Tuesday, 17 January, 2017
mg

SEND US UR DIWALI PICS AND STORY. SHARE IT WITH TVARTHALU FAMILY

This Diwali is so special. We have formed a news family on Tvarthalu.com. We love news and updates. The colors of life. This Diwali We take new step to make each other Happy. Lets Share our Happiness & with  Each Other. Please Send your  Deepavali Pics with family, friends, childrens, the lights and love. 

Send us at : info@tvarthalu.com

We will post as prority..as Your smile is our first  priority.

SHARE UR DIWALI PICS AND STORY WITH TVARTHALU READERS                                                share-ur-diwali-pics-and-story-with-tvarthalu-readers-3

share-ur-diwali-pics-and-story-with-tvarthalu-readers                                                   4

                                                         We wish you a happy and safe Diwali.

                                                                               Team 

                                                                        T-varthalu.com

 

diwali

దీపావ‌ళి ఇలా కూడా చేసుకోవ‌చ్చు..

దీపావ‌ళిని అంద‌రూ సెల‌బ్రేట్ చేస్తారు. చాలా మంది ప‌టాక‌లు కాల్చడం, స్వీట్లు తిన‌డ‌మే దీపావ‌ళి అనుకుంటారు. ప్ర‌కృతికి ఎలాంటి హాని క‌లిగించ‌ని విధంగా దీపావ‌ళి సెల‌బ్రేట్ చేసుకునే వాళ్లు చాలా త‌క్కువ‌. కానీ ఈ సారి ప్ర‌కృతిని కూడా దీపావ‌ళి చేసుకోనిద్దాం. గ్రీన్ దీపావ‌ళి సెలబ్రేట్ చేసుకుని న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుద్దాం. గ్రీన్ దీపావ‌ళి చేసుకోవ‌డానికి కొన్ని టిప్స్ ఇవే.

1. దీపాలు వెలిగిద్దాం

1-green-diwali
దీపావ‌ళి అంటే దీపాల వ‌రుస‌. వెలుగుల సంబురం. జీవితం ఆనందమ‌యం అవ్వాల‌ని… కొత్త కాంతుల‌తో ప్ర‌జ్వ‌రిల్లాలి అనే ఆశ‌తో దీపాలు వెలిగిస్తారు. కానీ ఈ మధ్య చాలా మంది రంగు రంగుల లైట్స్ కొని ఇంటికి అలంక‌రిస్తున్నారు. ఐదు రోజు పాటు ఇలా లైట్స్ పెడితే ఎంత కరెంట్ వృధా అవుతుందో ఆలోచించారా? అందుకే ఈ సారి లైట్స్ కాకుండా మ‌ట్టి ప్ర‌మిద దీపాలే పెడ‌దాం. దీపాల‌ను వ‌రుస‌లో పేర్చి కొత్త ఆనందాల‌ను, సంప‌ద‌ల‌ను ఆహ్వానిద్దాం.

2. ఎకో ఫ్రెండ్లీ ప‌టాక‌లు

2-green-diwali
దీపావ‌ళిని బాగా ఎంజాయ్ చేయాలంటే పెద్ద పెద్ద బాంబులే పేల్చాల‌ని రూలేం లేదు. ప్ర‌కృతికి ఎలాంటి హాని క‌లిగించ‌ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని క‌లుషితం చేయని ప‌టాక‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మామూలు వాటి క‌న్నా వీటి వెల కొంచెం ఎక్కువే. కానీ ప్ర‌కృతి విలువ అంత క‌న్నా ఎక్కువ క‌దా. భూమిని కాపాడుకోవ‌డానికి ఆ మాత్రం చేయ‌గ‌లం క‌దా.

3. పూవుల దీపావ‌ళి

3-green-diwali
పండుగ అంటేనే అస‌లైన ఆనందం. కానీ చాలా మంది న‌కిలీ పువ్వుల‌తో ఇంటిని అలంక‌రిస్తున్నారు. అందుకే ఈసారి ప్ర‌కృతి అందించే అంద‌మైన‌, సువాస‌నభ‌రిత‌మైన పువ్వుల‌ను వినియోగించి చూడండి. ఇంటి ముందు పూల‌తో డిజైన్ చేసిన దీపావ‌ళి స్పెష‌ల్ ముగ్గును వేయండి. వీటిని చూసి మీ కుటుంబ స‌భ్యుల సంతోషం డ‌బుల్ అవుతుంది. ఈ దీపావ‌ళి మ‌రింత స్పెష‌ల్ అవుతుంది.

4. హెర్బ‌ల్ గిఫ్ట్‌లు

4-green-diwali
దీపావ‌ళి ముందు రోజునుంచే స్వీట్, చాక్లెట్ బాక్సుల‌ను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. అందులో చాలా మ‌ట్టుకు ఆరోగ్యానికి హాని క‌లిగించేవే ఉంటాయి. మీరు గిఫ్ట్‌లో అనారోగ్యాన్ని ఇవ్వాల‌ని అనుకుంటున్నారా… కాదు క‌దా.. అందుకే నేతితో.. చేతితో చేసిన మిఠాయిలు, క్యాండిల్స్‌ను, ఆర్గానిక్ వ‌స్తువుల‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి.

 

 

5. చిరున‌వ్వులు వెలుగిద్దాం

5-green-diwali
దీపావ‌ళి రోజు దీపాల‌నే కాదు. కొంత మంది ముఖాల‌పై కూడా వెలుగు చూడొచ్చు. మీకు అంత‌గా ఉప‌యోగం లేని వ‌స్తువుల‌ను అవ‌స‌రం ఉన్న వారికి ఇవ్వండి. వాళ్ల క‌ళ్ల‌లో క‌నిపించే ఆనందం.. వెయ్యి దీపాలు వెలిగిస్తే వ‌చ్చే వెలుగు క‌న్నా ఎక్కువ అని మీరే ఫీలౌతారు.

దీపావ‌ళిని అంద‌రూ చేసుకుంటారు. ప‌టాక‌ల‌ను కాల్చి పాడేస్తారు. కానీ ఈ దీపావ‌ళి మీకు జీవితాంతం గుర్తుండాలంటే కొత్త‌గా ప్ర‌య‌త్నించండి.

                                           

                                                                      HAVE A SAFE AND GREAT DIWALI-
                                                                                          —– Team
                                                                                                  T- వార్త‌లు ——-  

_________________

Like this story? Wanna Say something ? comment below or mail us at : info@tvarthalu.com

lifestyle

ఈ హీరోయిన్ గెడ్డం గీయించుకుంది

ఈ హీరోయిన్ గెడ్డం గీయించుకుంది

ఏంటి హీరోయిన్ గెడ్డం గీయించుకోవ‌డం ఏంటి అని షాక్ కాకండి. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని పూర్తిగా తీయించేసుకుంటారు. కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్‌గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన వ్యక్తిగత మేకప్ మన్‌తో గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్ చేయించుకోవడం విశేషం.

women

ముఖేష్ అంబానీ కూతురి పెళ్లి

ముఖేష్ అంబానీ కూతురి పెళ్లి

అవును మీరు విన‌ది నిజ‌మే త్వ‌ర‌లోనే రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌, నీతా అంబానీల కుమార్తె పెళ్లిపీటలెక్కనుంది. ఇషా అంబానీ కొంతకాలంగా ఎవరితోనో ప్రేమలో ఉందని వార్తలు వెలువడుతున్నాయి కానీ అతనెవ్వరు అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. తాజాగా నవంబర్‌లో ఇషా అంబానీ పెళ్లి జ‌ర‌గుతుంద‌ని స‌మాచారం. అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా అంబానీ వెడ్డింగ్‌కి బాలీవుడ్‌ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలో బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్‌ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

sanniliyon

సన్నీలియోన్‌ అందాలు చూడండి

సన్నీలియోన్‌ అందాలు చూడండి
బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది.ఈ మ‌ధ్య నిర్మాత‌ల‌కు ఈ భామ అందాల డోస్ పై క్రేజ్‌ తగ్గిందో కానీ.. సినిమాల్లో అవ‌కాశాలు మాత్రం త‌గ్గాయి. దీంతో  మ‌రోసారి తన రేంజ్ పెంచుకునేందుకు  గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అలాగని అభిమానులను నిరుత్సాహపరచడం మాత్రం ఈ భామకు ఇష్టం లేదు. అందుకే మధ్యమధ్యలో ఫోటోషూట్స్ రూపంలో సోకుల ప్రదర్శనతో మైమరిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా కాస్మోపాటిలన్ మేగజైన్ కు ఇలా వైట్ అండ్ వైట్ టాప్ లో పోజ్ ఇచ్చింది. కాకపోతే.. టాప్ ఒక్కటే వేసుకోవడం అభిమానులకు అసలైన గిఫ్ట్.
ఈ ఫోటోలు పైన డ్రెస్ తో క‌ప్పినా… ఆ కింది అందాలను పరువాలను ఫోటోకి అప్పగింతలు పెట్టేసింది. మరీ ఎక్కువ గ్యాప్ కాకపోయినా.. గతంతో పోల్చితే అమ్మడి సోకుల సందర్శనలో కాసింత గ్యాప్ వచ్చేసరికి డీలా పడ్డ సన్నీ అందాల ఫ్యాన్స్ కు.. కొన్నాళ్ల పాటు ఈ డోస్ సరిపోతుంద‌నే చెప్పాలి
badam

బాదం.. పోష‌కాల‌కు గోదాం

బాదం శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బాదాం వలన ఆరోగ్యానికి కలిగే అన్ని రకాల ప్రయోజనాలు ఇవే..

1.  మ‌ల్టీ విట‌మిన్‌
బాదం ఆరోగ్యానికి, రుచిని కూడా ఇస్తుంది. శరీరానికి చాలా అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు పదార్థాలను కూడా కలిగి ఉంటుంది.

2. ఫ్యాట్ త‌గ్గుతుంది  ప్రతి రోజు బాదం లను తినటం వల్ల ఎక్కువ స్థాయి లిపోప్రొటీన్ పెరిగి, తక్కువ స్థాయి గల లిపోప్రొటీన్ లు త‌గ్గుతాయి. బాదం ఎక్కువగా మోనో సాకరైడేటెడ్ ఫాట్, ఆరోగ్యాన్ని పెంచే ఫాట్ ని కలిగి ఉంటాయి. రోజుకి 7 గ్రాముల బాదం తినటం వల్ల‌ ఎల్డి ఎల్ కొవ్వు స్థాయిని 15 శాతం తగ్గిస్తాయి.

3. ఎముకల ఆరోగ్యానికి
బాదం ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ను కలిగి ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి ఈ పోషకాలు తప్పని సరిగా అవసరం. ఈ పోషకాల లోపం వల్ల ఒస్టియోఫోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది.
4. చర్మాన్ని కాపాడుతుంది
బాదం విటమిన్ “E” కలిగి ఉన్నందు వల్ల‌ యాంటీ – ఆక్సిడెంట్ గా పనిచేసి సూర్య రశ్మి వల్ల చ‌ర్మానికి జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తుంది. బాదం పాలు ఎక్కువగా ప్రోటీన్, విటమిన్ లను కలిగి ఉండటం వలన చర్మ కణాలను హైడ్రేటింగ్ గాను, మృదువుగా ఉంచుతుంది.
5. జుట్టుకి ప‌ట్టు
చాలా రకాల కాస్మోటిక్స్ తయారీల వాడకంలో ఉపయోగించే విటమిన్ “D” , మెగ్నీషియంలను బాదం ఎక్కువగా కలిగి ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం కొరత వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. బాదం ఆయిల్ జుట్టుకి చాలా మంచిది. వారానికి ఒక్కసారి బాదం ఆయిల్ ను తలకి అద్దటం వల్ల తలని తేమగా ఉంచి, వెంట్రుకల సాంద్రతను పెంచి, జుట్టు రాలిపోటాన్ని తగ్గిస్తుంది.
6. బరువు నియంత్రణ
భోజన సమయంలో సరిపోయేంత పచ్చి బాదం తీసుకోవటం వల్ల బాదంలో ఉండే ఫైబర్ అధిక బరువు పెరగటాన్ని తగ్గిస్తుంది. కరగని ఫైబర్ పేగు కదలికలను తగ్గిస్తుంది. కరిగే ఫైబర్స్ వల్ల చిక్కని జెల్ ని ఏర్పరచి పేగు కదలికలను కావలసినంతగా కదిలేలా చేస్తుంది.
7. గర్భిణులకు వ‌రం
బాదం ఎక్కువగా ఫోలిక్ ఆసిడ్ ని కలిగి ఉన్నందున గర్బిణులకు ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. బాదం, కణాలు ఏర్పడటాన్ని, కణాల పెరుగుదలలో ఉపయోగప‌డుతుంది.
8. మలబద్దకం
బాదంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. బాదం తినేపడు ఎక్కువగా నీరు తాగటం వల్ల, అది జీర్ణక్రియ రేటును పెంచుతుంది. పేగుల కదలికలకు, సరిపోయే మోత్తంలో అంటే 4-5 బాదం తింటే సరిపోతుంది.
9. మధుమేహం
భోజనం తరువాత రక్తంలో గ్లూకోస్ మరియు ఇన్సులిన్ ల పెరుగుదల తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోస్ తయారయ్యే ప్రక్రియను నియంత్రించి, మృదువుగా, సాఫీగా జరిగేల చేస్తుంది.
10. రోగనిరోధక స్థాయిని పెంచుతుంది.
శరీరంలో అర్కలైటిని సాంద్రతను నియంత్రించటం వల్ల రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. రోగనిరోధకతని పెంచి వివిధ రకాలైన వ్యాధులను రాకుండా చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

|______

Like this story? Wanna Say something. comment below or mail us at : info@tvarthalu.com

you-can-invest

ఇన్వెస్ట్ చేయ‌రా డింభ‌కా! – టిప్స్‌

శ్రీ‌ను డిగ్రీ పూర్తి చేసి చిన్నవయసులోనే ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే ఆర్థిక విషయాలపై అతడికి ఏ మాత్రం అవగాహన లేదు. ఇక‌రిద్ద‌రు మిత్రులు ఏరా ఏమన్నా పొదుపు చేస్తున్నావా? అని అడిగితే., పెట్టుబడుల గురించి నాకేం తెలుసు బాస్… ఇప్పుడే ఆ చికాకులు వద్దు. లైఫ్ ఎంజాయ్ చెయ్యనీయ్ అనే వాడు. ఈ లోపే పెళ్లయింది. రెండు మూడేళ్లు తిరిగే సరికి పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై చాలా పాఠాలు నేర్చుకున్నాడు.

ధర కాదు …..మొత్తం ఖర్చు చూడాలి

Nakkatoka Quotes

పెళ్లయిన వెంటనే శ్రీ‌ను 25 లక్షల రూపాయలతో ఓ ఫ్లాట్ తీసుకున్నాడు. ముందూ వెనకా చూడకుండా బిల్డర్ చెప్పిన మాటలు నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఫ్లాట్ కు సరైన డోర్స్ గానీ, ఇంటీరియర్స్ గానీ లేవు అదేమని అడిగితే బిల్డర్ ఒప్పందంలో ఉన్నట్టే ఇచ్చా….. అన్నాడు. దాంటో చేసేదేం లేక మరో 10 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది.
గుణపాఠం – ఏదైనా వస్తువు లేదా ఆస్తులు కొనేముందు చాలా జాగ్రత్తగా ఒప్పందం షరతులు చదవాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా చివరికి ఎంత ఖర్చవుతుందనే విషయం ఆలోచించాలి. ఆ వస్తువులు లేదా ఆస్తులు నిజంగా అంత ధర పెట్టి కొనదగ్గవేనా? అనే విషయం కూడా ఆలోచించాలి.

తొలి పెట్టుబడి

you-can-invest-5

చాలా మంది ఉద్యోగంలో చేరిన రెండు మూడేళ్ల వరకు పెట్టుబడుల గురించే ఆలోచించరు. గరిష్ఠ రాబడులు ఎందులో వస్తాయా అని ఆలోచిస్తూ కాలం వృధా చేస్తారు. దీంతో వారి మిగులు నిధులపై కనీస రాబడులు కూడా రావు. ఇలాంటి వారి జీవితంలో తమ ఆర్థిక లక్ష్యాలు సాధించడంలో బాగా వెనకబడతారు.
గుణపాఠం – పెద్దగా తెలియకపోయినా పెట్టుబడుల గురించి ఆలస్యం చేయవద్దు. జాబ్ లో చేరినప్పటి నుంచే కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. నైక్ కంపెనీ ట్యాగ్‌లైన్ లా జస్ట్ డూ ( ఇపుడే చేద్దాం) అనేలా ప్రతి సంవత్సరం మీ పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లండి. ఇలా చేస్తే పెట్టుబడులపై రాబడులూ పెరుగుతాయి.

రిస్క్ కాదు…. ఆర్థిక లక్ష్యాలే ప్రధానం

Nakkatoka Quotesమనలో చాలా మందికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ లేని భయం. కష్టపడి సంపాదించిన నాలుగు రాళ్లు ఒడిదొడుకులు ఎక్కువగా ఉండే స్థాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే ఉన్నదంతా ఎక్కడ ఊడ్చుకుపోతుందోనని భయపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది నిజం కూడా. అయితే మీ పెట్టుబడుల విలువ త్వరగా పెరగాలంటే స్థాక్ మార్కెట్టే సరైన సాధనం. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చే సరికి 10 కోట్ల రూపాయల ఆస్తిపరుడు కావాలనుకున్నాడు. ఈ లక్ష్య సాధించాలంటేై అతడు ఆరున్నర శాతం వడ్డీ ఉండే బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లలో నెలకు 90 వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. అదే ఎనిమిది శాతం వడ్డీ రేటు ఉండే డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే నెలకు 67 వేల చొప్పున పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలికంగా చూస్తే భారత స్టాక్ మార్కెట్ లో సగటు రాబడి 14 శాతం వరకు ఉంటుంది. ఈ లెక్కన 30 ఏళ్ల వయసున్న వ్యక్తి నెలకు 18 వేలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే చాలు 60 ఏళ్లకల్లా తన 10 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటాడు.

గుణపాఠం — పిండి కొద్దీ రొట్టె అంటారు. ఈ సూత్రం పెట్టుబడులకు సైతం వర్తిస్తుంది. రిస్కు కొద్దీ రాబడులు అనేది పెట్టుబడి మార్కెట్ లో ప్రధాన సూత్రం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. శక్తికి మించి రిస్క్‌ తీసుకుంటే మాత్రం కష్టాలు తప్పవు. స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చేయడం కంటే, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మదుపు చేయడం మంచిది. ఐదేళ్ల కంటే తక్కువ కాలానికి మాత్రం ఎపుడు స్టాక్ మార్కెట్ లో మదుపు చేయవద్దు. దీర్ఘకాలిక రాబడుల కోసం మాత్రమే షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. స్వల్ప కాలిక రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలకు చెందిన రుణ పథకాల యూనిట్లలో మదుపు చేయడం మంచిది.

గుడ్డిగా అనుసరించవద్దు

Nakkatoka Quotesరామారావుకు జీతం పెరిగింది. ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చాడు. సంతోషంగా వాళ్ల అమ్మానాన్నలకు అదే విషయం చెప్పాడు. వెంటనే తల్లి దండ్రులు అరే అబ్బాయ్ వెంటనే ఏదైనా ఎల్ఐసి ఫాలసీ తీసుకో…. జీవితానికి బీమాతో పాటు పన్ను భారం కూడా తగ్గుతుందని సలహా ఇచ్చారు. మనోడు వెంటనే అమ్మా నాన్న చెప్పినట్టు ఒక పాలసీ తీసుకున్నాడు. తరువాత పర్సనల్ ఇన్వెస్ట్ మెంట్ నిపుణుడిని కలిసాక తెలిసింది. బీమాను పెట్టుబడులతో ముడిపెట్టడం సరి కాదని.
గుణపాఠం  — ఎవరో ఏదో చెప్పారని ఎడాపెడా బీమా పాలసీలు తీసుకోవద్దు. ఎవరైనా పర్సనల్ ఇన్వెస్ట్ మెంట్ నిపుణుడిని కలిసిన తర్వాతే బీమా పాలసీలు తీసుకోండి. ఎందుకంటే పెట్టుబడులతో బీమాను ఎప్పుడూ ముడి పెట్టకూడదు. పన్నుల ఆదా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పథకాలు ఎంచుకోవడం మంచిది.

పొరపాట్లు మంచివే

Nakkatoka Quotesపొరపాట్లు చేయడం కూడా తప్పే అని మన దేశంలో చిన్నప్పటి నుంచీ అందరి మెదళ్ల లో పాతుకు పోయింది. పొరపాట్లు చేస్తామనే భయంతోనే చాలా మంది పెట్టుబడులకు ముందుకు రారు. బుడిబుడి నడకల చిన్నారికైనా పడకుండా నడక రాదు. ఇదే సూత్రం పెట్టుబడులకూ వర్తిస్తుంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బపెట్టే ఇందుకు చక్కని ఉదాహరణ.

గుణపాఠం — పొరపాట్లు చేయండి. కానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. ఉదాహరణకు మీ దగ్గర ఉన్న షేర్లలో ధర పడిపోతుంటే, ధర తగ్గింది కదాని ఆ షేర్లను కొని యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే కొంప కొల్లేరయ్యే ప్రమాదం ఉంది.

విమాన ప్రయాణ సూత్రాన్ని అనుసరించండి

Nakkatoka Quotesఎయిర్ పొర్టు నుంచి టేకాఫ్ తీసుకుని గమ్య స్థానానికి వెళ్లే లోపు విమానాలు నూటికి 99 శాతం సమయం నిర్ణీత మార్గంలో ప్రయాణించవు.అయినా అవి నిర్ణీత సమయానికి గమ్యస్థానం చేరతాయి. కాక్ పిట్ లో ఉండే పైలెట్లు ఎప్పటికపుడు విమాన ప్రయాణ మార్గాన్ని సరిచేయడమే ఇందుకు కారణం.

గుణపాఠం — మన పెట్టుబడుల పోర్టుఫోలియోను సైతం ఎప్పటికపుడు చెక్ చేసుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటుండాలి. మార్కెట్ మార్పులను బట్టి ఎప్పటికపుడు ఈ మార్పులు చేయాలి. అలా చేస్తేనే మన ఆర్థిక లక్ష్యాలని సులభంగా చేరుకుంటాం. లేకపోతే లక్ష్యాలు కాదు గదా…. అమలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Photos Courtesy :   Nakkatoka Facebook Page

_____________

Like this post ? wanna share your thoughts just comment or mail us  at : info@tvarthalu.com

or connect with us on facebook and twitter.

young forever with omega 6

మెగా య‌వ్వనం ఫిక్స్ with ఓమెగా 6

గుండె ఆరో గ్యానికి మేలు చేసే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల గురించి చాలా మంది వినే ఉంటారు. అయితే ఒమేగా 6 కోవ్వు ఆమ్లాలంటేనే అంతగా తెలియదు. నిజానికి ఇవి కూడా ఒమేగా 3 కోవ్వుల మాగిరిగానే ముఖ్యమైనవీ, కీలకమైనవీ. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ గురించి మ‌రిన్ని ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు…

young-3

  • ఒమేగా 6ను మన శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి వీటిని ఆహారం సంపాదించాల్సి ఉంటుంది. ఈ ఆమ్లాలూ మెదడు పనితీరులోనూ, శరీర ఎదుగుదలలోనూ కీలకమైన భూమిక పోషిస్తాయి. చర్మం, వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. జీవక్రియలను నియంత్రిస్తాయి. పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పనిచేయటానికీ ఉపయోగపడతాయి.
  • ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలూ రకరకాల రూపంలో ఉంటాయి. వీటిలో ప్రధానమైంది లినోలిక్ యాసిడ్‌. శరీరంలోకి వెళ్లాక గామా-లినోలిక్ యాసిడ్ (జీఎల్ఏ)గా మారే ఇది.. గుండెపోటు, పక్షవాతం వంటి రకరకాల జబ్బులకు దారితీసే వాపు తరహా ప్రక్రియ తగ్గటానికి తోడ్పడుతుంది. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు వంటనూనెలు, విత్తనాల నుంచి తీసిన నూనెల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే బాదం, ఆక్రోట్‌, వేరుశనగల వంటి ప‌ప్పులు. నువ్వులు, గుమ్మడి గింజలు…సాల్మనె మాకెరెల్, టూనా వంటి చేపలు.. మాంసం, కోడిమాంసం, కోడి గుడ్లు.. వంటి వాటిలోనూ లభిస్తాయి. అయితే వీటిని మరీ అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశముంది. కాబట్టి తగినంత మోతాదులోనే తీసుకోవాలన్నది వైద్యుల‌ సూచన.
  • ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి రకరకాలుగా తోడ్పడతాయి. వివిధ సమస్యల బారిన పడకుండానూ కాపాడతాయి.
    బరువు తగ్గటం – ఒమేగా 6 కొవ్వు ఆమ్లాల్లో ఒక‌టైన లినోలిక్ యాసిడ్లు శరీరంలో కొవ్వును తగ్గించటంతో పాటు కండర దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇలా అధిక బరువు తగ్గటానికి తోడ్పడతాయన్నమాట.
  • గుండెకు రక్షణ – ఒమేగా 6లు చెడు కొవ్వు ఆమ్లాల ప్ర‌భావం మొదడుపై ప‌డ‌కుండా చూస్తాయి.ఆరోగ్యకరమైన కణాల వృద్దికి, నాడీ పనితీరు సజావుగా సాగటానికి ఉపకరిస్తాయి.
  •  రొమ్ము క్యాన్సర్ చికిత్సలో – 1మేగా 6ల్లోని జీఎల్ఏ, ఆరకిడోనిక్ యాసిడ్ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడతాయి. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే టామాక్సిఫెన్ ప్రతిస్పందనను జీఎల్ఎ పెంపోందిస్తున్నట్టు, కణితి పనితీరును అడ్డుకుంటున్నట్టు అధ్య‌యనాల్లో తేలింది.
  • ఏడీహెచ్డీ సమస్యలో – దేని మీదా ఏకాగ్రత చూపకుండా అతి చురుకుగా అల్లరి చేసే (ఏడీహెచ్డీ) పిల్లల్లో ఒమెగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు తక్కువ మోతాదులో ఉంటున్నట్టు తేలింది. ఒమేగా 6 మెదడు అభివృద్ధి, పనితీరులో పాలు పంచుకుంటుంది . ఇవి లభించే పదార్థాలు తీసుకోవటం వల్ల ఏడీహెచ్డీ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది.
  • ఎముకలు క్షీణించకుండా – ఒమేగా 6, ఒమేగా 3 తీసుకునే స్త్రీలకు ఎముక క్షీణత ముప్పు తక్కువ. రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ బారిన పడకుండానూ ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు కాపాడతాయి.

 

___________________

like this Article ? wanna say something? comment below or mail us at : infot@tvarthalu.com.

you can be friends on facebook  & twitter.