Tuesday, 17 January, 2017
health-telangana

త్వ‌ర‌లో స‌మ‌గ్ర ఆరోగ్య స‌ర్వే

ఆరోగ్య తెలంగాణ దిశ‌గా స‌ర్కార్ అడుగేస్తోంది. దాని కోసం స‌మ‌గ్ర తెలంగాణ ఆరోగ్య స‌ర్వే నిర్వ‌హించ‌డానికి క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ బాధ్య‌త‌ల‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐపీహెచ్)కు అప్పగించనుంది ప్ర‌భుత్వం. ప్ర‌జ‌ల ఆరోగ్య స్థితి గురించి తెలుసుకుని వాటిని బట్టి, నిధులు కేటాయింపులు చేయ‌వ‌చ్చ‌ని  ప్ర‌భుత్వం  భావిస్తోంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకొని జిల్లాలవారీగా పరిస్థితులను అంచనా వేసి ఆ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలనుకుంటున్నది. గ‌తంలో చేప‌ట్టిన స‌మ‌గ్ర కుటుంబ సర్వే లాగే  ఇంటింటికీ తిరిగి వివ‌రాలు సేకరిస్తారు. ఈ స‌ర్వే మొత్తం పూర్త‌వ‌డానికి ఏడాది ప‌ట్టొచ్చు. అందుకే ప్రతి మూడునెలలకోసారి సర్వే రిపోర్టులు స‌మ‌ర్పించేలా ప్ర‌భుత్వ యంత్రాంగం ప్ర‌ణాళిక రూపొందిస్తోంది..ఈ నెల 15లోపు స‌ర్వే చేసే విధివిధాల‌పై  ఐఐపీహెచ్ .. ప్ర‌భుత్వానికి ఒక నివేదిక ఇవ్వ‌నుంది.
nikhil-reddy-height

నిఖిల్ కు ఆపరేషన్ చేసిన డాక్టర్ పై బ్యాన్

ఎత్తు పెరగడానికి నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఆపరేషన్ చేసిన డాక్టర్ పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నిషేధం విధించింది. గ్లోబల్ ఆసుపత్రిలో డా. చంద్ర భూషన్ ఆతని టీమ్ నిర్వహించిన సర్జరి వల్ల నిఖిల్ రెండేళ్ల నుంచి బెడ్ కే పరిమితం అయ్యాడు. హైట్ పెరగడానికి ట్రీట్మెంట్ తీసుకుందామని హైదరాబాద్ లోని గ్లోబల్ హాస్పిటల్ కు వెళ్లిన నిఖిల్ కి మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వని సర్జరీ నిర్వహించారు. దీంతో నిఖిల్ ఇప్పుడు నడవలేని
స్థితిలో ఉన్నాడు. ఈ ఆపరేషన్ తల్లిదండ్రులకు తెలియకుండా జరిగింది. దీంతో నిఖిల్ తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విషయం పై దర్యాప్తు చేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ ఆపరేషన్ చేసిన డా. చంద్ర భూషన్ పై రెండేళ్లు, ఇతర టీమ్ డాక్టర్స్ పై కొన్ని నెలలు బ్యాన్ వేసింది.

family

కుటుంబం : ఏ మిక్సిడ్ భ్యాగ్ అఫ్ ఫ్రూట్స్…

అరటిపండును తొక్క తీసే తింటాం.సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం.సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం, పై తొక్కు, లోపలి గింజలు వదిలేస్తాం.ఆపిల్, జామ పళ్ళని మొత్తం తినేస్తాం.ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం. ఒక్కోటి ఒక్కో రుచి. తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.

పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తమంతే. అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు. కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు, ఒక్కోరిది ఒక్కో స్వభావం.అయితే అందరు పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే, వాళ్ళు చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా !!

పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం.ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.

img12

ఈమె బ‌రువు ఎంతో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే…

ఈమె బ‌రువు ఎంతో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే…
కొంతమందిని చూస్తే మనకు జాలేస్తుంది. వయసు తక్కువే కానీ భారీ కాయంతో అవస్థలు పడుతుంటారు. ఈ జిప్టు లోని అలెగ్జాండ్రియాకు చెందిన ఇమాన్ అహ్మద్ అబ్దులాతి వయసు 36.. అయితే ఆమె బరువు మాత్రం 500ల కిలోలు.  అధిక బరువు కారణంగా ఆమె 25 ఏళ్లుగా గడపదాటలేదు. అంతదాకా ఎందుకు….మంచంలోనే ఓ వైపు నుంచి మరోవైపునకు కనీసం అరంగుళం కూడా జరగలేని పరిస్థితిలో ఉన్నారామె. ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయురాలైన మహిళగా ఇమాన్‌ ప్రత్యేకత సాధించారు. స్నానం చేయడం దగ్గర నుంచి మొదలు అన్ని పనులకు ఇమాన్‌ తన తల్లి, సోదరిమీదే ఆధారపడుతున్నారు.  అయితే, శరీరావయవాలను విపరీతంగా ఉబ్బిపోయేలా చేసే ‘ఎలిఫెంటాసిన్‌’ వల్లనే ఆమె ఇలా కొండంత లావు పెరగడానికి మూలకారణమంటున్నారు వైద్యులు. ఇమాన్‌ బరువు వ‌ల్ల శరీరంలో ఓ వైపంతా చచ్చుపడిపోయింది.ఇప్పటిదాకా ఇమాన్‌తో ఎలాగోలా తంటాలు పడి…నెట్టుకొచ్చిన ఆమె కుటుంబం ఇప్పుడు సాయం కోసం అర్ధిస్తూ…ప్రజల ముందుకొచ్చింది.. ఇలా రోజురోజుకూ బరువుపెరిగిపోతున్న ఇమాన్‌కు కనీసం ఈ స్థితిలో నైనా అత్యవసర శస్త్రచికిత్స చేయించాని కోరుతున్నారు.
birth

షాకింగ్ న్యూస్‌.తెలియకుండానే తొమ్మిది నెలల గర్భాన్ని మోసింది !

అవును మీరు చ‌దివే ఈ వార్త మూమ్మ‌టికి నిజ‌మే. ఏమాత్రం నమ్మశక్యం కానీ విధంగా ఓ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన వైద్యులతోపాటు, ప్రతీఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో కిడ్నీలో రాళ్లున్నాయేమో అనుకుని ఓ మహిళ హాస్పిటల్‌కు వెళ్లింది. కానీ వైద్యులు కాసేపట్లో నీకు కాన్పు రాబోతుందని, ఇవి పురిటి నొప్పులని తెలిపారు. అంతేకాదు అరగంటలోనే పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

ఇంత‌కి ఆ మ‌హిళ పేరు ఏమిటంటే ‘స్టేఫానీ జాగర్స్’. ఈమెకు  తొమ్మిది నెలలుగా ఏమాత్రం బరువు పెరగలేదు. కనీసం ఆమెకు పీరియడ్స్ క్రమం కూడా తప్పలేదట . కానీ ఆమె కడుపులో తొమ్మిది నెలలుగా ఓ మగబిడ్డను మోస్తున్నాననే విషయం ఆమెకు ఏమాత్రం తెలియదట పాపం. ఇది వరకే ముగ్గురు పిల్లలు జన్మనిచ్చిన స్టేఫానీ తాజాగా మరో బిడ్డకు జన్మనిచ్చిన విధానం ప్రతీఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

young forever with omega 6

మెగా య‌వ్వనం ఫిక్స్ with ఓమెగా 6

గుండె ఆరో గ్యానికి మేలు చేసే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల గురించి చాలా మంది వినే ఉంటారు. అయితే ఒమేగా 6 కోవ్వు ఆమ్లాలంటేనే అంతగా తెలియదు. నిజానికి ఇవి కూడా ఒమేగా 3 కోవ్వుల మాగిరిగానే ముఖ్యమైనవీ, కీలకమైనవీ. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ గురించి మ‌రిన్ని ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు…

young-3

  • ఒమేగా 6ను మన శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి వీటిని ఆహారం సంపాదించాల్సి ఉంటుంది. ఈ ఆమ్లాలూ మెదడు పనితీరులోనూ, శరీర ఎదుగుదలలోనూ కీలకమైన భూమిక పోషిస్తాయి. చర్మం, వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. జీవక్రియలను నియంత్రిస్తాయి. పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పనిచేయటానికీ ఉపయోగపడతాయి.
  • ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలూ రకరకాల రూపంలో ఉంటాయి. వీటిలో ప్రధానమైంది లినోలిక్ యాసిడ్‌. శరీరంలోకి వెళ్లాక గామా-లినోలిక్ యాసిడ్ (జీఎల్ఏ)గా మారే ఇది.. గుండెపోటు, పక్షవాతం వంటి రకరకాల జబ్బులకు దారితీసే వాపు తరహా ప్రక్రియ తగ్గటానికి తోడ్పడుతుంది. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు వంటనూనెలు, విత్తనాల నుంచి తీసిన నూనెల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే బాదం, ఆక్రోట్‌, వేరుశనగల వంటి ప‌ప్పులు. నువ్వులు, గుమ్మడి గింజలు…సాల్మనె మాకెరెల్, టూనా వంటి చేపలు.. మాంసం, కోడిమాంసం, కోడి గుడ్లు.. వంటి వాటిలోనూ లభిస్తాయి. అయితే వీటిని మరీ అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశముంది. కాబట్టి తగినంత మోతాదులోనే తీసుకోవాలన్నది వైద్యుల‌ సూచన.
  • ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి రకరకాలుగా తోడ్పడతాయి. వివిధ సమస్యల బారిన పడకుండానూ కాపాడతాయి.
    బరువు తగ్గటం – ఒమేగా 6 కొవ్వు ఆమ్లాల్లో ఒక‌టైన లినోలిక్ యాసిడ్లు శరీరంలో కొవ్వును తగ్గించటంతో పాటు కండర దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇలా అధిక బరువు తగ్గటానికి తోడ్పడతాయన్నమాట.
  • గుండెకు రక్షణ – ఒమేగా 6లు చెడు కొవ్వు ఆమ్లాల ప్ర‌భావం మొదడుపై ప‌డ‌కుండా చూస్తాయి.ఆరోగ్యకరమైన కణాల వృద్దికి, నాడీ పనితీరు సజావుగా సాగటానికి ఉపకరిస్తాయి.
  •  రొమ్ము క్యాన్సర్ చికిత్సలో – 1మేగా 6ల్లోని జీఎల్ఏ, ఆరకిడోనిక్ యాసిడ్ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడతాయి. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే టామాక్సిఫెన్ ప్రతిస్పందనను జీఎల్ఎ పెంపోందిస్తున్నట్టు, కణితి పనితీరును అడ్డుకుంటున్నట్టు అధ్య‌యనాల్లో తేలింది.
  • ఏడీహెచ్డీ సమస్యలో – దేని మీదా ఏకాగ్రత చూపకుండా అతి చురుకుగా అల్లరి చేసే (ఏడీహెచ్డీ) పిల్లల్లో ఒమెగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు తక్కువ మోతాదులో ఉంటున్నట్టు తేలింది. ఒమేగా 6 మెదడు అభివృద్ధి, పనితీరులో పాలు పంచుకుంటుంది . ఇవి లభించే పదార్థాలు తీసుకోవటం వల్ల ఏడీహెచ్డీ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది.
  • ఎముకలు క్షీణించకుండా – ఒమేగా 6, ఒమేగా 3 తీసుకునే స్త్రీలకు ఎముక క్షీణత ముప్పు తక్కువ. రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ బారిన పడకుండానూ ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు కాపాడతాయి.

 

___________________

like this Article ? wanna say something? comment below or mail us at : infot@tvarthalu.com.

you can be friends on facebook  & twitter.