Thursday, 19 October, 2017
benefits of fasting

మీరు ఉప‌వాసం చేస్తున్నారా..? అయితే ఆరోగ్య‌వంతులే….

చాలా మంది వారంలో కొన్ని రోజులు ఉప‌వాసం చేస్తు ఉంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్‌. ఉపవాసం ఉంటే రోగాలు దరి చేరవట. అంతే కాదండ‌యో ఆయుష్షు పెరుగుతుందట. రెగ్యులర్ గా ఉపవాసం చేస్తే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, క్యాన్సర్ వంటివాటికి దూరంగా ఉండవచ్చునని యూఎస్ లోని పరిశోధకులు అంటున్నారు. కొద్దిసేపు ఆహారం తీసుకోకుండా ఉండడంవల్ల శరీరానికి రెస్ట్ దొరుకుతుందని, డీఎన్ఏ, ఇతర కణజాలం శక్తిమంతమవుతాయని వారు తేల్చారు. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడుతున్న మహిళలు సుమారు 13 గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే చాలా వరకు ఆ వ్యాధి రిస్క్ తగ్గిపోతుందని రీసెర్చర్లు వెల్లడించారు. పైగా బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కూడా పేర్కొన్నారు. అంతే కాదు.. రాత్రి వేళల్లో ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, కొద్దిసేపే ఉపవాసం ఉండడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ సరిగా ఉండదని గమనించారు. కొన్ని ఎలుకలపై కూడా పరిశోధనలు చేసి ఈ కొత్త విషయాలు తెలిపారు.

 

 

You might also like

Leave a Reply