకాశంలో ఎగరటం, బిల్డింగ్ లు ఎక్కడం చేయలేకున్నా.. చిన్న చిన్న నేరాలను ఆపడానికి ప్రయత్నించొచ్చు. పెద్ద పెద్ద నేరాలను ఆపడానికి పోలీసుల సహాయం తీసుకోవచ్చు. బాల్య వివాహాలు ఆపడం, బాల కార్మికులు కనిపిస్తే లేబర్ డిపార్ట్ మెంట్ వాళ్లకు సమాచారం అందించడం ఇలాంటి పనులు చేస్తే మీరే మరో సూపర్ హీరో అవ్వొచ్చు.

ఆరోగ్యం

సూపర్ హీరో ఎన్నో పనులు చేయాలి. చాలా శక్తి అవసరం. అందుకే అమ్మ చెప్పినట్టు విని పౌష్టికాహారం తీసుకోండి. తొందరగా పడుకొని తొందరగా నిద్ర లేవండి. లేవగానే చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. శక్తి ఉంటే మీరే శక్తిమాన్ అవుతారు.

AWGFచదువు

ఐరన్ మేన్ మువీస్ చూసారా.. సొంతంగా తయారు చేసుకున్న క్యూబ్ తో ఎగిరి అవసరం ఉన్న చోటికెళ్తాడు. ఎంతో మందిని కాపాడుతాడు. బాగా చదివి, నాలెడ్జ్ సంపాదించాడు కాబట్టి అలా పరిశోధనలు చేయగలిగాడు. అందుకే మీరు చదువుపై బాగా దృష్టి పెట్టాలి. ఎంత తెలిస్తే.. అంత తొందరగా గెలుస్తాం.

childrens-day-14nov2016

చిల్డ్రన్స్ డేకి ఎక్కడికి వెళ్తున్నారు ?

హైదరాబాద్ లో పిల్లల కోసం ఎన్నో విహార స్థలాలున్నాయి. ఈసారి చిల్డ్రన్స్ డేకి మీ అమ్మానాన్నలతో కలిసి అక్కడికి వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి. ఎక్కడికి వెళ్లాలో అనేగా ఆలోచిస్తున్నారు. మీ కోసం కొన్ని స్థలాలను ఎంపిక చేశాం. వాటి గురించి తెలుసుకుని.. మీకు నచ్చిన చోటికి వెళ్లండి. ఎంజాయ్ చేయండి.

 1. జూపార్క్

380 ఎకరాలు విస్తరించిన నెహ్రూ జంతు ప్రదర్శనశాల పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్నో వివిధ జాతుల వన్యప్రాణులు.. నగరం జీవితానికి సంబంధం లేని ప్రపంచం.. మొత్తానికి ఒక అడవిలో తిరిగిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

 1. గోల్కొండ

నాలుగు వందల ఎళ్లకు పైగా చరిత్ర ఉన్న గోల్కొండ అద్భుతమైన చరిత్ర ఉంది. 480 అడుగులు ఎత్తులో ఉన్న ఈ కోట నిర్మాణాన్ని కాకతీయులు ప్రారంభించగా.. కుతుబ్ షాహీలు పూర్తి చేశారు. ఈ కోట, దీని చుట్టు ఉన్న ప్రాంతాలు వజ్రాల వ్యాపారానికి ఒకప్పుడు చాలా ఫేమస్. ఈ కోటలోనే రామదాసుని బంధించారు. ఇప్పటికీ ఆ జైలును మీరు చూడొచ్చు.

3.సాలార్ జంగ్ మ్యూజియం

హైదరాబాదీ నవాబ్ రెండవ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ సొంత కలెక్షనే సాలార్జంగ్ మ్యూజియంలో ఉంటాయి. ఔరంగజేబు కత్తి, రాజా రవి వర్మ వేసిన పెయింటింగ్స్, జహంగీర్, నూర్జహాన్, షా జహాన్కు చెందిన డగార్లు ఇలా 43 వేల వస్తువులు, 50 వేల పుస్తకాలను మరెన్నో సాలార్ జంగ్ మ్యూజియంలో చూడొచ్చు.

 1. చార్మినార్, మక్కా మజీద్

హైదరాబాద్ అంటే అందరికీ చార్మినార్ గుర్తుకు వస్తుంది. 400 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న చార్మినార్ ను కూలీ కుతుబ్ షా 1591 లో కట్టించారు. పర్షియన్ స్టైల్లో నిర్మించిన చార్మినార్ ను చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తుంటారు. ఈసారి చార్మినార్ కు వెళ్లినప్పుడు పక్కనే ఉన్న మక్కా మజీదుకు కూడా వెళ్లండి.

 1. రామోజీ ఫిలింసిటి

ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న ఫిలింసిటీ ఇది. 1666 ఏకరాల్లో విస్తరించిన ఈ ఫిలింసిటీలో సినిమా షూటింగ్ కోసం జాతీయ, అంతర్జాతీయ దర్శకులు వస్తుంటారు. గుళ్లు, రైల్వేస్టేషన్లు ఇలా సినిమా షూటింగ్స్ సంబంధించిన ఎన్నో కట్టడాలు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.

 1. వండర్ లా

ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేయడానికి వండర్ లా మంచి ప్లేస్. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ అమ్యూజ్ మెంట్ పార్కు్ల్లో ఎంటర్టైన్ మెంట్ కి కొదవ లేదు. వాటర్ గేమ్స్, హై థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ రైడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్లొచ్చు.

పిల్లల కోసం వెబ్ సైట్లు

1.http://www.sesamestreet.org/

అక్షరాలు, రంగులు, శబ్దాలు, రైమ్స్ ఇలా ఎన్నో నేర్చుకోవడానికి ఈ వెబ్ సైట్ క్లిక్ చేస్తే చాలు. ఇందులోని క్లిప్పులు పిల్లల్ని బాగా అలరిస్తాయి. అంతకు మించి మంచి విషయాలు నేర్పిస్తాయి.

2.http://www.kidsnationalgeographic.com/

నేషనల్ జాగ్రఫీ సంస్థకు చెందిన వెబ్ సైట్ ఇది. ఇందులో పిల్లల కోసం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అప్ డేట్ చేస్తారు. వీడియాలు, గేమ్స్, జంతువుల గురించి చిన్న పిల్లలకు అర్థం అయ్యే విధంగా చెప్పడం ఇలా ఎన్నో స్పెషాలిటీలు ఉంటాయి.

 1. wikihow.com

ఏ డౌట్ ఉన్నా వెబ్ సైట్ లో సెర్చ్ చేయోచ్చు. ఉదాహరణకు మీకు కోపం ఎక్కువగా వస్తే దాన్ని ఎలా అదుపు చేసుకోవాలో అందులో సెర్చ్ చేయోచ్చు. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు వెతుక్కోవచ్చు.

 1. http://www.coolmath.com/

లెక్కలు (మ్యాథ్స్) అంటే భయపడే పిల్లల కోసం ఈ వెబ్ సైట్ ఆన్ లైన్ మ్యాథ్స్ టీచర్ లాంటిది. చాలా కూల్ గా, మీకు అర్థం అయ్యేలా లెక్కలు నేర్పుతుంది. ఆల్జీబ్ర, కాల్కులస్, జామెంట్రీ వీటితో ఇబ్బంది పడేవారు సులువుగా నేర్చుకోవచ్చు.

 1. http://ciscoverykids.com/

కొత్త కొత్త విషయాలతో అలరించే డిస్కవరీ ఛానెల్ తెలుసు కదా. వాళ్లు పిల్లల కోసమే వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలుంటాయి.

సూపర్ హీరోలవుదామా

ప్రపంచంలో ఎన్ని అందాలున్నాయో.. అన్ని ఆపదలు కూ డా ఉన్నాయి. మనిషి సాల్వ్ చేయలేని సమస్యలను ఎదుర్కొనేందుకు మనకు ఒక సూపర్ హీరో కావాలి. కానీ సినిమాలో చూపించినట్టు. నిజ జీవితంలో సూపర్ హీరోలు ఉండరని అంటారు. కానీ మీరే నెక్ట్స్ సూపర్ హీరో అవ్వొచ్చు. దాని కోసం ఈ టిప్స్ పాటిస్తే సరి.

కాస్ట్యూమ్ కాదు

సూపర్ హీరో అవడమంటే ముందు కాస్ట్యూమ్ కొనుక్కోవాలని కాదు. సూపర్ మేన్, స్పైడర్ మేన్, ఐరన్ మేన్, వీళ్లంతా సూపర్ హీరోలు ఎందుకయ్యరో తెలుసా? వాళ్లు చేసే మంచి పనులే వాళ్లను సూపర్ హీరోలను చేస్తాయి. అంతే కానీ వాళ్లు వేసుకున్న కాస్ట్యూమ్ వల్ల కాదు. మీరు కూడా సూపర్ హీరో అవ్వొచ్చు. మంచి లక్ష్యం పెట్టుకుని దానిపై దృష్టి పెట్టాలి. బాగా కష్టపడాలి. హుందాగా ప్రవర్తించాలి.

సూపర్ హీరోగా అవ్వాలంటే ముందు హుందాగా ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించాలి. మీకు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. సూపర్ మేన్ ను గమనించారా.. ఎవరినైనా రక్షించినప్పడు ఎంత హుందగా ప్రవర్తిస్తాడో.. తన గొప్పతనాన్ని గుర్తించాలని తహతహలాడడు కదా.

ధైర్యంగా ఉండండి

సూపర్ హీరోకు ఉండాల్సిన మొదటి లక్షణం ధైర్యం. అందరిని గౌరవిస్తూనే పనులను ధైర్యంగా చేయాలి. అప్పడు మీరు కూడా సూపర్ హీరో అవుతారు.

సహాయం చేయండి

స్పైడర్ మేన్ అంటే మీకు ఇష్టం కదా.. అతన్ని గమనించారు.. కాస్ట్యూమ్ వేసుకొనేది ప్రజల్ని రక్షించడానికే. సహాయం చేయడానికే, అందుకే మీరు కూడా సహాయం చేసి సూపర్ హీరొ కావచ్చు. ఆకలితో బాధపడే వారికి అన్నం పెట్టడం, పుట్టిన రోజును ఏదైనా అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసుకోవడం. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకోవడం.. ఇవన్నీ సహాయాలే.

నేరాలను ఆపండి సూపర్ హీరోల్లా మీరు ఆకాశంలో ఎగరటం, బిల్డింగ్ లు ఎక్కడం చేయలేకున్నా.. చిన్న చిన్న నేరాలను ఆపడానికి ప్రయత్నించొచ్చు. పెద్ద పెద్ద నేరాలను ఆపడానికి పోలీసుల సహాయం తీసుకోవచ్చు. బాల్య వివాహాలు ఆపడం, బాల కార్మికులు కనిపిస్తే లేబర్ డిపార్ట్ మెంట్ వాళ్లకు సమాచారం అందించడం ఇలాంటి పనులు చేస్తే మీరే మరో సూపర్ హీరో అవ్వొచ్చు.

ఆరోగ్యం

సూపర్ హీరో ఎన్నో పనులు చేయాలి. చాలా శక్తి అవసరం. అందుకే అమ్మ చెప్పినట్టు విని పౌష్టికాహారం తీసుకోండి. తొందరగా పడుకొని తొందరగా నిద్ర లేవండి. లేవగానే చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. శక్తి ఉంటే మీరే శక్తిమాన్ అవుతారు.

చదువు

ఐరన్ మేన్ మువీస్ చూసారా.. సొంతంగా తయారు చేసుకున్న క్యూబ్ తో ఎగిరి అవసరం ఉన్న చోటికెళ్తాడు. ఎంతో మందిని కాపాడుతాడు. బాగా చదివి, నాలెడ్జ్ సంపాదించాడు కాబట్టి అలా పరిశోధనలు చేయగలిగాడు. అందుకే మీరు చదువుపై బాగా దృష్టి పెట్టాలి. ఎంత తెలిస్తే.. అంత తొందరగా గెలుస్తాం.

ఈ చిట్కాలు పాటించి మీరు కూడా సూపర్ హీరో అవ్వొచ్చు. ఎంతో మందికి ఆదర్శంగా మారొచ్చు.

డిస్నీలాండ్ వెళ్దామా..

పిల్లలూ, ఈ ప్రపంచం అందరిదీ అనే విషయం మీకు తెలుసు కదా. కానీ మీకోసం ఎన్నో ప్రపంచాలు ఈ భూమిపైనే ఉన్నాయి. అక్కడ అంతా ఆనందమే. ఎక్కడ చూసినా మీకు నచ్చే బొమ్మలే.. మిమ్మల్ని అలరించే అంశాలే. ఇలా ప్రపంచంలో ఉన్న టాప్ 5 పిల్లల ప్రపంచాలివే.

 1. డిస్నీలాండ్ కాలిఫోర్నియా, ఫ్లోరిడా, అమెరికా

మిక్కిమౌస్, డోనాల్డ్ డక్ లాంటి ఎన్నో కార్టూన్ క్యారెక్టర్లను డిజైన్ చేసిన వాల్ట్ డిస్నీ.. పిల్లల కోసం డిస్నీలాండ్ ను ఏర్పాటు చేశారు.

ఇందులో ఇప్పటికే కోట్లాది మంది పిల్లలు డిస్నీలాండ్ కెళ్లి బాగా ఎంజాయ్ చేశారు. పీటర్ ప్యాన్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఇలా డిస్నీ పాత్రలన్నీ కళ్ల ముందే కదలాడుతాయి. కేవలం పిల్లలకే కాదు.. పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయదగ్గ ప్రదేశాల్లో డిస్నీలాండ్ ఒకటి.

 1. మేజికల్ కింగ్ డమ్, అమెరికా

అదో మాయాలోకం. అందులో చిన్నప్పుడు కథల్లో విన్న రాజులు, జంతువులు, కోటలు ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు ఎన్నో. డిస్నీ మూవీస్ లోగోలో కనిపించే భవనం ఉండేది ఇందులోనే. పిల్లల కోసం ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కార్టూన్ క్యారెక్టర్లు పరేడ్ చేస్తాయి. మీతో మాట్లాడతాయి. మీతో కలిసి డ్యాన్స్ చేస్తాయి.. కలిసి భోజనం కూడా చేస్తాయి. అందుకే చాలా మంది పిల్లలకు మేజిక్ కింగ్ డమ్ అంటె ఇష్టం.

 1. డిస్కవరి కోవ్, ఫ్లోరిడా, అమెరికా

భూమి 71 శాతం నీటితోనే నిండి ఉంది. అందులో లక్షలాది జీవజాతులు. వాటి గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్లు సముద్రంలోకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఫ్లోరిడాలోని డిస్కవరి కోవ్ కు వెళ్తే సరిపోతుంది. దాంతో పాటు వన్య ప్రాణులు, వివిధ రకాల చెట్లు.. ఇలా ప్రకృతి లోని ఎన్నో అంశాలతో పిల్లలను అలరిస్తోంది ఈ పార్క్.

 1. సెడార్ పాయింట్, ఒహైయో, అమెరికా

ఈ పార్క్ ని రోలర్ కోస్టర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. ఇదో ఆటల ప్రపంచం. చిన్న చిన్న ఆటల నుంచి పెద్ద పెద్ద రైడ్ల వరకు..సెడార్ పాయింట్ లోకి వెళ్తే వీటన్నింటిని ఎంజాయ్ చేయోచ్చు.

 1. నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, వాషింగ్టన్ డి.సి..

అందరిక్ష, విమానయానానికి సంబంధించిన ఎయిర్, స్పేస్ క్రాఫ్ట్ ల మ్యూజియం ఇది. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఎన్నో విమానాలు, అంతరిక్ష సాధనాలు చూడటానికి ప్రతీ సంవత్సరం 70 లక్షల మంది సందర్శకులు వస్తుంటారట.

బిలియనీర్ల వెరైటీ అలవాటు

వాళ్లంతా లక్షల కోట్ల సంస్థలకు అదిపతులు. కాని లైఫ్ స్టైల్ చాలా సింపుల్. డబ్బుంది కదా అని నచ్చినట్టు ఖర్చు చేయరు. తరతరాలు సరిపోయే డబ్బు ఉన్నా.. పని చేసే అవసరం లేకున్నా.. ప్రతి నిముషాన్నీ సంస్థ అభివృద్ధికే ఉపయోగిస్తారు. మరి ఆ స్థాయికి చేరుకోవడానికి జీవితంపై, తమ అలవాట్లపై అదుపు తెచ్చుకున్నారు. వారి వ్యక్తిగత, వృత్తి జీవితాలతో కోట్లాది మందికి ప్రేరణగా మారారు. అలాంటి కొంతి మంది దిగ్గజాల అలవాట్లపై ఓ లుక్ వేద్దాం.

 1. స్టీవ్ జాబ్స్

ఆపిల్ కంపెని సహ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈఓ

దివంగత ఆపిల్ దిగ్గజం స్టీవ్ జాబ్స్ లోకమంతా మర్చిపోయేలా పనిలో నిమగ్నమై ఉండేవారు. వ్యక్తిగత జీవితానికి అంతగా ప్రాధాన్యతనిచ్చేవారు కాదు. కనీసం ఇంట్లో సరైన ఫర్నీచర్ కూడా ఉండేది కాదు. స్టీవ్ జాబ్స్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అతను ప్రూటేరియన్ (ఫలాహారి). యుక్త వయసు నుంచి కేవలం పళ్లు తిని మాత్రమే బతికేవాడు. ఒకవేళ వేరే ఆహారం తీసుకోవాల్సి వస్తే.. అదే వంటని వారాల తరబడి తినేవారు. సీఈఒగా సంవత్సరానికి ఒక డాలర్ జీతాన్ని మాత్రమే తీసుకునేవారు. వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తే భరించే వారు కాదు. అందుకే చాలా సింపుల్ గా బతికారు. కానీ మరణించే ముందు రాసిన లెటర్ లో తను కూడా అందరిలా ఉంటే బాగుండేది అని.. జీవితాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను అని బాధ పడ్డాడు స్టీవ్.

 1. మార్క్ జుకర్ బర్గ్

 ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈఓ

సామాజిక మాద్యమాల్లో రారాజైన ఫేస్ బుక్ ను మార్క్ జుకర్ బర్గ్ 2004 లో ప్రారంభించారు. స్టీవ్ జాబ్స్ లా వన్ డాలర్ సాలరీ తీసుకునే వారు. బట్టలు ఎందుకోవడానికి టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని ప్రతి రోజు బూడిద రంగులో ఉండే టీషర్టునే వేసుకుంటారు. మాంసాహారం తీసుకోరు. అంత డబ్బు  ఉన్నా తన భార్యకు సొంతంగా రుబీ రింగు తయారు చేసి గిఫ్ట్ గా ఇచ్చారు. ఫేస్ బుక్ ఆఫీసులో మిగితా ఉద్యోగుల్లా మామూలు డెస్క్ పై కూర్చొని పని చేయడం జుకర్ బర్గ్ ప్రత్యేకత.

 1. బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు

ప్రతీ ఇంట్లో ఒక పర్సనల్ కంప్యూటర్ ఉండటమే తన కలగా తెలిపిన బిల్ గేట్స్ కు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. పుస్తకాల పిచ్చి ఎంత వరకు పెరిగిందంటే బయట ప్రపంచాన్ని మరిచి మరి పుస్తకాల్లో మునిగిపోయేవారు. బిల్ గేట్స్ ను కంట్రోల్ చేయడానికి డైనింగ్ టేబుల్ పై పుస్తకం తీసుకురావద్దని రూల్స్ పెట్టారట. సంవత్సరానికి ఒకసారి చదవాల్సిన పుస్తకాల జాబితా తయారు చేసుకుని ప్లాన్ ప్రకారం చదువుతాడు. మైక్రోసాఫ్ట్ నిర్వహణలో బిజీగా ఉన్నా.. పుస్తకాను చదివే అలవాటును మానుకోలేదు. డబ్బు విషయంలో బాగా స్ట్రిక్ట్ గా ఉండేవారు బిల్ గేట్స్. ఒక్క డాలర్ కూడా అనవసరంగా ఖర్చు చేసేవారు కాదు. కానీ తన సంపాదనంలో ఎక్కువ భాగం సామాజిక సేవకే వినియోగించడం బిల్ గేట్స్ ప్రత్యేకత.

 1. సుందర్ పిచ్చాయ్

గూగుల్ సీఈఓ

సర్జీబ్రిన్, ల్యారిపేజ్ తరువాత గూగుల్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్… సమస్యలను పరిష్కరించడానికి సింపుల్ టెక్నిక్ ను పాటిస్తాడట. ఏదైనా సమస్య వచ్చిప్పుడు మీటింగ్ లో డిస్కస్ చేసే పిచాయ్.. మీటింగ్ మధ్యలోనే పరిష్కారం గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్లిపోతుంటాడట. అలా వాకౌట్ చేసి ఒక పరిష్కారంతో మళ్లీ హాల్లోకి వస్తాడట. నిత్యం ఏదో ప్రాజెక్టుతో బిజీగా ఉండే పిచాయ్… మొబైల్ లో డయల్ చేసిన ప్రతి ఫోన్ నెంబర్ ను గుర్తుపెట్టుకోగలడట.

 1. సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్  సీఈఓ

హైదరాబాద్ కు చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కు సీఈఓగా 2014 లో సీఈఓ గా బాధ్యతలు చేపట్టారు. నాదేళ్లకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. ఎప్పుడైనా వీలు దొరికితే స్వయంగా వండాలని కోరికట. కానీ మూడేళ్ల నుంచి ఆ అవకాశం రాలేదట. క్రికెట్ ను అమితంగా ఇష్టపడే సత్యనాదేళ్ల సచిన్ సైన్ చేసి ఇచ్చిన బ్యాట్ ను అపురూపంగా చూసుకుంటారట. ఉదయం ఆరు గంటలకు లేచి వ్యాయామం, బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా రాసుకుంటారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఆఫిస్ టైమ్. తర్వాత ఫ్యామిలీతో కొంత సమయం కేటాయిస్తారు. పనిలో ఎంత బిజీగా ఉన్నా రోజుకు పదినిముషాలైన మెడిటేషన్ చేస్తారట.

ఈ అలవాటు మార్చుకోవాల్సిందే

అలవాట్లు మనిషి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. వీటిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రపంచం అంచనా వేస్తుంది. మంచి అలవాట్లు మంచిని చేస్తే… చెడ్డ అలవాట్లు మనిషి ఆరోగ్యాన్ని, ఇమేజ్ కు నష్టం కలిగిస్తాయి. అందుకే బ్యాడ్ హ్యాబిట్స్ ను ఎప్పటికైనా మానేయాల్సిందే. అందులో వెంటనే మానేయాల్సిన అలవాట్లు ఇవే.

 1. స్మోకింగ్

అసలు సిగరెట్ అలవాటే చేసుకోకూడదు. పొరపాటున అయిందంటే వెంటనే మానెయ్యాలి. ఎందుకంటే వేలంత ఉండే సిగరెట్టులో నాలుగు వేల ప్రమాదకరమైన రసాయనాలుంటాయి. నికోటిన్, తార్, మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్, అమోనియా వంటి 43అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు మెల్లిమెల్లిగా శరీరాన్ని డొల్ల చేస్తాయి. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధూమపానం మానేసిన 20 నిమిషాల నుంచే శరీరం కోలుకోవడం ప్రారంభిస్తుంది. శ్వాసక్రియ మెరుగౌతుంది. మీకు నచ్చిన ఆహారం రుచిని మరింతగా ఎంజాయ్ చెయోచ్చు. డబ్బు పొదుపు అవుతుంది. దాంతో పాటు మీ కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపగలరు. ఇలా సిగరెట్ నిజం తెలిసి మానేసిన వాళ్లలో మహేష్ బాబు, హృతిక్ రోషన్ లాంటి చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దమ్ము కొట్టడం మానేయాలని కొంత మంది పాన్, గుట్కా అలవాటు చేసుకుంటారు. ఒక చెడ్డ అలవాటు వదిలేయడానికి మరో చెడ్డ అలవాటు చేసుకోవడం పరిష్కారం కాదు. పొగతాగడం మానేయలనుకునే వాళ్లకు ఆన్ లైన్లో చిట్కాలతో పాటు మార్కెట్ లో పుస్తకాలు, నికోటిన్ గమ్ ను అందుబాటులో ఉన్నాయి. వీటన్నించిని మించిన ఆయుధం సంకల్పమే. ఒక్కసారి మానేసిన కమిటెడ్ గా ఉంటే మళ్లీ సిగరెట్ ని ముట్టుకోరు.

 1. ప్రతీదానికి సలహా తీసుకోవడం..

విజేతల జీవితాల్లో ఒక విషయం కామన్ గా ఉంటుంది. అదే సొంత నిర్ణయాలు తీసుకోవడం. ఎవరి జీవితం వారి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో ఇతరుల సలహాలపై ఆధారపడటం మంచిది కాదు. ఈ హ్యాబిట్ మన జీవితాన్ని మనది కాకుండా చేస్తుంది. ఈ అలవాటు పోవాలంటే ముందు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొని పాటించడం అలవాటు చేసుకోవాలి. మొదట్లో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నా అనుభవం వల్ల నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సార్లు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం, అవగాహన ఉండక పోవచ్చు. అలాంటప్పుడు ఒక ప్రొఫెషనల్ ను సంప్రదిస్తే మంచిది. అలా కాకుండా విషయంపై అవగాహన లేని వ్యక్తులను సంప్రదిస్తే మళ్లీ మీ జీవితం మీది కాకుండా పోతుంది.

3.డబ్బు ఆదా చేసే అలవాటు లేకపోవడం

డబ్బు సంపాదించడం ట్యాలెంట్. ఆదా చేయడం కళ. ఖర్చు చేయడం అవసరం. నెలంతా కష్టపడితే వచ్చే జీతాన్ని కొంత మంది వారంలోనే ఖర్చు పెట్టేస్తారు. మళ్లీ జీతం కోసం నెలంతా వేచి చూసి చూసి.. ఇలా జీతం రాగానే అలా ఖర్చు పెట్టేస్తారు. కానీ జీతం మీద ఆధారపడి బతికే వాళ్లు 30 రోజుల గురించి ఆలోచించి ఖర్చు చేయాలి. రేపటి అవసరాల కోసం ఆదా చేయాలి. ప్రతీ నెల కొంత మొత్తాన్ని బ్యాంక్ లో వేసి అవసరం ఉన్నప్పుడే విత్ డ్రా చేయాలి. క్రెడిట్ కార్లు తీసుకునే ముందు.. అది కూడా అప్పు అని.. 45 రోజుల తరువతా అయినా మీరే కట్టాల్సి ఉంటుందని గమనించాలి. సులభవాయిదాల పద్ధతి ఉంది కదా అని అంతగా అవసరం లేని వస్తువులు కొని ఉన్న ప్రశాంతతను కోల్పోతారు. వచ్చే డబ్బుతో ఏం చేయాలో అర్థం కాకపోతే మనీ మేనేజ్ మెంట్ గురించి నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవచ్చు.

 1. సాలరీ పెంచమని అడగలేక పోవడం

ఉద్యోగం చేసే చాలా మందికి ఎదురయ్యే సమస్య ఇది. పని ఎక్కువ.. జీతం తక్కువ అనిపించినప్పుడు సాలరీ పెంచమని అడిగేవాళ్లు తక్కువ. పెంచమని అడిగితే ఉన్న ఉద్యోగం ఎక్కడ పోతుందో అనే భయం కూడా కామన్. కానీ పెరగని జీతంతో ఆర్థిక అవసరాలకు భయపడుతూ ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు రావొచ్చు. మీరు పని చేసే సంస్థ మీ ట్యాలెంట్ ను గుర్తించి అడగక ముందే జీతం పెంచితే మంచిదే. కానీ అడగనిదే జీతం పెంచని సంస్థలో ఉన్నట్టైతే మొహమాటపడకండి. వెళ్లి జీతం పెంచమని అడగిచూడండి.

 1. ఆఫర్ మాయలో కొనడం

మార్కెట్ లో ఏదైనా ఆఫర్ వస్తే చాలు అవసరం ఉందా లేదా అని తేల్చుకోకుండానే కొనడానికి రెడీ అవుతారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్ చూసి అవసరం లేని వస్తువులతో ఇంటిని నింపేస్తారు. అలా కొన్న వాటిని సంవత్సరానికి ఒకసారైనా వాడిని సందర్భాలు కనిపించవు. అలాగే తక్కువ ధరకే వస్తుందని ఎక్కువగా కొనేస్తారు. ఏదైనా వస్తువు కొనేముందు దాని అవసరం ఉందా లేదా ఆలోచించాలి. పది రూపాయలు ఎక్కువైనా మన్నికైన వస్తువులను తీసుకోవాలి. ఇంటికి కావాల్సిన వస్తువుల జాబితా రాసుకుని అవే కొనడం ఉత్తమం.

 1. ఆత్మీయులతో టచ్ లో ఉండకపోవడం

స్మార్ట్ ఫోన్లు వచ్చాక తెలియని లేని వారితో పరిచయం పెరుగుతోంది. కానీ సొంత వాళ్లతో సాన్నిహిత్యం తగ్గుతోంది. డబ్బు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇవ్వలేని ఆనందాన్ని కాసేపు మాట్లాడు సొంతం చేసుకోవచ్చు. వీలైతే సెలవులు, పండుగల్లో మీ బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించడం.. లేదా మీరే వారింటికి వెళ్లి సర్ ప్రైజ్ చేయండి. ఆ సంతోషం క్యాండీ క్రష్ వెయ్యి సార్లు ఆడినా దొరకదు.

 1. కూల్ డ్రింక్స్ తాగడం

తిన్నది అరగడానికి కూల్ డ్రింక్స్ తీసువడం కామన్.. కానీ మద్యపానం ఎంత ప్రమాదకరమో.. కూల్ డ్రింక్స్ తాగడం కూడా అంతే ప్రమాదకరం. ఎందుకంటే వీటిలో చక్కర శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో అనవసరమైన క్యాలరీలు చేరుతాయి. దీంతో గుండె జబ్బులతో పాటు, స్థూలకాయం, పంటి, కిడ్నీకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కాఫీ, టీలు కూడా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం.

 1. నచ్చింది చేయకపోవడం

ఉద్యోగం..వ్యాపారం ఏం చేసినా అది ఆర్థికంగా నిలబడటానికే. వారంలో 5-6 రోజులు పనుల్లో బిజీగా గడిచిపోతాయి. కనీసం సెలవు అయినా మీకు నచ్చింది. చేయడానికి ప్రయత్నించండి. కొత్త ప్రదేశాలు చూడాలి అనుకుంటే ఒక్క రోజు టూరిస్ట్ అవ్వండి. ఫోటోగ్రఫీ, కవిత్వాలు రాయడం, పుస్తకాని తదవడం, మంచి సినిమాలు చూడటం, నచ్చిన వాళ్లను కలవడం, సేవా కార్యక్రమాలు చేయడం.. ఇలా మీకు ఏది నచ్చింది చేసేలా సెలవు రోజును ప్లాన్ చేసుకొండి. ఇలా రెండు మూడు వారాలు చేసి చూడండి. లైఫ్ మరిత హ్యాప్పీగా మారుతుంది.

ఆత్యాశ ఫలం

ఒక ఊళ్లో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళుతుండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు వెళిపోతూండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూండేవాడు. సాయంత్రం అన్నింటిని ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో  ఉన్నా వాటిని గుర్తించే వాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకు మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది.

ఒక రోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి ఆవు మెడలో గంట ఎంతో బావుంది. నాకు అమ్ముతావా, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని ఆడిగాడు.

వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు. ఉత్తి గంటకి ఏంతో డబ్బులిస్తున్నాడు అని మనుసులో నవ్వుకుని సరేనన్నాడు గోవిందుడు.

ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసికెళ్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని బాధ పడ్డాడు. ఆ గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేక పోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు.

నీతి : అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.

poet-kids

ఆస్థాన కవి

ఉజ్జయిని పాలకుడు విజయేంద్ర వర్మ ఏటా ఉగాదికి కవి సమ్మెళనం ఏర్పాటు చేసేవాడు. ఆ సమ్మేళనంలో ఉజ్జయినితో పాటు దాని పరిధిలోని సామంత రాజ్యాలకు చెందిన అనేక మంది కవులు పోల్గొనేవారు. సమ్మేళనంలో కవుల మధ్య పోటీ కూడా ఉండేది. ఆ పోటీలో మొద‌టి స్థానంలో నిలిచినవారిని విజయేంద్రవర్మ తన ఆస్థాన కవిగా పెట్టుకునేవాడు. మళ్లీ ఏడాది పోటీల వరకూ మాత్రమే ఆ సంవత్సరం విజేత ఆస్థానకవిగా ఉండేవాడు. ఏడాది పొడుగునా ఆస్థానకవికి ఎన్నో రాచమర్యాదలు చేసేవారు. కొత్త విజేత వచ్చేసరి మునుపటి విజేత ఆస్థానం నుంచి తప్పుకోవాల్సిందే.

ఎప్పటిలాగే ఆసారి ఉగాది వచ్చింది. కవి సమ్మేళనం, దాంతో పాటు పోటీలు ప్రారంభమయ్యాయి. ఒక సామంత రాజ్యానికి ఆస్థానకవి అయిన రామనాథశర్మ విజేతగా నిలిచాడు. ఆనవాయితీ ప్రకారం అతడిని ఉజ్జయినికి ఆస్థానకవిగా ఉండమని విజయేంద్రవర్మ ఆహ్వానం పంపాడు. కానీ రామనాథశర్మ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మునుపటి సామంత రాజ్యానికి తిరిగి ఆస్థానకవిగా వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని చెప్పాడు.

ఇంత పెద్ద రాజ్యానికి ఆస్థాన కవిని చేస్తానన్నా కాదని, తనరాజ్యంలోని ఓ చిన్న భాగానికే రామనాథశర్మ పరిమితమవుతాననడం విజయేంద్రవర్మకు ఆశ్ఛర్యం కలిగించింది. అందుకు కారణం ఏమిటని రామనాథశర్మని పిలిచి అడిగాడు. రాజా, నేను ఉజ్జయినిలో ఉంటే నా ప్రతిభతో సంబంధం లేకుండా ఏడాది వరకే ఆస్థాన కవి హోదాలో ఉండగలను. అదే చిన్నదైనా కూడా సామంత రాజ్యంలో ఉంటే నా పాండిత్యంతో ఎన్నాళ్లయినా ఆస్థాన కవిగా కొనసాగవచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు రామనాథశర్మ, ఆ మాటలు విన్నాక విజయేంద్ర వర్మ తన ఆలోచనను మార్చుకొని ఆస్థాన కవి పదవిని ఏడాది కాలానికి పరిమితం చేయకుండా ప్రతిభ చూపినంత కాలం పదవిలో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాడు.