Tuesday, 17 January, 2017

మొటిమలు మిమ్మల్ని బాధిస్తున్నాయా ?

యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆడవారిని మొటిమలు వేధిస్తుంటాయి. వీటి వల్ల ముఖం అందవికారంగా తయారయ్యి నలుగురితో కలవాలంటే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మొటిమలు మిమ్మల్ని దరి చేరవు.

  •  మొటిమలు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినేవారిలో వస్తాయి. కాబట్టి ఆయిల్ ఫుడ్ ను వీలైనంత వరకూ తగ్గించుకునేలా చూడాలి.

  •  మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బాక్టీరియా వల్ల వస్తుంటాయి. కాబట్టి ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.

  •  మొటిమలు ఉన్నవారు వాటిని సూది, పిన్నీసు వంటి వాటితో పొడుస్తుంటారు. ఇలా చెయ్యండం వల్ల దీనిలో ఉండే బాక్టీరియా ముఖం లోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది.

  •   మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్ను వాటిపై మెల్లిగా రుద్దుతుంటే కొంచెం ఉపశమనం లభిస్తుంది.

  •  కొంచెం నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం కనపడుతుంది

  •   మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహారం తగ్గించాలి.

  •  నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటిమలు రాకుండా చూసుకోవచ్చు.

  •   మొటిమలు ఉన్నాయి కదా అని ఏ క్రీం పడి తే అవి రాసెయ్యకూడదు. దీనివల్ల మీ ముఖం ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రభావం ఉంది.

  •   టమోటా పండు రసం తీసి మొటిమలు మీద రాసుకుంటే ఫిలితం కనిపిస్తుంది.

  •  కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు.

cold and fever tips in telugu

జలుబుకు గృహవైద్యం 

వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా జలుబు బారిన పడిన వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబును త్వరితగతిన వదిలించుకోవచ్చు. రాత్రి సమయంలో నిద్ర పోయేముందు పాలు తాగితే జలుబు నుంచి దూరం కావచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా మరగించి, ఆ తర్వాత ఆ నీటిని శుభ్రమైన వస్త్రంతో వడగట్టి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు తగ్గుతుంది. తులసి ఆకులు కూడా జలుబును తగ్గించేందుకు దోహద పడతాయి. కొన్ని తులసి ఆకులు, చిటికెడు రాతి ఉప్పు కలిపి రసాన్ని మింగితే మంచి ఫలితం లభిస్తుంది. తులసి ఆకులను ‘టీ’లా మరగించి తాగినా జలుబు నుంచి విముక్తి పొందవచ్చు.

o-couple-having-sex-facebook

పడకగదిలో శృత‌మించితే అంతే సంగ‌తులు

 శృంగార జీవితం ఆనందంగా ఉంటేనే దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది.  శృంగారంతో భాగ స్వాములు ఆనందకరమైన ఆరో గ్యాన్ని పొందవచ్చునంటున్నారు సెక్సాల‌జిస్టులు. అయితే ఇక్క‌డే ఉంది అస‌లైన ప్రాబ్ల‌మ్  సెక్స్  శ్రుతి మించితే మాత్రం ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చ‌రిస్తున్నార.తాజాగా నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల నొప్పి రావడం, ఇనఫెక్షన్స వచ్చే అవకాశం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌. అంతే కాదండ‌యో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం హానికరమేన‌ట‌. ప్రపంచవ్యాప్తంగా అతిశృంగారం వల్ల ఏటా వేలమంది చనిపోతు న్నట్లు ఈ సర్వే ద్వారా వెల్లడైంది. అందుకే సెక్స్‌ మితంగా ఉంటేనే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని చెబు తున్నారు.  

01-coffeiee

కాఫీ తాగే అల‌వాటు ఉంటే…ఇది చ‌ద‌వండి

మీకు రోజు మూడు కప్పులు కాఫీ తాగే ఆల‌వాటు ఉంటే నిజంగా మీరు గ్రేట్‌. ఎందుకంటే రోజు మూడు క‌ప్పుల కాఫీ తాగితే మతిమరపు దూరం అవుతుందంటున్నాయి తాజా పరిశోధనలు. రోజూ కాఫీ తీసుకుంటే దానిలోవుండే కెఫిన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోకి చేరే కాలుష్యాలను అడ్డుకుంట‌య‌ట‌. అంతే కాదు కాఫీ పార్కిన్ సన్ వ్యాధి నిరోధానికి కూడా మంచి ఔషధంగా పని చేస్తుందంటున్నారు సైంటిస్టులు. కాఫీ వాడకం గురించి వచ్చిన తాజా రిపోర్టు ప్రకారం రోజూ కాఫీ తాగేవారి శరీరంలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చేరిన కారణంగా మెమరీ పవర్ పెరిగినట్టు గమనించారు.ఇక‌పోతే నరాలకు సంబంధించిన వ్యాధులను కూడా నియంత్రించగల శక్తి కాఫీకి ఉందని యూరప్‌కు చెందిన ఆరు పెద్ద కాఫీ తయారీ సంస్థలు తేల్చాయి. ఇదిలా ఉంటే కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల కొంతమంది మహిళల్లో గర్భస్రావాలకు కారణమవ్వడం, గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యే ప్రమాదముందనేది కొన్ని పరిశోధనల సారాంశం.

maxresdefault

మీరు ఇయర్‌ బడ్స్‌ వాడుతున్నారా…జాగ్ర‌త్త సుమా..!

చెవుల్లో ఉండే గులిమిని తొలగించడానికి  ఇయర్‌ బడ్స్‌ను వాడుతుంటారు. అయితే ఇవి వాడడం వల్ల భవిష్యత్తులో చెవుడు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట.సాధారణంగా లోపల ఉండే వ్యర్థాన్ని తొలగించుకునేందుకు స్వతహాగా  చెవుల్లోనే ప్ర‌త్యేక నిర్మాణం ఉంటుందట. దీంతో  మనం ప్రత్యేకంగా వాటిని శుభ్రపరచాల్సిన అవసరం లేదని…ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.. చెవి లోపలి చర్మం కన్వేయర్‌ బెల్ట్‌లా పనిచేసి లోపలి వ్యర్థాలను బయటకు తోసేస్తుందట. అలా కాకుండా ఇయర్‌ బడ్స్‌ ద్వారా క్లీన్‌ చేయాలని ప్రయత్నిస్తే.. లోపల ఉండే గులిమి కొంత మాత్రమే బయటకు వస్తుందట. మిగిలినది ఇయర్‌ బడ్స్‌ తాకిడికి మరింత లోపలికి వెళ్లి ఇయర్‌ కెనాల్‌ గుండా ప్రయాణించి కర్ణభేరిపై పడతుందట.ఇలా కర్ణభేరి పనికి ఆటంకం కలిగించడం వల్ల చెవుడు వస్తుందట. అందుకే చెవులు క్లీనింగ్‌ చేయడానికి బయట నుంచి ఎటువంటి వస్తువులూ వాడకూడదని సూచిస్తున్నారు సైంటిస్టులు…

sex

అది ఎక్కువైతే కష్టమే

సెక్స్‌కు మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంత సంపాధించినా శృంగారంలో తృప్తి లేక‌పోతే ఆ జీవితానికి అర్ధం ఉండదు. అయితే తాజా సర్వేలో సెక్స్ గురించి కొన్ని ఆసక్తికర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ సర్వేలో ఒకరి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో త‌ర‌చూ పాల్గొంటూ ఉండే వారికి ముప్పు త‌ప్ప‌ద‌ట‌. లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ‘ప్రోస్టేట్‌ కేన్సర్‌’ ముప్పు ఎక్కువేనని తాజాగా ఈ అధ్య‌య‌నంలో తేలింది. ఈ షాకింగ్ మ్యాట‌ర్ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌ శాస్త్రవేత్తల బృందం జ‌రిపిన సర్వేలో వెల్లడయింది. ఈ సర్వేలో పదివేల మందిని పరీక్షించగా, లైంగిక చర్యకు ప్రోస్టేట్‌ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తెలిసిందని పరిశోధకులు తేల్చి చెప్పారు. కావున ఒక‌రి కంటే ఎక్కువ మందితో త‌ర‌చూ సెక్స్ కార్య‌క‌లాపాలు కొన‌సాగించే పురుషులు ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

h-03

మీరు చికెన్ తింటున్నారా.. అయితే ఇది చ‌ద‌వండి

చికెన్ అంటే లొట్ట‌లేసుకొని తినే వారికి ఓ బ్యాడ్ నూస్‌. మనం తినే మూడొంతుల చికెన్ లో రెండొంతులు చికెన్ ఇ కోలీ బాక్టీరియా సోకినదేనని తాజా పరిశోథనలు తేల్చాయి. షాపుల నుంచి తెచ్చిన చికెన్ లో ఉండే ఇకోలీ బాక్టీరియా వల్ల స్టమక్ అప్సెట్ అవడం, డయేరియా, వాంతులు లాంటి ఉదర సంబంధవ్యాధులు సోకే ప్రమాదముందట. ఒక్కోసారి ఈ సూపర్ బగ్  వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదముందట.   ఇకోలి బగ్ పై ఇంగ్లాండ్ మార్కెట్ లో జరిపిన సర్వేలో ఏటా ఐదువేలకు పైగా మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఇంగ్లండ్ లో అమ్మే మూడొంతుల చికెన్ లో రెండొంతులు ఇకోలీ సూపర్ బగ్ సోకినదే అంటున్నారు ఎక్స్ పర్ట్ లు. సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్ లో అధిక శాతం ఇకోలి బగ్ సోకిందేనని చెబుతున్నారు
 యూనివర్సిటి ఆఫ్ కేంబ్రిడ్జ్ సైంటిస్టులు పేరున్న మార్కెట్ల నుంచి తెచ్చిన చికెన్ పై జరిపిన పరిశోథనల్లో అధిక మొత్తంలో  కలుషితమని తేలింది. ఈ పరిశోధనొక్కటే కాదు.. డిపార్ట్ మెంట్ ఫర్ ఎన్విరాన్ మెంట్, ఫుడ్ అండ్ రూరల్ అఫైర్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ , ఇంగ్లాండ్ తదితర ప్రభుత్వ శాఖలు కూడా ఇంగ్లండ్ లో  దొరికే చికెన్లో అధిక శాతం చికెన్ ఇకోలి బగ్ కలిగిందేనని తేల్చారు. ముందు ముందు అతిగా ఇకోలి బాక్టీరియా సోకిన చికెన్ తింటే.. భారీ మూల్యం చెల్లించాల్సిందేనంటున్నాయి పరిశోథనలు. అదే విధంగా అతిగా యాంటీ బయాటిక్స్ వాడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు.  
ఇక‌పోతే  కోళ్లలోనే ఇకోలీ బగ్ ఎందుకు వృధ్ది చెందుతుందంటే.. పౌల్ట్రీ రంగంలోనే అతిగా యాంటీ బయాటిక్స్  వాడుతున్నారనీ, అందుకే పౌల్ట్రీ చికెన్ లోనే ఇకోలీ బక్టీరియా అధికంగా చేరుతుంది. దీనినుంచి బయటపడాలంటే… చికెన్ స్టోర్స్ కు చేరుకునే ముందే  దానిలో బాక్టిరియా లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే సూపర్ బగ్ లేని నిఖార్సయిన చికెన్ తినే అవకాశం కలుగుతుందని సలహా ఇస్తున్నారు సైంటిస్టులు..  
healthy-benefits-of-plums

ఆల్ బుకారా.. అర‌డ‌జ‌ను లాభాలు

అవునండీ బాబు.. ఆల్ బుకారా పండ్లు తింటే ఎంతో మంచిద‌ట‌. ఈ పండ్ల‌లో ఉంటే విటమిన్ ‘ఇ’, బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారినుంచి రక్షిస్తాయిట‌. అలాగే దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. అలాంటి వారు ఆల్ బుకారా పండ్లను తీసుకోవడం ద్వారా పెదవుల అందాన్ని మెరుగుపరుస్తుంది. దీంతోపాటు ఆల్ బుకారా తొక్కతో పెదవులను కొన్ని రోజులు మ‌ర్ధ‌న చేసుకుంటే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి.

మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే అఆల్ బుకారాను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

spices-for-low-female-sex-drive

సెక్స్ కోరిక‌ను పెంచే సుగంధ ద్ర‌వ్యాలు ఇవే..!  

ప్ర‌కృతిలో ల‌భించే ప్ర‌తి వ‌స్తువుకు దేనికో ఒక దానికి సంబంధం ఖ‌చ్చితంగా ఉంటుంది. అయితే సుగంధ ద్ర‌వ్యాల ప్ర‌స్తావ‌న మాత్రం శృంగారానికి ముడిప‌డి ఉంద‌ని గ్రీకు పురాణాలు తెలియ‌జేస్తున్నాయి.  అయితే సుగంధ‌ద్ర‌వ్యాలలో కొన్ని ఆహారంగా తీసుకుంటే ‘ఆకలిని’ పెంచుతాయి. మ‌రి కొన్ని అయితే సువాసనతోనే ప్రభావం చూపుతాయి.  ఇంకొన్ని ఈ సుగంధ‌ద్రవ్యాలు వాడితే శృంగారంలో రెచ్చిపోతార‌ని చాలా మంది ఆయుర్వేద వైద్య నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా ఇండియాలో బాగా పండే లవంగాలు కు వంటింటిలోనూ, వైద్యంలోనూ వీటికి సముచిత స్థానం ఉంది.శృంగారోత్తేజంలోనూ లవంగం పాత్ర అద్వీతీయం అని భారతీయ వైద్య శాస్త్రం కూడా అంగీక‌రించింది.   ఒక చిటికెడు లవంగం పౌడర్ ను లేట్ నైట్ కాఫీలో వేసి మీ పార్టనర్ కు ఇస్తే చాలు శృంగారంలో రెచ్చిపోతారు.

ఇక‌పోతే  పెప్పర్ మింట్ ఆయిల్‌. ఈ ఆయిల్‌తో మ‌సాజ్ చేసుకుంటే మత్తెక్కించే కోరిక‌ల‌ను ప్రేరేపిస్తుంద‌ట‌. దీని మహత్యం అనుభవించే వాళ్లకే అర్థమవుతుందంటున్నారు శృంగార నిపుణులు. శరీరానికి మసాజ్ తో దీని ప్రభావం మెదడు వరకూ చేరుతుందని.. సెక్సువల్ ఆపరేషన్ అలా మొదలవుతుందని సూచిస్తున్నారు.

Like this story ? wanna say something..comment below..or mail us : info@tvarthalu.com

saffron-bindu

నుదుటన కుంకుమ బొట్టు ధరించడం

చాలా మంది అనుకుంటారు నుద‌ట‌నే కుంకుమ బొట్టును ఎందుకు ధ‌రించాల‌ని. అయితే దీనికో రీజ‌న్ ఉంద‌ట‌. నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట.ఇక‌పోతే కుంకుమ‌ను ఏ చేతి వేలితో పెట్టుకోవాల‌ని అనే  డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే కుంకుమ‌ను ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కో ఫ‌లితం క‌లుగుతుంది. కుంకుమ‌ను ఉంగ‌ర‌పు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్ర‌శాంతి చేకూరుతుంది. ఇక న‌డివేలుతో ధ‌రిస్తే ఆయువు స‌మృద్ధి చెంఉదుతంది. బొట‌న వేలితో ధ‌రిస్తే శ‌క్తి క‌లుగుతుంది, చూపుడు వేలుతో ధ‌రిస్తే, భ‌క్తీ, ముక్తీ క‌లుగుతాయి.

ఇదిలా ఉంటే ప్లాస్టిక్ బొట్టు, బిళ్ల‌లు పెట్టుకోవ‌డం క‌న్నా మేల ర‌కం కుంకుమ ధ‌రిస్తే  మంచింది. నుదుట‌న కుంకుమ అదిస్తే జ్ఞాన చ‌క్రాన్ని పూజించిన‌ట్టేన‌ని చాలా మంది పెద్ద‌లు చెబుతుంటారు.