Monday, 25 September, 2017

రైతు బజార్లలో క్యాష్‌లెస్ విధానం-మంత్రి హ‌రీష్ రావు

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి  హ‌రీష్ రావు మాట్లాడారు.  దేశంలోనే తొలిసారిగా రైతు బజార్లలో క్యాష్‌లెస్ విధానం తీసుకొచ్చామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. క్యాష్‌లెస్ విధానాన్ని రాష్ట్రంలో తొలిసారిగా కూకట్‌పల్లి రైతు బజార్లో ప్రారంభించామని తెలిపారు. రాబోయే రెండు మూడు వారాల్లో అన్ని మార్కెట్లలో క్యాష్‌లెస్ విధానం తీసుకొస్తామన్నారు. క్యాష్‌లెస్ విధానంతో అమ్మకాలు పెరిగాయని చెప్పారు.  రైతులను, వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మన కూరగాయాలు పథకం తీసుకొచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మన కూరగాయాలు పథకాన్ని విస్తరిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే మన కూరగాయాలు పథకం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కూరగాయాల మార్కెట్లను ఆధునీకరిస్తున్నామని మంత్రి హ‌రీష్ రావు చెప్పారు