Monday, 20 November, 2017

వాయు కాలుష్యంతో 16 లక్షలమంది ప్రాణాలు పోయాయి

అవును వాయికాలుష్యం మ‌న‌షుల‌ను హరిస్తోంది. ముఖ్యంగా చైనా, భారత్ వాయుకాలుష్యంలోనూ ముందంజలో ఉన్నాయి. వాయు కాలుష్యం వల్ల గత ఏడాదికాలంలో భారత్, చైనా దేశాల్లో 16 లక్షలమంది మరణించారని తాజాగా వెల్లడైంది. పారిశ్రామికాభివృద్ధి వల్ల వాయు కాలుష్యం పెరిగి జనం మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని గ్రీన్ పీస్ అనే సంస్థ వెల్లడించింది.వాహనాల పొగతోపాటు బొగ్గు కాల్చడం వల్ల అధికంగా కాలుష్యం వెలువడుతుందని గ్రీన్ పీస్ సంస్థ తన నివేదికలో పేర్కొంది భార‌త్‌, చైనా దేశాల్లోనూ బొగ్గు వినియోగం పెరగటం వల్ల కాలుష్యం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. అధిక ఆదాయం వస్తున్న దేశాలతో పోలిస్తే మన దేశంలో వాయుకాలుష్యం వల్ల మరణాల సంఖ్య నాలుగురెట్లు పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వల్ల వాయు కాలుష్యం పెరిగిందని, దాన్ని అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని గ్రీన్ పీస్ సంస్థ సూచించింది.నానాటికీ హరిస్తున్న పచ్చదనం, దెబ్బతింటున్న ప్రకృతి, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడంలో వైఫల్యమే వినాశనానికి కారణమవుతున్నాయ‌ని తెలిపింది.

You might also like

Leave a Reply