Monday, 20 November, 2017

ట్రంప్ గెలిచాడు….వీరు  కోటీశ్వరులైనారు…..

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌డంతో కొంత‌మంది కోటీశ్వ‌రులైనారు. అదేంటి ట్రంప్ గెలిస్తే ఎవరో కోటీశ్వ‌రుల‌వుతార‌నే డౌట్ మీకు రావొచ్చు. ఇంత‌కీ అసలు విష‌యం ఏమిటంటే  అమెరికా కు అధ్యక్ష ఎన్నిక‌ల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా బెట్టింగ్ కొన‌సాగింది. ఇందులో చాలా మంది ఎగ్జిట్ పోల్స్‌, స‌ర్వేల ప్ర‌కారం హిల్ల‌రీ క్లింట‌న్ గెలుస్తుంద‌ని బెట్టింగ్ కాశారు. కానీ ఫ‌లితాలు తారు మారు అయి ట్రంప్ వైట్ హౌస్ అధ్య‌క్ష పీఠం అధిరోహించాడు.

దీంతో ట్రంప్ గెలుస్తాడ‌ని బెట్టింగ్ కాసిన వారికి బాగా క‌లిసివ‌చ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే కేవ‌లం తెలంగాణ‌, ఏపీలో మూడో కంటికి అనుమానం రాకుండా ఆన్ లైన్ వేదికగా తతంగం మొత్తం జరిగిపోయిన‌ట్టు సమాచారం. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని కోట్లు చేతులు మారాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఏది ఏమైనా ట్రంప్ న‌మ్మ‌కుని బెట్టింగ్ వేసిన వారు మాత్రం కోటీశ్వ‌రులైనార‌నే చెప్ప‌వ‌చ్చు.